18 నుంచి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
పెంటపాడు :స్థానిక ప్రభుత్వ పోస్టు బేసిక్ స్కూల్లో ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు 62వ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు క్రీడల కన్వీనర్ డీవైఈవో జి.విలియం స్థానిక స్కూల్లో బుధవారం ఆ వివరాలు వెల్లడించారు. ఈ పోటీలకు గాను 13 జిల్లాల నుంచి 300 మందికి పైగా క్రీడాకారులు హాజరు కానున్నారని తెలిపారు. ఒకేరోజు నాలుగు గేమ్‌లు ఆడేందుకు కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. క్రీడా మైదానాన్ని మెరక చేసేందుకు సహకరించి మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్‌ను అభినందించారు. గూడెం ప్రాంతంలో మొదటిసారిగా ఈ రాష్ట్రస్థాయి పోటీలు జరగనుండటం విశేషమన్నారు. ఎంఈవో పి.శేషు పాల్గొన్నారు.