చంద్రిక (ఫైల్ ఫోటో)
సాక్షి, తూర్పుగోదావరి : పెంటపాడు మండలంలో వివాహితను భర్త దారుణంగా హత్య చేశాడు. మరో వ్యక్తితో మోటార్‌సైకిల్‌పై వెళుతున్న ఆమెను శుక్రవారం ఉదయం భర్త అడ్డగించి విచక్షణారహితంగా మెడపై కత్తితో నరికి చంపడం సంచలనం రేకిత్తించింది. తాడేపల్లిగూడెం టౌన్ సీఐ ఆకుల రఘు తెలిపిన వివరాల ప్రకారం.. గణపవరం మండలం చిలకంపాడు గ్రామానికి చెందిన దువ్వారపు చంటియ్యకు అదే మండలం మొయ్యేరు గ్రామానికి చెందిన చంద్రికతో ఆరేళ్లక్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. చదవండి: (నవ జంట ఆత్మహత్య.. మొదటి భర్త అండమాన్‌లో..)
కొంతకాలంగా తరచూ గొడవలు పడుతున్న వీరి కుటుంబంలో సోషల్‌మీడియా చిచ్చుపెట్టింది. సోషల్‌మీడియాలో ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన కొమ్ము జెర్సీతో చంద్రికకు పరిచయం ఏర్పడింది. నాలుగునెలులుగా తన భర్తకు దూరంగా ఉంటున్న చంద్రిక ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో జెర్సీతో కలిసి నివసిస్తోంది. ఈ విషయంపై భార్యా, భర్తల మధ్య మరింత అగాధం ఏర్పడింది. తన భర్తను వదిలి వేరుగా ఉండాలని నిర్ణయించుకుని కుటుంబసభ్యులతో చర్చించి పెద్దల సమక్షంలో విడిపోదామనుకొంది. అదే సమయంలో గొల్లగూడెం నుంచి పెంటపాడు వైపు మోటార్‌సైకిల్‌పై వస్తున్న జెర్సీ, చంద్రికలను భర్త చంటియ్య, మరో ఇద్దరితో కలిసి అడ్డగించి వాగ్వాదానికి దిగారు. చదవండి: (పెళ్లయినా మరదలిపై కన్నేసి.. ఎంత పనిచేశాడంటే..!)
తనతో తెచ్చుకొన్న కత్తితో చంటియ్య తన భార్యను మెడపై నరికాడు. కాగా తీవ్ర గాయాలతో చంద్రిక మృతి చెందింది. భర్తతో పాటు, మరో ఇద్దరు పరారయ్యారు. జెర్సీ పెంటపాడు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై కె. శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ఇన్‌చార్జి సీఐ ఆకుల రఘు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కొవ్వూరు ఇన్‌చార్జ్ డీఎస్పీ లలిత సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలం వద్ద చంద్రిక తల్లిదండ్రులు కృష్ణవేణి, శ్రీనివాసరావులు తీవ్రంగా రోధించారు. చంద్రిక మృతదేహాన్ని గూడెం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. చదవండి: (మళ్లీ ప్రేమలో పడ్డా)
Comments
Please login to add a commentAdd a comment