పెంటపాడు : పెంటపాడు ఎస్టీవీఎన్ స్కూల్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు.
మోటార్ సైక్లిస్ట్ దుర్మరణం
Aug 30 2016 1:19 AM | Updated on Apr 3 2019 7:53 PM
పెంటపాడు : పెంటపాడు ఎస్టీవీఎన్ స్కూల్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. తాడేపల్లిగూడెం రామారావుపేటకు చెందిన కలవపూడి పవన్‌కుమార్ (43), మరోవ్యక్తితో కలిసి మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా లారీ ఢీకొట్టింది. పవన్‌కుమార్ తొడపై నుంచి లారీ చక్రం వెళ్లడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పెంటపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement