లారీ, బైక్‌ ఢీ | lorry bike accident | Sakshi
Sakshi News home page

లారీ, బైక్‌ ఢీ

Published Sun, Dec 11 2016 11:56 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

lorry bike accident

 - ఒకరి పరిస్థితి విషమం
- మరొకరికి గాయాలు
కొలిమిగుండ్ల: కొలిమిగుండ్ల–బెలుం గ్రామాల మధ్యనున్న హెచ్‌పీ గ్యాస్‌ గోడౌన్‌ సమీపంలోని ప్రధాన రహదారిపై ఆదివారం ప్రమాదం చోటు చేసుకుంది.  బెలుం ఎస్సీ కాలనీకి చెందిన శ్రీరాములు పిల్లలకు బట్టలు కుట్టించేందుకు అదే కాలనీకి చెందిన కంబగిరితో కలసి బైక్‌పై కొలిమిగుండ్లకు వచ్చాడు. టైలర్‌కు బట్టలు ఇచ్చి స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో హెచ్‌పీ గ్యాస్‌ గోడౌన్‌ సమీపంలో అనంతపురం జిల్లా కదిరికి చెందిన బోర్‌వెల్‌ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీరాములు తీవ్రగాయాల పాలై పరిస్థితి విషమంగా మారగా..కంబగిరి ఎగిరి కింద పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను మానవతా ఆంబులెన్స్‌లో కర్నూలుకు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement