లారీ ఢీకొని ఇద్దరి దుర్మరణం
Published Sun, Sep 11 2016 1:37 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
నరసాపురం రూరల్ : లారీ ఢీకొని ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. పోలీ సుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా గంగవరం మండలం నెల్లిపూడికి చెందిన గారపాటి బాపిరాజు (23), విశాఖపట్టణానికి చెందిన నిమ్మల వెంకట రమేష్(25) ఇద్దరూ నరసాపురం పట్టణంలోని ఒక టీవీ షోరూమ్‌లో సేల్స్‌ప్రమోటర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ షాపు మూసివేసిన అనంతరం మోటార్‌సైకిల్‌పై పాలకొల్లు వెళ్తుండగా, పాలకొల్లు నుంచి నరసాపురం వస్తున్న లారీ సిరి ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో వీరిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వారిని నరసాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాపిరాజు మృతిచెందాడు. నిమ్మ వెంకట రమేష్‌ను మెరుగైన వైద్యం కోసం భీమవరం తరలించగా.. అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందాడు. యువకుల మృతితో వీరి కుటుంబాలు బోరున విలపించాయి. అందరితో కలపుగొలుగా ఉండే వీరు మృత్యువాత పడటంతో షాపులోని సహచరులు కంటతడిపెట్టారు. కేసు నమోదు చేసి సీఐ రామచంద్రరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్ కురాపు స్వామి పిచ్చయ్యముత్తును అదుపులోకి తీసుకున్నామని రూరల్ పోలీస్‌స్టేçÙన్ ఇన్‌చార్జి ఎస్‌ఐ బి. శ్రీనివాసు తెలిపారు.
Advertisement
Advertisement