రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Published Mon, Jun 5 2017 12:21 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
కోవెలకుంట్ల: ఆళ్లగడ్డలో వివాహం చేసుకుని అక్కడే నివాసం ఉంటున్న కోవెలకుంట్ల సంతపేటకు చెందిన ఇమాంవుశేన్(28) ఆదివారం కంపమల్ల మెట్ట సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో మరణించాడు. గౌండా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఇమాంవుశేన్ ఆదివారం పనికి వెళ్లకుండా కోవెలకుంట్లలో ఉన్న తల్లిదండ్రులను చూసేందుకు బైక్‌పై బయలుదేరాడు. కంపమల్ల మెట్ట సమీపంలో ఆళ్లగడ్డ వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మంజునాథ్ తెలిపారు.
జోళదరాశి వద్ద ఒకరికి గాయాలు..
కోవెలకుంట్ల- నంద్యాల ఆర్‌అండ్‌బీ రహదారిలో జోళదరాశి సమీపంలో జరిగిన ప్రమాదంలో కోవెలకుంట్ల ఎల్‌ఎం కాంపౌండ్‌కు చెందిన వెంకటసుబ్బయ్య తీవ్రంగా గాయపడ్డాడు. త్వరలో కుమార్తె వివాహం ఉండటంతో నంద్యాలలో పెళ్లిపనులు చూసుకుని బైక్‌పై తిరిగి వస్తుండగా ఎదురుగా వెళ్తున్న డీసీఎం మినీలారీ ఢీకొనడంతో తలకు బలమైన గాయలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement