ఇద్దరిని బలిగొన్న ప్రమాదం
ఇద్దరిని బలిగొన్న ప్రమాదం
Published Wed, Jun 14 2017 1:15 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
కుక్కునూరు : మండలంలోని చీరవెల్లి, యర్రబోరు గ్రామాల మధ్య పాలవాగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా, మరొక యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బెస్తగూడెం గ్రామానికి చెందిన దానూరి నాగేంద్ర (24), దానూరి అరవింద్ (21), నడిపెంటి కిరణ్ (22) బైక్‌పై కుక్కునూరు నుంచి వెళుతుండగా చీరవెల్లి, యర్రబోరు గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్‌ను అతివేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నాగేంద్ర, అరవింద్ అక్కడికక్కడే మృతిచెందగా, కిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. కిరణ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. ఈ దుర్ఘటనతో మృతుల తల్లితండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుమారుడు మృతదేహాన్ని చూసిన వెంటనే నాగేంద్ర తల్లి స్పృహతప్పి పడిపోయింది. ముగ్గురు యువకులూ అవివాహితులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీసీఎం వ్యాన్ బోల్తాపడి తుప్పల్లో పడింది. అందులోని వారికి ఎటువంటి గాయాలు కాలేదు.
Advertisement
Advertisement