DCM van
-
AP: దేవరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏడుగురు మృతి
సాక్షి,తూర్పుగోదావరిజిల్లా: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో మంగళవారం(సెప్టెంబర్10) అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా ఒకరు గాయపడ్డారు. బొర్రంపాలెం నుంచి జీడిగింజల లోడుతో తాడిమల్ల వెళుతున్న డీసీఎం వాహనం దేవరపల్లి మండలం చిలకావారి పాకల వద్ద అదుపు తప్పిబోల్తా పడింది. జీడి గింజల బస్తాల కింద చిక్కుకుని ఊపిరాడక ఏడుగురు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో బస్తాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటికి తీశారు. మృతులను నిడదవోలు మండలం తాడిమళ్ల వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో డీసీఎంలో 10 మంది ఉన్నారు. డీసీఎం కేబిన్‌లో ఉన్నవారికి మాత్రం ఏమీ కాలేదు.ఇదీ చదవండి.. మాకు అడ్డొస్తే చంపేస్తాం -
Hyd: అల్వాల్‌లో డీసీఎం బీభత్సం.. బాలుడి మృతి
సాక్షి,హైదరాబాద్: సికింద్రాబాద్ అల్వాల్‌లో గురువారం మధ్యాహ్నం డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. స్థానికంగా ఉన్న ఓ సూపర్ మార్కెట్‌కు సరకులు తీసుకు వచ్చిన డీసీఎం వ్యాన్ పాదచారులపైకి దూసుకొచ్చింది. ఇదే సమయంలో తల్లితో నడుచుకుంటూ అటువైపు వెళుతున్న తిరుపాల్ (9)ని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తిరుపాల్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం తర్వాత వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి.. నిర్మల్ జిల్లాలో దారుణం.. ప్రియురాలి హత్య -
నట్టేట ముంచిన గూగుల్ మ్యాప్
అక్కన్నపేట (హుస్నాబాద్): ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తున్నామా?.. జస్ట్ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయడం, అందులో సూచించిన దారిని అనుసరిస్తూ ముందుకు వెళ్లిపోవడం మామూలైపోయింది. కానీ అన్నిసార్లు గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మి ముందుకెళ్తే నట్టేట మునగడం ఖాయం. తాజాగా ఓ డీసీఎం వ్యాన్ డ్రైవర్ గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వాహనం నడిపి ఏకంగా ప్రాజెక్టులోకి వెళ్లిపోయాడు. సిద్దిపేట అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామంలో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద ఈ ఘటన జరిగింది. పాల ప్యాకెట్లు తీసుకెళ్తూ.. హైదరాబాద్‌కు చెందిన ఓ డీసీఎం డ్రైవర్ శనివారం రాత్రి హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో వృధా అయిన పాల ప్యాకెట్లను వ్యాన్‌లో లోడ్ చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి హుస్నాబాద్ మీదుగా రామవరం వైపు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్‌కు రోడ్డుపై సరైన అవగాహన లేక గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో బంగారు లొద్దితండా దాటాక రామవరం వైపు వెళ్లాల్సిన ఉన్నా.. గుడాటిపల్లి వైపు మళ్లారు. మ్యాప్‌లో చూపించినట్టుగా ముందుకువెళ్లారు. కొంతదూరం వెళ్లాక నీరు ఎక్కువగా కనిపించింది. వాన వల్ల నీళ్లు నిలిచాయేమో అనుకుని ముందుకెళ్లాడు. క్యాబిన్ వరకూ నీళ్లు వచ్చాయి. డీసీఎం ఆగిపోయింది. దీంతో డ్రైవర్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఈదుకుంటూ బయటకు వచ్చాడు. చుట్టుపక్కల ఉన్న వారి వద్దకు వెళ్లి ఈ విషయం చెప్పాడు. ఆదివారం ఉదయం స్థానికులు జేసీబీ సాయంతో డీసీఎంను బయటకు లాగారు. రోడ్డుకు అడ్డుగా గోడ నిర్మించాలి నందారం స్టేజీ దాటాక రోడ్డుకు అవతలి వైపు గౌరవెల్లి ప్రాజెక్టు కట్టడంతో వెళ్లడానికి దారి లేదని స్థానికులు తెలిపారు. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ మేర నీరు నిలిచి ఉంటుందని వివరించారు. రోడ్డుకు అడ్డుగా పెద్ద గోడ నిర్మించాలని.. లేకుంటే గూగుల్ మ్యాప్ నుంచి ఈ రోడ్డును తొలగించాలని సూచించారు. ఇంతకుముందు సెప్టెంబర్ 7న ఓ లారీ డ్రైవర్ ఇలాగే గూగుల్ మ్యాప్ చూస్తూ.. ప్రాజెక్టులోకి దూసుకెళ్లారని.. ఇప్పుడు డీసీఎం వ్యాన్ వెళ్లిందని తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, నిజామాబాద్: నగర శివారులోని అర్సపల్లి బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి రెంజల్ మండలం దూపల్లి వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన డీసీఎం ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన జరిగిన ప్రాంతంలో అతివేగంతో రెండు వాహనాలు ఢీకొట్టు కోగా, మృతదేహాలతో పరిస్థితి భయానకంగా మారింది. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్‌లో భవన నిర్మాణ పనులు చేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. మృతులు, గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఆరవ టౌన్ పోలీసులు.. విచారణ చేపట్టారు. చదవండి: ప్రేమ విఫలమైందని రివాల్వర్‌తో కాల్చుకుని.. -
తుపాకీతో బెదిరించి.. ఫ్లిప్‌కార్ట్ సామాగ్రి దొంగతనం.. కళ్లకు గంతలు కట్టి
సాక్షి, హైదరాబాద్: ఐదుగురు దొంగలు దారిదోపిడీకి పాల్పడ్డారు. సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర సామగ్రితో వెళుతున్న డీసీఎంను అడ్డగించారు. డ్రైవర్‌ను తుపాకీతో బెదిరించి సామగ్రిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన భానూర్–బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వినాయక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..ప్లిప్ కార్డ్ కంపెనీ నుంచి గజ్వేల్‌కు ఓ డీసీఎం వెళుతుండగా, పటాన్చెరు మండల పరిధిలోని కర్ధనూర్ సర్వీస్ రోడ్డు వద్ద ఐదుగురు కారులో వచ్చి అడ్డగించారు. డీసీఎం డ్రైవర్‌ను బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకున్నారు. కళ్లకు గంతలు కట్టారు. ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగేలోపు తుపాకీతో బెదిరించారు. ఓ గంట తర్వాత కారులోంచి దింపారు. కళ్లకు కట్టిన గంతలు విప్పుకొని చూడగా, సుల్తాన్పూర్ ఎగ్జిట్–4 సర్వీస్ రోడ్డు వద్ద ఉన్నాడు. కొద్దిదూరంలో డీసీఎం ఉంది. అక్కడకు వెళ్లి చూడగా, డీసీఎంలో ఉన్న 20 బ్యాగులు కనిపించలేదు. సుమారు రూ.1,78,000 లక్షల విలువైన వస్తువులు చోరీ అయ్యాయని గుర్తించాడు. వెంటనే బాధితుడు పటాన్చెరు పోలీసులకు తెలుపగా వారు సంఘటన స్థలానికి వెళ్లాక పోలీసులు ఇది భానూర్–బీడీఎల్ ఠాణా పరిధిలోకి వస్తుందని వారికి సమాచారం ఇచ్చారు. డ్రైవర్ ఎండీ సత్తార్ ఫిర్యాదు మేరకు బీడీఎల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వంట చేయడానికి వెళ్తూ.. రోడ్డుకు బలై..
మహేశ్వరం/వెల్దండ: శుభకార్యాలకు వంట చేస్తూ మెప్పు పొందిన నలుగురు యువకులు.. ఓ పెళ్లిలో వంట చేసి పెట్టారు. మరో శుభకార్యానికి వంట చేసేందుకు కారులో బయలుదేరారు. కానీ రోడ్డు ప్రమాదానికి బలైపోయారు. అతి వేగంగా దూసు కొచ్చిన డీసీఎం వీరి కారును ఢీకొట్టడంతో నలుగు రూ దుర్మరణం పాలయ్యారు. వ్యాన్ డ్రైవర్, క్లీన ర్లకు గాయాలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజా మున శ్రీశైలం జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గేటు వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీనితో నాలుగు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. వంట పని చేసేందుకు వెళ్తూ..: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్డండ మండలం పోతేపల్లికి చెందిన బైకని యాదయ్య(34), ఎరుకలి చెన్న కేశవులు(35), ముంత శ్రీనివాసులు (30), లింగారెడ్డిపల్లికి చెందిన ఇమ్మరాశి రామస్వామి (32) నలుగురూ శుభ కార్యాల్లో వంట పనులు చేస్తుంటారు. నలుగురు కలిసి గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో ఓ పెళ్లికి వంట చేశారు. రాత్రి నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం తుమ్మ లపల్లిలో మరో పెళ్లిలో వంట చేయడానికి స్విఫ్ట్ కారులో బయలుదేరారు. వారు అర్ధరాత్రి 2 గంటల సమయంలో శ్రీశైలం జాతీయ రహ దారిపై తుమ్మలూరు గేటు సమీపంలో ప్రయాణిస్తుండగా.. కందు కూరు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న డీసీఎం వాహనం బలంగా స్విఫ్ట్ కారును ఢీకొట్టింది. కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయిపోగా.. డీసీఎం అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమా దంలో కారులోని రామస్వామి, యాద య్య, శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన చెన్నకేశ వులును 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలో ప్రాణాలు వదిలాడు. డీసీఎం డ్రైవర్ షేక్ జానీ, క్లీనర్లకు గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డీసీఎం డ్రైవర్ అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నా రు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి కి తరలించారు. నలుగురి మృతితో రెండు గ్రామాలు విషాదంలో మునిగిపోయాయి. మృతుల బంధువుల ఆందోళన ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వారి బంధువులు, పోతేపల్లి, లింగారెడ్డి పల్లి సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు మహేశ్వరం పోలీస్‌స్టేషన్ ఎదుట, తర్వాత శ్రీశైలం జాతీయ రహదారి పై ధర్నాకు దిగారు. దీనితో సుమారు 3 గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. కాగా మృతుల కు టుంబాలను కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరా మర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, పిల్లలకు ఉచిత విద్య తోపాటు ప్రభుత్వపరంగా అన్నిరకాలుగా ఆదుకుంటామ ని హామీ ఇచ్చారు. పోతేపల్లికి చెందిన సంజీవ్‌కుమార్ యాదవ్ బాధిత కుటుంబాలకు రూ.25వేల చొప్పున రూ.లక్ష ఆర్థి కసాయం అందజేశారు. ఇక బాధిత కుటుంబాలను చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, బీజేపీ నేత ఆచారి పరామర్శించారు. అందరూ నిరుపేదలే.. తుమ్మలూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నలుగురివీ పేద కుటుంబాలే. వీరిలో యాదయ్య వ్యవసాయం చేస్తూ.. పెళ్లిళ్ల సీజన్లో వంట పనులు చేస్తుంటాడు. తనకు సహాయంగా చెన్నకేశవులు, శ్రీనివాసులు, రామస్వామిలను తీసుకెళ్తుంటాడు. యాదయ్యకు భార్య భాగ్యమ్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామస్వామికి భార్య కృష్ణమ్మతో పాటు ఒక కుమారుడు, కుమార్తె.. కేశవులుకు భార్య రజిత ఒక కుమార్తె, కుమారుడు.. శ్రీనివాసులుకు భార్య కృష్ణమ్మతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కు అయినవారు మృతి చెందడంతో.. ఈ నాలుగు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. -
పెంబర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
జనగామ: పొగమంచు.. అతివేగంతో జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. జనగామ మండలం పెంబర్తి శివారు పెట్రోల్ బంకు ఏరియాలో హైవేపై మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటలకు జరిగిన ప్రమాదంలో వేర్వేరు కుటుంబాలకు చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇనుప సామాను స్క్రాప్ వ్యాపారం చేసే సూర్యాపేట జిల్లా తిర్మలగిరికి చెందిన వాటం రాజశేఖర్(33), భువనగిరిలో ఉంటున్న డీసీఎం క్లీనర్ ఎండీ అబ్దుల్‌రహీంఖాన్(38) స్క్రాప్ లోడ్ తీసుకుని డీసీఎంలో సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌కు సోమవారం రాత్రి బయలుదేరారు. జనగామ మండలం పెంబర్తి శివారు పెట్రోలు బంకు ఏరియాకు చేరుకునే సమయంలో డీసీఎం టైరు పంక్చర్ అయింది. టైరు మార్చుకునే క్రమంలో డీసీఎంను రోడ్డు పక్కన నిలిపి... పార్కింగ్ లైట్లు వెలిగించి సెక్యూరిటీగా టైరును అడ్డంగా ఉంచారు. తిరుపతి నుంచి వరంగల్‌కి రైలులో వచ్చిన బేగంపేట బ్రాంచ్ హెచ్డీబీ బ్యాంకు మేనేజర్ మిర్యాల దేవేందర్‌రెడ్డి కారులో తాను నివాసం ఉంటున్న హైదరాబాద్ కేబీహెచ్‌కే కాలనీకి తన భార్య శ్రావణి, కూతురు శ్రీనిత (7)తో బయలుదేరారు. తెల్లవారుజామున 5.30గంటల సమయంలో పొగమంచు కారణంగా రోడ్డుపై ఆగి ఉన్న డీసీఎంను గమనించని దేవేందర్‌రెడ్డి.. సెక్యూరిటీగా ఉంచిన టైరును వేగంగా ఢీకొట్టాడు. దీంతో గాల్లో పల్టీలు కొట్టిన కారు... టైరు పంక్చర్ చేస్తున్న క్లీనర్ ఎండీ అబ్దుల్ రహీం ఖాన్, రాజశేఖర్‌పై పడి... మరో 200 మీటర్ల దూరం దూసుకుపోయింది. నుజ్జునుజ్జయిన ఆ ఇద్దరూ అక్కడకక్కడే మృతి చెందగా... కారులో కూర్చున్న శ్రీనిత.. ముందు అద్దం పగలడంతో రోడ్డుపై ఎగిరి పడింది. తలకు బలమైన గాయాలు కావడంతో...ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. సీటు బెల్ట్ ధరించడంతో తప్పిన ప్రాణాపాయం దేవేందర్‌రెడ్డి, శ్రావణి సీటు బెల్ట్ ధరించడంతో స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ప్రమాద సమయంలో డీసీఎం డ్రైవర్ మహబూబ్ కాస్త దూరంగా ఉండడంతో.. త్రుటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకున్నాడు. దేవేందర్‌రెడ్డిపై కేసు నమోదు... మృతుడు రాజశేఖర్ భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కారు యజమాని(డ్రైవర్) దేవేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ప్రమాద సమయంలో డీసీఎం రోడ్డు పక్కగా ఉందని, అటుగావచ్చే వాహనాలు గమనించేలా పార్కింగ్ లైట్లు కూడా వేశారని చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఢీ కొట్టి.. ఈడ్చుకెళ్లి..
భువనగిరి: బంధువుల అంత్యక్రియలకు వెళ్లేందుకు స్కూటీపై బయల్దేరిన వారిని డీసీఎం వాహనం రాంగ్ రూట్లో వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో వెనుక కూర్చున్న మహిళ ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. వీరిని ఢీ కొట్టిన తర్వాతైనా బండిపై ఉన్నవారు వేసిన కేకల్ని వినిపించుకుని వాహనాన్ని ఆపితే కనీసం రెండు ప్రాణాలైనా నిలిచేవి. కానీ, మద్యంమత్తులో వాహనాన్ని అత్యంత నిర్లక్ష్యంగా నడుపుతున్న ఆ డ్రైవర్ వీరు వేసిన కేకల్ని వినిపించుకోలేదు. స్కూటీతో పాటు వీరిని కూడా వంద మీటర్లు దూరం ఈడ్చుకెళ్లిపోయాడు. దీంతో వీరు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ముగ్గురు ప్రాణాలు తీయడమే కాకుండా ముగ్గురు పిల్లలు అనాథలయ్యేందుకు కారణమయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని హన్మాపురం గ్రామ పరిధిలో గురువారం చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామానికి చెందిన దండబోయిన నర్సింహ(35), రాజ్యలక్ష్మి(30) దంపతులతో పాటు నర్సింహ వదిన దండ బోయిన జంగమ్మ(40) గురువారం బొమ్మల రామారం మండలం లోని చౌదరిపల్లి గ్రామంలో బంధువుల అంత్య క్రియలకు హాజరయ్యేందుకు స్కూటీపై బయల్దే రారు. అంతకు ముందేగానే జంగమ్మ భర్త బాలు మల్లు అంత్యక్రియలకు బయల్దేరి వెళ్లాడు. అయితే స్కూటీపై బయల్దేరిన ముగ్గురూ భువనగిరి పట్టణం దాటిన తర్వాత హన్మాపురం గ్రామ పరిధిలోని బచ్పన్ స్కూల్ సమీపంలో చేరుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో జగదేవ్‌పూర్ నుంచి భువనగిరి వైపు వేగంగా వస్తున్న డీసీఎం వాహనం వీరిని ఢీకొట్టింది. దీంతో స్కూటీ డీసీఎం వాహనం ముందు భాగంలో ఇరుక్కుపోయింది. స్కూటీపై వెనుక కూర్చున్న జంగమ్మ ఎగిరి రోడ్డుపైపడి అక్కడికక్కడే మృతి చెందింది. కేకలు పెడుతున్నా వినిపించుకోకుండా.. స్కూటీ ముందుభాగం డీసీఎంలో ఇరుక్కుపోవ డంతో రాజ్యలక్ష్మి, నర్సింహ కేకలు వేశారు. ఎంత గా అరుస్తున్నా వినిపించుకోకుండా డీసీఎం డ్రైవర్ ముందుకు దూసుకెళ్లాడు. కొంతదూరం వెళ్లగానే రాజ్యలక్ష్మి స్కూటీ నుంచి విడిపోయి మృతి చెంద గా..నర్సింహను సుమారు 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లిపోయాడు. అప్పటికే అతడు కూడా మృతి చెందాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి డీసీఎం వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, పారిపోతున్న డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బంధువులు కూడా గుర్తించలేదు మృతుల బంధువులు కూడా అదే దారిలో అంత్య క్రియలకు వెళ్తుండగా అప్పటికే ప్రమాదం జరగ డంతో జనం గుమికూడారు. దీంతో చనిపోయింది తమ బంధువులేనని గుర్తించలేకపోయామని వా రు వాపోతున్నారు. జంగమ్మ భర్త బాలుమల్లు ఇ చ్చిన ఫిర్యాదు మేరకు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడి పిన డీసీఎం డ్రైవర్‌పై 304( జీజీ) సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనాథలైన పిల్లలు నర్సింహా, రాజ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తల్లిదం డ్రులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ముగ్గురూ అనాథలయ్యారు. మరో మృతు రాలు జంగమ్మకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
హైదరాబాద్: చలో అంటే చల్తా నై!
సాక్షి, హైదరాబాద్: అనుమతి లేని సమయంలో నగరంలోని రహదారులపైకి దూసుకువస్తున్న భారీ వాహనాలు, డీసీఎంల కారణంగానూ కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఇలా వస్తున్న వాహనాలకు చలాన్ విధించడంతో సరిపెట్టారు. ఇకపై వీటిని ఆంక్షలున్న సమయం ముగిసే వరకు ఆపేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్వులు బేఖాతరు.. ►అనుమతి పొందినవి మినహా నగరంలోకి భారీ వాహనాలు, లారీలు, డీసీఎంల ప్రవేశంపై కొన్ని ఆంక్షలు ఉన్నాయి. రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల మధ్యలోనే ఇవి నగరంలో సంచరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఈ ఉత్తర్వుల్ని బేఖాతరు చేస్తున్న నిర్వాహకులు, డ్రైవర్లు ఎప్పుడుపడితే అప్పుడు దూసుకువచ్చేస్తున్నారు. ఈ ఉల్లంఘనపై ‘నో ఎంట్రీ’ కేసులు రాస్తున్న ట్రాఫిక్ పోలీసులు రూ.1000 చొప్పున జరిమానా విధిస్తున్నారు. ఏటా 30 వేల నుంచి 50 వేల వరకు ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. చదవండి: ప్రియుడితో పిజ్జాహట్‌కు.. మొదటి భార్యతో కలసి వీడియో రికార్డింగ్ ►ఆయా వాహనాల డ్రైవర్లు కూడా అనుమతి లేని వేళలో నగరంలోని ప్రవేశించేసి ఓసారి చలాన్ వేయించుకుంటున్నారు. దీన్ని చూపిస్తూ ఆ రోజంతా సిటీలో విహరించేస్తున్నారు. ఇలాంటి వాహనాలకు ప్రతి జంక్షన్‌లోనూ జరిమానా విధించే అవకాశం ఉన్నా.. ఇప్పటి వరకు మానవతా దృక్పథంతో పోలీసులు అలా చేయలేదు. దీన్ని అలుసుగా తీసుకుంటున్న కొన్ని కంపెనీలు తమ వాహనాలను నో ఎంట్రీ సమయంలోనూ తిప్పేస్తున్నాయి. రోజుకు ఒక చలాన్ చొప్పున చెల్లిస్తూ తమ పని కానిచ్చుకుంటున్నాయి. వీటి వల్ల ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతూ ఇతర వాహనచోదకులు ఇబ్బందులు పడటంతో పాటు కొన్నిసార్లు ప్రమాదాలూ జరుగుతున్నాయి. పెద్ద ప్రహసనమే.. వీటిని పరిగణనలోకి తీసుకున్న సిటీ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఆయా వాహనాలు కనిపించిన వెంటనే ఆపి చలాన్ వేయడంతో పాటు నిషేధిత సమయం ముగిసే వరకు అనువైన ప్రాంతంలో ఆపేయాలని నిర్ణయించారు. మరోపక్క ఇలాంటి ‘నో ఎంట్రీ వాహనాలను’ స్వాధీనం చేసుకునే ఆస్కారం సైతం పోలీసులకు ఉంది. అయితే దీని వెనక పెద్ద ప్రహసనమే ఉంటోంది. రహదారిలో ఓ ప్రాంతంలో ఇలాంటి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడే ఉంచడం సాధ్యం కాదు. దాని డ్రైవర్‌ను పంపేసినా మరో డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్ పోలీసుస్టేషన్కో, గోషామహల్ స్టేడియానికో తరలించాలి. ఆపై సదరు డ్రైవర్/యజమాని జరిమానా చెల్లించి వచ్చి తీసుకువెళ్లే వరకు దాన్ని భద్రపరచాల్సి ఉంటుంది. వీటన్నింటికీ మించి అనుమతి లేని సమయంలో వచ్చిన భారీ వాహనంలో నిత్యావసర, అత్యవసర, సున్నిత వస్తువులు ఉంటే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కావట్లేదు. భారీ శబ్దాలతో నరకం.. ►నో ఎంట్రీ సమయంలో వస్తున్న భారీ వాహనాల్లో డీసీఎంలే ఎక్కువ. ప్రమాదాల్లోనూ వీటిది పెద్ద స్థానమే. మరోపక్క రాత్రి అయిందంటే చాలు నగరంలోని ప్రధాన రహదారులన్నీ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులతో నిండిపోతున్నాయి. అడ్డదిడ్డంగా నడిచే ఈ వాహనాలు, అడ్డగోలుగా పార్కింగ్స్, భయానకమైన శబ్దాలు చేసే హారన్లు తోటి వాహనచోదకులతో పాటు నగర వాసులకూ నరకాన్ని చూపిస్తున్నాయి. ►రాత్రి 10 గంటల లోపు ప్రైవేట్ బస్సులు సిటీలోకి రావడానికి అనుమతి లేదు. రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు నిబంధనలు బేఖాతరు చేయడం, అడ్డదిడ్డంగా డ్రైవ్ చేయడం, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా పార్కింగ్ చేయడం పరిపాటగా మారింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఆయా వాహనాలకు నిర్దిష్ట విధానం రూపొందించడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ సమస్య తీరాలంటే ప్రయాణికుల్ని ఎక్కించుకోవడానికి, దింపడానికి ఈ వాహనాల కోసం ప్రత్యేక ప్రాంతాలు ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసుస్టేషన్ల వారీగా గుర్తించి ఏర్పాట్లు చేస్తేనే ఈ బస్సుల హడావుడికి చెక్ చెప్పవచ్చనే వాదన వినిపిస్తోంది. -
నల్గొండ: సేల్స్ ట్యాక్స్ అధికారుల దాడి.. ప్లాస్టిక్ పైపులతో కొట్టి చంపి..
సాక్షి, తుర్కపల్లి: సేల్స్ ట్యాక్స్ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో డీసీఎం డ్రైవర్ అస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. అయితే ఆకస్మికంగా కిందపడి తన తండ్రి చనిపోయినట్లు మృతుడి కుమారుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనగా, అడిగినంత లంచం ఇవ్వలేదని సేల్స్‌ట్యాక్స్ అధికారులు ప్లాస్టిక్ పైపులతో కొట్టి చంపారని ప్రత్యక్ష సాక్షిగా ఉన్న డీసీఎం క్లీనర్ అంటున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెంది ననబీలాల్ సదాఫ్(48) ఏపీలోని గుంటూరు నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు డీసీఎం వ్యాన్‌లో ఇనుప సామగ్రితో బుధవారం వెళ్తున్నారు. తుర్కపల్లిలో భువనగిరికి చెందిన కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నబీలాల్ సదాఫ్ డీసీఎంను ఆపారు. ఆ సమయంలో సదాఫ్ ఆకస్మికంగా కింద పడటంతో ఇతర లారీ డ్రైవర్లు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి భువనగిరికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు నబీలాల్ కొడుకు దవాలా సాబ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. చదవండి: తెలంగాణలో ఒమిక్రాన్ కలవరం ఒకే రోజు 14 కేసులు అడిగినంత లంచం ఇవ్వలేదనే చంపేశారు: క్లీనర్ అధికారులు లోడ్‌ను తనిఖీ చేసి వాహన కాగితాలు పరిశీలించారని, వాహనాన్ని పక్కకు నిలిపి రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని క్లీనర్ ఆరోపించారు. ఈ విషయమై డీసీఎం డ్రైవర్ ట్రాన్ప్రోర్టు యాజమానులకు ఫోన్ ద్వారా చెప్పి రూ.15 వేలు ఇస్తానని బతిమిలాడినా ఒప్పుకోలేదని, అధికారి దినేష్ కోపోద్రిక్తుడై నదాఫ్ కాళ్లపై ప్లాస్టిక్ పైప్‌తో కొట్టాడన్నారు. దీంతో సదాఫ్ ప్యాంట్‌లోనే మూత్ర విసర్జన చేసుకుని అక్కడికక్కడే కుప్పకూలాడని, వెంటనే సేల్‌ట్యాక్స్ అధికారుల కారులోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని, అక్కడి నుంచి భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడని తెలిపారు. చదవండి: విటమిన్ ‘డి’ లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త! -
ఘట్కేసర్లో డీసీఎం వ్యాన్ మంటలు
-
ఇంటికి చేరుకునేలోపే...
పరిగి : పండగపూట విషాదం చోటు చేసుకుంది. అందరూ ఉపవాస దీక్షల్లో మునిగిపోతే..ఆ ఇంట్లో మాత్రం విషాద ఛాయలు అలముకున్నాయి. ఎదురురెదుగా వస్తున్న డీసీఎం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని ఖుదావంద్‌గేట్ సమీపంలో పరిగి–షాద్‌నగర్ రోడ్డుపై మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం గాలిగూడెం అనుబంధ గ్రామం ఇస్రాన్‌గడ్డతండాకు చెందిన విక్రమ్(19), అదే తండాకు చెందిన హన్ము(13) స్నేహితులు. విక్రమ్ అన్న బతుకుదెరువు కోసం బొంబాయి వెళుతుండటంతో సాగనంపేందుకు వికారాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. వారిని రైలెక్కించి తిరిగి ఇంటికి బయలుదేరారు. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుతారనగా మండల పరిధిలోని ఖుదావంద్‌పూర్ గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వీరి బైకును ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న విక్రం (19) అక్కడికక్కడే మృతి చెందాడు. హన్ము(13)కు తీవ్ర గాయాలవడంతో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విక్రమ్ షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుండగా.. హన్ము గాలిగూడెం పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విక్రమ్ మృతదేహాన్ని పరిగి మార్చురీలో ఉంచారు. -
డీసీఎం ఢీకొని ముగ్గురు యువకులు మృతి
-
డీసీఎం వ్యాను బీభత్సం : ముగ్గురు మృతి
నల్లగొండ : నల్లగొండ బైపాస్ రోడ్ లో అర్జలబావి దగ్గర డీసీఎం వ్యాను బీభత్సం సృష్టించింది. నార్కెట్‌పల్లి అద్దంకి రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి నడుచుకుంటూ వెళుతున్న ముగ్గురు యువకులను డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. నల్లగొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ సంతాప సభ జిల్లా కేంద్రంలో జరగనున్న నేపథ్యంలో టెంటూ క్యాటరింగ్ ఏర్పాట్ల కోసం హైదరాబాద్ నుండి యువకులు వచ్చినట్లు తెలుస్తోంది. అద్దంకి నార్కెట్‌పల్లి రోడ్డులోని మర్రిగూడ బైపాస్ వద్ద బస్సు దిగాల్సి ఉండగా, యువకులు తెలియక ముందుకెళ్లి దిగారు. అక్కడి నుండి తిరిగి నడుచుకుంటూ వస్తున్న ఈ యువకులను డీసీఎం వ్యాను ఢీకొట్టడంతో మృత్యువాత పడ్డారు. మృతులు కృష్ణా జిల్లా చెన్నూరుకు చెందిన హేమంత్, అదే జిల్లా కంచికర్లకు చెందిన వాసిరెడ్డి మురళి, కీసరకు చెందిన సనీల్ గా గుర్తించారు. -
ఇద్దరిని బలిగొన్న ప్రమాదం
కుక్కునూరు : మండలంలోని చీరవెల్లి, యర్రబోరు గ్రామాల మధ్య పాలవాగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా, మరొక యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బెస్తగూడెం గ్రామానికి చెందిన దానూరి నాగేంద్ర (24), దానూరి అరవింద్ (21), నడిపెంటి కిరణ్ (22) బైక్‌పై కుక్కునూరు నుంచి వెళుతుండగా చీరవెల్లి, యర్రబోరు గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్‌ను అతివేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నాగేంద్ర, అరవింద్ అక్కడికక్కడే మృతిచెందగా, కిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. కిరణ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. ఈ దుర్ఘటనతో మృతుల తల్లితండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుమారుడు మృతదేహాన్ని చూసిన వెంటనే నాగేంద్ర తల్లి స్పృహతప్పి పడిపోయింది. ముగ్గురు యువకులూ అవివాహితులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీసీఎం వ్యాన్ బోల్తాపడి తుప్పల్లో పడింది. అందులోని వారికి ఎటువంటి గాయాలు కాలేదు. -
లారీ–డీసీఎం ఢీ.. వ్యక్తి మృతి
శంషాబాద్(రంగారెడ్డి): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఘన్షిమియాగూడ వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొట్టడంతో.. ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
డీసీఎం వ్యాన్ బీభత్సం, ఇద్దరు మృతి
అనంతపురం: వేగంగా వెళ్తున్న డీసీఎం వాహనం అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం ఎన్ఎస్పీ కొట్టాల వద్ద శనివారం ఉదయం రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి వ్యాన్ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. -
డీసీఎంను ఢీకొట్టిన వోల్వో: ఇద్దరు మృతి
నల్గొండ : నల్గొండ జిల్లా కోదాడ జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం వ్యాన్‌ను గరుడ వోల్వో బస్సు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు డీసీఎం వ్యాన్ డ్రైవర్ శ్రీనివాస్, గరుణ బస్సు క్లీనర్ వినయ్‌కుమార్ రెడ్డి అని పోలీసులు చెప్పారు. -
డీసీఎం వ్యాన్ బోల్తా : 8మందికి గాయాలు
పినపాక: ఖమ్మం జిల్లాలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో 8మందికి తీవ్రగాయాలయ్యాయి. పినపాక మండలం మల్లారం మూలమలుపు వద్ద డీసీఎం వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వాళ్లంతా పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఖమ్మం నుంచి వరంగల్ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పినపాక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి
ఘట్కేసర్(రంగారెడ్డి): డీసీఎం వ్యాను బైక్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఘట్కేసర్ మండలం అవుషాపూర్ వద్ద గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఘట్కేసర్ పోలీసులు తెలిపిన వివరాలు...వరంగల్ జిల్లా తొర్రూర్ మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన అలుగంటి వేణు(28) హైదరాబాద్‌లో ఉంటున్నాడు. గురువారం రాత్రి స్వగ్రామం నుంచి బైక్‌పై వస్తున్న అతడిని ఘట్కేసర్ మండలంలోని వరంగల్-హైదరాబాద్ జాతీయరహదారిపై వెనుక నుంచి వచ్చిన డీసీఎం ఢీ కొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలవ్వడంతో వేణు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. -
గుట్కా లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా
ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలం తుక్కాపురం స్టేజీ వద్ద గుట్కాలోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం సోమవారం రాత్రి అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. డీసీఎం హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ డీసీఎం డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. -
ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్ ఢీ
చింతపల్లి (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా చింతపల్లి శివారులో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి వినుకొండకు వెళుతున్న ఏపీ 29 జడ్ 3538 నంబర్ గల ఆర్టీసీ బస్సు, మల్లేపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఏపీ 29యు 2789 నంబరు గల డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న కుర్మేడు గ్రామానికి చెందిన యాదగిరి, దేవరకొండకు చెందిన వెంకటరెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను చింతపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చింతపల్లి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు.. డీసీఎం వ్యాను ఢీ
చింతపల్లి: ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వెంకటంపేట వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. వివరాలు.. దేవరకొండ నుంచి ఆర్టీసీ బస్సులో నల్లగొండ వైపు వెళ్తోంది. ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాను, బస్సు ఢీ కొన్నాయి. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డీసీఎం వ్యాను డ్రైవర్, క్లీనర్, మరో వ్యక్తి గాయపడగా వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. -
గంజాయి తరలిస్తున్న డీసీఎం స్వాధీనం
మెదక్: మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలంలో పోలీసులు 180 కిలోల గంజాయిని సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....ఎక్సైజ్ సీఐ మణెమ్మ, స్థానిక ఎస్సై సూర్య ప్రకాశ్ శుక్రవారం ఉదయం బీబీపేట వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా పిట్లం నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న డీసీఎంను తనిఖీ చేయగా 180 కిలోల గంజాయితో పట్టుబడింది. లారీని ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. (నారాయణ్‌ఖేడ్) -
బాలుడిని చిదిమేసిన వ్యాన్
తొమ్మిదేళ్ల బాలుడిని డీసీఎం వ్యాన్ చిదిమేసింది. పాలు తీసుకొచ్చేందుకు సైకిల్‌పై బయల్దేరిన అతడిని వ్యాన్ ఢీకొట్టడంతో చక్రాల కిందపడి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనతో మొయినాబాద్ మండలం చిలుకూరులో విషాదం అలుముకుంది. - సైకిల్‌ను ఢీకొన్న వ్యాన్ - వెనుక చక్రాల కిందపడి దుర్మరణం - మొయినాబాద్ మండలం చిలుకూరులో ఘటన మొయినాబాద్ రూరల్: డీసీఎం వ్యాన్ ఓ బాలుణ్ని బలిగొంది. పాలు తీసుకురావడానికి సైకిల్‌పై వెళ్తున్న బాలుణ్ని ఢీకొనడంతో వెనుక చక్రాల కిందపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ‘అప్పుడే నీకు నూరే ళ్లు నిండాయారా తండ్రీ.. ’ అంటూ మృతుడి తల్లి రోదించిన తీరు స్థానికులకు కంటతడి పెట్టించింది. ఈ విషాదకర సంఘటన మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్ఐ రవీంద్రనాయక్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వినోదను కొన్నేళ్ల క్రితం రాజేంద్రనగర్ మండలం ఖిల్లాస్ఖాన్ దర్గాకు చెందిన రాములు వివాహం చేసుకున్నాడు. దంపతులు కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పిల్లలు వినయ్(9), అఖిల ఉన్నారు. బాలుడు వినయ్ అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చిలుకూరులోని ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఇదిలా ఉండగా, కుటుంబ కలహాల నేపథ్యంలో మూడు నెలల క్రితం వినోద కూతురును తీసుకొని పుట్టింటికి వచ్చింది. సోమవారం ఉదయం సుమారు 8.45 గంటల సమయంలో బాలుడు స్కూల్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అంతలోనే పాలు తీసుకురావడానికి కిరాణా దుకాణానికి సైకిల్‌పై బయలుదేరాడు. ఈక్రమంలో కోళ్లలోడ్‌తో నగరానికి వెళ్తున్న ఓ డీసీఎం వ్యాన్ (ఏపీ 28టీజీ 4702) వినయ్ సైకిల్‌ను ఢీకొంది. బాలుడు ఎగిరిపడడంతో డీసీఎం వెనుక చక్రాలు అతడి పైనుంచి వెళ్లాయి. దీంతో అతడి తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు మృత్యువాత పడడంతో వినోద గుండెలుబాదుకుంటూ రోదించింది. సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఉస్మానియా ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతుడి తల్లి వినోద ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వ్యాన్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.