డీసీఎం వ్యాను బైక్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.
ఘట్‌కేసర్(రంగారెడ్డి): డీసీఎం వ్యాను బైక్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఘట్కేసర్ మండలం అవుషాపూర్ వద్ద గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఘట్‌కేసర్ పోలీసులు తెలిపిన వివరాలు...వరంగల్ జిల్లా తొర్రూర్ మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన అలుగంటి వేణు(28) హైదరాబాద్‌లో ఉంటున్నాడు.
గురువారం రాత్రి స్వగ్రామం నుంచి బైక్‌పై వస్తున్న అతడిని ఘట్‌కేసర్ మండలంలోని వరంగల్-హైదరాబాద్ జాతీయరహదారిపై వెనుక నుంచి వచ్చిన డీసీఎం ఢీ కొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలవ్వడంతో వేణు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు.