బోలేరో - డీసీఎం ఢీ: ఒకరు మృతి | One dead, Two injured in Road Accident at Anantapur District | Sakshi
Sakshi News home page

బోలేరో - డీసీఎం ఢీ: ఒకరు మృతి

Published Sat, Aug 2 2014 8:19 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

One dead, Two injured in Road Accident at Anantapur District

అనంతపురం: అనంతపురం జిల్లా తనెకల్లు మండలం కొక్కంటి క్రాస్ రోడ్డు వద్ద బోలేరో, డీసీఎం వాహనాలు ఢీ కొన్నాయి. ఆ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆ ఘటనలో మరణించిన మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement