మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామం వద్ద సైకిల్‌పై వెళ్తున్న విద్యార్థులను డీసీఎం ఢీకొట్టింది.
రంగారెడ్డి: మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామం వద్ద సైకిల్‌పై వెళ్తున్న విద్యార్థులను డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూల్ విద్యార్థి వినయ్(10) మృతి చెందాడు. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాలున్ని దగ్గరలోని భాస్కర ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వినయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు డీసీఎం డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
(మొయినాబాద్)