సంగారెడ్డి: జులాయిగా తిరగొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన రాయపోలు మండలం ఎల్కల్‌లో చోటు చేసుకుంది. బేగంపేట ఎస్సై అరుణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కల్‌కు చెందిన ఎల్లొల్ల చంద్రం కుమారుడు వినయ్ (16) చదువు మానేసి ఖాళీగా తిరుగుతున్నాడు. స్నేహితులతో జులాయిగా తిరగొద్దని, ఏదైనా పనిచేసుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన వినయ్ డిసెంబర్ 29న గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో గడ్డిమందు తాగాడు. విషయాన్ని తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. గమనించి స్నేహితులు కుటుంసభ్యులకు సమాచారం అందించి వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
ఇవి చదవండి: బర్త్‌డేకు ఇదే నా చిన్న గిఫ్ట్ అంటూ.. సెల్ఫీతో యువకుడి విషాదం!
Comments
Please login to add a commentAdd a comment