
మెదక్: సైకోలా ప్రవర్తించిన భర్త, భార్యపిల్లల ముందు కూర్చోబెట్టుకున్నాడు. విషం తాగుతున్నానని అడ్డుకుంటే కత్తితో పొడుస్తానని బెదిరించి ఆత్మహత్మ చేసుకున్నాడు. ఈ సంఘటన మండలపరిధిలోని బ్యాతోల్‌లో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మంగళి పోచయ్య(42) కొంతకాలంగా మద్యం తాగి తరుచుగా కుటుంబీకులతో గొడవలు పడేవాడు.
సైకోగా మారిన అతను ఈనెల 18న సోమవారం రాత్రి భార్య, కుమారుల ఎదుట పురుగుల మందు తాగి, అడ్డుకుంటే కత్తితో పొడుస్తానంటూ బెదిరించాడు. దీంతో ఎవరు దగ్గరకు వెళ్లలేదు. అపస్మారక స్థితికి వెళ్లపోయిన అతడిని వెంటనే మెదక్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గాంధీకి తీసుకెళ్లారు. ఇక్కడ రెండు రోజులుగా చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.