pochaiah
-
సైకోగా మారిన భర్త..! భార్యపిల్లల ముందే మరీ దారుణం..!!
మెదక్: సైకోలా ప్రవర్తించిన భర్త, భార్యపిల్లల ముందు కూర్చోబెట్టుకున్నాడు. విషం తాగుతున్నానని అడ్డుకుంటే కత్తితో పొడుస్తానని బెదిరించి ఆత్మహత్మ చేసుకున్నాడు. ఈ సంఘటన మండలపరిధిలోని బ్యాతోల్‌లో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మంగళి పోచయ్య(42) కొంతకాలంగా మద్యం తాగి తరుచుగా కుటుంబీకులతో గొడవలు పడేవాడు. సైకోగా మారిన అతను ఈనెల 18న సోమవారం రాత్రి భార్య, కుమారుల ఎదుట పురుగుల మందు తాగి, అడ్డుకుంటే కత్తితో పొడుస్తానంటూ బెదిరించాడు. దీంతో ఎవరు దగ్గరకు వెళ్లలేదు. అపస్మారక స్థితికి వెళ్లపోయిన అతడిని వెంటనే మెదక్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గాంధీకి తీసుకెళ్లారు. ఇక్కడ రెండు రోజులుగా చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మద్యం తాగి.. పలుమార్లు రైతు పైనుంచి ట్రాక్టర్ని.. ఘోర విషాదం..
పెద్దపల్లి: మద్యం తాగి వాహనాలు నడపరాదని పోలీసులు ఎంత అవగాహన కల్పించినా కొందరు వినడం లేదు. మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపిన వ్యక్తి ఓ రైతును బలితీసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని అంబారిపేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అంబారిపేటకు చెందిన ముడిమడుగుల పోచయ్య(50) తన వ్యవసాయ పొలం దున్నడానికి మంగళవారం అదే గ్రామానికి చెందిన జాడి బానయ్యను పిలిచాడు. అతను అతిగా మద్యం తాగి, ఆ మత్తులో ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్నాడు. వెనక ఉన్న పోచయ్యను గమనించకుండా వేగంగా నడపడంతో ట్రాక్టర్ అతన్ని తొక్కుకుంటూ వెళ్లింది. ఈ సంఘటనలో పోచయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్న బానయ్య పలుమార్లు ట్రాక్టర్‌ను మృతదేహం పైనుంచి తిప్పడంతో నుజ్జునుజ్జయి, తల, మొండెం, కాళ్లు, చేతులు వేటికవే పూర్తిగా తెగిపోయాయి. పొలం దున్నడం పూర్తయిన తర్వాత పోచయ్య కనిపించడం లేదని అతని కుమారుడు సతీశ్‌కు చెప్పాడు. దీంతో కుటుంబసభ్యులు గ్రామంలో వెతకగా ఆచూకీ లభించలేదు. రాత్రి సమయంలో పొలంలో వెతకగా రక్తం, పోచయ్య శరీర భాగాలు కొద్దిగా కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు బుధవారం పొలంలో పూర్తిగా తెగిపడిన మృతుడి శరీర భాగాలను బయటకు తీయించి, పోస్టుమార్టం చేయించారు. పోచయ్య కుమారుడి ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మద్యం తాగి, ట్రాక్టర్ నడిపి, పోచయ్య మృతికి కారణమైన బానయ్యపై కఠినచర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబసభ్యులు కోరుతున్నారు. -
ఉట్నూర్ ఐటీడీఏకి ‘తుడుందెబ్బ’
సాక్షి,ఆదిలాబాద్: ఎస్టీల్లో నుంచి లంబాడాలను తొలగించాలని ఇప్పటివరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ఆదివాసీలు తాజాగా ప్రభుత్వం వివిధ కులాలను ఎస్టీల్లో చేర్చడంపై ఆగ్రహావేశాలతో ఆందోళన ఉధృతం చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో వాల్మీకిబోయ, ఖైతి లంబాడాతో పాటు మొత్తంగా 11 కులాలను షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో చేరుస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏను ముట్టడించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ముందుగా నిర్ణయించింది. రాష్ట్ర అధ్యక్షుడు బుర్సా పోచయ్య ఆధ్వర్యంలో సోమవారం ఆదివాసీలు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఆ తర్వాత కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సమీపంలో ఏర్పాటుచేసిన బారికేడ్లను తోసేసి ఆదివాసీలులోనికి దూసుకెళ్లారు. కార్యాలయం పైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఆవరణలో ఉన్న ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ వాహన అద్దాలను ధ్వంసం చేశారు. అదనపు బలగాలతో చేరుకున్న ఎస్పీ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్పీ డి.ఉదయ్‌కుమార్ రెడ్డి అదనపు బలగాలతో ఉట్నూర్ చేరుకున్నారు. సమస్యలను కలెక్టర్‌కు విన్నవించాలని కోరారు. అయితే ఆందోళనకారులు ఐటీడీఏ పీవో రావాలని పట్టుబట్టారు. ప్రస్తుతం నిర్మల్ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న వరుణ్‌రెడ్డి ఉట్నూర్ ఐటీడీఏకు ఇన్చార్జి పీవోగా కొనసాగుతున్నారు. ఓ గంట తర్వాత ఆయన అక్కడికి చేరుకోవడంతో ఆదివాసీలు తమ సమస్యలను విన్నవించారు. ఎస్టీల్లో అదనంగా కులాలను చేర్చడాన్ని వెనక్కి తీసుకోవాలని డి మాండ్ చేశారు. పోడు భూములకు పట్టాల జారీలో షరతులు విదించడం సరికాదన్నారు. దీనిపై వినతి పత్రాన్ని అందజేశారు. ఆయన స్పందిస్తూ ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. -
రైతు ఆత్మహత్య
పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం సజ్జనపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముగురి పోచయ్య(48) అనే రైతు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పంటల పెట్టుబడి కోసం రూ. 4 లక్షల వరకు అప్పు చేశాడు. దీంతో పాటు బ్యాంకులో తీసుకున్న అప్పు కూడా పెరిగిపోవడంతో.. వాటిని తీర్చే దారి కానరాక ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా.. అప్పటికే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భువనగిరిలో వ్యక్తి దారుణ హత్య
నల్లగొండ(భువనగిరి): నల్లగొండ జిల్లా భువనగిరిలో ఓ వ్యకి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. భువనగిరికి చెందిన పోటెట్టి పోచయ్య(28) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే పోచయ్యను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తర్వాత గ్రామ శివారులో కత్తులతో పొడిచి హతమార్చినట్టు తెలుస్తోంది. మృతుడికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.