![Nine Year Old Boy Died After Dcm Van Hit At Alwal - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/8/DCM.jpg.webp?itok=nJVPtaiR)
సాక్షి,హైదరాబాద్: సికింద్రాబాద్ అల్వాల్‌లో గురువారం మధ్యాహ్నం డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. స్థానికంగా ఉన్న ఓ సూపర్ మార్కెట్‌కు సరకులు తీసుకు వచ్చిన డీసీఎం వ్యాన్ పాదచారులపైకి దూసుకొచ్చింది. ఇదే సమయంలో తల్లితో నడుచుకుంటూ అటువైపు వెళుతున్న తిరుపాల్ (9)ని ఢీకొట్టింది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తిరుపాల్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం తర్వాత వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి.. నిర్మల్ జిల్లాలో దారుణం.. ప్రియురాలి హత్య
Comments
Please login to add a commentAdd a comment