
నగర శివారులోని అర్సపల్లి బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి రెంజల్ మండలం దూపల్లి వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన డీసీఎం ఢీకొన్నాయి.
సాక్షి, నిజామాబాద్: నగర శివారులోని అర్సపల్లి బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి రెంజల్ మండలం దూపల్లి వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన డీసీఎం ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
సంఘటన జరిగిన ప్రాంతంలో అతివేగంతో రెండు వాహనాలు ఢీకొట్టు కోగా, మృతదేహాలతో పరిస్థితి భయానకంగా మారింది. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్‌లో భవన నిర్మాణ పనులు చేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. మృతులు, గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఆరవ టౌన్ పోలీసులు.. విచారణ చేపట్టారు.
చదవండి: ప్రేమ విఫలమైందని రివాల్వర్‌తో కాల్చుకుని..