నబీలాల్ నదాఫ్(ఫైల్)
సాక్షి, తుర్కపల్లి: సేల్స్ ట్యాక్స్ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో డీసీఎం డ్రైవర్ అస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. అయితే ఆకస్మికంగా కిందపడి తన తండ్రి చనిపోయినట్లు మృతుడి కుమారుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనగా, అడిగినంత లంచం ఇవ్వలేదని సేల్స్‌ట్యాక్స్ అధికారులు ప్లాస్టిక్ పైపులతో కొట్టి చంపారని ప్రత్యక్ష సాక్షిగా ఉన్న డీసీఎం క్లీనర్ అంటున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెంది ననబీలాల్ సదాఫ్(48) ఏపీలోని గుంటూరు నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు డీసీఎం వ్యాన్‌లో ఇనుప సామగ్రితో బుధవారం వెళ్తున్నారు. తుర్కపల్లిలో భువనగిరికి చెందిన కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నబీలాల్ సదాఫ్ డీసీఎంను ఆపారు. ఆ సమయంలో సదాఫ్ ఆకస్మికంగా కింద పడటంతో ఇతర లారీ డ్రైవర్లు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి భువనగిరికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు నబీలాల్ కొడుకు దవాలా సాబ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
చదవండి: తెలంగాణలో ఒమిక్రాన్ కలవరం ఒకే రోజు 14 కేసులు
అడిగినంత లంచం ఇవ్వలేదనే చంపేశారు: క్లీనర్
అధికారులు లోడ్‌ను తనిఖీ చేసి వాహన కాగితాలు పరిశీలించారని, వాహనాన్ని పక్కకు నిలిపి రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని క్లీనర్ ఆరోపించారు. ఈ విషయమై డీసీఎం డ్రైవర్ ట్రాన్‌ప్రోర్టు యాజమానులకు ఫోన్ ద్వారా చెప్పి రూ.15 వేలు ఇస్తానని బతిమిలాడినా ఒప్పుకోలేదని, అధికారి దినేష్ కోపోద్రిక్తుడై నదాఫ్ కాళ్లపై ప్లాస్టిక్ పైప్‌తో కొట్టాడన్నారు. దీంతో సదాఫ్ ప్యాంట్‌లోనే మూత్ర విసర్జన చేసుకుని అక్కడికక్కడే కుప్పకూలాడని, వెంటనే సేల్‌ట్యాక్స్ అధికారుల కారులోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని, అక్కడి నుంచి భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడని తెలిపారు.
చదవండి: విటమిన్ ‘డి’ లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
Comments
Please login to add a commentAdd a comment