turkapally
-
ప్రేమ పెళ్లి చేసుకున్నారని దారుణం.. పెళ్లి ఫోటోలు వాట్సాప్‌లో పెట్టడంతో.
సాక్షి, నల్గొండ: తుర్కపల్లి మండలంలోని గంధమల్ల గ్రామానికి చెదిన యువతీయువకుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి ఇష్టం లేని అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు ఆగ్రహంతో అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టారు. వివరాలు.. గంధమల్ల గ్రామానికి చెందిన వేముల భాను అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం వీరిద్దరూ ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి గుడిలో వివాహం చేసుకున్నారు. అనంతరం పెళ్లికి సంబంధించిన ఫొటోలను భాను అదే గ్రామానికి చెందిన ఓ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. ఈ పెళ్లి విషయం తెలుసుకున్న అమ్మాయి తరఫున కుటుంబ సభ్యులు ఆగ్రహానికి లోనై యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవండతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఇబ్రహీంపట్నం ఘటన.. డాక్టర్ శ్రీధర్ సస్పెన్షన్‌ను రద్దు చేసిన హైకోర్టు -
చెల్లెని బాగా చూసుకోవాలని చెబితే.. నాకే నీతులు చెబుతావా అంటూ..
సాక్షి, తుర్కపల్లి: ‘బావా మా అక్కను ఎందుకు వేధిస్తున్నావు.. కుటుంబంలో చిన్నచిన్న తగాదాలు సాధారణమే.. చీటికి మాటికి గొడవలు పడితే చులకనవుతారు.. సర్దుకుపోయి కాపురాన్ని చక్కదిద్దుకోవాలి.. పిల్లల ముఖం చూసైనా మారాలి’అని సర్దిచెప్పిన బావమరిదికి అవే ఆఖరి మాటలయ్యాయి. మద్యం మత్తులో ఉన్న ఆ బావ తీవ్ర ఆగ్రహంతో.. ‘నాకే నీతులు చెబుతావా’అంటూ ఇటుకతో బావమరిదిపై దాడి చేసి కడతేర్చాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ దారుణ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన ఎర్రవల్లి వెంకటేశానికి సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల గ్రామానికి చెందిన కృష్టవేణితో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. వెంకటేశం బ్యాండ్ మేళంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అనుమానం పెంచుకుని.. కొన్నేళ్ల నుంచి వెంకటేశం దంపతులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న వెంకటేశం మద్యానికి బానిసగా మారాడు. నిత్యం తాగి వచ్చి భార్యను కొడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇదే తరుణంలో శుక్రవారం కూడా వెంకటేశం మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన కృష్ణవేణి జరిగిన విషయాన్ని సోదరుడు రాచకొండ రమేశ్‌కు ఫోన్లో వివరించి రోదించింది. భర్త ఇబ్బందులు పెడుతున్నాడని వెంటనే రావాలని కోరింది. నిలదీస్తే దాడి చేసి.. సిద్దిపేట జిల్లా మామిడ్యాలలో ఆర్ఎంపీగా పనిచేస్తున్న రాచకొండ రమేశ్ శుక్రవారం రాత్రి మాదాపూర్ గ్రామంలోని సోదరి ఇంటికి వచ్చాడు. తన సోదరిని ఎందుకు వేధిస్తున్నావని బావ వెంకటేశాన్ని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఆగ్రహంతో వెంకటేశం ఇటుకతో బావమరిది తలపై బలంగా మోదడంతో రమేశ్ అక్కడికక్కడే కుప్పకులిపోయాడు. అదే కోపంతో అతడి ఛాతీ, కడుపులో కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. గాయపడిన రమేశ్‌ను వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడినుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. రమే శ్ భార్య ప్రస్తుతం నిండు గర్భిణి. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నవీన్‌రెడ్డి, ఎస్ఐ మధుబాబు తెలిపారు. -
నల్గొండ: సేల్స్ ట్యాక్స్ అధికారుల దాడి.. ప్లాస్టిక్ పైపులతో కొట్టి చంపి..
సాక్షి, తుర్కపల్లి: సేల్స్ ట్యాక్స్ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో డీసీఎం డ్రైవర్ అస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. అయితే ఆకస్మికంగా కిందపడి తన తండ్రి చనిపోయినట్లు మృతుడి కుమారుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనగా, అడిగినంత లంచం ఇవ్వలేదని సేల్స్‌ట్యాక్స్ అధికారులు ప్లాస్టిక్ పైపులతో కొట్టి చంపారని ప్రత్యక్ష సాక్షిగా ఉన్న డీసీఎం క్లీనర్ అంటున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెంది ననబీలాల్ సదాఫ్(48) ఏపీలోని గుంటూరు నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు డీసీఎం వ్యాన్‌లో ఇనుప సామగ్రితో బుధవారం వెళ్తున్నారు. తుర్కపల్లిలో భువనగిరికి చెందిన కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నబీలాల్ సదాఫ్ డీసీఎంను ఆపారు. ఆ సమయంలో సదాఫ్ ఆకస్మికంగా కింద పడటంతో ఇతర లారీ డ్రైవర్లు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి భువనగిరికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు నబీలాల్ కొడుకు దవాలా సాబ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. చదవండి: తెలంగాణలో ఒమిక్రాన్ కలవరం ఒకే రోజు 14 కేసులు అడిగినంత లంచం ఇవ్వలేదనే చంపేశారు: క్లీనర్ అధికారులు లోడ్‌ను తనిఖీ చేసి వాహన కాగితాలు పరిశీలించారని, వాహనాన్ని పక్కకు నిలిపి రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని క్లీనర్ ఆరోపించారు. ఈ విషయమై డీసీఎం డ్రైవర్ ట్రాన్ప్రోర్టు యాజమానులకు ఫోన్ ద్వారా చెప్పి రూ.15 వేలు ఇస్తానని బతిమిలాడినా ఒప్పుకోలేదని, అధికారి దినేష్ కోపోద్రిక్తుడై నదాఫ్ కాళ్లపై ప్లాస్టిక్ పైప్‌తో కొట్టాడన్నారు. దీంతో సదాఫ్ ప్యాంట్‌లోనే మూత్ర విసర్జన చేసుకుని అక్కడికక్కడే కుప్పకూలాడని, వెంటనే సేల్‌ట్యాక్స్ అధికారుల కారులోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని, అక్కడి నుంచి భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడని తెలిపారు. చదవండి: విటమిన్ ‘డి’ లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త! -
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడే సీఎం
తుర్కపల్లి: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను ఒప్పించి దళితుడిని లేదా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తికేకి ముఖ్యమంత్రి పదవి వచ్చేలా ప్రయత్నం చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దళితులకు, గిరిజనులకు లబ్ధిచేకూరిందన్నారు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని రాంపూర్ తండాలో గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో పాల్గొని మాట్లాడారు. హుజూరాబాద్ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి గెలవాలని సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ముందుకు తీసుకువచ్చారన్నారు. సీఎం దత్తత గ్రామం వాసాలమర్రి దళితులకు ఇప్పటి వరకు ఎందుకు దళిత బంధు డబ్బులు ఇవ్వలేదని ప్రశ్నించారు. కలెక్టర్ ఖాతాలో డబ్బులుంటే అవి దళితులకు ఏ విధంగా చెందినట్లు అని, అధికారులతో మాట్లాడితే దళితులకు అవగాహన కల్పిస్తున్నామని చెబుతున్నారని అన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలోని వాసాలమర్రిలో సభ నిర్వహించి కనీసం తనకు సమాచారం ఇవ్వలేదని కోమటిరెడ్డి విమర్శించారు. తనను పిలిస్తే దళితబంధుతో పాటు ఇతర కులాలకు కూడా లబ్ధిచేకూరేలా ప్రశ్నిస్తాననే ఉద్దేశంతోనే ప్రొటోకాల్ పాటించకుండా సభ నిర్వహించారని చెప్పారు. -
సర్పంచూ.. 22న మీ ఊరొస్తున్నా : ఫోన్లో సీఎం కేసీఆర్
తుర్కపల్లి: సీఎం కేసీఆర్ తాను హామీ ఇచ్చిన మేరకు ఈ నెల 22వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి వెళ్తున్నారు. అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆ గ్రామ సర్పంచ్ పోగుల అంజయ్యకు శుక్రవారం సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. గ్రామస్తులతో సహపంక్తి భోజనం, గ్రామసభ ఏర్పాటు కోసం స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, సర్పంచ్ అంజయ్య మధ్య సంభాషణ సాగిందిలా.. సీఎం కేసీఆర్: హలో సర్పంచ్: సార్ నమస్తే సార్ సీఎం: నమస్తే అంజయ్య.. బాగున్నవా? సర్పంచ్: బాగున్న సార్.. బాగున్న సార్ సీఎం: అంజయ్యా.. ఇప్పుడేందంటే 22న వస్తున్న మీ ఊరికి. సర్పంచ్: 22 తారీఖా సార్. సీఎం: ఎందుకంటే ఈ మధ్య నాకు కరోనా వచ్చింది. దేశమంతా కరోనా వచ్చే. సూద్దమంటే కూడ రాలేకపోయిన. అప్పుడు నేను మాటిచ్చిన కాబట్టి 22న వచ్చి, ప్రాజెక్ట్ టేకాఫ్ చేద్దాం ఇగ. సర్పంచ్: ఓకే సార్. థాంక్యూ సార్. సీఎం: నువ్వు రెండు జాగలు జూడాలే. ఊరందరికీ భోజనం నేనే పెట్టాలే. ఎవరు పెట్టే అవసరం ఉండదు. ఎమ్మెల్యే గారికి కూడ చెప్పిన. నేనే పంపిస్తా. టీమ్ హైదరాబాద్ నుంచి వస్తారు. మొత్తం మీ ఊరి జనాభా ఎంతయ్యా? సర్పంచ్: 2,600 సార్. సీఎం: మూడు వేల మందికి వండితే సరిపోతదిగా మంచిగ? సర్పంచ్: మూడు వేలకు సరిపోతది సార్. సీఎం: నా వెంబడే వస్తది జిల్లా యంత్రాంగమంతా.. సర్పంచ్: అయితే ఎక్కువ గావలే సార్.. సీఎం: సరిపోతది.. నా వెంబడి 200 మంది వస్తే.. ఇంకో 200 మందికి ఎక్స్ట్రా అనుకుందాం. సర్పంచ్: సరిపోతది సార్. సీఎం: పోలీసోళ్లు, వాళ్లు, వీళ్లు ఉంటరు చూద్దాంలే. దానికి నువ్వెందుకు బాధ పడతవుగని. నేను జేపిస్తలే, టీమ్ వచ్చి సపరేట్ చేస్తరులే నువ్వేం గాబరా గావాల్సిన అవసరం ఉండది, కాకపోతే రెండు జాగాలు చూడాలే నువ్వు. మీ కలెక్టర్ కూడ వస్తది. సర్పంచ్: ఇప్పుడే వస్తదా సార్? సీఎం: ఆ.. కలెక్టర్ ఇప్పుడొస్తది. నీకు చెప్పే వస్తది, నీ పేరు కూడ చెప్పిన.. మధ్యాహ్నం వరకు వస్తదేమో. మొత్తం టీమ్, టీమ్ వస్తరిగ. మొత్తం రెండు జాగలు, ఒకటి ఊరి మొత్తం కులం, మతం, జాతి లేకుండా అందరికీ గలిసి సామూహిక భోజనం. ఒక్కతాననే తిందాం. నేను పదకొండున్నర, 12 మధ్యన చేరుకుంట. అందరితోపాటు కలిసి నేనుగూడ తింట. మందిల్నే కూర్చుని తింట. మీ మంత్రి గారొస్తరు. లోకమంత వస్తరు. దాని తర్వాత ఇంకో జాగల మీటింగ్ సర్పంచ్: సార్.. ఓకే సార్ సీఎం: దీనికి కూడ రెయిన్ ఫ్రూప్ టెంట్ ఏర్పాటు చేయాలే.. వానొచ్చినా ఇబ్బంది లేకుంట.. కలెక్టర్‌కు చెప్పిన. వాళ్లు చూసుకుంటరు. ఊరంత కూర్చొని తినడానికి. ఊరంత గూసోని మళ్లీ సభ జరుపుకోవడానికి రెండు జాగలు మంచివి నీట్‌గా ఉండేవి చూడాలె. అర్థమైందిగదా.. సర్పంచ్: ఊరు చిన్నది సార్. గ్రామ పంచాయతీ అంటే మరీ మధ్యన అయితది, అంతమంది కూర్చోవడానికి వీలు కాకపోవచ్చు సార్. మన రామాలయం అప్పుడు మీరు కారు ఆపిండ్రు చూడు సార్ టర్నింగ్‌ల, కొండాపూర్ రోడ్ల, అక్కడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంటడు. అక్కడ అయనది ఓ ముప్పై ఎకరాలుంటది. హాస్టల్ దగ్గర.. సీఎం: అక్కడనే పెట్టియ్యి. అదే జాగల పెట్టు. సర్పంచ్: అక్కన్నే పెడ్తసార్. మీరొచ్చే తొవ్వలనే.. మీరు రావడానికి ఈజీ ఉంటది సార్. ట్రాఫిక్ ఇబ్బంది ఉండది. సీఎం: నాది బస్సు వస్తది. అండ్లనే బాత్రూం గిట్ల అన్ని ఉంటయి. నేను ఎవరింటికి పోవాల్సిన అవసరం ఉండది. బస్సులకే పోత. సర్పంచ్: మా ఇంటికి రావాలే సార్, ఓ సారి.. సీఎం: మీ ఇల్లు ఎక్కడుంది? సర్పంచ్: మాది ఊరి లోపలుంటది సార్. చిన్నది పెంకల ఇల్లు సార్. సీఎం: ఆ.. ఏముంది మీ ఇంటికి వస్తా. సర్పంచ్: మా ఇంటికి వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి పోవాలే సార్. సీఎం: నో ప్రాబ్లం. ముందో, తరువాతనో పోచేలా ప్లాన్ చేసుకుందాం. సర్పంచ్: ఒకే సార్, సరే సార్. సీఎం: దీంట్ల చిల్లర రాజకీయాలు, పార్టీలుండవు. సర్పంచ్: నా దగ్గర అట్లాంటివి లేవు సార్. సీఎం: నీదిగాదు నేను చెప్పేది వేరే పార్టీలోళ్లు ఉంటే గూడ ఓపికతో కలుపుకొని పోవాలే. ప్రతి ఇంటిని బాగు చేయాలనే చూస్తున్నం. వీడు, వాడు అనేదేం ఉండదు మనకు, నువ్వు మంచిగ చేస్తే, ప్రాజెక్ట్ మంచిగ ఇంప్లిమెంట్ జేస్తే నీకు మంచి ఫలితాలు ఉంటాయి. సర్పంచ్: మీ దయ, బ్లెస్సింగ్స్ సార్. సీఎం: బాగ చెయ్యి ఊరును, నీకు మంచిగుంటది. సర్పంచ్: సరే సార్ సీఎం: అన్నం తినే జాగ, మీటింగ్ జాగ వేరే ఉండాలి. అర్థమైంది గద. సర్పంచ్: అర్థమైంది సార్. సీఎం: మీటింగ్ అయ్యే లోపున అన్నం తిని మీ ఇంటికి వస్తా, పబ్లిక్ తిని మీటింగ్ వచ్చే వరకల్ల మీ ఇంటికి పోయి వద్దాం. సర్పంచ్: మంచిది సార్. -
తల్లి పక్కన ఉండగానే అడవి జంతువుల దాడి!
తుర్కపల్లి: అడవి జంతువులు ఓ చిన్నారిని చిదిమేశాయి. వాటి దాడిలో నాలుగేళ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామశివారులో గురువారం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా వాపన్ పల్లి కాలనీకి చెందిన శివ, అతని కుమారుడు హరీశ్ కుటుంబం సహా నెలరోజుల క్రితం వాసాలమర్రికి వలసవచ్చారు. హరీశ్‌కు భార్య గంగోత్రి, కుమారుడు మునేశ్వర్‌రావు(4) ఉన్నారు. రోజుమాదిరిగానే బుధవారం సాయంత్రం వరకు కోళ్లు అమ్ముకొని వచ్చి రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. అటవీప్రాంతం కావడంతో పాములు, తేళ్ల భయానికి మునేశ్వర్‌రావు పక్కన తల్లి గంగోత్రి, ఆమెకు రక్షణగా భర్త హరీశ్, మరోపక్కన తాత శివ పడుకున్నారు. అర్ధరాత్రి బాలుడు ఏడవడంతో తల్లి గంగోత్రి నిద్రలేచి పాలిచ్చింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో తల్లి లేచి చూడగా కొడుకు తలను కొరికివేసినట్టుగా ఉండటం చూసి గట్టిగా కేకలేయడంతో భర్త, మామ నిద్రలేచారు. బాలుడి తల రక్తమడుగులో ఉంది. తీవ్రగాయాలపాలై కళ్లు బయటికి వచ్చాయి. రాత్రి 2.30 గంటల సమయంలో బాలుడి తలను అడవిజంతువులు కొరికివేసి ఉంటాయని అనుమానిస్తున్నారు. కాగా, బాలుడి తలను కొరికివేసింది కుక్కలా.. అడవిజంతువులా అనేది తేలాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక వచ్చాక అసలు విషయం బయటపడుతుందని పోలీసులు తెలిపారు. -
అభాగ్యుడిని ఆదుకోరూ !
సాక్షి, తుర్కపల్లి (ఆలేరు) : తుర్కపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన హన్మంత్ తొలుత వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. దిగుబడులు ఆశాజనకంగా లేకపోవడంతో కుటుంబ పోషణ నిమిత్తం 2004లో ఆటో కొని మండల కేంద్రం నుంచి స్వగ్రామానికి కిరాయికి నడుపుకునేవాడు. కాలక్రమంలో వ్యవసాయం పూర్తిగా కుంటు పడడంతో ఆటోనే జీవనధారంగా చే సుకుని బతుకుబండిని ముందుకు సాగించాడు. జీవనం సంతోషంగా సాగుతున్న తరుణంలో.. హన్మంత్ ఆటో నడుపుకుంటూ కుటుంబంతో సంతోషంగా సాగిపోతున్న తరుణంలో అనుకోని ఉపద్రవం వచ్చిపడింది. అప్పటి వరకు ఎటువంటి శారీరక ఇబ్బందులు లేని హన్మంత్‌కు 2017లో హఠాత్తుగా తీవ్రమైన వెన్నునొప్పి వచ్చి కుప్పకూలిపోవడంతో జీవితం అంధకారమయమైంది. ఆరునెలల పాటు వైద్యం హన్మంత్ రెండు కాళ్లు కదపలేని స్థితి, నడుము కింది భాగం పూర్తిగా స్పర్శ కోల్పోయాడు. దీంతో పాటు వెన్నుకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రిల్లో వైద్యం అందించాల్సిన పరిస్థితి. చేతిలో ఉన్న డబ్బుతో వైద్యం అందించినా ఫలితం లేదు. పనిచేయని రెండు కాళ్లు నడుం పై భాగం నుంచి కాళ్లు పూర్తిగా స్పర్శ కోల్పోవడంతో మల, మూత్ర విసర్జన కూడా మంచంవద్దే చేయాల్సిన పరిస్థితి. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఎక్కడ ఈ వ్యాధికి ఉచితంగా వైద్యం చేస్తారంటే అక్కడికి తన భర్త హన్మంత్‌ను తీసుకువెళ్లి వైద్యం చేయిస్తుంది. పిల్లల చదువులకు తీవ్ర ఇబ్బందులు హన్మంత్ కుమారుడు మేడ్చల్ జిల్లా కీసరలో చదువుతున్నాడు ,ప్రస్తుతం కూతురు మనోజ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబ ఇంటి పెద్ద మంచానికే పరిమితమవడంతో ఆర్థిక పరిస్థితులు ఛిన్నాభిన్నమై పిల్లల చదువులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అనిత భర్తకు సపర్యలు చేసుకుంటు గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ బతుకుపోరాటం సాగిస్తోంది. ఎకరం పొలం విక్రయించి.. భర్త ఉన్నట్టుండి మంచానికే పరిమితంకావడంతో హన్మంత్ భార్య అనిత తట్టుకోలేకపోయింది. ఉన్న ఎకరం భూమిని విక్రయించి సుమారు రూ. 10లక్షలకు పైగా భర్తకు వైద్యానికి ఖర్చుచేసింది. అయినా భర్త కోలుకోకపోవడంతో కుమిలిపోతోంది. ఇంకా ఖరీదైన వైద్యం చేయాలని డాక్టర్లు సూచించడంతో బంధువుల వద్ద అప్పు చేసింది. అయినా పరిస్థితిలో మార్పు లేదు. ఖరీదైన వైద్యం చేస్తే తప్ప ఏమీ చేయలేయని డాక్టర్లు సూచిస్తుండడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. -
చిన్నారిని రేప్ చేసి చంపిన క్రూరుడు
సాక్షి, హైదరాబాద్: ఆరేళ్ల మైనర్ బాలికను దారుణంగా రేప్ చేసి, హత్య చేసిన సంఘటన నగర శివారు గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడు చిన్నారిని అపహరించి ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నిందితుడు ఎత్తుకెళ్లడానికి ముందే సదరు బాలిక (6) అపస్మారక స్థితిలో ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు మద్యం సేవించినట్టు పోలీసులు చెప్పారు. హత్యకు గురైన చిన్నారిది హైదరాబాద్ సమీపంలోని తుర్కపల్లి గ్రామం. తండ్రి రోజువారీ కూలీ. గురువారం స్వగ్రామంలో హోలీ ఆడుతున్న చిన్నారిని నిందితుడు ఎత్తుకెళ్లగా.. బాలిక మాయమైనట్టు గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే దగ్గరలోని అల్వాల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు వేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అదే రోజు సాయంత్రానికి హైదరాబాద్ శివార్లలో చనిపోయి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు అతడిది బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాగా నిర్ధారించారు. నిందితుడిపై ఐపీసీలోని పోక్సో సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు సైబరాబాద్ పోలీసులు మీడియాకు తెలిపారు. -
విజ్ఞాన యాత్రలో అపశృతి
సాక్షి, సిరిసిల్ల: విజ్ఞాన యాత్రకు వెళ్తున్న పాఠశాల బస్సు, హైవేపై యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలవ్వగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా శాంతినగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు విజ్ఞాన యాత్రలో భాగంగా హైదరాబాద్‌కు బయలుదేరారు. తుర్కపల్లిలోని చౌరస్తా వద్ద వెనకవైపు నుంచి వస్తున్న వ్యానును గమనించకుండానే లారీ డ్రైవర్ యూటర్న్ తీసుకున్నాడు. దీంతో విద్యార్థులున్న వ్యాను, లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు ముందుభాగం పాడైంది. ముందు భాగంలోని అద్దం పగిలి, గ్లాస్ పెంకులు విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపు 8 మంది విద్యార్థులకు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. వీరిని మేడ్చల్‌లోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటనలో పెనుప్రమాదం తప్పడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. -
కళాకారుల ప్రదర్శన
తుర్కపల్లి : స్వచ్ఛ తెలంగాణ కోసం ప్రతిఒక్కరూ కషి చేయాలని తెలంగాణ సాంస్కతిక సారథి కళకారుడు జాహంగీర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ తెలంగాణ కోసం కళా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పాటల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యకమంలో సురేశ్, సంజీవులు, వేణుకొండల్, కరుణాకర్, సిద్ధూ, ఇన్చార్జి హెచ్ఎం వెంకటాచారి, డాక్టర్ లక్ష్మీనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. -
శుభలేఖలు పంచడానికి వెళుతూ..
మరో రెండు రోజులు గడిస్తే ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మొగనున్నాయి. వివాహ వేడకను వైభ వంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.. వేడకకు బంధువులందరినీ ఆహ్వా నించేందుకు ముగ్గురు యువకులు బైక్‌పై బయలుదేరారు.. కాసేపటికే పిడుగులాంటి వార్త.. ఇంటి వద్ద నుంచి వెళ్లిన యువకులు మృత్యుకోరలకు చిక్కుకుపోయారన్న చేదు నిజం తండా వాసులను కలచివేసింది. పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. తుర్కపల్లి : తుర్కపల్లి మండలం పెద్దతండా పరిధి జాలుబావి తండాకు చెందిన హస్లీ, బిచ్చాల కూతురు వివాహం ఈ నెల 3 తేదీన రాజపేట మండలం పుట్టగూడేనికి చెందిన వ్యక్తితో జరగనుంది. దీంతో పత్రికలు పంచడానికి పెళ్లి కూ తురు సోదరుడు (చిన్నమ్మ కొడుకు) ధనావత్ గణేశ్(17), అతడి మిత్రుడు భానోత్ మల్లేశ్ (18) రాజపేట మండలం పుట్టగూడేనికి చెంది న మాలోత్ సాయికుమారు(19) గురువారం బైక్‌పై తండా నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో ముల్కలపల్లి గ్రామశివారులోని మూ ల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ వీరి బైక్‌ను ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్క డే మృతిచెందారు. మృతదేహాలు చెల్లాచెదురు గా రోడ్డుపై పడి పోయాయి. మిన్నంటిన రోదనలు ప్రమాద విషయం తెలుసుకుని మృతుల కుటు ంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటి వరకు తమతో పాటే ఉన్న యు వకులు మృత్యువాత పడడంతో కుటుంబ స భ్యుల రోదనలు మిన్నంటాయి. గణేశ్, మ ల్లేశ్ ఇద్దరూ భువనగిరి ప్రభుత్వ కళశాలల్లో ఇం ట ర్మీడియట్ చదువుతుండగా, సాయికుమారు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గణేశ్‌కు ఇద్దరు చెల్లెలు అమ్మనాన్న ఉన్నారు. మల్లేశ్‌కు ముగ్గురు అక్కలు, ఓచెల్లె అమ్మనాన్న ఉ న్నారు. వీరిని ఢీ కొట్టిన లారీ జాడ తెలియరాలే దు. సంఘటన స్ధలానికి డీఎస్పీ మోహన్‌రెడ్డి పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిం చారు. సీఐ రఘువీరారెడ్డి, ఎస్ఐ మదుసుధన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబలాను అదుకోవాలి బాధిత కుటుంబాలను ప్రభుత్వం అదుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. మృతుని కుటుంబాలను పరిమర్శించి మృతి చెందిన గణేశ్, మల్లేశ్ కుటుంబాలకు రూ. 5వేల చొప్పున అందజేశారు. -
మోటార్ సైకిల్ కోసం కుమారుడి కిడ్నాప్
తుర్కపల్లి: ఓ తండ్రి మోటార్ సైకిల్ కోసం కన్న కొడుకునే కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలంలో గురువారం జరిగింది. మాదాపూర్ గ్రామ పరిధిలోని కేవ్లా తండాకు చెందిన సోనా, దేవసోతు దేవ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. భర్త తాగుడుకు బానిసై తరచూ హింసిస్తుండడంతో భార్య సోనా ఐదేళ్ల క్రితం తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. మూడేళ్ల క్రితం భార్యను పంపాలని వచ్చి అడిగిన సమయంలో మోటార్ సైకిల్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మాదాపూర్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న అతని పెద్దకుమారుడు వెంకటేశ్‌ను బుధవారం మధ్యాహ్నం దేవ తీసుకెళ్లాడు. గమనించిన స్థానికులు సోనికి సమాచారం అందించారు. విద్యార్థి మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు బుధవారం రాత్రి దేవను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా మోటార్‌సైకిల్ కోసమే తన కుమారుడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు చెప్పాడు. -
రేవు పార్టీపై పోలీసుల దాడి
-
రేవ్ పార్టీపై దాడి: 26 మంది అరెస్ట్
నగర శివారు శామీర్‌పేట సమీపంలోని తుర్కపల్లిలో ఓ రిసార్ట్‌లో జరుగుతున్న రేవ్ పార్టీపై పోలీసులు గత అర్థరాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా 14 మంది యువకులు, 12 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. యువతి యువకుల నుంచి 26 సెల్ఫోన్లు, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం వారందరిని పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతులు, విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
పెళ్లింట విషాదం
తుర్కపల్లి : తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన అన్నంపట్ల నర్సయ్య, నర్సమ్మ దంపతుల పెద్దకూమారుడు అన్నంపట్ల కనకరాజు (25) పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం ఓ స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్నాడు. ఇతడికి రంగారెడ్డి జిల్లా చెర్లపల్లికి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. శనివారం మధ్యాహ్నం 12-05 నిమిషాలకు వధువు ఇంట్లో పెళ్లి జర గాల్సి ఉంది. గురువారం కనకరాజును తన ఇంట్లో పెళ్లికొ డుకుగా అలకరించారు. శుక్రవారం సాయంత్రం వరకు అత ని ఇల్లు బంధువులతో సందడిగా ఉంది. ఆ తర్వాత కాసేప టికి పెళ్లికొడుకుకు ఆకస్మికంగా తీవ్రమైన కడుపునొప్పి రా వడంతో చికిత్స నిమిత్తం హుటాహుటిన రాజపేటకు తీసు కువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో భువనగిరి ఏరి యా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 11-30 నిమిషాలకు మృతి చెందాడు. పెళ్లికని వచ్చిన బంధువులు పెళ్లి కొడుకు చావును చూడాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. పెళ్లిని కళ్లార చూద్దామనుకున్న తల్లిదండ్రులు కొడుకు శవమైండని బోరున విలపిస్తుంటే గ్రామస్తులు కంటతడిపెట్టారు. -
బలహీనవర్గాల అభ్యున్నతి టీఆర్ఎస్ కృషి
తుర్కపల్లి, న్యూస్‌లైన్ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ కృషి చేస్తుందని టీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పలుగ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రుస్తాపూర్‌లో ఏర్పా టు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అధికారంలోకి రాగానే ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, ఇది అన్నిరంగాల్లో అభివృద్ధి చేదాలంటే టీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. 14 ఏళ్ల పాటు కేసీఆర్ నాయకత్వంలో నిరంతర పోరాటం చేసింది టీఆర్ఎస్ అన్నారు. ఎంతో మంది త్యాగల ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు,బలహీన వర్గాలకు రెండు పడకగదులతో కూడిన ఇంటి నిర్మాణం, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్య అందించడానికి టీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. కార్యక్రమంలో నాయకులు బోరెడ్డి జ్యోతి ఆయోధ్యరెడ్డి, పడాల శ్రీనివాస్, సుంకరి శెట్టయ్య, గోవింద్చారి, కొమ్మిరి శెట్టినర్సింహులు, అమరేందర్‌రె డ్డి, కరుణాకర్‌రెడ్డి, సింగం వెంకటేశం,పొగుల ఆంజనేయులు, ఉపేందర్‌రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.