తుర్కపల్లి, న్యూస్‌లైన్ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి టీఆర్‌ఎస్ కృషి చేస్తుందని టీఆర్‌ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పలుగ్రామాల్లో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రుస్తాపూర్‌లో ఏర్పా టు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అధికారంలోకి రాగానే ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, ఇది అన్నిరంగాల్లో అభివృద్ధి చేదాలంటే టీఆర్‌ఎస్ తోనే సాధ్యమన్నారు.
14 ఏళ్ల పాటు కేసీఆర్ నాయకత్వంలో నిరంతర పోరాటం చేసింది టీఆర్‌ఎస్ అన్నారు. ఎంతో మంది త్యాగల ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు,బలహీన వర్గాలకు రెండు పడకగదులతో కూడిన ఇంటి నిర్మాణం, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్య అందించడానికి టీఆర్‌ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.
కార్యక్రమంలో నాయకులు బోరెడ్డి జ్యోతి ఆయోధ్యరెడ్డి, పడాల శ్రీనివాస్, సుంకరి శెట్టయ్య, గోవింద్‌చారి, కొమ్మిరి శెట్టినర్సింహులు, అమరేందర్‌రె డ్డి, కరుణాకర్‌రెడ్డి, సింగం వెంకటేశం,పొగుల ఆంజనేయులు, ఉపేందర్‌రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.
బలహీనవర్గాల అభ్యున్నతి టీఆర్‌ఎస్ కృషి
Published Fri, Apr 25 2014 1:03 AM | Last Updated on Wed, Aug 15 2018 8:57 PM
Advertisement