MLA candidate
-
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.15కోట్ల ఆఫర్
ఢిల్లీ : మరికొన్ని గంటల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్‌ను నాశనం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగా తమ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రలోభాలకు గురి చేస్తోందన్నారు. అభ్యర్థులు ఎవరనేది చెప్పకుండా మా పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో ఆఫర్ చేసిందని చెప్పారు.గురువారం ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు.‘బుధవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన వెంటనే మా పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు బీజేపీ నుంచి ఫోన్ వచ్చింది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15కోట్లు ఇస్తాం.మా పార్టీలో చేరమని బీజేపీ ఆఫర్ చేసింది.ఎన్నికల ఫలితాలు వెలువడకముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది. దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే ఢిల్లీలో సైతం ఇతర పార్టీలను నిర్విర్యం చేసేందుకు శ్రీకారం చుట్టుంది. ప్రలోభాలకు చేసేలా ఆడియో,వీడియో కాల్స్ వస్తే ఫిర్యాదు చేయాలని, నేరుగా కలిస్తే రహస్యంగా వీడియోలు తీయమని సదరు అభ్యర్ధులకు చెప్పాం’ అని అన్నారు.#WATCH | Delhi: AAP MP Sanjay Singh says, "Seven MLAs (of AAP) have received phone calls from some BJP elements, who have offered to give them Rs 15 crore to leave the Aam Aadmi Party and join the BJP... We have told the MLAs to record such audio calls and complain about it. If… pic.twitter.com/YbYhfu7rEC— ANI (@ANI) February 6, 2025 బీజేపీ ప్రలోభాలపై స్పందిస్తూ..ఎన్నికల ఫలితాలు (ఫిబ్రవరి 8న) వెలువడకముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది.దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే ఢిల్లీలో కూడా బీజేపీ పార్టీలను బద్దలు కొట్టే రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. కాగా,బుధవారం (ఫిబ్రవరి 5) జరిగిన ఎన్నికలలో ఢిల్లీలో 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. అధిక సంఖ్యలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. దీంతో ఆప్‌లో కలవరం మొదలైందనే పొలిటికల్ సర్కిళ్ల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. -
అందమైన అమ్మాయిలు రైతు బిడ్డను పెళ్లిచేసుకోవడం లేదు: ఎమ్మెల్యే కామెంట్స్
ముంబై: అందమైన అమ్మాయిలు ఎవరూ రైతు బిడ్డని పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడరు అంటూ మహారాష్ట్ర ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో, ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.మహారాష్ట్రకు చెందిన అజిల్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే దేవేంద్ర భుయార్ వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన తన నియోజకవర్గం వరుద్ తహసీల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైతుల సమస్యలపై మాట్లాడారు. ఈ క్రమంలో భుయార్ మాట్లాడుతూ.. ఉద్యోగం ఉన్న అబ్బాయిలనే అందమైన అమ్మాయిలు ఎంచుకుంటారు. ఒక అమ్మాయి అందంగా ఉంటే రైతుల కొడుకులను ఇష్టపడదు. కొందరు అమ్మాయిలు మాత్రమే వ్యవసాయ కుటుంబంలోని అబ్బాయిని వివాహం చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు అని కామెంట్స్ చేశారు.ఈ క్రమంలో ఎమ్మెల్యే దేవేంద్ర వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకురాలు, మహారాష్ట్ర మాజీ మహిళా శిశు అభివృద్ధి మంత్రి యశోమతి ఠాకూర్ స్పందిస్తూ.. మహిళలను ఉద్దేశిస్తూ భుయార్ మాట్లాడిన భాష సరిగా లేదన్నారు. ఆయన ఉపయోగించిన పదజాలం మహిళలను కించపరిచేలా ఉంది అంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో తమ ఎమ్మెల్యేలను అదుపులో ఉంచుకోవాలని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్‌కు సూచించారు.ఇది కూడా చదవండి: వరద నీటిలో పడిపోయిన ఆర్మీ హెలికాప్టర్.. ఆ తర్వాత ఏమైందంటే? -
మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
గుడిపాల/చిత్తూరు అర్బన్: చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు ఎస్సీ, ఎస్టీ మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అందరి ఎదుటే దళిత మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి వెంటనే అతడిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని.. ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల మండలం కనకనేరి ఆది అంధ్రవాడలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.టీడీపీ చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బాలాజీ నాయుడు తదితరులు మందీ మార్బలంతో శనివారం కనకనేరి గ్రామానికి ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు. ఇక్కడున్న ఆది ఆంధ్రవాడకు చెందిన మహిళలు యానాదులకు చెందిన మహిళలను ఓం శక్తి గుడి వద్దకు జగన్మోహన్ నాయుడు పిలిపించాడు. మీకు గ్రామంలో ఏం సమస్య ఉందో చెప్పాలని మహిళలను అడగగా.. నీటి సమస్య ఎక్కువగా ఉందని పారిశుద్ధ్యం సరిగా లేదని మహిళలు సమాధానమిచ్చారు. దీంతో టీడీపీ అభ్యర్థి జగన్మోహన్ నాయుడు ‘నేను ఐదేళ్ల ముందే వచ్చినప్పుడు మీకు చెప్పినాను కదా ఫ్యాన్‌కు ఓటేయవద్దు అని. నా మాట వినలేదు. ఇప్పుడు అనుభవిస్తున్నారు, అనుభవించండి. ఓటు ఫ్యాన్ గుర్తుకు వేస్తారు, సమస్యలు మాకు చెబుతారా? ఎగేసుకొని పోయి ఓటు వేసినారు కదా ఫ్యానుకు.. అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఈసారి మాకే ఓటేస్తామని మహిళలంతా వచ్చి దేవుని ఎదుట ప్రమాణం చేయాలని హుకుం జారీ చేశాడు. అంతటితో ఆగకుండా.. ‘ఏమిరా మీ ఊరులో పెళ్లిళ్లు చేసుకుని మొగుళ్లని వదిలేస్తారంట కదా.. ఆమేమో మొగుడ్ని వదిలేసాను అంటది ఈమేమో మొగుడు ఉండాడు యాడికో పోయినాడు అంటాది. మీ ఊరంతా ఇట్లాంటోల్లేనా ఉండేది’ అంటూ దళితుల మనోభావాలు కించపరిచేలా మాట్లాడాడు. ఇలాంటి వ్యక్తికి ఓట్లేసి గెలిపిస్తే దళితులపై ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే తగ్గకుండా చివర్లో తాము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామంటూ మహిళలంతా తేల్చి చెప్పడంతో జగన్మోహన్ నాయుడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మరోవైపు కులాహంకారాన్ని వ్యక్తపరిచేలా జగన్మోహన్ నాయుడు చేసిన ఈ వ్యాఖ్యల పట్ల దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిత్తూరుకు చెందిన మేయర్ అముద, మాజీ చైర్మన్ తదితరులు జగన్మోహన్ నాయుడు వ్యాఖ్యలను ఖండిస్తూ అతనిపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గుడిపాల మండలంలోని దళిత నాయకులు మాట్లాడుతూ గురజాల జగన్మోహన్ నాయుడును ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కోరనున్నట్లు తెలిపారు. -
కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే
-
నామినేషన్ దాఖలు చేసిన శెట్టిపల్లె రఘురామిరెడ్డి
-
పంచకట్టులో భూమా అభినయ్ రెడ్డి నామినేషన్
-
సీఎం జగన్ అశీస్సులతో స్థానికుడినైన నాకు అవకాశం లభించింది: దొరబాబు
-
అయ్యా చంద్రబాబు మేమంటే నీకు అంత చిన్నచూపా..
-
సంక్షేమం కొనసాగాలంటే..మళ్లీ జగనే రావాలి
-
టీడీపీ మునస్వామి.. థామస్ ఎలా అయ్యాడు?
‘డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు ధనముంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారు కాషే ఉంటే ఫేస్‌కు విలువస్తుంది నోటే ఉంటే మాటకు బలమొస్తుంది..’ ఇది ఓ తెలుగు సినిమాలో ఫేమస్ పాట. అచ్చం ఇలాంటిదే జీడీనెల్లూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. టీడీపీ తురఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న వీ.ఎం.థామస్ కులం, మతం, చదవులపై పలు అనునాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్మీడియెట్ టీసీలో వీ.మునస్వామిగా ఉన్న ఆయన పేరు ఆ తర్వాత కొంత కాలానికి వీ.ఎం.థామస్‌గా మారిపోవడం వెనుక ఆంతర్యమేమిటో అంతుపట్టడంలేదు. ఇక ప్రపంచ ప్రఖ్యాత సంతాన సాఫల్య వైద్యునిగా పేరుగడిస్తున్న ఆయన చదువుపైనా హిందూ ధర్మ పరిరక్షణ సమితి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నిజనిజాలు నిగ్గు తేల్చాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని గంగాధరనెల్లూరు నియోజకవర్గం టీడీపీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి మునస్వామి (థామస్) 1990–91లో కార్వేటినగరం మండల కేంద్రంలోని ఆర్కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ పూర్తిచేశారు. ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీచేయబోతున్న ఆయనపై పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మునస్వామి మతం, విద్యార్హతలు, నేరచరిత్ర పైన సమగ్ర విచారణ చేయాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ మిట్టపల్లి సతీష్‌రెడ్డి జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇంటర్మీడియెట్ కోర్సు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (టీసీ)లో వీ.మునస్వామిగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఉన్న పాస్‌పోర్టు, కులధ్రువీకరణ పత్రంలో వీ.మునస్వామి థామస్‌గా ఎలా అయ్యారనే విషయాన్ని సమగ్ర విచారణ చేయించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంబీబీఎస్ చేయకున్నప్పటికీ డాక్టర్‌గా చెలామణి అవుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం థామస్ అనే క్రిస్టియన్ పేరు మీద చెలామణి అవుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. థామస్ పేరులోనే క్రిస్టియానిటీ ఉందని, కావున అతని ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసి, థామస్ నామినేషన్‌ను తిరస్కరించి, ఎన్నికల్లో అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. తప్పుడు పత్రంతో ఎన్నికల్లో పోటీ క్రైస్తవ మతం స్వీకరించిన థామస్‌కు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మతం మారిన ఎస్సీలను బీసీలుగా గుర్తించాలని చట్టం చెబుతోందన్నారు. అయినప్పటికీ ఆయన తప్పుడు కులధ్రువీకరణ పత్రం సమర్పించి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారన్నారు. ఆయన ఎంబీబీఎస్ చదవక పోయినా పీహెచ్‌డీని అడ్డుపెట్టుకుని డాక్టర్‌గా చలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తను ప్రపంచ ప్రఖ్యాత సంతాన సాఫల్య వైద్యునిగా ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే ఆయన నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని, 2017లో తన వద్ద డాక్టర్‌గా పనిచేసి మానేసిన డాక్టర్ ఎస్.రమ్యను హత్య చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలున్నాయన్నారు. ఆ కేసులో ఆయనతో పాటు ఆరుగురు అరెస్టు కాగా, తరువాత ఆ కేసు ఏమైందో తెలియడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా కులధ్రువీకరణపత్రం 2022లో కార్వేటినగరం మండలంలో పనిచేసిన తహసీల్దార్ క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండానే నిబంధనలకు వ్యతిరేకంగా థామస్‌కు కులధ్రువీకరణ పత్రం జారీచేశారని తెలిసింది. 2022లో కార్వేటినగరం తహసీల్దార్‌గా పనిచేసిన షబ్బర్బాషా 26–04–2022న వీ.మునస్వామికి వీ.మునస్వామి థామస్ అని కులధ్రువీకరణ పత్రం ఎలా ఇచ్చారు?.. కులంపై వివాదం వచ్చినపుడు సంబంధిత గ్రామంలో నలుగురిని అడిగి పంచనాయా చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కులధ్రువీకరణ పత్రం ఎలా జారీచేశారని ఫిర్యాదుదారులు ప్రశ్నిస్తున్నారు. థామస్ మత మార్పిడి విషయాన్ని సమగ్రంగా విచారణ చేయాలని జై హిందుస్థాన్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అక్కిలిగుంట మధు ఈనెల మార్చి 15న జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్‌కు వినతి పత్రం అందజేశారు. ఆయన అందజేసిన వినతిలో సహజంగా పాస్ పోర్టు మంజూరు సమయంలో ఒక అక్షరం తప్పు ఉన్నా అధికారులు ఆమోదించరన్నారు. అలాంటిది మునస్వామి థామస్ అని పాస్‌పోర్టులో పొందారన్నారు. పేరు మార్చుకోవాలంటే గెజిట్ నోటిఫికేషన్ ఉండాలని, మతం మార్చుకుని ఉంటే సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. కాబట్టి పాస్‌పోర్టు సమయంలో మత మార్పిడి ధ్రువీకరణ పత్రం, గెజిట్ నోటిఫికేషన్ సమర్పించి ఉంటారని, సంబంధిత కార్యాలయం నుంచి నివేదిక తెప్పించుకుని విచారణ చేయాలని ఆ ఫిర్యాదులో కోరారు. వీటిపై సమగ్ర విచారణ 1.ఇంటర్ సర్టిఫికేట్లో వీ.మునస్వామి అని ఉన్న పేరు, పాస్‌పోర్టులో వీ.ఎం.థామస్‌గా ఎలా మారింది? 2.ఆయన జన్మస్థలం అల్లాగుంటని టీసీలోనూ, చైన్నె అని పాస్‌పోర్టులోనూ పేర్కొన్నారు. ఇందులో ఏది నిజం? 3. ఆయన వైద్యశాస్త్రం చదివారా..? లేక డాక్టరేట్ పొందిన వ్యక్తా? 4. ఆయనపై ఉన్న హత్యా ప్రయత్నం కేసు ఏమైంది. విచారణ కొనసాగుతోందా..? లేక కేసు కొట్టి వేశారా? పకడ్బందీగా విచారణ ఆధార్ కార్డులో వీ.ఎం, థామస్ అని ఉంది. ఏప్రిల్ 2022లో పనిచేసిన తహసీల్దార్ జారీచేసిన కులధ్రువీకరణ పత్రంలో వీ.మునస్వామి థామస్ అని జారీచేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నుంచి అందిన ఫిర్యాదులను సమగ్రంగా విచారిస్తున్నాం. ఆ ఫిర్యాదులకు సంబంధించిన రుజువులను పంపుతాం. ఈ ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేసి వాస్తవాలు తెలుసుకుంటాను. – పుష్పకుమారి, తహసీల్దార్, కార్వేటినగరం మండలం -
మా అభ్యర్థులు ఒకరు టిప్పర్ డ్రైవర్, మరొకరు కూలీ..బాబుకు అదిరిపోయే కౌంటర్..
-
టిప్పర్ డ్రైవర్ కు సీటు ఇచ్చారంటూ ఎగతాళిగా మాట్లాడిన చంద్రబాబు
-
కంటైనర్ లో డబ్బుల మూటలు...అడ్డంగా దొరికిన టీడీపీ అభ్యర్థి
-
శింగనమలలో టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులుకు వైఎస్సార్ సీపీ టికెట్
-
ఏపీ బీజేపీ లిస్ట్.. ఊహించినట్టే వాళ్లకు మొండిచేయి
సాక్షి, ఎన్టీఆర్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పొత్తులో భాగంగా తాము తీసుకున్న మొత్తం 10 స్థానాలకు అభ్యర్థులను బుధవారం సాయంత్రం ప్రకటించింది. తొలి నుంచి ఊహించినట్లే అసలైన బీజేపీ నేతలకు మొండి చేయి ఇచ్చింది అధిష్టానం. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు మాధవ్, విష్ణువర్ధన్‌రెడ్డిలకు అసెంబ్లీ టికెట్లు దక్కలేదు. యువమోర్చా మాజీ జాతీయ కార్యదర్శి సురేష్‌కు నిరాశే ఎదురైంది. అయితే.. నిన్న బీజేపీలో చేరిన టీడీపీ నేత రోషన్‌కు బద్వేల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ లభించింది. సుజనా చౌదరి, రోషన్లకు టికెట్లు దక్కడంతో.. ఇక్కడా టీడీపీ అధినేత చంద్రబాబు తన రాజకీయం చూపించారని సీనియర్లు వాపోతున్నారు. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా.. అరకు - పంగి రాజారావు అనపర్తి- ఎమ్. శివకృష్ణం రాజు విజయవాడ వెస్ట్- సుజనా చౌదరి ఎచ్చర్ల. ఎన్‌ఈశ్వర్ రావు కైకలూరు - కామినేని శ్రీనివాసరావు జమ్మల మడుగు- ఆదినారాయణ రెడ్డి ఆదోని- పీవీ పార్థసారథి ధర్మవరం - వై.సత్యకుమార్ బద్వేల్ -బొజ్జ రోషన్న విశాఖ నార్త్-విష్ణుకుమార్‌రాజు ఏపీ బీజేపీ జాబితాపై అసంతృప్తి జ్వాలలు వెల్లువెత్తున్నాయి. మొదటి నుంచి ఉన్నవాళ్లకు అన్యాయం జరిగిందనే మాట వినిపిస్తోంది. సీనియర్లతో పాటు నాగోతు రమేష్‌నాయుడు, వల్లూరి జయప్రకాశ్, వరదాపురంలకు కూడా టికెట్ దక్కలేదు. నాలుగు ఓట్లు లేనివాళ్లకు సీట్లు ఇచ్చిందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పలువురు. బద్వేల్ టికెట్ దక్కించుకున్న రోషన్ మీటింగ్‌లో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘‘ఆయనొక్కడే బీజేపీ కండువా వేసుకుంటాడు. ఈ ఒక నెల బీజేపీ కండువా కప్పుకుని ప్రచారం చేస్తారు. ఆ తర్వాత ఎప్పటిలాగే తెలుగుదేశం నాయకుల ఉందాం’’ అంటూ బహిరంగంగానే వాళ్లు వ్యాఖ్యానించడం గమనార్హం. జనసేనకు షాక్ విజయవాడ వెస్ట్‌లో టికెట్ ఆశించిన పోతిన మహేష్‌కు షాక్ తగిలింది. బీజేపీకి టికెట్ వెళ్తుందనే ప్రచారం నడిచినప్పటికీ.. పవన్‌పై నమ్మకంతో టికెట్ తనకే వస్తుందని మహేష్ నమ్మకంగా ఉన్నారు. ఈ క్రమంలో రిలే దీక్షలు చేస్తూ వస్తున్నారు. అయినా మహేష్‌కు మొండిచేయి మిగిలింది. దీంతో ఆయన రెబల్‌గా పోటీ చేస్తారనే చర్చ నడుస్తోంది. -
నాపై జగనన్న ఉంచిన నమ్మకాన్ని నిలపెట్టుకుంటాను: అనురాధ
-
సామాన్యుడిపై నమ్మకం...మైలవరం మొనగాడు
-
అసెంబ్లీ బరిలో కూలీ.. లక్కప్ప
-
గన్నవరం YSRCP అభ్యర్థి గా వంశీ..!
-
ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ అభ్యర్థులు వీరే
-
సీటు రాని అభ్యర్థులకు సీఎం జగన్ హామీ
-
వైఎస్ జగన్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం
-
అంతా అయోమయం, జగన్నాథం.. టీడీపీ జనసేన కూటమిలో కంగాళీ
అసలేం జరిగింది.. ఏం జరుగుతోంది.. ఏం జరగబోతోంది నాకు తెలియాలి.. నాకు ఇప్పుడే తెలియాలి.. ఇదీ సగటు జనసేన. టీడీపీ నాయకుల ఆందోళన కమ్ కంగారు కమ్ కన్ఫ్యూజన్ కమ్ చిరాకు కమ్ పరాకులు వినిపిస్తున్నాయి. జనసేన, టీడీపీ మధ్య పొత్తు అన్నారు. అదిప్పుడు ఏ స్థాయిలో ఉన్నదో తెలీదు. ఎవరికీ ఎక్కడ సీట్లు ఇస్తారో తెలీదు.. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసేలా ఉంది.. ఇప్పటికి కూడా తమ నియోజకవర్గం అడ్రస్ తెలీకుండా ఎలా అని ఇరుపార్టీల్లో ఆందోళన నెలకొంది. కానీ ఎవరూ ఎక్కడా బయటపడడం లేదు.. అంతా గుంభనంగా ఉంటూ మేకపోతు గాంభీర్యం చూపుతున్నారు. దీనికి తోడు పొత్తు వ్యవహారంలో ఉన్న కన్ ఫ్యూజన్ కూడా ఇరుపార్టీల నాయకులను ఇంకా ఇరకాటంలోనే ఉంచుతోంది. అందుకే చంద్రబాబు ఇప్పటి వరకు తొలి జాబితా విడుదల కాలేదు. ఎవరికీ ఎక్కడ సీట్ అన్నది తేలితే తప్ప పనులు మొదలు పెట్టి ముందుగు సాగే అవకాశం లేకపోవడంతో నాయకులు అంతా అయోమయంలో ఉన్నారు. అసలు నియోజకవర్గాల్లో తిరుగుదాం. పని మొదలు పెడదాం. అందర్నీ కలుద్దాం అంటే టిక్కెట్ వస్తుందో రాదో.. అది కాస్తా జనసేనకు వెళ్ళిపోతే తన ఖర్చు.. కష్టం.. టైం అంతా వృథా అవుతుందని టీడీపీ నాయకులు డైలమాలో ఉన్నారు. ఇదిలా ఉండగా అటు కాపునేత చేగొండి హరిరామ జోగయ్య మాత్రం 51 స్థానాల్లో జనసేనకు సీట్లు ఇవ్వాల్సిందే అని చెబుతూ సొంతంగా లిస్ట్ కూడా విడుదల చేసారు. మరోవైపు చుట్టపు చూపుగా ఆంధ్రకు వచ్చే పవన్ ఇక్కడి నాయకులకు అస్సలు అందుబాటులో ఉండరు.. కాబట్టి ఆయనతో ఏమైనా మాట్లాడాలి అనుకున్న కష్టమే.. దీంతో జనసేన క్యాడర్ సైతం చికాకు, చిరాకు పడుతోంది. మరోవైపు అంగన్ వాడీలను రెచ్చగొట్టి రాజకీయం చేద్దాం.. ప్రభుత్వం మీద వ్యతిరేకతను ఎక్కువచేసి చూపిద్దాం అనుకున్న టీడీపీకి అక్కడా పెద్ద ఫాయిదా దక్కలేదు. వారి డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉండడంతో అంగన్వాడీలు సమ్మె విరమించారు. దీంతో వారి తెరవెనుక ఉండి చంద్రబాబు ఆడించిన నాటకానికి తెరపడింది. వాళ్లంతా ఇప్పుడు జై జగన్ అంటున్నారు. దీంతో ఎటు చూసినా తనకు దారి క్లియర్‌గా కనిపించకపోవడంతో చంద్రబాబు సైతం ఇంకా సీట్లు సంగతి తేల్చడం లేదు. దీంతో క్యాడర్లో కంగారు మొదలైంది.. చివరి నిముషంలో టిక్కెట్ తెచ్చుకుని బలమైన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిని ఎదుర్కోవడం కష్టం కదా అని వారు లోలోన ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ ఫ్రాస్ట్రేషన్నుఎవరిమీద చూపాలో తెలీక లోలోన కుమిలిపోతున్నారు. -సిమ్మాదిరప్పన్న. -
తిరుపతి అసెంబ్లీ YSRCP అభ్యర్థిగా భూమన అభినయ్ రెడ్డి
-
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డితో టుడేస్ లీడర్
-
తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూర్ లో ఎమ్మెల్యే గాదరి ఎన్నికల ప్రచారం
-
ప్రజల మద్దతు నాకే..
‘ప్రచారానికి వెళ్లిన ప్రతి చోటా ప్రజల నుంచి నాకు ఆదరణ లభిస్తోంది. భారీ మెజార్టీతో విజయం సాధిస్తానన్న ధీమా ఏర్పడింది. నామీద నమ్మకంతో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈ ప్రాంత బిడ్డగా.. ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలపై ప్రతి నిత్యం కొట్లాడుతున్నాను. ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చి దిద్దుతా’నని కాంగ్రెస్ నాగార్జునసాగర్ అభ్యర్థి కుందూరు జయవీర్‌రెడ్డి అన్నారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. నల్గొండ: నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు మా ర్పు కోరుకుంటున్నారు. ఎక్కడికెళ్లినా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని ప్రజలు భావిస్తున్నారు. భారీ మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నాను. నియోజకవర్గానికి మా నాన్న చేసిన అభివృద్ధి వాళ్ల కళ్ల ముందే కనిపిస్తోంది. గడిచిన ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది. నేను గెలిచాక స్థానికంగానే ఉండి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుతా. జానారెడ్డి హయాంలోనే అభివృద్ధి.. సాగర్ నియోజకవర్గంలో ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన మా నాన్న కుందూరు జానారెడ్డి హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగింది. గిరిజన తండాలకు రోడ్లు, కరెంట్ సౌకర్యంతో పాటు 34 వేల ఇళ్లు, 2 లక్షల ఎకరాలకు సాగునీరు, 1048 కిలోమీటర్ల రహదారుల నిర్మాణంతో పాటు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లు మా వద్ద లెక్కలతో సహా ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి.. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన జాబ్ క్యాలెండర్ అమలు చేయడానికి కట్టుబడి ఉంది. యువత చెడ్డదారిలో పోకుండా చదువుపై మనస్సును నిలిపి పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగ అవకాశాలు విస్తృతం చేయనున్నాం. ప్రైవేట్ రంగాల్లోనూ ఉపాధి కల్పించడానికి నేను సొంతంగా కృషి చేస్తాను. యువత మేధస్సును పరిపూర్ణంగా వినియోగించుకుంటాం. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి.. నియోజకవర్గంలో ప్రజలు వైద్య సేవలు సక్రమంగా అందక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి మండల, మేజర్ గ్రామ పంచాయతీల్లో ప్రజలకు కావాలి్సన ఆధునిక వైద్య సౌకర్యాలు కల్పించి వైద్య సేవలు స్థానికంగానే అందేలా చర్యలు తీసుకుంటాం. విద్యా సౌకర్యాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. చాలా స్కూళ్లలో టీచర్ల కొరత ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే.. టీచర్ల కొరత తీర్చడంతో పాటు శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలలకు మరమ్మతు చేయించి ప్రైమరీ స్కూళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. -
ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం
-
కేటీఆర్ ను విమర్శించే స్థాయి మైనంపల్లికి లేదు: మర్రి రాజశేఖర్ రెడ్డి
-
జనసేనతో కలిసి వెళ్లడంపై బీజేపీ మహిళా ఎమ్మెల్యే కీ కామెంట్స్
-
కేసీఆర్ కు జై కొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్
-
ఎన్నికల ప్రచారంలో ఇందిర దూకుడు
-
నన్ను గెలిపించండి పనిచేయకపోతే ఈ చెప్పుతో కొట్టండి
-
ఉప్పల్ లో బీఆర్ఎస్ జోరు
-
వేములవాడ బీజేపీ అభ్యర్థిగా చెన్నమనేని వికాస్ రావు
-
ఎన్నికల సిత్రం: ‘‘కాళ్లు పట్టుకుంటా.. నాకు మద్దతివ్వు’’
జైపూర్: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపు ముసలం వైపు దారి తీస్తోంది. గతంలో సచిన్ పైలట్ నేతృత్వంలో తిరుగుబాటు జరిగినప్పుడు.. ఆయన వెంట ఉన్న రెబల్స్‌లో కొందరికి ఈదఫా టికెట్లు నిరాకరించింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో వాళ్ల అనుచరులు ఆందోళనలకు దిగారు. ఇదిలా ఉండగానే కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు.. ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలంటూ ఎమ్మెల్యే అభ్యర్థి కాళ్లు పట్టుకోబోయారు. రాజ్‌గఢ్-లక్ష్మణ్‌గఢ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోహారీలాల్ మీనాను కాదని.. తాజాగా రిటైర్డ్ అయిన ప్రభుత్వ అధికారి మంగీలాల్ మీనాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. దాంతో.. ఇదే స్థానం నుంచి టికెట్ ఆశించిన రాహుల్ మీనా భంగపడ్డారు. కొన్ని రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన రాహుల్.. తాజాగా మూడో జాబితా ప్రకటన తర్వాత రాజస్థాన్‌కు తిరిగొచ్చారు. రాజ్‌గఢ్‌లో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమై.. తన ఆవేదనను వెలిబుచ్చారు. ఆ సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమావేశం కొనసాగుతుండగానే అక్కడికి వచ్చిన మంగీలాల్ తనకు అండగా నిలవాలని మోకాళ్లపై కూర్చొని రాహుల్‌ను వేడుకున్నారు. ఒక సోదరుడిలా భావించి తనకు మద్దతు ఇవ్వాలంటూ ఆయన కాళ్లు పట్టుకోబోయారు కూడా. రాహుల్ ఒకింత ఇబ్బందికి గురై.. పాదాలను తాకకుండా మంగీలాల్‌ను ఆపారు. कांग्रेस प्रत्याशी ने दावेदार के सामने टेके घुटने, मांगीलाल मीणा बोले- मुझसे गलती हो गई हैं तो माफ करें#RajasthanAssemblyElection2023 #RajasthanElection2023 pic.twitter.com/uDSuPiUMML — khushbu rawal (@khushburawal2) November 1, 2023 -
ఇది పగనా లేక అభిమానమా ?..ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఎమ్మెల్యే షాక్..
-
గాంధీభవన్‌లో ఉద్రిక్తత
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): రాబోయే ఎన్నికల రెండవ జాబితా విడుదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదివారం గాంధీభవన్‌లో నర్సాపూర్ అభ్యర్థిగా ఆవుల రాజిరెడ్డిని మార్చాలని కోరుతూ నియోజకవర్గ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఈ సందర్భంగా పలువురు ఆందోళనకారులు మాట్లాడుతూ....కాంగ్రెస్ పార్టీ అంటే తమకు ఎంతో అభిమానమని గత కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నవారిని కాదని ఇతరులకు టికెట్లు కేటాయించడం సరికాదన్నారు. బచావో కాంగ్రెస్ హటావో పారాచూట్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త పెట్రోలు పోసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పక్కనే ఉన్న పార్టీ కార్యకర్తలు అడ్డుకుని ఆ వ్యక్తిపై నీళ్లుచల్లి నిప్పుఅంటించుకునే ప్రయత్నాన్ని ఆపివేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారుతుండటంతో పోలీసులు కలుగజేసుకుని పార్టీశ్రేణులను బయటకు పంపించివేశారు. -
‘ఒకే ఒక్కడు’తో బీజేపీ రెండో జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: ఒకే ఒక్క అభ్యర్థి పేరుతో బీజేపీ శుక్రవారం రెండో జాబితా విడుదల చేసింది. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు ఏపీ మిథున్ రెడ్డి పేరును ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మిథున్‌రెడ్డితో కలిపి ఇప్పటివరకు 53 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. కాగా నవంబర్ 1 న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో భేటీ కానున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ, మిగతా స్థానాలకు అభ్యర్థులను ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు సమాచారం. -
అబ్రహంకు బీఫామ్ ఇవ్వని కేసీఆర్.. కలవకుండా కారెక్కి వెళ్లిపోయిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిరేపుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సొంతపార్టీలోనే అసమ్మతి తారస్థాయికి చేరుకోవడం.. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్లు వార్ కొనసాగుతుండడం చర్చనీయాంశంగా మారాయి. అలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిపై సందిగ్ధత కొనసాగుతోంది. బీఆర్ఎస్ ప్రకటించిన లిస్ట్‌లో అలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అబ్రహం పేరు ఉన్నా, ప్రస్తుతం ఆయనకు బీఫామ్ దక్కలేదు. అబ్రహాంకు కాకుండా వేరే అభ్యర్థికి బీఫామ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అనుచరుడు విజేయుడుకు బీఫామ్ ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. మరో వైపు, తెలంగాణ భవన్‌కు వచ్చిన అబ్రహంను కలవకుండా కేటీఆర్ కారెక్కి వెళ్లిపోయారు. వచ్చే ఎసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత అందరికంటే ముందుగా ఆగస్టు 21న అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి పాలమూరులో 14 స్థానాలుండగా.. అంతటా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో అలంపూర్, మక్తల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలంటూ అసమ్మతి పెల్లుబికింది. అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి తొలుత పలు మండలాల్లో చల్లా వర్గీయులుగా ముద్రపడిన అసంతృప్త నాయకులు సమావేశాలు నిర్వహించినా.. ఆ తర్వాత సద్దుమణిగింది. ఇక బీఫాంలు అందజేస్తారు అన్న క్రమంలో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమనడం.. పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు వెళ్లి కేటీఆర్‌ను కలవడం.. అభ్యర్థిని మార్చాలంటూ వినతిపత్రం అందజేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్సీనే ఎన్నికల ఇన్చార్జిగా ప్రకటించిన తర్వాత కూడా పరిస్థితి కుదుటపడకపోవడంతో బీఆర్ఎస్ అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. దీనిపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటు ముఖ్య నాయకులతో సీఎం కేసీఆర్ సమాలోచనలు చేసినట్లు తెలిసింది. అలంపూర్‌పై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఉత్కంఠ నెలకొంది. చదవండి: రాహుల్ బైక్ ర్యాలీలో అపశ్రుతి..కొండా సురేఖకు గాయాలు -
లొల్లి చేస్తే దవడ పగలగొడతా: రేణుకా చౌదరి
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్‌లో టిక్కెట్ల పంచాయతీ తారాస్థాయికి చేరింది. బుధవారం జరిగిన వాగ్వాదం.. చివరకు కుర్చీలు విసురుకొని కొట్టుకునే వరకు వచ్చింది. ఈ గొడవతో చిర్రెత్తుకొచ్చిన సీనియర్ నేత రేణుకా చౌదరి.. దవడ పగలకొడతానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో రసాభస నెలకొంది. మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరితో పాటు అబ్జర్వర్ మహ్మద్ అరిఫ్ ఖాన్,సత్తుపల్లి టికెట్ ఆశిస్తున్న మట్టా దయానంద్, మానవతారాయ్ హాజరయ్యారు. ఈ క్రమంలో మట్టా దయానంద్, మానవతరాయ్ వర్గాలకు సంబంధించిన అనుచరులు తమ నేతకు టికెట్ కేటాయించాలంటే తమ నేతకు టికెట్ కేటాయించాలని పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన తమకే టికెట్ రావాలని మానవతారాయ్ వర్గానికి సంబంధించిన అనుచరులు అబ్జర్వర్ మహ్మద్ అరిఫ్ ఖాన్‌ను కోరారు. అటు మట్ట దయానంద్ వర్గం కూడా తమకే టికెట్ కేటాయించాలని సూచించడంతో పరస్పరం రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. రెండు వర్గాలు ఒకరికొకరు కుర్చీలు విసురుకోవడంతో కొందరు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి..తో సమావేశం మధ్యలో నుంచే రేణుక చౌదరి వెళ్లిపోయారు. అనంతరం ఆమె ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాయలంలో ప్రెస్ మీట్ పెట్టారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో ఇంకోసారి గొడవపడితే ఊరుకోం. గొడవపడితే నేనే దవడ పగలకొడతా. కార్యకర్తల బలంలేని నాయకులే ఎక్కువగా మొరుగుతారు’’ అంటూ తీవ్ర స్థాయిలో గ్రూప్ రాజకీయాలపై మండిపడ్డారామె. మరోవైపు ఇప్పటికే సత్తుపల్లి కాంగ్రెస్‌లో నాలుగు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు టికెట్ ఆశిస్తున్నారు. కొండూరు సుధాకర్, మానవతారాయ్, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖ, మట్టా దయానంద్ టికెట్ తనకొస్తుందంటే తనకొస్తుందని ధీమాతో ఉన్నారు. చదవండి: కిషన్‌రెడ్డి నిరాహార దీక్ష.. కేసీఆర్‌పై సీరియస్ -
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక వాయిదా!
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక వాయిదా పడింది. విధివిధానాలు, సర్వేలు, ఈక్వేషన్స్ ముందు పెట్టుకొని అభ్యర్థుల జాబితా సిద్ధం చెయ్యాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లో నిర్వహించే సీడబ్ల్యూసీ సమావేశం తర్వాతే తేల్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉండనుంది. ఈసారి స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో పెట్టాలని కెంగ్రెస్ భావిస్తోంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల లిస్ట్ తయారు చేయనుంది. అభ్యర్థుల ఎంపికలో విధివిధానాలు, ఎలాంటి అంశాలు ప్రామాణికం చేసుకొని ఎంపిక చెయ్యాలో ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. భారీగా దరఖాస్తులు అభ్యర్థుల ఎంపిక కోసం ఆశావహుల నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. 119 నియోజకవర్గాలకు కలిపి వెయ్యి మందికి పైగా అభ్యర్థులు కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారందరినీ వడపోసి సరైన అభ్యర్థలను బరిలో నిలపాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానం మీద ఉంది. చదవండి: ప్రధానికి లేఖ.. మహిళా బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదు? తీవ్ర కసరత్తు దరఖాస్తుల స్వీకరణ అనంతరం సెప్టెంబర్ 4వ తేదీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా కసరత్తు తీవ్రంగానే సాగుతోంది. ప్రదేశ్ ఎన్నికల కమిటీ అభిప్రాయాలతో పాటు, ఆపై పీఈసీలో లేని సభ్యులు, మాజీ కార్యదర్శులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతోనూ వన్ టు వన్ భేటీ నిర్వహించారు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్. వాళ్ల నుంచి అభిప్రాయ సేకరణ ద్వారా చివరకు ఒక్కో నియోజకవర్గానికి ప్రయారిటీల వారిగా 1 నుంచి మూడు పేర్లను స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 16,17 వ తేదీలలో హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు ఉండడంతో కేసి వేణుగోపాల్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. Cwc సమావేశాలు జరిగే తాజ్ కృష్ణ హోటల్ తో పాటు.. భారీ బహిరంగ సభ కోసం పీసీసీ చూసిన రెండు స్థలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం cwc సమావేశాల నేపథ్యంలో.. ఏఐసీసీ గైడ్ లైన్స్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిశా నిర్దేశం చేస్తారు. -
సమరానికి సమాయత్తం
-
చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్‌రెడ్డికి అడుగడుగునా బ్రహ్మరథం
పాకాల : మండలంలోని పంటపల్లె పంచాయతీలో వైఎస్సార్ సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బుధవారం పంటపల్లె పంచాయతీలో మోహిత్‌రెడ్డి గడప గడపకు మహా పాదయాత్ర సాగింది. ఇంటింటికీ వెళ్లి ఆయన ప్రజలతో మమేకమయ్యారు. పథకాల ద్వారా పొందిన లబ్ధిని వివరించి సంక్షేమ బావుటా బుక్‌లెట్‌ను అందించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు. జగనన్న పాలనలో రామరాజ్యం ముఖ్యమంత్రి జగనన్న పాలనలో ప్రజలు రామరాజ్యాన్ని చూస్తున్నారని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ జగనన్న చేదోడు పథకంతో మహిళలను ఆర్థికంగా బలపడుతున్నారని తెలిపారు. హామీలను నెరేవేర్చిన ఏకై క సీఎంగా జగనన్న చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. అద్భుతమైన పథకాల అమలుతో రాష్ట్రంలో జనరంజక పాలన కొనసాగుతోందని తెలిపారు. ప్రజలంతా జగనన్న వైపే ఉన్నారని, రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం తథ్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన కుటుంబసభ్యుల కంటే నియోజకవర్గ ప్రజలనే ఎక్కువగా అభిమానిస్తారని వివరించారు. నిరంతరం ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో పని చేసే వ్యక్తి మన ఎమ్మెల్యే అని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను ఆశీర్వదించి గెలిపించాలని మోహిత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎంపీపీ లోకనాథం, వైఎస్సార్ సీపీ కన్వీనర్ నంగా నరే ష్‌రెడ్డి, నాయకులు వల్లివేడు విక్రమ్‌రెడ్డి, మునీశ్వర్‌రెడ్డి, రఘుపతి, కపిలేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
హిందూపురంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేద్దాం: దీపిక
హిందూపురం: వచ్చే ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీని అఖండ మెజార్టీతో గెలిపించి పార్టీ జెండా ఎగరేద్దామని నియోజకవర్గ సమన్వయకర్త దీపిక పిలుపునిచ్చారు. సమన్వయకర్తగా నియమితులయ్యాక తొలిసారిగా ఆదివారం హిందూపురం వచ్చిన ఆమెకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తూమకుంట చెక్‌పోస్టు నుంచి హిందూపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మెయిన్ బజారు గాంధీ సర్కిల్ వద్ద గజమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులనుద్దేశించి దీపిక మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ నియోజకవర్గ ప్రజల సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు. చుట్టపు చూపుగా వస్తూ వెళ్తూ ఓటరు తీర్పును అపహాస్యం చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. పార్టీ నాయకులు, ప్రజలకు రుణపడి ఉంటానని, హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. హిందూపురం సమన్వయకర్తగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ నాయకులందర్ని కలుపుకుని ముందుకు సాగుతానన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే ధ్యేయంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. వై నాట్ 175 అన్న జగనన్న నినాదాన్ని నిజం చేద్దామన్నారు. నాయకుల ఆప్యాయత, ఆశీర్వాదాలు ఎల్లవేళలా తనపై ఉండాలని కోరారు. త్వరలోనే పార్టీ నాయకులతో కలిసి ప్రజలతో మమేకమవుతానని తెలిపారు. సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిద్దామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా జగనన్న చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అందరికీ సమన్యాయం చేయడం ఆయనతోనే సాధ్యమైందన్నారు. జగనన్న ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పక్షపాతి అన్నారు. మైనార్టీల సంక్షేమానికి 4 శాతం రిజర్వేషన్ కల్పించి వైఎస్సార్ ఎంతో మేలు చేశారని తెలిపారు. తండ్రిని మించి సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. చంద్రబాబు మళ్లీ కళ్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయన్ను నమ్మరాదని సూచించారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో పవన్ కల్యాణ్‌కు ఒక్కటి కూడా లేవని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు హిందూపురం ప్రజల గురించి ఆలోచించే టైం లేదని ఎద్దేవా చేశారు. దీపికకు మనందరి మద్దతు అందిద్దామని పిలుపునిచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బలరామిరెడ్డి, కౌన్సిలర్లు శివ, షాజియాలు మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా ముందుకుపోదామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కొటిపి హనుమంతరెడ్డి, పెనుకొండ మాజీ సమన్వయకర్త నాగలూరు బాబురెడ్డి, కౌన్సిలర్లు మారుతిరెడ్డి, ఆసీఫ్, రామచంద్ర, గిరి, జయప్ప, పురశురాం, నాగేంద్రబాబు, రోషన్, పార్వతీ, నాగేంద్రమ్మ, రహమత్బీ, ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఉపేంద్రరెడ్డి, నాగమణి, జనార్దన్‌రెడ్డి, లక్ష్మినారాయణ, మండల కన్వీనర్ నారాయణస్వామి, వైస్ ఎంపీపీ అంజన్‌రెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, నక్కలపల్లి శ్రీరామిరెడ్డి, సర్పంచ్‌లు శంకర్‌రెడ్డి, నాగరత్నమ్మ, నాయకులు డిష్ నాగరాజు, మహేష్, చంద్రశేఖర్, అబీబ్, ఆనంద్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, తిమ్మిరెడ్డి, పెద్ద ఎత్తున కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అంటున్న సౌమ్యారెడ్డి
-
నీళ్లలో దూకాడు.. బీజేపీ తరపున జాక్‌పాట్ కొట్టాడు
గాంధీనగర్: గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాదం.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సుమారు 135 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ప్రమాదంపై నమోదైన కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అయితే.. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్న టైంలో.. ఓ వ్యక్తి ప్రముఖంగా వార్తల్లో హైలెట్ అయ్యారు. ఆయనెవరో కాదు.. మోర్బీ మాజీ ఎమ్మెల్యే కంతిలాల్ అమృతీయ(60). ఇప్పుడు ఆయన జాక్‌పాట్ కొట్టాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం గురువారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది బీజేపీ. ఇందులో మోర్బీ నియోజవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకి కాకుండా.. కంతిలాల్‌కు సీటు ఇచ్చి ఆశ్చర్యపర్చింది బీజేపీ. ఈ విషయాన్ని స్థానిక మీడియా ఛానెల్స్ ప్రముఖంగా ప్రచురించాయి. అక్టోబర్ 30వ తేదీన రాత్రి ప్రమాదం జరగ్గా.. ఆ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని లైఫ్ ట్యూబ్ ధరించి నీళ్లలోకి దూకి సహాయక చర్యల్లోకి పాల్గొన్నారు ఆయన. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కాగా.. మోకాళ్ల లోతు నీళ్లలో ఆయన ఆ పని చేశారంటూ మరోవైపు ట్రోలింగ్ కూడా నడిచింది. కంతిలాల్ అమృతీయ.. బీజేపీ నేత. గతంలో రెండుసార్లు మోర్బీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సేవాకార్యక్రమాలతోనూ ఆయన మంచి గుర్తింపు ఉంది అక్కడ. అయితే.. મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના ખુબ જ કમનસીબ છે. હું સ્થળ પર જ છું. સૌને નમ્ર અપીલ કે આ દુઃખની ઘડીમાં આપણે સૌ સાથે મળી શક્ય તેટલા લોકોને મદદરૂપ થઈએ. નોંધ:જે જગ્યાએ બચાવ કાર્ય ચાલુ છે ત્યા ખોટી ભીડ ના કરીએ જેથી રાહતકાર્યમાં કોઈ અડચણ ના આવે.@narendramodi @AmitShah @Bhupendrapbjp pic.twitter.com/s5HG2ZY0zt — Kantilal Amrutiya (@Kanti_amrutiya) October 30, 2022 ఈ అసెంబ్లీ ఎన్నికల జాబితాలో తొలుత కంతిలాల్ లేడని, అయితే సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న తరుణంలోనే ఆయనకు బీజేపీ సీటు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే బ్రిజేష్ మెర్జాను మోర్బీ ప్రమాదం నేపథ్యంలో ప్రజావ్యతిరేకతకు కారణం అవుతారనే ఉద్దేశంతోనే తప్పించినట్లు కథనాలు అందుతున్నాయి. ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండు దశల్లో డిసెంబర్ 1, 5వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు.. డిసెంబర్ 8వ తేదీన ప్రకటిస్తారు. ఇదీ చదవండి: క్రికెటర్ జడేజా భార్య.. బీజేపీ సీటుపై అక్కడ పోటీ -
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడ్డాకే పార్టీ అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిసింది. షెడ్యూల్ వెలువడేలోగా పార్టీపరంగా మునుగోడు నియోజకవర్గంలో జరిగే ప్రచార కార్యక్రమాలన్నింటిలోనూ కూసుకుంట్లకే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆయనే పార్టీ అభ్యర్థి అనే సంకేతాలను కేడర్‌కు కేసీఆర్ పంపనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఆర్ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్యతోపాటు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సైతం పాల్గొనడం గమనార్హం. మునుగోడు నియోజకవర్గంలో గ్రామాలవారీగా జరుగుతున్న పార్టీ కార్యకర్తల సమావేశాల నివేదికలను విశ్లేషిస్తూ రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధుతోపాటు ఇటీవల ప్రకటించిన గిరిజన బంధు, గిరిజన రిజర్వేషన్ల పెంపు అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. ఆత్మీయ వన భోజనాల ద్వారా మండలాలవారీగా నియమితులైన పార్టీ ఇన్చార్జీలు కేడర్‌కు దగ్గర కావాలని సూచించారు. చేరికల ద్వారా పార్టీ బలోపేతం కావాలని, పాత, కొత్త కేడర్‌ను సమన్వయం చేయడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్‌కు దరఖాస్తులు ఆహ్వానం
కరీంనగర్ టౌన్: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరిగే ఉప ఎన్నిక కోసం పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా, బుధవారం రెండు అర్జీలు అందిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. హుజూరాబాద్ మండలం కనుకుంట్ల గ్రామానికి చెందిన జాలి కమలాకర్‌రెడ్డి, సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన ఒంటెల లింగారెడ్డి దరఖాస్తులను ఆఫీస్ ఇన్‌చార్జీలకు అందజేశారు. ఇంకా ఎవరైనా ఆసక్తి ఉండి దరఖాస్తు చేసుకోదలచుకుంటే రూ.5 వేల డీడీని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, హైదరాబాద్ పేరున తీసి, బయోడేటా, పాస్ పోర్టు సైజ్ ఫొటో జత చేసిన ఫారాలను జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈ నెల 5వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని సూచించారు. ఆశావహులు అందజేసిన దరఖాస్తు ఫారాలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అందజేస్తామని, వాటిని పరిశీలించి ఈనెల 10 తర్వాత అభ్యర్థి పేరు వెల్లడించడం జరుగుతుందని పేర్కొన్నారు. చదవండి: గుండెనిండా ‘జగనన్న’ అభిమానం: కశ్మీర్ నుంచి యాత్ర చదవండి: నువ్వంటే క్రష్.. ‘ఓయో’లో కలుద్దామా.. ఉద్యోగికి బాస్ వేధింపులు -
ఫలితాలకు ముందే ఆగిన శ్వాస
సాక్షి, చెన్నై: ప్రజా మద్దతుతో అసెంబ్లీలో అడుగుపెడతారనుకున్న కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావు మృత్యుఓడిలోకి చేరారు. ఫలితాలకు ముందే కరోనా కబళించింది. రెండు సార్లు నెగటివ్ వచ్చినా, ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన మృతిచెందినట్టు ఆదివారం వైద్యులు ప్రకటించారు. విరుదునగర్ జిల్లా శ్రీవిళ్లిపుత్తూరు అసెంబ్లీ స్థానం కోసం కాంగ్రెస్‌లో పలువురు నేతలు తీవ్రంగానే పట్టుబట్టారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌కే ఆ సీటు దక్కింది. అయితే, అభ్యర్థి ఎంపికలో సాగిన వివాదా ల తర్వాత ఎట్టకేలకు మాధవరావు అలియాస్ సెల్వదురై తన బలాన్ని చాటుకున్నారు. విరుదునగర్ జిల్లా వత్త్రాయిరుప్పులో పుట్టి, న్యాయవాదిగా చెన్నైలో స్థిరపడి, పలు వ్యాపారాల్లో రాణిస్తూ వచ్చిన మాధవరావుకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చింది. దీంతో మార్చి 17న నామినేషన్ వేసిన మూడురోజులకే అనారోగ్యం బా రినపడ్డారు. కరోనా లక్షణాలు ఆయనలో కనిపించడంతో మదురైలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అభ్యర్థి ఆస్పత్రిలో ఉండడంతో కాంగ్రెస్ నేతలు శ్రీవిళ్లిపుత్తూరుకు కదిలారు. చెన్నైలోని మాధవరావు కుమార్తె దివ్య తన చంటిబిడ్డను భుజాన వేసుకుని తండ్రి కోసం ప్రచారంలో పరుగులు తీశారు. ఇన్ఫెక్షన్తో.. ఎన్నికల్లో మాధవరావుపై సానుభూతి చూపిన ఓట ర్లు ఎక్కువే. ఆయన కుమార్తె చంటిబిడ్డను వేసుకుని ఇంటింటా తిరగడంతో తామున్నామని భరోసా ఇచ్చిన గ్రామీణ ఓటర్లు ఎక్కువే. ఆమేరకు ఈనెల ఆరో తేదీన ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆదివారం ఉదయం 7.50 గంటలకు మాధవరావు మరణించినట్టుగా మదురై ప్రైవేటు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయనకు రెండుసార్లు కరోనా నిర్ధారణ పరిశోధన జరిగినట్టు, నెగటివ్ అని వచ్చినా, ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్ కారణంగా గుండెపోటు వచ్చినట్టు ప్రకటించారు. కరోనా లక్షణాలు ఆయనలో కనిపించడంతోనే అందుకు చికిత్స అందించినా, ఫలితం లేకుండా పోయినట్టు వైద్యులు వివరించారు. ఈ సమాచారంతో మాధవరావు కుటుంబం, మద్దతుదారులు కన్నీటిసంద్రంలో మునిగారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. కరోనా నెగటివ్ వచ్చినా, లక్షణాలు కనిపించినట్టుగా వైద్యులు ప్రకటించడంతో భౌతిక కాయాన్ని అందుకు తగ్గ నిబంధనలకు అనుగుణంగా ప్యాకింగ్ చేశారు. సాయంత్రం మదు రై తత్తనేరి శ్మశాన వాటికలో ఆయన భౌతికకాయా న్ని దహనం చేశారు. మాధవరావు సతీమణి సీతై ప్రభుత్వ వైద్యురాలు. ఆమె 2017లో మరణించారు. కుమార్తె దివ్య తండ్రికి తోడుగా ఉంటూ వచ్చారు. నివాళులు.. మాధవరావు మరణ సమాచారంతో సీఎం పళనిస్వా మి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం తమ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకుశాంతి కల్గాలని ప్రార్థించారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సంతాపం తెలుపుతూ విజయకేతనంతో అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిన మాధవరావును ఇలా మృతువు కబళించడం తీవ్ర వేదనకు గురి చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి పేర్కొంటూ ఆ సీటు కోసం పోరాడి, పట్టుబడి సా ధించుకున్న మాధవరావు ఫలితాలకు ముందే దూ రం కావడం ఆవేదన కల్గిస్తున్నదన్నారు. ఇక, ఎన్నికల ప్రధాన అధికారి సత్యబ్రత సాహు పేర్కొంటూ ఆ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదన్నారు. మాధవరావు గెలిచిన పక్షంలో, ఆ నియోజకవర్గం ఖాళీగా ప్రకటించి ఉప ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఆస్పత్రుల్లో అభ్యర్థులు.. ఎన్నికల ప్రచారంలో పరుగులు తీసిన అభ్యర్థులు పలువుర్ని కరోనా తాకిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు ఆస్పత్రిలో చికిత్సతో కోలుకుని ఇళ్లల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తిరుప్పూర్ ఉత్తరం సిపిఐ అభ్యర్థి రవి అలియాస్ సుబ్రమణ్యం, అరవకురిచ్చి బీజేపీ అభ్యర్థి అన్నామలై తాజాగా కరోనా బారిన పడ్డారు. వీరు ఆస్పత్రిలో ఉన్నారు. థౌజండ్ లైట్స్ బీజేపీ అభ్యర్థి, నటి కుష్బూ భర్త , దర్శకుడు సుందర్ సి కరోనా బారినపడ్డారు. ఆయన ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుష్బూ కోసం తీవ్రంగానే ఎన్నికల విధుల్లో సుందర్ సి నిమగ్నమైన విషయం తెలిసిందే. అయితే, తాను, తన పిల్లలు నాలుగు రోజుల క్రితం పరీక్ష చేసుకోగా నెగటివ్ వచ్చినట్టు కుష్బూ పేర్కొన్నారు. మళ్లీ పరీక్ష చేసుకుంటామని తెలిపారు. చదవండి: తమిళనాడు ఎన్నికలు: గెలుపెవరిదో తేల్చేది వాళ్లే! -
అసెంబ్లీ ఎన్నికల వేళ అభ్యర్థి మిస్సింగ్..!
సాక్షి, యానాం: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ బహిష్కృత నేత అదృశ్యం కలకలం రేపుతోంది. యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీచేస్తున్న పెమ్మాడి దుర్గాప్రసాద్ అదృశ్యమయ్యారు. తన భర్త గురువారం ఉదయం నుంచి కనిపించట్లేదని ఆయన భార్య పెమ్మాడి శాంతి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఉదయం ఎన్నికల ప్రచారం కోసం వెళ్లి, తిరిగి ఇంటికి రాలేదని అంతేకాకుండా మొబైల్ ఫోన్ స్విచాఫ్‌లో ఉన్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఆయన ఎక్కడున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, యానాం కొత్తపేటకు చెందిన పెమ్మాడి దుర్గా ప్రసాద్.. మత్స్య వ్యాపారి. ఆయనకు సొంతంగా ఫిషింగ్ బోట్లు ఉన్నాయి. యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. తన సామాజిక వర్గంలో మంచి పట్టు ఉండడంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఈనెల 6న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దుర్గా ప్రసాద్ అదృశ్యం సంచలనం రేకిత్తిస్తుంది. చదవండి: అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల్లో 18% నేరచరితులే -
సేవలోనూ ‘సగం’
‘ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడం.. వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపడంలోనే తృప్తి ఉంటుంది. చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులు లేకపోయినా ఉన్నదాంట్లోనే కుటుంబాన్ని నెట్టుకొస్తూ.. రాజకీయ కార్యకలాపాలు నడిపేందుకు వెచ్చిస్తున్నా. విద్యా సంస్థలు ఉన్నా.. వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రజా సేవకే వినియోగిస్తున్నా. చిన్న వయసులోనే 2002లో ఇంటర్ పూర్తయి.. ఎంసెట్ పరీక్ష రాసిన వెంటనే పెళ్లి కావడం.. రాజకీయ నేపథ్యం లేకున్నా రాజకీయాల్లోకి అనూహ్యంగా వచ్చాను. పార్టీపరంగా.. పదవులపరంగా అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నా. నా భర్త హరిసింగ్ సహకారంతోనే నిత్యం ప్రజల మధ్య ఉంటూ రాజకీయంగా రాణించగలుగుతున్నా. ఉన్నత విద్యను అభ్యసించడం.. చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావడంతో బాధ్యతలు మరింతగా పెరిగాయి. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ.. కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం కేటాయిస్తూ రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నా. నా భర్త బానోతు హరిసింగ్‌నాయక్ బండికి ఇరుసులా మారి రాజకీయంగా నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. రాజకీయ సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడు’. ‘సాక్షి’ పర్సనల్ టైమ్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియనాయక్ ఇల్లెందు: మాది కొత్తగూడెంలోని బాబు క్యాంప్ ప్రాంతం. నాన్న బాదావత్ సీతారాంనాయక్ సింగరేణిలో ఉద్యోగం చేసేవారు. అమ్మ దర్జన్ గృహిణి. 2002లో ఇంటర్ పూర్తయి, ఎంసెట్ రాసిన వెంటనే టేకులపల్లికి చెందిన హరిసింగ్ నాయక్‌తో వివాహం అయింది. పెళ్లయ్యాకే భర్త హరిసింగ్ ప్రోత్సాహంతో హైదరాబాద్‌లో బీటెక్, ఎంటెక్ పూర్తి చేశాను. 2006లో టేకులపల్లిలో హరిసింగ్ విద్యాసంస్థలను ప్రారంభించారు. క్రమంగా హైదరాబాద్‌లోనూ ప్రైవేటు స్కూల్ పెట్టాం. నాతోపాటు మా బంధువుల పిల్లలం అందరం కలిసి హైదరాబాద్‌లో ఉండేవాళ్లం. స్కూల్లో బోధించడంతోపాటు చదువు కోసం కాలేజీకి వెళ్లడం, అందరికీ వంట చేయడం.. ఇలా రోజంతా కష్టపడేదాన్ని. టేకులపల్లి, హైదరాబాద్‌లో కలిపి ఇప్పుడు నాలుగు ప్రైవేటు స్కూళ్లు, నాలుగు జూనియర్ కాలేజీలు ఎనిమిది బ్రాంచీలు ఉన్నాయి. మొత్తం 3,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో అనేక మంది పేద పిల్లలకు ఉచితంగానే విద్యా బోధన చేస్తున్నాం. ఉన్నత విద్యతోనే రాజకీయాల్లోకి.. 2004లో ఇల్లెందు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి కల్పనాబాయి పోటీ చేశారు. ఆమె సోదరుడు నా భర్త హరిసింగ్‌నాయక్‌కు మిత్రుడు కావడంతో ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ప్రభావంతోనే హరిసింగ్‌కు రాజకీయాలపై దృష్టి మళ్లింది. 2008లో టీడీపీలో చేరారు. అనతి కాలంలోనే తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ టీడీపీ నుంచి ఊకె అబ్బయ్యకు అవకాశం రావడంతో.. హరిసింగ్ రెబెల్‌గా నామినేషన్ వేశారు. అప్పుడు ఎన్నికల ప్రచారం కోసం చంద్రబాబునాయుడు ఇల్లెందుకు వచ్చినప్పుడు హరిసింగ్‌తో మాట్లాడి.. ‘నీకు మంచి భవిష్యత్ ఉంటుంది.. పోటీనుంచి తప్పుకో’ అని సూచించారు. అప్పటికే నామినేషన్ విత్‌డ్రాకు సమయం అయిపోవడంతో బరిలో ఉంటూనే అబ్బయ్య గెలుపు కోసం పనిచేశారు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు మళ్లీ విద్యాసంస్థలపై దృష్టి పెట్టాం. వాటినే పటిష్టం చేసి, అందులోనే నిలదొక్కుకోవాలనుకున్నాం. ఇంతలోనే 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇల్లెందు అభ్యర్థిని మార్చాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో ఉన్నత విద్యావంతురాలైన నన్ను బరిలోకి దింపితే బాగుంటుందని, గెలిచే అవకాశం ఉంటుందని నాటి బయ్యారం మండల టీడీపీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. తుమ్మల ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పడంతో ఇల్లెందు టికెట్ నాకు ఇవ్వాలని నిర్ణయించారు. టికెట్ ఇవ్వడానికి ఐదు గంటల ముందు మమ్మల్ని హైదరాబాద్‌కు రమ్మని ఫోన్ వచ్చింది. దీంతో హడావిడిగా వెళ్లి నాటి సీఎం చంద్రబాబును కలిశాము. ఆయనతో మాట్లాడిన తర్వాత టికెట్ నాకే ఇస్తున్నారనే సంకేతం వచ్చింది. మరుసటి రోజు పేపర్లో వార్త చూసి వచ్చి నామినేషన్ వేశాం. అయితే తొలిసారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఐదేళ్ల పాటు టీడీపీ సమన్వయకర్తగా పని చేసి, అనేక సమస్యలపై ఉద్యమాలు నిర్వహించాం. 2017లో కాంగ్రెస్‌లోకి.. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ బలహీనపడడంతో 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్‌లో చేరాం. గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీచేసి, ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మళ్లీ పార్టీ మారాల్సి వచ్చింది. అయితే మేము రాజకీయాల్లోకి వచ్చి సంపాదించింది ఏమీ లేదు. ప్రస్తుతం మా విద్యాసంస్థలను మా బంధువుల పిల్లలే నిర్వహిస్తున్నారు. వాటిపై వచ్చే ఆదాయాన్ని ఇక్కడ ఖర్చు చేస్తున్నాం. ఎమ్మెల్యేగా నాకు ప్రతి నెలా వచ్చే జీతంతో పాటు విద్యాసంస్థల డబ్బు కూడా రాజకీయాలు నడిపేందుకే వెచ్చిస్తున్నాం. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడంలో ఎంతో ఆనందం ఉంది. రాజకీయాలతో పాటు కుటుంబ సమస్యలను కూడా మేమిద్దరం సమానంగా పంచుకుంటూ ముందుకు సాగుతున్నాం. నాకు రాజకీయాలపై అవగాహన లేకున్నా హరిసింగ్ సహకారంతోనే రాణించగలుగుతున్నా. ఉన్నత విద్యావంతురాలిని కావడం, చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావడంతో అందరూ ఎంతో అభిమానం చూపుతున్నారు. నేను సభలు, సమావేశాలకు వెళ్లినా.. అక్కడ ఏ మాట్లాడాలనేది ఇద్దరం చర్చించుకుంటాం. రాజకీయాలు, కుటుంబ విషయాల్లోనూ ఇద్దరిది ఒకే మాట–ఒకే బాట కావడం వల్లే దిగ్విజయంగా ముందుకు సాగుతున్నా. రాజకీయ జీవితానికి అలవాటు పడి విహారయాత్రలు కూడా మరిచిపోయాం. అయితే రాజకీయాల్లో ఉండాలనే బలమైన కోరికతో వచ్చిన భర్త హరిసింగ్ తన కుర్చీని నాకు త్యాగం చేశారు. -
డాన్స్‌తో ఎన్నికల ప్రచారం
తిరువళ్లూరు: ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తిరువళ్లూరు పార్లమెంట్ స్థానంతో పాటు పూందమల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏప్రిల్ 18న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. పూందమల్లి నియోజకవర్గంలోని వదట్టూరు కోయంబాక్కం ఎగువకొండయూర్ ఆరియలూరుతో పాటు పది గ్రామాల్లో అన్నాడీఎంకే అభ్యర్థి వైద్యనాథన్ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదే విధంగా పూందమల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి కృష్ణస్వామి పూందమల్లి పట్టణంలోనూ, ఏఎంఎంకే అభ్యర్థి ఏలుమలై ఎల్లాపురం యూనియన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. కాగా పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థి వేణుగోపాల్ గుమ్మిడిపూండిలోనూ, కాంగ్రెస్ అభ్యర్థి జయకుమార్ తిరువేళాంగాడు యూనియన్లోనూ, ఏఎంఎంకే అభ్యర్థి పొన్‌రాజా పొన్నేరిలోనూ ప్రచారం నిర్వహించారు. ఇదిలాఉండగా గ్రామీణ ఓటర్లును ఆకట్టుకోవడానికి ఎంజీఆర్‌తో పాటు ఇతర వేషధారణలో కళాకారులతో నృత్యాలను ఏర్పాటు చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. -
అభివృద్ధే లక్ష్యం..
అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న బద్వేలు నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని వైఎస్సార్సీపీ బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆయన పాలనకు ఆకర్షితుడినై రాజకీయాల్లో ప్రవేశించానని, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సహకారంతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయించారని, రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నడాక్టర్ వెంకటసుబ్బయ్యతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.. ప్రశ్న: మీ రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది? జవాబు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అందిస్తున్న సువర్ణ పాలనకు ఆకర్షితుడినై 2009లో డీసీ గోవిందరెడ్డితో కలిసి సామాన్య కార్యకర్తగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చా. వైద్యుడిగా ప్రజలకు సేవలందిస్తున్న నన్ను 2016లో డీసీ గోవిందరెడ్డి, జగన్మోహన్రెడ్డిలు బద్వేలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా నియమించి ఇటీవల ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ప్రశ్న: ప్రస్తుతం ప్రచారం ఎలా సాగుతోంది? జవాబు: వైఎస్సార్సీపీ బద్వేలు నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించిన నాటి నుండి ఇప్పటి వరకు గడప గడపకు వైఎస్సార్, పల్లెనిద్ర, రావాలి జగన్ – కావాలి జగన్, ఇంటింటికి వైఎస్సార్ వంటి కార్యక్రమాలతో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లాను. ప్రస్తుతం ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో గ్రామాల వారీగా, పంచాయతీల వారీగా ప్రచారం ముమ్మరం చేశాం. టీడీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడంతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అందుకే ఎక్కడికి వెళ్లినా ఆప్యాయంగా ఆదరిస్తున్నారు. ఈసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటామని ఘంటాపథంగా చెబుతున్నారు. ప్రశ్న: నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు? జవాబు: ఈ రెండేళ్ల కాలంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్లాను. ముఖ్యంగా ఇక్కడి ప్రజలు సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా చాలా గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కూడా లేవు. పేదలకు సరైన వైద్యం కూడా అందడం లేదు. ప్రశ్న: మీ లక్ష్యం ఏమిటి? జవాబు: నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, జగనన్న, గోవిందరెడ్డిల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలుపొందగానే సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతాను. నియోజకవర్గంలో వైఎస్సార్ మెమోరియల్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి పేదలందరికి ఉచిత వైద్యం అందిస్తాను. -
విజయం సాధిస్తా..అభివృద్ధి చేస్తా
జమ్మలమడుగు నియోజకవర్గంలో గత కొన్ని దశాబ్దాలుగా నాయకులు ఫ్యాక్షన్ భూతాన్ని చూపించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ తమ పబ్బం గడుపుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ప్రజలు వారి నీచ రాజకీయాలను అర్థం చేసుకున్నారు. మార్పు కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తా.. ఇళ్లులేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేయిస్తా.. భూమిలేని వారికి ఒకటిన్నర ఎకరా భూమి ఇప్పిస్తా.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తా.. అని జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి తొలిసారి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నడాక్టర్ మూలే సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు ప్రశ్న: రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? జవాబు: ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆహ్వానం మేరకు నేను రాజకీయ రంగ ప్రవేశం చేశాను. మొదట డాక్టర్‌గా ప్రజలకు సేవలందిస్తూ వచ్చాను. మా కుటుంబం 40 ఏళ్ల నుంచి కమలాపురం, ఎర్రగుంట్లలో రాజకీయాల్లో ఉంది. ఆ అనుభవంతో ఎన్నికల బరిలోకి దిగాను. చాలా ఆనందంగా ఉంది. ప్రశ్న: ప్రచారంలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? జవాబు: నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్రచారం చేస్తున్నాను. ప్రజలు వైఎస్ కుటుంబంపై చూపిన ప్రేమాభిమానాలు నాపై కూడా చూపిస్తున్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ప్రశ్న: మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిలు కలిసిపోయాం. గెలుపు మాదే అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? జవాబు: ఓట్లు వేసేది.. గెలుపు ఓటములను నిర్ణయించేది ప్రజలు. మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల కలయికను ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టాం. జైలుకు వెళ్లాం. ఇప్పుడు వారిద్దరు కలిసిపోతే గ్రామాల్లో మేము కలిసి పనిచేసేది లేదంటూ బాహాటంగా చెబుతూ వస్తున్నారు. ఇద్దరు నాయకులు కలిసినా ప్రజల మద్దతు నాకే ఉంది. గెలుపు తథ్యం. ప్రశ్న: ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలకు ఏమి చేయాలనుకుంటున్నారు? జవాబు: ఇంత వరకు ఉన్న నాయకులు కేవలం తమ స్వలాభం కోసమే రాజకీయాలు చేసుకున్నారు. ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే జమ్మలమడుగు నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయించి దాదాపు 20వేల మంది నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాను. అంతేకాకుండా ఇళ్లు లేని నిరుపేదలకు కచ్చితంగా ఇంటి స్థలంతోపాటు, ఇంటి నిర్మాణం చేయిస్తాను. వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి భూమి లేని రైతులకు ఒకటిన్నర ఎకరా భూమి ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. ప్రశ్న: జమ్మలమడుగు ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. అలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలను ఎలా ఎదుర్కొంటారు? జవాబు: జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇంతకాలం ఫ్యాక్షన్‌ను అడ్డం పెట్టుకుని ఇరువర్గాల నాయకులు తమ పబ్బం గడుపుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ప్రజలు అన్నీ తెలుసుకున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు కాలం చెల్లిపోయింది. ఇద్దరు నాయకులు కలిసినా నా గెలుపునకు ఎలాంటి ఢోకాలేదు. ఇంత వరకు ఇద్దరు నాయకులు ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. రాజకీయం అంటే సేవ చేయడం. ఒక్కసారి ప్రజలు నాకు అవకాశం కలిస్తే నేను ప్రజలకు సేవ చేసి కనీసం 25 సంవత్సరాలపాటు ఎమ్మెల్యేగా ఉండే విధంగా చేసుకుంటాను. -
గిద్దలూరులో గెలిచేదెవరు..?
సాక్షి, గిద్దలూరు (ప్రకాశం): గిద్దలూరు నియోజకవర్గ ప్రజలది విలక్షణ తీర్పుగా ప్రచారం ఉంది. పిడతల రంగారెడ్డి మినహా.. ఏ నాయకుడినీ ఎమ్మెల్యేగా రెండో పర్యాయం ఎన్నుకున్న దాఖలాలు లేవు. నియోజకవర్గం ఏర్పడిన కొత్తలో 1951తో పాటు 1955 ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు, తిరిగి 1972తో పాటు 1978 ఎన్నికల్లో పిడతల రంగారెడ్డి విజయం సాధించారు. అనంతరం జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేను ఓటర్లు మారుస్తూనే వచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఇదే విధమైన మార్పును నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, పిడతల రంగారెడ్డి తర్వాత రెండోసారి ఎమ్మెల్యే అయ్యే రికార్డును మాత్రం అన్నా రాంబాబు బ్రేక్ చేస్తారని, నియోజకవర్గాన్ని రెండోసారి వైఎస్సార్ సీపీ ఖాతాలో వేస్తారని అంటున్నారు. నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు... మొత్తం ఓట్లు 2,24,592 పురుషులు 1,11,858 స్త్రీలు 1,12,441 ఇతరులు 19 పట్టుసాధించిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు... ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు నియోజకవర్గంపై పట్టుసాధించారు. ఈయన 2009లో పీఆర్పీ తరఫున పోటీచేసి గెలుపొందారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించారు. తన సామాజికవర్గమైన ఆర్యవైశ్యులతో పాటు యాదవ, కాపు సామాజికవర్గాల్లో రాంబాబుకు మంచి పట్టుంది. దీనికితోడు వైఎస్సార్ సీపీకి అనుకూల ఓటింగ్ అయిన ముస్లిం, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీల అండతో ఎదురులేని నాయకునిగా ఆయన మారారు. నియోజకవర్గం నుంచి ఏటా వందమందికి పైగా విద్యార్థులను ఇంజినీర్లుగా అన్నా రాంబాబు తీర్చిదిద్దుతున్నారు. నిరుద్యోగులకు తన శక్తిమేర ఉద్యోగావకాశాలు కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. కొందరు పేద విద్యార్థులు ఎంబీబీఎస్, ఎంసీఏ, ఎంబీఏ వంటి ఉన్నత విద్యనభ్యసించేందుకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. దీంతో పాటు పేదలు ఎక్కడైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిస్తే నేరుగా సహాయం అందిస్తున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, వెలిగొండ ప్రాజెక్టు నీటిని నియోజకవర్గంలోని అన్ని మండలాలకు అందించాలంటూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పోరాటం చేసి సాధించారు. అప్పట్లో తిరుపతి వరకు పాదయాత్ర చేసిన ధీరత్వం కలిగిన నాయకుడు. రాజకీయ చరిత్ర... 1951వ సంవత్సరంలో గిద్దలూరు నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 2009లో కంభం నియోజకవర్గాన్ని గిద్దలూరు నియోజకవర్గంలో కలిపారు. కంభం నియోజకవర్గంలో ఉన్న తర్లుపాడు, కొనకనమిట్ల మండలాలు మార్కాపురం నియోజకవర్గంలో కలవగా, అర్ధవీడు, కంభం, బేస్తవారిపేట మండలాలను గిద్దలూరు నియోజకవర్గంలో కలిసాయి. ప్రస్తుతం గిద్దలూరు నియోజకవర్గంలో గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట, కంభం, అర్ధవీడు మండలాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో అత్యధిక సార్లు కాంగ్రెస్ పార్టీ 5 పర్యాయాలు గెలుపొందింది. టీడీపీ అభ్యర్థి పరిస్థితి ఇలా... టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ముత్తుముల అశోక్‌రెడ్డి 2014లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీచేసి గెలిచి అనంతరం టీడీపీలోకి మారడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అభివృద్ధి కోసమే మారానని చెప్పి.. ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడం ఆయన పట్ల వ్యతిరేకతకు కారణమైంది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు. నీటి సమస్యను పరిష్కరించడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారు. రూ.500 కోట్ల వరకు ఖర్చు చేసి రోడ్లు, భవనాలు, చెక్ డ్యామ్‌లు నిర్మించామని ప్రచారం చేసుకోవడం మినహా.. వాటి దాఖలాలు, వాటితో ప్రజలకు ఒరిగిన ప్రయోజనాలు శూన్యం. కేవలం నాయకుల జేబులు నింపుకునేందుకే ఆ పనులు చేశారన్న వాదన ప్రజల్లో వినిపిస్తోంది. అధిక ఆదాయం వచ్చే పనులను తన బినామీలతో చేయించి కోట్ల రూపాయలు సంపాదించారని, పెట్టుబడి ఎక్కువ అయ్యే పనులను కార్యకర్తలకు ఇవ్వడం వలన చాలా మంది నాయకులు నష్టపోయారని సమాచారం. టీడీపీ నాయకులే ఆయనను వ్యతిరేకించిన సందర్భాలు అనేకం. వీటన్నింటింతో నియోజకవర్గంలో అశోక్‌రెడ్డితో పాటు టీడీపీ కూడా పూర్తిగా బలహీనపడింది. -
ప్రచార జోరు
పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రచార జోరును పెంచాయి. సభలు, సమావేశాలు, ర్యాలీలతో ప్రచారం ఊపందుకోగా, బహిరంగ సభల నిర్వహణలో మాత్రం ఇతర పార్టీలతో పోలిస్తే టీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఇప్పటి వరకు ఆ పార్టీ ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించింది. ప్రచార గడువు ముగిసే నాటికి మరో రెండు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని యోచిస్తోంది. డిసెంబర్ 2న పటాన్చెరులో బహిరంగ సభ ఉండగా, కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్‌లో సభ నిర్వహణపై స్పష్టత రావాల్సి ఉంది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో ఆరు రోజులు మాత్రమే వ్యవధి ఉండడంతో అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు ప్రచార పర్వంలో పరుగులు తీస్తున్నాయి. శాసనసభ రద్దయి, ఎన్నికల షెడ్యూలు వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్, బీజేపీ మినహా మహా కూటమి చెప్పుకోదగిన స్థాయిలో బహిరంగ సభలు నిర్వహించలేదు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీఆర్ఎస్ ఇప్పటికే ఎనిమిది నియోజకవర్గ కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తో పాటు, పటాన్చెరు, దుబ్బాక మినహా ఇతర అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ సభలు జరిగాయి. అసెంబ్లీ రద్దయిన తర్వాత సెప్టెంబర్ 7న హుస్నాబాద్, ఈ నెల 20న సిద్దిపేట, 22న మెదక్‌లో జరిగిన బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ఈ బహిరంగ సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు. వచ్చే నెల ఐదో తేదీతో ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడనుండగా, డిసెంబర్ 2న మధ్యాహ్నం మూడు గంటలకు పటాన్చెరు నియోజకవర్గ కేంద్రంలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. కేసీఆర్ పాల్గొనే సభలకు సంబంధించి డిసెంబర్ 4వ తేదీ వరకు పార్టీ వర్గాలు షెడ్యూలు విడుదల చేశాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో బహిరంగ సభకు సంబంధించిన వివరాలు లేవు. దీంతో కేసీఆర్ గజ్వేల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడం సాధ్యమయ్యే సూచన కనిపించడం లేదు. బీజేపీ మినహా ఇతర పార్టీల్లో ఎన్నికల ప్రచార పర్వం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్తో పాటు బీజేపీ మాత్రమే ఉమ్మడి మెదక్ జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించింది. ఈ నెల 25న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నారాయణఖేడ్, దుబ్బాక నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొనగా, గురువారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జహీరాబాద్‌లో జరిగిన సభలో ప్రసంగించారు. సెప్టెంబర్ 27న చేగుంట సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, అక్టోబర్ 15న సంగారెడ్డిలో జరిగిన సభలో కేంద్ర మంత్రి సదానంద గౌడ పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన మొదలుకుని ప్రచార పర్వంలోనూ వెనుకంజలో ఉన్న మహా కూటమి ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో చెప్పుకోదగిన సభ ఏదీ నిర్వహించలేదు. టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నర్సాపూర్, జహీరాబాద్‌లో జరిగిన రోడ్‌షోలకు హాజరయ్యారు. మరో ఆరు రోజుల్లో ప్రచార పర్వానికి తెరపడుతున్నా మహా కూటమి పక్షాన భారీ సభల ఊసు లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉంటే బహిరంగ సభల నిర్వహణతో జోష్‌లో ఉన్న టీఆర్ఎస్.. మరో ఆరు రోజుల పాటు ఇంటింటి ప్రచారంతో పాటు, ర్యాలీలు నిర్వహించడం ద్వారా ప్రచార వేడి తగ్గకుండా చూసుకునే యోచనలో ఉంది. ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా బీజేపీ అభ్యర్థులు కూడా ప్రచారంలో పోటీ పడేందుకు పరుగులు తీస్తున్నారు. -
ఏం జరుగుతుంది..భయ్యా?
ఎమ్మెల్యే అభ్యర్థి : హలో..! కార్యకర్త : హలో సార్.. నమస్తే అ : నమస్తే భయ్యా కా : చెప్పండి సార్.. అ : మీ వాడల మన పార్టీ పరిస్థితి ఎలా ఉంది.? జనం ఏమనుకుంటున్నారు..? ఓట్లు మనకే కదా..? కా: ఇప్పటికైతే ఫర్వాలేదు సార్.. ఈ రోజే ప్రత్యర్థి పార్టీ వాళ్లు ప్రచారం చేసిండ్రు. ఇప్పటికే మనం కలిసిన వాళ్లను కలిసిండ్రు. ఎందుకైన మంచిది మనం కూడా ఇంకోసారి వాళ్లను కలుద్దాం. అ : అవునా సరే. ముందు వాళ్లకు ఫోన్లు చేద్దాం. మరీ అవసరమనిపిస్తే అప్పటికి కలుద్దాం. అన్ని ప్రాంతాలు తిరగాలి కదా..? టైం లేదు. కా : సరే సార్ అ : మన పార్టీ క్యాడర్ బాగా పనిచేస్తుందా..? కా : అవును సార్.. కేటాయించిన ప్రాంతాలను చూసుకుంటుండ్రు. ఇంటింటికీ తిరుగుతుండ్రు. అ : వాళ్లతో పని చేయించుకో.. జరనువ్వే చూసుకోవాలి. మనోళ్లందరికీ చెప్పు. గెలుపునకు మనం దగ్గర్లోనే ఉన్నామని. మనం గెలిస్తే అందరికీ మంచి రోజులొస్తాయని. కా : సరే సార్.. అందరూ ఉత్సాహంతోనే పనిచేస్తుండ్రు. మీరు నిశ్చింతగా ఉండండి. అ : అయితే ఒకే... రేపు మళ్లీ మాట్లాడుకుందాం. సాక్షి, జగిత్యాల: ఇదీ ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల ప్రచారం తీరు. శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా 16 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఎమ్మెల్యే అభ్యర్థులు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఓ పక్క విస్తృత ప్రచారాలతో ఓటర్లను ఆకర్షిస్తున్న అభ్యర్థులు మరోపక్క ఇతర ప్రాంతాలపై పట్టు సడలకుండా జాగ్రత్త పడుతున్నారు. స్థానికంగా ఉన్న ప్రతికూల పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకూ ఉవ్విళ్లూరుతున్నారు. తమదైన శైలిలో ఒకరిపైమరొకరు సవాళ్లు విసురుతున్నారు. ప్రచారహోరుతో దద్దరిల్లుతున్న ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురిని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ త్రిముఖ పోటీ నెలకొంది. తెలంగాణ సాధించిన ఘనత, నాలుగేళ్ల అభివృద్ధి ప్రధాన ఎజెండాగా టీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంటే నాలుగేళ్లలో నెరవేరని ఉద్యమ ఆకాంక్షలు.. ఆశించిన మేరకు జరగని అభివృద్ధి ప్రధాన ఎజెండాగా మహాకూటమి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. అభివృద్ధితోపాటు అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిభ కూడా ఈ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి. ఊపందుకున్న వలసలు ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ జిల్లాలో ఓ పార్టీ నుంచి ఇంకోపార్టీకి వలసల పరంపర ఊపందుకుంటోంది. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీకి చెందిన అసంతృప్తులు.. ప్రచారానికి దూరంగా ఉంటున్న వారిని గుర్తించే పనిలో పడ్డారు. వారికి గాలం వేసి తమ పార్టీలో చేర్పించుకుంటున్నారు. ఇప్పటికే ఇరుపార్టీల నుంచీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీలు మారారు. తాజాగా జిల్లాకేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఏలేటీ శైలేందర్రెడ్డితో పాటు వైద్యుడు చంద్రశేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో సుమారు రెండొందల మంది గులాబీ కండువా కప్పుకున్నారు. ఇటు గతంలో టీఆర్ఎస్లో జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన గంగారెడ్డి, తాటిపర్తి శరత్‌రెడ్డి, బండ భాస్కర్‌రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రతిరోజు వందల సంఖ్యలో ఒకపార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఎన్నికల హడావుడి నెలకొంది. రానున్న రోజుల్లో ఆపరేషన్ ఆకర్ష్ మరింతగా ఉంటుందని ఇరుపార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతటా.. ఉత్కంఠ.. ముందస్తు ఎన్నికలు జిల్లాలో ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులకూ ముచ్చెమటలు పుట్టిస్తున్నాయి. ఓ వైపు సీనియర్లు.. మరో వై పు జూనియర్లు అసెంబ్లీలోకి అడుగుపెట్టేందు కు హోరాహోరీగా తలపడుతున్నారు. అన్ని సెగ్మెంట్లలో పోరు రసవత్తరంగా మారింది. ఇప్పటికే జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్న ఎంపీ కవిత ఆ మేర కు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ముఖ్యం గా మహాకూటమి జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డిని ఓడించి గులాబీ జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సంజయ్‌కుమార్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటు మహాకూటమికీ జగిత్యాల గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. జీవన్‌రెడ్డికి మద్దతుగా టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ సైతం ప్రచారంలో ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇన్నాళ్లూ ఒకరికొకరు ప్రత్యర్థులుగా ఉన్న రమణ, జీవన్‌రెడ్డి ఏకమవడంతో టీఆర్ఎస్ గట్టిపోటే ఎదుర్కొనుం ది. ఇటు కోరుట్ల నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు రెండునెలలుగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కూటమి రాష్ట్ర మాజీమంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు తనయుడు నర్సింగరావును తమ అభ్యర్థిగా ప్రకటించింది. నిన్నటి వరకు టీఆర్ఎస్ ప్రచారానికే పరిమితమైన ఆ నియోజకవర్గంలో జువ్వాడి సైతం తన ప్రచార వ్యూహాలకు పదునుపెడుతున్నారు. దీంతో అక్కడా ఇరువురి మధ్య గట్టి పో టే నెలకొంది. వీరితోపాటు బీజేపీ అభ్యర్థి జేఎన్ వెంకట్ సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. ధర్మపురి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు కూటమి అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు మధ్య రసవత్తర పోటీ నెలకొంది. -
వర్ధన్నపేట అభ్యర్థిని ప్రకటించని మహాకూటమి
సాక్షి, వరంగల్ రూరల్: ఓ వైపు ఎన్నికల ప్రచా రాన్ని నియోజకవర్గాల్లో పలు రాజకీయ పార్టీలు జోరుగా నిర్వహిస్తుంటే.. మరికొన్ని పార్టీలు మాత్రం తమ అభ్యర్థులనే ఇంకా ప్రకటించలేదు. నామినేషన్ల గడువు సమీపిస్తున్నా అభ్యర్థుల ప్రకటన పూర్తి కాలేదు. సెప్టెంబర్ 6న ప్రభుత్వాన్ని రద్దు చేశాక టీఆర్ఎస్ అధినేత 105 మంది ఎమ్మె ల్యే అభ్యర్థులను వెంటనే ప్రకటించిన విషయం తెలిసిందే. వారిలో వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట నుంచి ఆరూరి రమేశ్, నర్సంపేట నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి, పరకాల నుంచి చల్లా ధర్మారెడ్డి పేర్లు ఉన్నాయి. ఇటీవల బీజేపీ పరకాల నుంచి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి, వర్ధన్నపేట నుంచి కొత్త సారంగరావు, మహాకూటమి తరఫున పరకాల నుంచి కొండా సురేఖ, నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డిని ప్రకటించారు. ఇంకా జిల్లాలో మహకూటమి తరఫున వర్ధన్నపేట అభ్యర్థిని ప్రకటించలేదు. వర్ధన్నపేట మహాకూటమి అభ్యర్థి ఎవరో? వర్ధన్నపేట మహాకూటమి అభ్యర్థిని ఇంత వరకు ప్రకటించలేదు. మహాకూటమిలోని టీజేఎస్ 12 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. అందులో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని తెలంగా ణ జన సమితి(టీజేఎస్)కి కేటాయించినట్లు ఇప్పటికే ఆ పార్టీ తెలిపింది. కాంగ్రెస్ పార్టీకే కేటా యించాలని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌తో పాటు తన అనుచరులు గాంధీభవన్‌లో ఆందోళన చేపట్టారు. ఓ వైపు నామినేషన్ల గడువు దగ్గర పడుతుంటే అభ్యర్థుల ప్రకటనలో కూటమి తర్జనభర్జన పడుతోంది.టీజేఎస్ తరఫున పగిడిపాటి దేవయ్యని నిలబెడతారని సమాచారం. ఇప్పటికే దేవ య్యప్రచార రథాలను సైతం సిద్ధం చేసుకున్నారు. సమీపిస్తున్న గడువు పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల గడువు సమీపిస్తోంది. ఈ నెల 12 నుంచి ప్రారంభమైన నామినేషన్ల గడువు ఈ నెల 19వ తేదీతో ముగియనుంది. ఈ నెల 20న నామినేషన్ల పరిశీలన జరగనుంది. 22న మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ ఉపసంహరణ తుది గడువు ఉంటుంది. గడు వు సమీపిస్తున్నా మహాకూటమి అభ్యర్థిని ప్రకటిం చకపోవడంతో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. ఓ పక్క టీఆర్ఎస్ ప్రచారంలో దూ సుకెళ్తుండగా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆయా పార్టీల కార్యకర్తలు నిరాశకు లోనవుతున్నారు. -
కాంగ్రెస్‌లో టికెట్లకు తీవ్ర పోటీ
సాక్షి, రంగారెడ్డి జిల్లాప్రతినిధి: టికెట్ల కేటాయింపు కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఒక్కో సీటుకు ఇద్దరు ముగ్గురు పోటీపడుతున్నారు. ఆశావహుల మధ్య పోటీ ఉండడం సహజమే అయినా వైరివర్గాలుగా వ్యవహరిస్తుండడం ఇబ్బందిగా మారింది. ఒకరికి టికెట్ ఇస్తే.. మరొకరు సహకరించే పరిస్థితి లేకపోవడంతో అధినాయకత్వం దిక్కుతోచని పరిస్థితిలో పడింది. చేవెళ్లలో యమ డిమాండ్ చేవెళ్ల కాంగ్రెస్ టికెట్‌కు భలే డిమాండ్ ఉంది. రిజర్వ్డ్ స్థానమైన ఇక్కడి నుంచి పోటీ చేయడానికి స్థానిక నాయకులే కాకుండా వలస నేతలు సైతం వస్తుండడంతో ఈ నియోజకవర్గానికి గిరాకీ పెరిగింది. గత ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన యాదయ్య టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆయన స్థానంలో పోటీచేయడానికి కాంగ్రెస్‌లో పోటీ నెలకొంది. పార్టీని నమ్ముకొన్న సీనియర్ నేత వెంకటస్వామి ఈసారి టికెట్టు లభిస్తుందని గంపెడాశతో ఉండగా తాజాగా టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే రత్నం తనకే టికెట్ దక్కుతుందనే ధీమాలో ఉన్నారు. మరోవైపు మొదటి నుంచి ఈ సెగ్మెంట్‌పై కన్నేసిన రాచమల్ల సిద్దేశ్వర్ కూడా తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. తనకు మాజీ మంత్రి సబిత, ఏఐసీసీ పెద్దల అండదండలతో అభ్యర్థిత్వం ఖరారవుతుందనే భరోసాతో ఉన్నారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘం నేత పోచయ్య కూడా టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరందరిని కాదని అధిష్టానం మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ పేరును పరిశీలిస్తోందనే ప్రచారమూ జరుగుతోంది. తాండూరులో కీచులాటలు తాండూరు కాంగ్రెస్‌లో షరా మామూలుగానే వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. మొదటి నుంచి ఈ సెగ్మెంట్లో గ్రూపులుగా విడిపోయిన హస్తం నేతలు తాజాగా కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో బాబాయ్, అబ్బాయ్‌కే పరిమితమైన విభేదాలు ఈసారి కొత్తగా చేరిన పైలెట్ రోహిత్‌రెడ్డిని తాకాయి. ఎన్నికల వరకు ఒకరు.. టికెట్ కేటాయింపు వచ్చేసరికి మరోనేతను తెరమీదకు తెచ్చే ‘మహారాజ్ ఫ్యామిలీ’ ఈసారి కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించింది. మొన్నటి వరకు ఇన్చార్జిగా వ్యవహరించిన రమేశ్.. ఎన్నికల్లో పోటీ చేయలేనని విదేశీబాట పట్టగా తనకో, తన అన్న కొడుకు నరేశ్కో టికెట్టు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే నారాయణరావు గాంధీభవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మరోవైపు పార్టీకి వెన్నంటి నిలిచిన తన పేరును పరిశీలించాలని డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి అభ్యర్థిస్తున్నారు. రాహుల్‌గాంధీని కలిసి పార్టీలో చేరిన రోహిత్ మాత్రం టికెట్టు తనకేననే ధీమాతో ఉన్నారు. మరోవైపు డాక్టర్ సంపత్ కూడా తెర వెనుక లాబీయింగ్ నెరుపుతున్నారు. వికారాబాద్‌పై పీటముడి వికారాబాద్ టికెట్ కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్ హైకమాండ్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. 2014లో పోటీచేసి ఓడిపోయిన మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ మరోసారి ఇక్కడి నుంచి రంగంలోకి దిగడానికి ఉబలాటపడుతున్నారు. అలాగే గత ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ కూడా ఈసారి బరిలో దిగాల్సిందేనని నిర్ణయించారు. కొన్నాళ్ల క్రితం ప్రసాద్ టీఆర్ఎస్లో చేరాలని భావించి చివరి నిమిషంలో రాహుల్‌గాంధీ జోక్యం చేసుకోవడంతో ఆగిపోయారు. దీంతో ఎలాగైనా తనకే టికెట్టు అనే భరోసాతో ఉన్నారు. ఇక మూడేళ్ల క్రితం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీచేసి ఓడిన చంద్రశేఖర్‌కు శాసనసభ లేదా పార్లమెం టు బరిలో దిగే అవకాశం కల్పిస్తామని ఏఐసీసీ హామీ ఇచ్చింది. ఈ హామీని నిలబెట్టుకోవాలని ఆయన ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారు. వీరిరువురిలో ఎవరికి టికెట్టు లభించినా మరొకరు సహాయ నిరాకరణ చేసే పరిస్థితి నెలకొంది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పట్నంలో పాత కథే! ఇబ్రహీంపట్నంలో పాత కథే పునరావృతమవుతోంది. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మధ్య మరోసారి టికెట్టు పోరు ఏర్పడింది. గత ఎన్నికల్లో మల్లేశ్‌కు టికెట్టు లభించడంతో మల్రెడ్డి రంగారెడ్డి సోదరుడు రాంరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి మల్లేశ్‌ను మూడోస్థానానికి పరిమితం చేశారు. కాంగ్రెస్‌లో ఓట్ల చీలికతో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విజయం సులువైంది. ఈసారి కూడా మల్రెడ్డి, మల్లేశ్‌లు టికెట్ల వేటలో హస్తినకేగారు. ఎవరికివారు ఏఐసీసీ పెద్దలతో అభ్యర్థిత్వం ఖరారు చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఇక్కడ కూడా ఒకరికి టికెట్టు దక్కితే మరొకరు చేయిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. రసకందాయంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి వైఖరి కాంగ్రెస్‌లో కలవరం సృష్టిస్తోంది. పీసీసీ ‘ముఖ్య’నేతతో వైరం ఏర్పడడం.. అదికాస్తా తారాస్థాయికి చేరడంతో మనస్తాపానికి గురైన ఆయన తాజాగా జరిగే ఎన్నికల్లో పోటీపై వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర నాయకత్వం అనుమానపు చూపులతో కినుక వహించిన ఆయన టీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారమూ లేకపోలేదు. ఈ పరిణామాలన్నింటికీ స్థానిక నేతలే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, పార్టీ నేతలు నర్సింహారెడ్డి, తోటకూర జంగయ్యయాదవ్ స్థానికేతరుడిగా ముద్రిస్తుండడం.. గులాబీకి గూటికి చేరుతున్నారనే ప్రచారం వెనుక వీరి పాత్ర ఉందని కేఎల్లార్ విశ్వసిస్తున్నారు. దీంతో ఇక్కడి కాంగ్రెస్ మార్కు రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అక్కడక్కడా చిటపటలు మహేశ్వరంలో మాజీ మంత్రి సబిత పోటీచేయాలని భావిస్తుండగా.. అదే సీటుపై కన్నేసిన దేప భాస్కర్‌రెడ్డి టికెట్టు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాజేంద్రనగర్‌లో కార్తీక్‌రెడ్డి, ముంగి జైపాల్‌రెడ్డి మధ్య టికెట్టు వేట కొనసాగుతోంది. మల్కాజిగిరిలో నందికంటి శ్రీధర్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ మధ్య, షాద్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి, కె.శ్రీనివాస్ మధ్య పోటీ నెలకొంది. ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, పరిగి, ఉప్పల్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కల్వకుర్తిలో మాత్రం ఆశావహుల సంఖ్య ఒకిరికే పరిమితం కావడంతో ఇబ్బంది లేకుండా పోయింది. -
సిద్ధిపేట టీఅర్ఎస్ ఎమ్మెలే అభ్యర్ధిని మార్చబోతున్నారు
-
వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా : వచ్చే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్ నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ..ఏ పార్టీలో చేరేది మరో రెండు నెలల్లో ప్రకటిస్తానని చెప్పారు. కార్యకర్తల అభీష్టం మేరకు ఏ పార్టీ అనేది ఆగస్టులో చెబుతానని ఆయన తెలిపారు. అంతకు ముందు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడనే కారణంతో కాంగ్రెస్ పార్టీ రామ్ కుమార్‌ను సస్పెండ్ చేసింది. దీంతో ఎలాగూ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో దిక్కు లేకపోవడంతో సీనియర్ బీజేపీ నాయకుడు, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరినా అప్పటి నుంచి పార్టీలో నిమ్మకు నీరెత్తిన విధంగానే ఉన్నారు. ఆయన ఏ పార్టీలో చేరేదీ తెలియాలంటే మరో రెండు నెలలు వేచి ఉండాల్సిందే. -
కష్ట కాలంలో పోటీచేశాం.. మర్చిపోకండి!
సాక్షి, గుంటూరు: పార్టీ ఇబ్బందుల్లో ఉందని తెలిసినా చిత్తశుద్ధితో పనిచేశామని, ఎన్నికలు ముగిసి మూడు నెలలు దాటుతున్నా ఇంత వరకూ పార్టీలో తమకు సరైన ప్రాధాన్యత కల్పించలేదని కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో పదవులు అనుభవించిన ఎంతోమంది బడా నాయకులు సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు ఇచ్చినప్పటికీ ఓటమి భయంతో పోటీ చేయకుండా వెనక్కు వెళ్ళారని, అలాంటి వారికి ఇప్పుడు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎలా అప్పజెబుతారంటూ అధిష్టానంపై మండిపడుతున్నారు. నియోజకవర్గంలో తమకు ఎలాంటి ప్రాధాన్యం కల్పిస్తున్నారనే అంశంపై గత నెల విజయవాడలో జరిగిన విసృ్తతస్థాయి సమావేశంలో ఎలాంటి ప్రకటనా చేయకపోవడంపై వీరు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అసలు పార్టీలో తమ ప్రాధాన్యమేమిటో చెప్పకుండా ఇప్పుడు సమీక్షల పేరుతో పార్టీని పునఃనిర్మిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేశామని, పార్టీ నుంచి వచ్చిన కొద్దోగొప్పో డబ్బును కూడా నాయకులు కాజేశారే తప్ప చిల్లిగవ్వ కూడా తమకు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఇద్దరు వ్యక్తులు పార్టీని అడ్డుపెట్టుకొని మంత్రి పదవులు అనుభవించి తీరా ఎన్నికలు వచ్చేసరికి పోటీ నుంచి పక్కకు తప్పుకుని తమని బలిపశువులుగా మార్చారని వాపోతున్నారు. తాడోపేడో తేల్చుకుంటాం.. కాంగ్రెస్‌పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అధ్యక్షతన జరిగే సమీక్షా సమావేశంలో తాడో పేడో తేల్చుకునేందుకు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు సిద్ధమౌతున్నట్లు సమాచారం. తమను నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా ప్రకటించాలంటూ రఘువీరారెడ్డిని నిలదీసేందుకు కొందరు సిద్ధమౌతున్నట్లు తెలిసింది. తమను కాదని సీనియారిటీ పేరుతో పోటీ నుంచి తప్పుకున్న వ్యక్తులకు బాధ్యతలు అప్పగిస్తే సహించేది లేదని హెచ్చరిసున్నారు. అలాగని పెండింగ్ పెట్టినా ఊరుకోబోమని అంటున్నారు. మేం పార్టీ మారాం.. సమీక్షా సమావేశానికి హాజరుకావాలంటూ అనేక మంది నాయకులకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఫోన్లు రావడంతో ‘మేం పార్టీ మారాం.. మీవాళ్ళను పిలుచుకోండి’ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ఎవరికి ఫోన్ చేయాలో, ఎవరికి చేయకూడదో తెలియక పార్టీ కార్యాలయ సిబ్బంది తలలుపట్టుకు కూర్చున్నారు. ఎవరు పార్టీలో ఉన్నారో.. ఎవరు పార్టీని విడిచారో తెలియని దారుణమైన పిరిస్థితి తామెప్పుడూ చూడలేదని పార్టీ కార్యాలయ సపిబ్బంది వాపోతున్నారు. -
కోట్లకు ఓట్లొచ్చేనా..!
సాక్షి, ఒంగోలు: ఈసారి జరిగిన ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా రికార్డులకెక్కాయి. జిల్లాలో సుమారు రూ.200 కోట్లకు పైగానే ఖర్చయినట్లు రాజకీయ పరిశీలకులు లెక్కలేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి రూ.28 లక్షలు, ఎంపీ అభ్యర్థి రూ.70 లక్షలకు మించి ఖర్చు చేయరాదు. కానీ ప్రధాన పార్టీలకు చెందిన ఒక్కో అభ్యర్థి రూ.10 కోట్ల వరకు వెదజల్లారు. ఇక, ఆయా పార్టీల ప్రధాన నాయకులు పోటీపడిన నియోజకవర్గాల్లో ప్రలోభాల పర్వం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగింది. ధన, మద్య ప్రవాహం ఏరులై పారింది. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 187 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మూడు లోక్‌సభ స్థానాలకూ మొత్తం 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరందరూ ఎన్నికల ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదు. పదిమంది సభ్యులున్న సంఘానికి ఒక అభ్యర్థి రూ.5 వేలిస్తే.. మరో అభ్యర్థి ఏకంగా రూ.పదివేలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇలా ఒకరికంటే మరొకరు రెండింతలు చొప్పున డబ్బు వారి చేతిలో పెట్టారు. జిల్లాలోని 50 వేలకు పైగానే ఉన్న మహిళా సంఘాలు, 12 వేల యువజన సంఘాలు, గ్రామగ్రామాన ఉన్న కులసంఘాలు, వాడవాడలా ఉన్న కాలనీ అభివృద్ధి కమిటీలకు ఈసారి అన్ని పార్టీల నుంచి ప్రలోభాలు దక్కాయి. సంఘాల వారీగానే కాకుండా ప్రత్యక్షంగానూ ఇంటింటికీ లబ్ధి చేకూరింది. ఈవిధంగా కాగితాల్లోకి చేరని ఖర్చు రూ.కోట్లకు మించిపోయిందనేది బహిరంగ రహస్యమే.. నిన్నటిదాకా ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లకు డబ్బులు పంచిన పార్టీల నేతలు... ప్రస్తుతం జిల్లా కేంద్రంలో గెస్ట్‌హౌస్‌లు, లాడ్జీల్లో సేదదీరుతూ ఎక్కడెక్కడ ఓటుబ్యాంకు తమపార్టీ తరఫున డిపాజిట్ అయిందనే లెక్కల్లో మునిగారు. ఏ ప్రాంతంలో ఎంతెంత పంపిణీ చేశాం.. నోట్లకు ఏమేరకు ఓట్లు రాలాయనే అంచనాలను పార్టీ అభ్యర్థుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఒక్కో అసెంబ్లీ అభ్యర్థి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు... ఎంపీ అభ్యర్థి రూ.60 లక్షల వరకు ఖర్చుచేసినట్లు అధికారికంగా కాగితాల్లో లెక్కలేసి ఎన్నికల కమిషన్‌కు ఇప్పటికే సమర్పిస్తున్నారు. అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చుపెట్టినా ...అధికారుల నిఘా కళ్లకు ఏమాత్రం పట్టుబడకుండా జాగ్రత్తపడ్డారు. ఓట్ల కొనుగోలుకు తెగ బడ్డ టీడీపీ.. ఈసారి అధికారం తెచ్చుకోకపోతే, రాజకీయంగా కొన్ని దశాబ్దాలపాటు వెనకబడి పోతామనే అధినేత చంద్రబాబు మాటలతో.. జిల్లాలో ఆపార్టీ అభ్యర్థులు ఓట్ల కొనుగోలుకు తెగబడ్డారు. సీట్ల కేటాయింపులోనే పారిశ్రామికవేత్తలు, కోటీశ్వరులను ఎంపిక చేసుకుని మరీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆమేరకు అభ్యర్థులు తాము పోటీచేసిన నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా ఖర్చుచేశారు. దర్శి, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు ఓటుకు రూ.2 వేలు చొప్పున పంపిణీ చేసినట్లు వెలుగు చూస్తుండగా.. చీరాల, కనిగిరిలోనూ ఆపార్టీ అభ్యర్థులు రూ.1500కు తగ్గకుండా అందజేసినట్లు ఓటర్లు చెబుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్నకు రెండ్రోజుల ముందుగానే ఇంటింటికీ పంపిణీ చేసిన అభ్యర్థులు.. ఓటింగ్‌నకు బయల్దేరే సమయంలోనూ పోలింగ్‌బూత్‌ల వద్దనే ఓటుస్లిప్పు ప్రకారం డబ్బు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు జిల్లావ్యాప్తంగా మొత్తం రూ.7 కోట్ల 28 లక్షల 29 వేల 650 సీజ్ చేయగా, అందులో లెక్కలు చూపని రూ.3 ఓట్ల 41 లక్షల 23 వేల 220లను ఆదాయపన్ను శాఖకు అప్పగించారు. ఇంకా రూ.28 లక్షల 31 వేల 780పై విచారణ కొనసాగుతోంది. నగదు తరలిస్తూ పట్టుబడిన వారిపై 49 కేసులు నమోదు కాగా, వీరిలో అధికంగా టీడీపీకి చెందిన నేతలే ఉండటం గమనార్హం. -
అభివృద్ధి పథంలో నిలబెడతా...
ఆమదాలవలస, న్యూస్‌లైన్:నియోజకవర్గంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, ప్రజలు ఏమి కోరుకుం టున్నారో తెలిసిన వాడినని, వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా చర్యలు తీసుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆ పార్టీ ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం అన్నారు. ‘న్యూస్‌లైన్’తో ఆదివారం ప్రత్యేకంగా మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి మీరేం చేస్తారు? ఆమదాలవలసలో మూతపడిన చక్కెర కర్మాగారాన్ని జగన్మోహన్రెడ్డి హామీ మేరకు తెరచేందుకు శాయశక్తులా కృషిచేస్తాను. ఈ ప్రాంత ప్రజలు, రైతులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు పాటుపడతా. టీడీపీ హయూంలో పడిన మచ్చను తొలగించుకుంటాను. నాగావళి నదిపై బలసర రేవువద్ద బ్రిడ్జి నిర్మాణానికి కృషిచేస్తా. ఆమదాలవలస-పొందూరుకు అనుసంధానం చేస్తూ నాగావళి నదిపై ఉన్న దూసి బ్రిడ్జిపై వాహనాలు నడిచేందుకు అనుగుణంగా అంతర బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటా. నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పొందూరు మండలంలో కేసవదాసుపురం, నందివాడ, కొంచాడ, లైదాం, రాపాక లతో పాటు సుమారు 20గ్రామాలకు అటు మడ్డువలస, ఇటు నారాయణపురం ప్రాజక్టులు నుంచి సాగునీరు అందడంలేదు. కాలువలు విస్తరింపజేసి సాగునీ టి కల్పనకు కృషిచేస్తాను. పొందూ రు పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాను. మీకు గ్రామాల్లో మంచి ఆదరణ లభిస్తుంది. దీనికి కారణం? గ్రామాల్లోని ప్రతి ఒక్కరు మహానేత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధిపొందారు. దీంతో వారంతా అండగా నిలిస్తున్నారు. గ్రామీణ ప్రజలనుంచి ఇంత ఆదరణ ఏ పార్టీకీ లేదు. గెలుపు ఖాయం. గెలిచిన తర్వాత ప్రజల అభీష్టం మేరకు అన్ని గ్రామాల అభివృద్ధికి పాటుపడుతాను. అందరివాడిగా మెలగుతాను. -
తొక్కించేస్తా.. తొక్కేస్తా... చింతమనేని వీరంగం
ఓటర్లపై చింతమనేని చిందులు పెదపాడు : ‘ఎవరైనా ఎదురు తిరిగితే తొక్కించేస్తా.. తేడాలొస్తే నేనే తొక్కేస్తా...’ అంటూ దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఓటర్లపై విరుచుకుపడ్డారు. పెదపాడు శివారు కేఆర్ పాలెంలో ఆదివారం రాత్రి ప్రచారానికి వచ్చిన ఆయన దుర్భాషలాడటంతో ఓటర్లు నిర్ఘాంతపోయూరు. ఓట్లు అభ్యర్థించడం మానేసి ‘నాకు వ్యతిరేకంగా పోటీ చేయడానికి గుంటూరు నుంచి వచ్చాడొకడు. వేరే చోటనుంచి తయూరయ్యూడు మరొకడు. వాళ్లు డబ్బులిస్తే తీసుకోండి. ఓటును మాత్రం నాకే వేయం డి’ అంటూ చింతమనేని ప్రసంగిస్తుండగా.. ఇదేమిటని ఓ ఓటరు ప్రశ్నించాడు. దీంతో రెచ్చిపోయిన చింతమనేని ‘నాకే ఎదురు చెబుతావా. ఎవడ్రా నువ్వు.. నిన్ను తొక్కించేస్తా.. తొక్కేస్తా. ఎవరైనా ఎదురుతిరిగితే ఇదేగతి’ అంటూ చిం దులు తొక్కారు. ‘అలా అంటారేంటి బాబూ’ అని ఓ మహిళ ప్రశ్నించగా.. ‘నువ్వెవరు.. ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా..’ అంటూ దుర్భాషలాడారు. ఓటమి భయంతోనే చింతమనేని ఈ విధంగా మాట్లాడుతున్నారని మిగిలిన ఓటర్లంతా గుసగుసలాడుకోవడం కనిపించింది. మొత్తానికి చింతమనేని వ్యవహార శైలి విమర్శలకు దారితీస్తోంది. -
ఓటడిగే అర్హత నాకే ఉంది
- కాంగ్రెస్ పార్టీ నాగార్జునసాగర్ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు జానారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటడిగే హక్కు నాకు మాత్రమే ఉంది. రాష్టలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దా. తెలంగాణ ప్రజల కల సాకారం కోసం ముందుండి పోరాడా. ఇక్కడ పోటీలో ఉన్న నా ప్రత్యర్థులెవరూ ఏనాడూ తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్నవారు కారు. 2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టించింది నేనే. తెలంగాణ రాష్ట్రం సాధించకపోతే నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని ముందే ప్రకటించా. ఇపుడు రాష్ట్రం ఏర్పాటయ్యింది. ఓటడిగే అర్హత నాకు తప్ప మరెవరికి ఉంటుంది చెప్పండి. విద్యారంగానికి పెద్దపీట మండలానికో మోడల్‌స్కూల్ మంజూరు చేయించా. హాలియాలో ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ఐటీఐ కళాశాలను ప్రభుత్వపరం చేసి నడిపిస్తున్నాం. నాగార్జునసాగర్‌లో పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయించా. అది వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. ఎవరైనా ఔత్సాహికులు ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే అనుమతి ఇప్పించి అండగా ఉంటా. తెలంగాణ రాష్ట్రానికి మంజూరయ్యే సాంకేతిక విద్యకు సంబంధించిన కళాశాలను సాగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయిస్తా. సాగునీటి సౌకర్యం కల్పన కోసం.. ఎస్ఎల్బీసీని పూర్తిచేయించడంతో పాటు, అందులో భాగమైన వరద కాలువకు మోటార్లు బిగిస్తే వచ్చేఖరీప్ సీజన్‌కు సాగునీరందుతుంది. నియోజకవర్గంలో సాగర్ ఎడమకాలువపై ఉన్న 15ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు రూ. 20కోట్లు మంజూరు చేయించా. పెద్దవూర మండలంలో రూ. 60కోట్లతో ఐదువేల ఎకరాల బీడు భూముల సాగుకుగాను నెల్లికల్లు లిప్టును మంజూరు చేయించా. హాలియా మండలంలో స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తా. నియోజకవర్గంలో ఆర్టీసీ బస్ డిపోను కూడా ఏర్పాటు చేయిస్తా. మౌలిక సదుపాయాల కల్పనకు.. రక్షిత తాగునీటికి గాను నియోజకవర్గంలో రూ. 97.50కోట్ల వ్యయంతో 10 మలీ్టవిలేజ్ స్కీమ్‌లు మంజూరు చేయించా. రూ.18.82కోట్లతో ఏక గ్రామ పథకం ద్వారా 301 పనులు జరుగుతున్నాయి. రూ. 120కోట్లతో నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సీసీరోడ్లు వేయించా. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రూ. 24.86కోట్లతో 12రోడ్లు పూర్తయ్యాయి. ఏఎమ్మార్పీ పరిధిలోని మూడు మండలాలలో రూ. 39.86కోట్లతో 32పనులు మంజూరయ్యాయి. -
బంగారు తెలంగాణే లక్ష్యం
కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్నది నా ప్రధాన లక్ష్యం. దీనిలో భాగంగా ఎమ్మెల్యేగా గెలిచిన మూడు, నాలుగు నెలల్లో తొలి ప్రాధాన్యత కింద జిల్లాలో పెండింగ్‌లో ఉన్న తాగు, సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా. నియోజకవర్గంలో తొలి విడత శాటిలైట్ టౌన్షిప్ పేరుతో ఐదు వేల ఇళ్ల నిర్మాణం చేపడతా.జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీతో పాటు దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తా . నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా.. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఐటీ పార్కు ఏర్పాటు, ప్రభుత్వ భూములు సేకరించి పేదలకు పంపిణీ చేస్తా. మేజర్ గ్రామపంచాయతీల్లో ప్రభుత్వ భూములు సేకరించి శాటిలైట్ టౌన్ షిప్‌లు ఏర్పాటు చేయిస్తా. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి ప్రత్యేక రాష్ట్రంలో సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు నాకు ఉన్నాయి. కానీ సీఎం పదవి కంటే కూడా ఈ ప్రాంత ప్రజల బాగోగులు చూసుకోవడం ముఖ్యం. టీ కాంగ్రెస్ మేనిఫెస్టోల్లో పేర్కొన్న అంశాలను అమలు చేసేందుకు కృషి చేస్తా. రైతులకు రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయిస్తా. బీసీలు, ముస్లింలు, మైనార్టీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటుకు కృషి, హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారిపై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయిస్తా. వృద్ధులకు, వికలాంగులకు పింఛన్‌ను రూ.వెయ్యికి పెంచేందుకు పాటుపడతా. రైతులకు 9 గంటల పాటు నిరంతరాయం గా విద్యుత్ సరఫరా చేయిస్తా. స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తా. -
మూడ్రోజుల క్రితం అదృశ్యమైన హారిక క్షేమం
-
ఎమ్మెల్యే అభ్యర్థి కుమార్తె అదృశ్యం
నల్లగొండ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బిల్యానాయక్ కుమార్తె హారిక... హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. బిల్యానాయక్‌కు బీఎన్‌రెడ్డి నగర్, సిరిపురం కాలనీలలో రెండు నివాసాలున్నాయి. నాయక్ ఎన్నికల ప్రచారం నిమిత్తం భార్యతో కలిసి దేవరకొండ వెళ్లారు. 8వ తరగతి చదువుతున్న కుమార్తె హారికను వార్షిక పరీక్షల నిమిత్తం బీఎన్‌రెడ్డి నగర్‌లోని తమ బంధువుల ఇంట్లో ఉంచారు. పరీక్షలు పూర్తవడంతో కుమార్తెను తీసుకువెళ్లేందుకు తల్లి అనిత బుధవారం రాత్రి సిరిపురం కాలనీలోని తన ఇంటికొచ్చారు. బీఎన్‌రెడ్డి నగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి కుమార్తెను తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. అక్కడ తమ కుమార్తె జాడలేకపోవడంతో వెంటనే భర్తకు తెలిపారు. బిల్యానాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీ అభ్యర్ధికుమార్తె అదృశ్యం
-
బలహీనవర్గాల అభ్యున్నతి టీఆర్ఎస్ కృషి
తుర్కపల్లి, న్యూస్‌లైన్ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ కృషి చేస్తుందని టీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పలుగ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రుస్తాపూర్‌లో ఏర్పా టు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అధికారంలోకి రాగానే ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, ఇది అన్నిరంగాల్లో అభివృద్ధి చేదాలంటే టీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. 14 ఏళ్ల పాటు కేసీఆర్ నాయకత్వంలో నిరంతర పోరాటం చేసింది టీఆర్ఎస్ అన్నారు. ఎంతో మంది త్యాగల ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు,బలహీన వర్గాలకు రెండు పడకగదులతో కూడిన ఇంటి నిర్మాణం, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్య అందించడానికి టీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. కార్యక్రమంలో నాయకులు బోరెడ్డి జ్యోతి ఆయోధ్యరెడ్డి, పడాల శ్రీనివాస్, సుంకరి శెట్టయ్య, గోవింద్చారి, కొమ్మిరి శెట్టినర్సింహులు, అమరేందర్‌రె డ్డి, కరుణాకర్‌రెడ్డి, సింగం వెంకటేశం,పొగుల ఆంజనేయులు, ఉపేందర్‌రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు. -
ప్రజల కష్టాలు తీర్చేందుకే జనంలోకి జగన్
పొట్లపల్లి(హుస్నాబాద్‌రూరల్ ), న్యూస్‌లైన్: పేదల కష్టాలు తీర్చేందుకే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజ ల్లోకి వస్తున్నారని, ఆయనను ఆదరించాలని పార్టీ జిల్లా కన్వీనర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కరీం నగర్ ఎంపీ అభ్యర్థి మీసాల రాజారెడ్డి కోరారు. మండలంలోని పొట్లపల్లి స్వయం భు రాజేశ్వరస్వామి సన్నిధి నుంచి ఆదివారం ప్రచారం ప్రారంభించారు. అంత కముందు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రచార రథాన్ని వైఎస్సార్సీపీ జిల్లా యువజన సంఘం కన్వీనర్ బోయినపల్లి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సమయంలో పొట్లపల్లికి వచ్చారని, ఆ సమయంలో మెట్ట ప్రాంత రైతుల కోసం వరద కాలువ నిర్మిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు వైఎస్ జగన్‌తోనే సాధ్యమన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్య, అమ్మ ఒడి పథకం, డ్వాక్రా మహిళల రుణాల మాఫీతోపాటు అనేక రకాల సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు తె లిపారు. జిల్లాలో 11 అసెంబ్లీ, కరీంనగర్ ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి మీసాల రాజారెడ్డి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యార్థుల జీవితాల్లో వైఎస్సార్ వెలుగులు నింపారన్నారు. వైఎస్సార్ ఆశయాల సాధన జగన్‌తోనే సాధ్యమన్నారు. కరీంనగర్ ఎంపీగా తనను గెలిపించాలని కోరారు. అనంతరం పోట్లపల్లిలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు సింగిరెడ్డి ఇందిరా, శృతి, హుస్నాబాద్, భీమదేవరపల్లి మండల అధ్యక్షులు బొంగోని శ్రీనివాస్‌గౌడ్, వనపర్తి రమేశాచారి, నాయకులు అజయ్ పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీతోనే సువర్ణయుగం
త్రిపురారం, న్యూస్‌లైన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు సువర్ణ యుగం లాంటి పాలన అందుతుందని ఆ పార్టీ సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లు రవీందర్‌రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామం లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణలోని ప్రతి కుటుంబంలో ఏదో ఒక రకంగా అందుతున్నాయని చెప్పారు. తెలంగాణలో కోట్లాది మంది దివంగత నేత వైఎస్సార్ అభిమానులు ఉన్నారని, వారిని ఓట్ల రూపంలో మలుచుకుంటామని తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా తమ పార్టీ పని చేస్తోందని చెప్పారు. వైఎస్సార్ మరణం తరువాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరు గార్చిందని విమర్శించారు. పేదలకు తామున్నామనే భరోసాపై ఏ నాయకుడు ఇవ్వలేదని, దీంతో ప్రజలు అనేక అవస్థలు పడ్డారని తెలిపారు. సాగర్ నియోజకవర్గంలో సాగు, తాగు నీరందించి సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట ఆ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జవహార్‌నాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొల్లి రవి కుమార్, బిచ్చునాయక్, కొల్లి అన్నపూర్ణ, బూర రేణుక, దుర్గయ్య, బూర నాగయ్య, బాలరాజు, మురళి, నియోజకవర్గ యూత్ నాయకుడు పడిడోజు సైదాచారి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను గెలిపించాలి
డిచ్పల్లి, న్యూస్‌లైన్ : ఇచ్చిన మాట మీద నిలిచి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం డిచ్పల్లి మండలం గన్నారం, తిర్మన్‌పల్లి, రాంపూర్, మిట్టాపల్లి, కమలాపూర్, ఘన్పూర్, డిచ్పల్లి రైల్వే స్టేషన్, నడిపల్లి, ధర్మారం(బి), బర్ధిపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఇచ్చిన మాట ప్రకారమే సోనియా తెలంగాణ ఇచ్చారని అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు, ఈనెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారు.. రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారని ప్రతి గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో డీఎస్ ఆయా గ్రామస్తులను ప్రశ్నించారు. దీనికి డి.శ్రీనివాస్‌ను అని వారు సమాధానం ఇవ్వడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మీరందరూ చెబితే తప్పకుండా ఎన్నికల్లో నిలబడతానన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి కూరపాటి అరుణతో పాటు, ఎంపీటీసీ అభ్యర్థులు లంబాని లక్ష్మి, డాక్టర్ శివప్రసాద్, దెగావత్ లక్ష్మి, కూతురు సువర్ణ, ఒడ్డెం సవిత, పొలసాని లక్ష్మి, కడ్దూరం రవికిరణ్, సలీం, పాయల్, పార్టీ నాయకులు గజవాడ జైపాల్, కంచెట్టి గంగాధర్, అమృతాపూర్ గంగాధర్, సుజాత, చింతశ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, చిన్నయ్య, మురళి, గాండ్ల లక్ష్మీనారాయణ, ధర్మాగౌడ్, దేవాగౌడ్, అంబర్‌సింగ్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.