![Telangana: Congress Invite Applications For Huzurabad Candidate - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/2/Huzurabad-Congress-MLA-Tick.jpg.webp?itok=M9Nz9fdE)
దరఖాస్తులు స్వీకరిస్తున్ననాయకులు
కరీంనగర్ టౌన్: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరిగే ఉప ఎన్నిక కోసం పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా, బుధవారం రెండు అర్జీలు అందిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. హుజూరాబాద్ మండలం కనుకుంట్ల గ్రామానికి చెందిన జాలి కమలాకర్‌రెడ్డి, సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన ఒంటెల లింగారెడ్డి దరఖాస్తులను ఆఫీస్ ఇన్‌చార్జీలకు అందజేశారు. ఇంకా ఎవరైనా ఆసక్తి ఉండి దరఖాస్తు చేసుకోదలచుకుంటే రూ.5 వేల డీడీని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, హైదరాబాద్ పేరున తీసి, బయోడేటా, పాస్ పోర్టు సైజ్ ఫొటో జత చేసిన ఫారాలను జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈ నెల 5వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని సూచించారు. ఆశావహులు అందజేసిన దరఖాస్తు ఫారాలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అందజేస్తామని, వాటిని పరిశీలించి ఈనెల 10 తర్వాత అభ్యర్థి పేరు వెల్లడించడం జరుగుతుందని పేర్కొన్నారు.
చదవండి: గుండెనిండా ‘జగనన్న’ అభిమానం: కశ్మీర్ నుంచి యాత్ర
చదవండి: నువ్వంటే క్రష్.. ‘ఓయో’లో కలుద్దామా.. ఉద్యోగికి బాస్ వేధింపులు
Comments
Please login to add a commentAdd a comment