సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. కౌశిక్‌రెడ్డి కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, టీఆర్‌ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఫిర్యాదులు నేపథ్యంలో 24 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ క్రమశిక్షణ సంఘం నోటీస్‌లో పేర్కొంది. గతంలో కౌశిక్‌రెడ్డిని హెచ్చరించినా ఆయన తీరులో మార్పు రాలేదని క్రమశిక్షణ సంఘం తెలిపింది.
కాగా, హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి వాయిస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తనకే టీఆర్‌ఎస్ టికెట్ ఇస్తుందని ఫోన్ల ద్వారా కౌశిక్‌రెడ్డి స్థానిక నాయకుల వద్ద చెప్తున్నట్టు వైరలైన ఆడియో క్లిప్ ద్వారా తెలుస్తోంది. రానున్న ఉపఎన్నికల్లో తానే టీఆర్‌ఎస్ అభ్యర్థినంటూ కౌశిక్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. మాదన్నపేట్‌కు చెందిన యువకుడితో కౌశిక్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment