అందమైన అమ్మాయిలు రైతు బిడ్డను పెళ్లిచేసుకోవడం లేదు: ఎమ్మెల్యే కామెంట్స్‌ | MLA Devendra Mahadevrao Bhuyar Sensational Comments Creates Controversy, More Details Inside | Sakshi
Sakshi News home page

అందమైన అమ్మాయిలు రైతు బిడ్డను పెళ్లిచేసుకోవడం లేదు: ఎమ్మెల్యే కామెంట్స్‌

Published Wed, Oct 2 2024 8:17 PM | Last Updated on Thu, Oct 3 2024 10:49 AM

MLA Devendra Mahadevrao Bhuyar Sensational Comments

ముంబై: అందమైన అమ్మాయిలు ఎవరూ రైతు బిడ్డని పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడరు అంటూ మహారాష్ట్ర ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో, ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మహిళా నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్రకు చెందిన అజిల్‌ పవార్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యే దేవేంద్ర భుయార్‌ వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన తన నియోజకవర్గం వరుద్ తహసీల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైతుల సమస్యలపై మాట్లాడారు. ఈ క్రమంలో భుయార్‌ మాట్లాడుతూ.. ఉద్యోగం ఉన్న అబ్బాయిలనే అందమైన అమ్మాయిలు ఎంచుకుంటారు. ఒక అమ్మాయి అందంగా ఉంటే రైతుల కొడుకులను ఇష్టపడదు. కొందరు అమ్మాయిలు మాత్రమే వ్యవసాయ కుటుంబంలోని అబ్బాయిని వివాహం చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు అని కామెంట్స్‌ చేశారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే దేవేంద్ర వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకురాలు, మహారాష్ట్ర మాజీ మహిళా శిశు అభివృద్ధి మంత్రి యశోమతి ఠాకూర్ స్పందిస్తూ.. మహిళలను ఉద్దేశిస్తూ భుయార్ మాట్లాడిన భాష సరిగా లేదన్నారు. ఆయన ఉపయోగించిన పదజాలం మహిళలను కించపరిచేలా ఉంది అంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో తమ ఎమ్మెల్యేలను అదుపులో ఉంచుకోవాలని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్‌కు సూచించారు.

ఇది కూడా చదవండి: వరద నీటిలో పడిపోయిన ఆర్మీ హెలికాప్టర్‌.. ఆ తర్వాత ఏమైందంటే?

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement