
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌పవార్.. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ నివాసానికి వెళ్లారు. కేబినెట్ విస్తరణ జరగిన కొన్ని గంటల్లోనే ముంబైలోని శరద్ పవార్ అధికారిక నివాసమైన ‘సిల్వర్ ఓక్’ను సందర్శించడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఎన్సీపీపై తిరుగుబాటు ఎగురవేసి, తన వర్గం నేతలతో ప్రభుత్వంలో చేరిన అనంతరం అజిత్, ఎన్‌సీపీ అధినేత ఇంటికి వెళ్లడం ఇదే తొలిసారి.
అయితే అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్‌తో సమావేశమయ్యారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై అజిత్ పవార్ వర్గం నేతలు స్పందించారు. తన భేటీ వెనక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని తెలిపారు. కేవలం తన చిన్నమ్మ(శరద్ భార్య) ప్రతిభా పవార్ పరామర్శించడానే ఆ ఇంటికి వెళ్లారని వెల్లడించారు.
కాగా శరద్ పవార్ సతీమణి ప్రతిభకు క్రవారం దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేతికి సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది. అనంతరం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. చిన్నమ్మను చూసేందుకు అజిత్ శరద్ నివాసానికి వెళ్లారు. ఇదిలా ఉండగా అజిత్ పవార్ తన చిన్నమ్మ ప్రతిభతో మంచి సాన్నిహిత్యం ఉంది. 2019లో పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ స్వల్పకాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. అతన్ని తిరిగి ఎన్సీపీలోకి తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
చదవండి: ఒక్క పర్వతంపై 900 ఆలయాలు.. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా..
ఇక జూలైన 2న ఎన్సీపీని రెండు గా చీల్చిన అజిత్ పవార్ 30-35 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. అందులో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
అయితే రెండు వారాల తర్వాత వీరికి శుక్రవారం శాఖలు కేటాయింపు జరిగింది. అజిత్‌కు రెండు ప్రధాన ఆర్థిక, ప్రణాళిక శాఖ కేటాయించారు. ఆయన వర్గానికి చెందిన మరో ఎనిమింది మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. ఇప్పటి వరకు శిండే, ఫడ్నవీస్ వర్గానికి చెందిన 20 మంది మత్రులతోనే ప్రభుత్వాన్ని నెట్టొచ్చారు. ఇప్పుడు అజిత్ వర్గం కూడా చేరండంతో రాష్ట్ర కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 29కి చేరింది.
#WATCH | Mumbai: Maharashtra Deputy Chief Minister Ajit Pawar leaves from NCP chief Sharad Pawar's residence Silver Oak. pic.twitter.com/qt6mdCuX9M
— ANI (@ANI) July 14, 2023