నల్లగొండ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బిల్యానాయక్ కుమార్తె హారిక... హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది.
నల్లగొండ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బిల్యానాయక్ కుమార్తె హారిక... హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. బిల్యానాయక్‌కు బీఎన్‌రెడ్డి నగర్, సిరిపురం కాలనీలలో రెండు నివాసాలున్నాయి. నాయక్ ఎన్నికల ప్రచారం నిమిత్తం భార్యతో కలిసి దేవరకొండ వెళ్లారు. 8వ తరగతి చదువుతున్న కుమార్తె హారికను వార్షిక పరీక్షల నిమిత్తం బీఎన్‌రెడ్డి నగర్‌లోని తమ బంధువుల ఇంట్లో ఉంచారు.
పరీక్షలు పూర్తవడంతో కుమార్తెను తీసుకువెళ్లేందుకు తల్లి అనిత బుధవారం రాత్రి సిరిపురం కాలనీలోని తన ఇంటికొచ్చారు. బీఎన్‌రెడ్డి నగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి కుమార్తెను తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. అక్కడ తమ కుమార్తె జాడలేకపోవడంతో వెంటనే భర్తకు తెలిపారు. బిల్యానాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.