ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.15కోట్ల ఆఫర్‌ | BJP offered Rs 15 crore to 7 aap candidate, Sanjay Singh claims | Sakshi
Sakshi News home page

ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.15కోట్లు.. బీజేపీపై ఆప్‌ సంచలన ఆరోపణలు

Published Thu, Feb 6 2025 6:54 PM | Last Updated on Thu, Feb 6 2025 7:07 PM

BJP offered Rs 15 crore to 7 aap candidate, Sanjay Singh claims

ఢిల్లీ : మరికొన్ని గంటల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీ అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్‌ను నాశనం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగా తమ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రలోభాలకు గురి చేస్తోందన్నారు. అభ్యర్థులు ఎవరనేది చెప్పకుండా మా పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో ఆఫర్‌ చేసిందని చెప్పారు.

గురువారం ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడారు.‘బుధవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. పోలింగ్‌ ముగిసిన వెంటనే మా పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు బీజేపీ నుంచి ఫోన్‌ వచ్చింది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15కోట్లు ఇస్తాం.మా పార్టీలో చేరమని బీజేపీ ఆఫర్‌ చేసింది.

ఎన్నికల ఫలితాలు వెలువడకముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది. దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే ఢిల్లీలో సైతం ఇతర పార్టీలను నిర్విర్యం చేసేందుకు శ్రీకారం చుట్టుంది. ప్రలోభాలకు చేసేలా ఆడియో,వీడియో కాల్స్‌ వస్తే ఫిర్యాదు చేయాలని, నేరుగా కలిస్తే రహస్యంగా వీడియోలు తీయమని సదరు అభ్యర్ధులకు చెప్పాం’ అని అన్నారు.

 బీజేపీ ప్రలోభాలపై స్పందిస్తూ..ఎన్నికల ఫలితాలు (ఫిబ్రవరి 8న) వెలువడకముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది.దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే ఢిల్లీలో కూడా బీజేపీ పార్టీలను బద్దలు కొట్టే రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు.  

కాగా,బుధవారం (ఫిబ్రవరి 5) జరిగిన ఎన్నికలలో ఢిల్లీలో 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. అధిక సంఖ్యలో ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. దీంతో ఆప్‌లో కలవరం మొదలైందనే పొలిటికల్‌ సర్కిళ్ల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement