bilya nayak
-
బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేత బిల్యా నాయక్
సాక్షి, హైదరాబాద్: నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత బిల్యా నాయక్ బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో మంత్రి జగదీశ్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్.. బిల్యా నాయక్, ఆయన అనుచరులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా గమ్మత్తైన డైలాగులు, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని విమర్శించారు. గిరిజనులకు ఆత్మ గౌరవం ఇస్తోంది కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ చెప్పారు. విద్యుత్ రంగాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుకెళ్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌తోనే గిరిజనులకు న్యాయం జరుగుతుందని.. దశాబ్దాలు కోట్లాడిన బాగుపడని తాండాలు ఇప్పుడు సీఎం నాయకత్వంలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. నాడు నల్గొండలో వంకర తిరిగిన కాళ్లు కనిపించేవని.. కేసీఆర్ వచ్చాక మంచి నీళ్లు అందిస్తున్నారని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ది చెందుతుందన్నారు. గత 15 రోజుల నుంచి 32 నియోజకవర్గాలకు వరకు తిరిగానని కేటీఆర్ గుర్తు చేశారు. ఆదిలాబాద్ నుంచి వనపర్తి దాకా, సత్తుపల్లి నుంచి మెదక్ వరకు.. తెలంగాణలోని నాలుగు మూలాలను తిరిగాను. ప్రజల మూడ్ స్పష్టంగా కనబడుతోంది. ప్రజల నుంచి అసహనం వ్యక్తం కావడం లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబడకపోగా, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే పేదలు, రైతులు, బడుగు, బలహీన వర్గాలు బాగుపడతాయని ప్రజలు విశ్వసిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. చదవండి: ఈసీ ఆదేశం.. తెలంగాణలో పలువురు ఎస్పీలు, కలెక్టర్ల బదిలీ ఎన్నికలు రాగానే వస్తారు.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీ వాళ్లు వస్తారని పార్టీ కార్యాయానికి కొత్త రంగులు వేసుకుంటారని, కొత్త డ్రెస్సులు వేసుకుంటారని కేటీఆర్ విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి, మంత్రి తానంటే తాను అని పోటీ పడుతారు. ఇక మీడియాలో కూడా సర్వే వస్తది.. అంతా అయిపోయిందంటారు. గమ్మతైన డైలాగులు, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తారు. 2018లో అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్‌ను ఓడించే దాకా గడ్డమే తీయను అని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఉత్తమన్న గడ్డం ఉందో పీకిందో తెలియదు గానీ, ఇలాంటి డైలాగులు మస్తుగా విన్నాం. ఆ సన్నాసి మళ్లా పోటీ చేస్తుండు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా డైలాగులు కొట్టిండు. కొడంగల్‌లో నన్ను ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ సన్నాసి మళ్లా పోటీ చేస్తుండు.. అది వేరే విషయం కానీ.. ఇలా బేకర్ డైలాగులు కొడుతారు. ఐదారేండ్ల కింద ఓటుకు నోటు.. ఇప్పుడేమో సీటుకు నోటు.. అందుకే రేవంత్ రెడ్డిని ఇప్పుడు రేటంత రేటంత అని అంటున్నారు. వాళ్లతోటి ఏం కాదు’ అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి ‘భారత దేశంలో తెలంగాణ నంబర్1 లో నిలిపింది కేసీఆర్. నల్లగొండ జిల్లాకు 5లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కేవలం దేవరకొండకు ఇచ్చింది కేసీఆర్. ఏడాదిలో డిండి ప్రాజెక్ట్ పూర్తిచేసి దేవర కొండ సస్యశ్యామలం చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ కాదు, 11 ఛాన్సులు ఇచ్చాం. ఇన్నేళ్లు వాళ్ళ పాలన చూడలేదా?. అప్పుడెందుకు అభివృద్ది చేయలేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి మేము ఎవరికి బీ టీమ్ కాదు గిరిజన విశ్వ విద్యాలయానికి స్థలం ఏనాడో ఇచ్చాం. కానీ ఇప్పుడొచ్చి దాని గురించి మాట్లాడుతున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు తెలంగాణ దేశంలో నంబర్ 1 అంటూ అమిత్ షా అంటున్నారు. పార్లమెంట్ళో తెలంగాణ లో రైతు ఆత్మహత్యలు లేవని చెప్పింది మీ కేంద్రమే. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అంటోంది కాంగ్రెస్, కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ బీ టీమ్ అంటూ బీజేపీ చెప్తోంది. మేము ఎవరికి బీ టీమ్ కాదు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధులను కేంద్రం ఇవ్వలేదు. డాక్టర్ చదవాలంటే చాలా కష్టం ఉండేది. కానీ ఇప్పుడు కేసిఆర్ వచ్చాక నల్లగొండ కు కూడా మెడికల్ కాలేజీ ఇచ్చారు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
ఆసక్తికరంగా.. దేవరకొండ రాజకీయం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : దేవరకొండలో ఎన్నికల రాజకీయం ఆసక్తిగొల్పుతోంది. కాంగ్రెస్ తన అభ్యర్థిగా జెడ్పీ చైర్మన్ బాలునాయక్‌కు టికెట్ ప్రకటించిన వెంటనే ఆ పార్టీలో పరిణామాలు వేగంగా మారాయి. దాదాపు ఏడాది కిందట టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ కాంగ్రెస్ గూటికి చేరిన బిల్యానాయక్ అనివార్యంగా కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చింది. టీడీపీనుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే ముందు టికెట్ హామీతోనే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. రేవంత్‌రెడ్డి వెంట రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. తీరా చివరి నిమిషం దాకా ఉత్కంఠ రేపి ఆఖరికి తమ పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన, ప్రస్తుత జెడ్పీ చైర్మన్ బాలునాయక్ వైపే మొగ్గుచూపింది. వాస్తవానికి బాలునాయక్ కూడా చైర్మన్‌గా ఎన్నికై ఏడాది గడవక ముందే టీఆర్ఎస్ బాట పట్టారు. ఇన్నాళ్లూ ఆ పార్టీలో కొనసాగిన ఆయన దేవరకొండ టికెట్ ఆశించారు. కానీ, టీఆర్ఎస్ నాయకత్వం సీపీఐనుంచి తమ పార్టీలో ఎమ్మెల్యే హోదాలో చేరిన రవీంద్రకుమార్ కే టికెట్ ఇచ్చింది. దీంతో నారాజైన బాలు సెప్టెంబరు నెల మధ్యలో కాంగ్రెస్‌కు తిరిగి వచ్చారు. దీంతో కాంగ్రెస్‌లో జగన్‌లాల్‌నాయక్, బిల్యానాయక్, బాలూనాయక్ మధ్య టికెట్‌కు పోటీ ఏర్పడింది. నిన్నా మొన్నటి దాకా ఎవరికి టికెట్ వచ్చినా, అందరం కలిసి పనిచేస్తామని ప్రకటనలూ ఇచ్చారు. తీరా ఇప్పుడు బాలునాయక్‌కు టికెట్ రావడతో బిల్యా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. గత ఎన్నికల్లో రెండో స్థానం గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడినుంచి పోటీ చేయలేదు. కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ విజయం సాధిం చింది. అంతకు ముందు (2009) కాంగ్రెస్ నుంచి బాలూనాయక్ ఎమ్మెల్యేగా చేశారు. తమ సిట్టింగ్ సీటును త్యాగం చేసి మరీ కాంగ్రెస్ ఇక్కడ సీపీఐకి 2014 ఎన్నికల్లో మద్దతు ఇచ్చింది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రకుమార్ టీఆర్ఎస్ బాట పట్టడం, జెడ్పీ చైర్మన్‌గా కాంగ్రెస్‌నుంచే ఎ న్నికైన బాలునాయక్ గులాబీ గూటికే చేరడంతో , భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ నుంచి బిల్యానాయక్‌ను ఆహ్వానించింది. కానీ, ఎన్నికల్లో టికెట్ మాత్రం ఇవ్వలేకపోయింది. గత ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ పోటీ చేసినా, మూడో స్థానంలో నిలిచింది. సీపీఐ, టీడీపీల మధ్యే ప్రధా న పోరు నడిచింది. టీడీపీనుంచి బిల్యా నాయక్ పోటీ పడగా, తక్కువ మెజారిటీతోనే ఆయన ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో బిల్యాకు వచ్చిన ఓట్లను చూసే, కాంగ్రెస్ బిల్యాను పార్టీలో చేర్చుకుంది. కానీ, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు, జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పే నేతల మద్దతు, కాంగ్రెస్‌లో రాష్ట్ర స్థా యిలో నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు తదితర కారణాలతో బిల్యాకు మొండి చేయిచూపింది. దీంతో ఆయన శనివారం బీఎల్ఎఫ్ కండువా కప్పుకున్నారు. బీఎల్ఎఫ్ తరఫున ఆయన దే వరకొండలో పోటీచేయడం ఖాయమంటున్నారు. దీంతో ఇక్కడి రాజకీయం రంజుగా మారింది. దేవరకొండ అభ్యర్థి.. నేనావత్ బాలునాయక్ పేరు : నేనావత్ బాలునాయక్ తండ్రిపేరు : లస్కర్ పుట్టిన తేదీ : 03–07–1972 విద్యార్హతలు : బీ.ఏ(ఎల్ఎల్బీ) స్వగ్రామం : సూర్యతండా, ముదిగొండ, దేవరకొండ మండలము, నల్లగొండ రాజకీయ ప్రస్థానం, చేపట్టిన పదవులు : ఎన్ఎస్యూఐ దేవరకొండ ప్రెసిడెంట్, నల్లగొండ జిల్లా సెక్రటరీ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ(1999–2004), కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు(2004–05), వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, సీపీఐ అభ్యర్థి రవీంద్రకుమార్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా(2009) గెలుపొందారు. కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా సీపీఐకు టిక్కెట్ కేటాయించారు(2014). చందంపేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించిన ఆయనకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవీ లభించింది. -
మళ్లీ.. బిల్యానే
అనేక మలుపుల అనంతరం పాత కాపుకే టీడీపీ పగ్గాలు ఉమ వర్గానికి మోత్కుపల్లి చెక్..అధినేత వద్ద పలుకుబడి నిలబెట్టుకున్న నర్సింహులు ఒక దశలో స్వయంగా ఉమా మాధవరెడ్డి పేరును తెరపైకి తెచ్చిన నాయకులు మేడమ్ మౌనంతో బిల్యాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు బిల్యాకు కలిసివచ్చిన సామాజిక వర్గ కూర్పు.. 10 రోజుల్లో జిల్లా కమిటీ నియామకం సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పార్టీ అధినేత చంద్రబాబు వద్ద తనకున్న పలుకుబడిని మరోమారు నిరూపించుకున్నారు టీడీపీ జిల్లా సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు. పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక విషయంలో రెండు గ్రూపులుగా చీలిపోయి తమ వాదనలు వినిపించినా.. తాను చెప్పిన నాయకుడికే మళ్లీ పగ్గాలు ఇప్పించుకోగలిగారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం తన హవా తగ్గిపోయిందని, ఉమామాధవరెడ్డికి అనుకూలంగా నాయకగణం మారిపోయిందనే సంకేతాలను పటాపంచలు చేస్తూ తాను చెప్పిన విధంగా టీడీపీ జిల్లా అధ్యక్ష పదవిని ప్రస్తుత అధ్యక్షుడు బిల్యానాయక్కే మరోమారు దక్కేలా చేసుకున్నారు. దీంతో వారం రోజుల సస్పెన్షన్‌కు తెరపడింది. ఉమామాధవరెడ్డి వర్గానికి చెక్ పడి మోత్కుపల్లి చెప్పిన నాయకునికి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. వివాదరహితుడిగా పేరుండడంతో పాటు సామాజిక వర్గ కూర్పు కూడా అనుకూలంగా మారడంతో మరో రెండేళ్లు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బిల్యా కొనసాగనున్నారు. తీవ్ర పోటీ నడుమ.. జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం ఈసారి ఆ పార్టీ నేతల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ప్రస్తుత అధ్యక్షుడు బిల్యానాయక్‌తో పాటు నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జ్ కంచర్ల భూపాల్‌రెడ్డి, నెల్లూరి దుర్గాప్రసాద్ , పలువురు నేతలు జిల్లా పదవిని ఆశించారు. తమ వర్గానికి కావాలంటే తమ వర్గానికి కావాలని ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి వర్గీయులు పోటీలు పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో బిల్యాను మార్చి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఉమా వర్గం, బిల్యాను కొనసాగించాల్సిందేనని మోత్కుపల్లి వర్గం పట్టుబట్టాయి. తనకు పదవి ఇవ్వాల్సిందేనని కంచర్ల భూపాల్‌రెడ్డి భీష్మించుకు కూర్చున్నారు. ఈ దశలో పార్టీ పరిశీలకులుగా రాష్ట్రం నుంచి వచ్చిన నాయకులు కూడా చేసేదేమీ లేక, జిల్లా పార్టీ అభిప్రాయాలు పార్టీ అధినేత చంద్రబాబుకు చెపుతామని చెప్పి ఈనెల 16న జరిగిన పార్టీ జిల్లాస్థాయి సమావేశాన్ని ముగించాల్సి వచ్చింది. మోత్కుపల్లి, ఉమా వర్గీయులు విడివిడిగా పార్టీ పరిశీలకులను కలిసి తమ అభిప్రాయాలను వెలిబుచ్చిన నేపథ్యంలో నాయకుల ఫీడ్‌బ్యాక్‌ను తీసుకున్న పరిశీలకులు పార్టీ అధినేత కోర్టులోకి బంతిని నెట్టి వెళ్లిపోయారు. జిల్లా పార్టీ అధ్యక్షుడి నియామకం పూర్తి కావడంతో మహానాడు అనంతరం 10 రోజుల్లో పార్టీ జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తారని జిల్లా పార్టీ నేతలు భావిస్తున్నారు. మోత్కుపల్లి మొండిపట్టు.. బంతి చంద్రబాబు కోర్టులోకి వెళ్లిన తర్వాత సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు రంగంలోకి దిగారు. తాను చెప్పిన బిల్యాను కొనసాగించాల్సిందేనని ఆయన చంద్రబాబు వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించారు. అయితే, ఉమా మాధవరెడ్డి వర్గం కూడా తమ వంతు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. బిల్యాకు పోటీగా తెరపైకి వచ్చిన కంచర్ల భూపాల్‌రెడ్డి పేరును ఏకగ్రీవంగా చెప్పేందుకు ఉమా వర్గం ముందుకు రాకపోవడంతో అసలు ఆగ్రూపు నుంచి ఎవరి పేరు చెప్పాలన్న విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. కంచర్లకు పదవిని ఇచ్చే విషయంలో ఉమా మౌనంగానే ఉండిపోవడంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఇక ఆ శిబిరం నుంచి నెల్లూరి దుర్గాప్రసాద్, స్వామిగౌడ్లతోపాటు ఒక దశలో ఉమా మాధవరెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. మోత్కుపల్లికి చెక్ చెప్పాలంటే ఉమామాధవరెడ్డిని జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా నియమించాలనే చర్చ తీవ్రంగా తెరపైకి వచ్చింది. ఒకదశలో మోత్కుపల్లి కూడా ఆమె అభ్యర్థిత్వాన్ని అంగీకరించాల్సి వచ్చినా... మేడమ్మాత్రం వెనక్కు తగ్గడంతో సీన్ రివర్స్ అయింది. పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడంలో తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, అయితే ఇది సమయం కాదనే ఆలోచనతోనే ఆమె మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న బిల్యా నాయక్‌ను కూడా తానెప్పుడూ వ్యతిరేకించలేదని, అయితే మార్పు జరిగితే పార్టీకి లాభం జరుగుతుందనే ఆలోచనతోనే తాను ఉన్నానని ఆమె తనను కలిసిన పార్టీ నేతలతో కూడా వ్యాఖ్యానించారు. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు కూడా మోత్కుపల్లి ఒత్తిడికి తలొగ్గి బిల్యాకు పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్టు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వర్గాలు తెలిపాయి. ఇప్పుడేం చేద్దాం.. తాము ఎంత పోరాడినా పార్టీ అధినేత మోత్కుపల్లి మాటకే విలువిచ్చిన నేపథ్యంలో ఉమామాధవరెడ్డి వర్గ నేతలుగా గుర్తింపు పొందిన నాయకులంతా కింకర్తవ్యం ఏంటనే దానిపై పునరాలోచనలో పడ్డారు. మేడమ్ మౌనంతోపాటు మోత్కుపల్లి వర్గీయుల దూకుడును ఎలా తట్టుకోవాలనే దానిపై వారు మల్లగుల్లాలు పడుతున్నారు. త్వరలోనే ఉమామాధవరెడ్డి వర్గీయులు పేరు పడ్డ నాయకులంతా సమావేశమై పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై చర్చించనున్నట్టు సమాచారం. తామెంతా చెప్పినా మోత్కుపల్లి మాటకే చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఉమా వర్గం నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది త్వరలోనే తేలనుంది. మన స్తాపం చెందా: కంచర్ల జిల్లా పార్టీఅధ్యక్ష పదవిని ఆశించిన కంచర్ల భూపాల్‌రెడ్డి ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తనను పదవి దక్కకపోవడంపై మనస్తాపం చెందానని చెప్పారు. పార్టీ అభ్యున్నతి కోసం పనిచేద్దామన్న ఆలోచనతో తాను పదవిని అడిగానని, అయితే సామాజిక వర్గ కూర్పులో భాగంగా బిల్యాకు అవకాశం కల్పించారని ఆయన చెప్పారు. ఈ విషయమై త్వరలోనే పార్టీ అధినేత చంద్రబాబును కలిసి మాట్లాడనున్నట్టు ఆయన వెల్లడించారు. టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తా: బిల్యా నల్లగొండ రూరల్: వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బూత్‌స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసి అధికారంలోకి తీసుకోచ్చేందుకు కార్యకర్తలతో కలిసి సైనికుల్లా పనిచేస్తానని రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన బిల్యానాయక్ అన్నారు. తన ఎన్నికకు సహకరించిన పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, మోత్కుపల్లి నర్సింహులు, ఉమా మాధవరెడ్డి, పార్టీ నాయకులందరికి ఆయన ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కొందరు నాయకులు పార్టీలు మారినా కార్యకర్తలు మారలేదని, బలహీనవర్గాలన్ని టీడీపీకే మద్దతుగా ఉన్నాయన్నారు. -
టీడీపీ నిరసన, రాస్తారోకో
నల్లగొండ రూరల్ : తమ పార్టీ కార్యాలయానికి నిప్పుపెట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు టీడీపీ కార్యాలయానికి నిప్పుపెట్టడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం క్లాక్‌టవర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకులు ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిరసన తెలియజేసుకునే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడలేదన్నారు. పార్టీలకతీతంగా కలిసి వచ్చి టీఆర్ఎస్ నాయకులు చేసిన దాడిని ఖండించాలని విజ్ఞఫ్తి చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకు ముందు పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, బొల్లం మల్లయ్యయాదవ్, నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ రజనికుమారీ ఎల్వి. యాదవ్ పిల్లి రామరాజులు పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకుల దాడులను నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాస్తారోకో చేస్తున్న టీడీపీ నాయకులను పోలీసులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బంద్‌ను జయప్రదం చేయాలి టీడీపీ కార్యాలయంపై టీఆర్ఎస్ నాయకులు చేసిన దాడికి నిరసనగా బుధవారం నిర్వహిస్తున్న జిల్లాబంద్‌ను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్ కోరారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దీపావళి పండగ సందర్భంగా బంద్‌లో ఆర్టీసీ బస్సులకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. కేసీఆర్ కావాలనే టీఆర్ఎస్ నాయకులతో తమ పార్టీ కార్యాలయాలపైన దాడులు చేయిస్తున్నారని, జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి దాడులకు ఊసిగొల్పారని ఆరోపించారు. తాము తలుచుకుంటే టీఆర్ఎస్ జెండాలుండవని హెచ్చరించారు. టీఆర్ఎస్ నాయకులు పార్టీ కార్యాలయంలో ఉన్న మాధవరెడ్డి విగ్రహాన్ని కూడా తగులబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. -
మూడ్రోజుల క్రితం అదృశ్యమైన హారిక క్షేమం
-
ఎమ్మెల్యే అభ్యర్థి కుమార్తె అదృశ్యం
నల్లగొండ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బిల్యానాయక్ కుమార్తె హారిక... హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. బిల్యానాయక్‌కు బీఎన్‌రెడ్డి నగర్, సిరిపురం కాలనీలలో రెండు నివాసాలున్నాయి. నాయక్ ఎన్నికల ప్రచారం నిమిత్తం భార్యతో కలిసి దేవరకొండ వెళ్లారు. 8వ తరగతి చదువుతున్న కుమార్తె హారికను వార్షిక పరీక్షల నిమిత్తం బీఎన్‌రెడ్డి నగర్‌లోని తమ బంధువుల ఇంట్లో ఉంచారు. పరీక్షలు పూర్తవడంతో కుమార్తెను తీసుకువెళ్లేందుకు తల్లి అనిత బుధవారం రాత్రి సిరిపురం కాలనీలోని తన ఇంటికొచ్చారు. బీఎన్‌రెడ్డి నగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి కుమార్తెను తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. అక్కడ తమ కుమార్తె జాడలేకపోవడంతో వెంటనే భర్తకు తెలిపారు. బిల్యానాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీ అభ్యర్ధికుమార్తె అదృశ్యం