
సాక్షి, న్యూఢిల్లీ: ఒకే ఒక్క అభ్యర్థి పేరుతో బీజేపీ శుక్రవారం రెండో జాబితా విడుదల చేసింది. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు ఏపీ మిథున్ రెడ్డి పేరును ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మిథున్‌రెడ్డితో కలిపి ఇప్పటివరకు 53 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. కాగా నవంబర్ 1 న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో భేటీ కానున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ, మిగతా స్థానాలకు అభ్యర్థులను ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment