mahababunagar
-
మహబూబ్ నగర్ లో మరోసారి భూప్రకంపనలు
-
మహబూబ్ నగర్ పరిధిలో హైడ్రా తరహా కూల్చివేతలు?
-
గుర్రంగడ్డ.. కష్టాల అడ్డా!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: చుట్టూ కృష్ణా నది.. మధ్యలో ఊరు.. విద్య, వైద్యం, నిత్యావసరాలు ఏది కావాలన్నా, ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా పడవలో నది దాటాల్సిందే.నది ఉప్పొంగే సమయంలో అయితే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే.. తెలంగాణలోనే ఏకైక ద్వీపంగా పేరు పొందిన గుర్రంగడ్డ వాసుల పరిస్థితి ఇది. పాలకులు మారుతున్నా తమ బాధలు తీరడం లేదని.. వంతెన నిర్మాణం చేపట్టినా ఏళ్లకేళ్లుగా సాగుతూనే ఉందని గ్రామస్తులు వాపోతున్నారు.సాహసం చేయాల్సిందే..జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో కృష్ణానది మధ్యలో గుర్రంగడ్డ ఉంది. గద్వాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవి వైశాల్యం సుమారు 2,400 ఎకరాలు. ఇక్కడ సుమారు 200 కుటుంబాలు నివసిస్తుండగా, జనాభా వెయ్యికి పైనే ఉంటుంది. గ్రామస్తులు ఇక్కడి 1,500 ఎకరాల్లో వేరుశనగ, వరి వంటి పంటలు సాగు చేస్తున్నారు.ఇక్కడ ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఆపై చదువుకోవాలన్నా, ఏదైనా అనారోగ్యానికి గురైనా, నిత్యావసరాలు కావాలన్నా, చివరికి రేషన్ సరుకుల కోసం కూడా.. నది దాటి వెళ్లాల్సిందే. ఏటా వానాకాలం మొదలై నదిలో ప్రవాహం పెరిగాక కష్టాలు మరింతగా పెరుగుతాయి. దీనితో ఇక్కడి పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ఇక ప్రతిదానికీ నది దాటాల్సి రావడంతో ఈ ఊరు పిల్లలను పెళ్లి చేసుకునేందుకు గానీ, ఊరి వారికి పిల్లను ఇచ్చేందుకు గానీ వెనుకాడే పరిస్థితి ఉందని.. ప్రస్తుతం 40 మందికిపైగా పెళ్లికాకుండా ఉన్నారని స్థానికులు అంటున్నారు.6 ఏళ్లుగా పిల్లర్ల దశలోనే వంతెనగుర్రంగడ్డకు సుమారు ఆరేళ్ల కింద వంతెన మంజూరైంది. అప్పటి నుంచి నిర్మాణం సాగుతూనే ఉంది. ఏటా వానాకాలం ముందు పనులు ప్రారంభించడం, వరద పెరగగానే నిలిపివేయడం కాంట్రాక్టర్‌కు పరిపాటిగా మారిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. పనుల్లో జాప్యంపై కాంట్రాక్టర్‌కు ఐదుసార్లు నోటీసులిచ్చామని, వచ్చే ఏడాది వానాకాలంలోపు వంతెన నిర్మాణం పూర్తిచేస్తామని ఇరిగేషన్ ఈఈ జుబేర్ అహ్మద్ తెలిపారు.ఈ ఫొటోలోని మహిళ పేరు పద్మమ్మ. గుర్రంగడ్డకు చెందిన ఆమెకు అయిజ మండలం ఉప్పలకు చెందిన వెంకటేశ్‌తో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. పుట్టింటికి రావాలంటే నది దాటాలి. దాంతో ఎప్పుడు వచి్చనా భర్తతో కలిసి వస్తుంది. నదికి వరద పోటెత్తితే.. బోట్లు నడవక కొన్నిరోజులు గ్రామంలోనే ఉండిపోవాల్సి వస్తుందని.. అందుకే ఎప్పుడో ఓసారి మాత్రమే వస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తోంది.ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని దాటుతున్నాం గ్రామంలో ఆస్పత్రి లేదు. ఏ చిన్న చికిత్స కోసమైనా గద్వాలకు వెళ్లాలి. గర్భిణిగా ఉన్నప్పుడు, డెలివరీ అయ్యాక చెకప్ కోసం చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బోట్లో నది దాటాల్సి వచి్చంది. వరద వచి్చనప్పుడు ఏ సమస్య వచ్చినా కష్టమే. – సంధ్య, గ్రామ మహిళ -
ముగిసిన మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
Live Updates.. ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. జోగులాంబ గద్వాల.. ►జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్ఎస్ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు. ►నాగర్ కర్నూల్ జడ్పీ గ్రౌండ్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ కూచకుల దామోదర్ రెడ్డి. జోగులాంబ గద్వాల.. ►స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకోనున్న 225 మంది ప్రజా ప్రతినిధులు. వనపర్తి జిల్లా.. ►వనపర్తి జిల్లా కేంద్రంలోని RDO కార్యాలయంలో ప్రారంభమైన పోలింగ్. ►వనపర్తి జిల్లాలో మొత్తం ఓటర్స్ :218 ►నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట బాలికల ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ►ఓటు హక్కును వినియోగించుకోనున్న 101 ఓటర్లు. వికారాబాద్ జిల్లా ►కొడంగల్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ►కొడంగల్ నియోజకవర్గం మొత్తం 56 ఓటర్ల తమ ఓటును హక్కును వినియోగించనున్నారు. ►మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ►ఎమ్మెల్సీ ఉపఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం పోలింగ్ జరగనుండగా.. స్థానిక సంస్థల పరిధిలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, పురపాలక కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరితోపాటు ఎక్స్ అఫీషియో హోదాలో ఉమ్మడి జిల్లా పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతోపాటు ముగ్గురు ఎమ్మెల్సీలు మొత్తం 1,439 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ అఫీషియోగా కొడంగల్‌లో ఓటు వేయనున్నారు. ►ఉపఎన్నికకు మహబూబ్‌నగర్, కొడంగల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్‌నగర్ నియోజకవర్గ కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ►ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. బ్యాలెట్ ద్వారా ప్రజాప్రతినిధులు ఓట్లు వేయనున్నారు. ►బుధవారం ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచి అన్ని పోలింగ్ సెంటర్లకు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. వచ్చే నెల రెండో తేదీన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నేరుగా పోలింగ్ కేంద్రాలకే.. ►పార్లమెంట్ ఎన్నికలకు ముందు వచ్చిన ఉప ఎన్నిక కాగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టా త్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్ నుంచి యువ పారిశ్రామిక వేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి జెడ్పీ మాజీ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి పోటీ పడుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుని పట్టు సాధించాలని బీఆర్ఎస్.. ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ ఎత్తుకు పైఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. ఓటర్లు చేజారొద్దనే ఉద్దేశంతో ఓటర్లను ఆయా పార్టీలు గోవా, ఊటీ, కొడైకెనాల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంప్‌లకు తరలించారు. ►గురువారం పోలింగ్ జరగనుండగా.. బుధవారం తెల్లవారుజామునే క్యాంపుల నుంచి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. రాత్రికి వారిని హైదరాబాద్‌లోని రిసార్ట్స్‌కు తరలించి.. గురువారం ఉదయం నేరుగా ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ సెంటర్లకు తీసుకురానున్నారు. సంఖ్య ప్రకారం బీఆర్ఎస్ కు మెజారిటీ ఉన్నా, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణా మాల క్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరారు. గెలుపుపై ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
‘ఒకే ఒక్కడు’తో బీజేపీ రెండో జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: ఒకే ఒక్క అభ్యర్థి పేరుతో బీజేపీ శుక్రవారం రెండో జాబితా విడుదల చేసింది. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు ఏపీ మిథున్ రెడ్డి పేరును ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మిథున్‌రెడ్డితో కలిపి ఇప్పటివరకు 53 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. కాగా నవంబర్ 1 న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో భేటీ కానున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ, మిగతా స్థానాలకు అభ్యర్థులను ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు సమాచారం. -
'మిస్ ఎర్త్ ఇండియా'గా ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కూతురు
రాజస్థాన్‌కు చెందిన ప్రియన్ సైన్ (20)... మిస్ ఎర్త్ ఇండియా 2023గా ఎంపికైంది. దీని ద్వారా డిసెంబర్లో వియత్నాంలో జరగనున్న అంతర్జాతీయ అందాల పోటీల్లో మిస్ ఎర్త్‌గా భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. 'డివైన్ బ్యూటీ' పేరుతో జరిగే ఈ ఈవెంట్లో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా, మిస్ ఎర్త్ ఇండియా అవార్డులను అందజేస్తారు. మిస్ రాజస్థాన్ 2022 అందాల పోటీలో ప్రియన్ సైన్ మొదటి రన్నరప్‌గా నిలిచి గుర్తింపు పొందింది. తాజాగ ఈ ఈవెంట్ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మిస్ ఎర్త్ ఇండియా ఈవెంట్ జరిగింది. దీనిని దీపక్ అగర్వాల్ డివైన్ బ్యూటీ వారు ఈ పోటీని నిర్వహించారు. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు నోటీసులు) 16 మంది ఫైనలిస్టులలో ప్రియన్ సైన్ ఒకరు. అనేక పోటీల్లో గెలుపొందిన ఆమె ఇప్పుడు మిస్ ఎర్త్ ఇండియా 2023గా అవతరించింది. విజేతగా ప్రకటించిన వెంటనే ప్రియన్ సైన్ భావోద్వేగానికి గురయ్యారు. మిస్ రాజస్థాన్ 2022లో ప్రియన్ మొదటి రన్నరప్‌గా నిలిచిందని మిస్ రాజస్థాన్ నిర్వాహకులు, ప్రియన్ సైన్ మెంటార్ యోగేష్ మిశ్రా, నిమిషా మిశ్రా తెలిపారు. మెడిసిన్ చదువుతూనే ప్రియన్ సైన్ మిస్ ఇండియాకు కూడా సిద్ధమవుతోంది. (ఇదీ చదవండి: ధృవ సినిమాకు సీక్వెల్ రెడీ.. టీజర్ విడుదల కానీ..) ప్రియన్ తల్లి రాజస్థాన్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ప్రియన్‌కు తల్లి మాత్రమే ఉంది, ఆమెను కొడుకులా పెంచింది. దీని గురించి ప్రియన్ సైన్ మాట్లాడుతూ.. ఈ అవార్డును గెలుచుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని ఆమె తెలిపింది. మిస్ ఇండియా, మిస్ వరల్డ్ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధపడుతున్నట్లు తెలిపింది. 2019 మిస్ ఎర్త్ ఇండియాగా తెలంగాణకు చెందిన మహబూబ్ నగర్ బిడ్డ డాక్టర్ తేజస్వి మనోజ్ఞ గుర్తింపు పొందారు. View this post on Instagram A post shared by 𝐌𝐢𝐬𝐬 𝐃𝐢𝐯𝐢𝐧𝐞 𝐁𝐞𝐚𝐮𝐭𝐲 (@divinegroupindia) -
ఉరితాడై.. ఉసురు తీసిన 'ఊయల' !
మహబూబ్‌నగర్: ఇంటివద్ద చీరతో కట్టిన ఊయలలో ఆడుకుంటున్న ఓ బాలిక ప్రమాదవశాత్తు ఉరిపడి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. సిద్దాపూర్ హెడ్‌కానిస్టేబుల్ రెడ్యానాయక్ కథనం ప్రకారం.. బొమ్మన్‌పల్లికి చెందిన పరశురాములు చిన్న కూతురు శ్రావణి(10) ఇంటి ఆరుబయట చీరతో కట్టిన ఊయలలో శుక్రవారం ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బాలిక మెడకు ఉరి పడింది. వెంటనే కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వచ్చి ఊయల నుంచి తీశారు. అపస్మారక స్థితికి వెళ్లిన బాలికను వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం నాగర్‌కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడి నుంచి హైదరాబాద్ రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ బాలిక శనివారం మృతి చెందింది. కుటుంబ సభ్యుడు భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. -
నకిలీ బాబా గుట్టురట్టు..దేహశుద్ధి చేసిన మహిళా సంఘాలు
సాక్షి, మహబూబాబాద్: మహిళలను వేధింపులకు గురి చేస్తున్న నకిలీ బాబా గుట్టురట్టయ్యింది. మహిళా సంఘాలు అతడికి దేహశుద్ధి చేసి మరీ పోలీసులకు అప్పగించారు. రెండు నెలలగా ఓ మహిళను నగ్న వీడియోలు ఉన్నాయంటూ బెదిరింపులకు గురిచేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో ఓ నకిలీ బాబా మహిళలను తన మాయమాటలతో లోబర్చుకుని వారిని వేధిపులకు గురి చేయడం వంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. అతను మహిళలను క్షద్ర పూజల పేరుతో లోబర్చుకుని నగ్న వీడియోలు తీసి డబ్బులు డిమాండ్ చేయడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యంతో హైదరాబాద్‌కు చెందిన మహిళ ఈ నకిలీ బాబాను ఆశ్రయించగా.. ఇదే అదునుగా తీసుకుని ఆమెను వేధిపులుకు గురి చేయడం ప్రారంభించాడు. గత రెండు నెలలుగా ఆ మహిళను నగ్న వీడియోలు ఉన్నాయని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. ఇక అతడి వికృత చేష్టలకు తాళలేక ఆ మహిళ సంఘాలను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన మహిళా సంఘాలు రెక్కీ నిర్వహించి మరీ ఆ దొంగ బాబాను పట్టుకుని అతడికి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత అతనని పోలీసులకు అప్పగించారు. (చదవండి: అప్సర కేసు: అర్థరాత్రి జడ్జి ముందుకు.. పూర్తికాని అటాప్సీ! సాయికృష్ణ అమాయకుడా?) -
మున్నూరు రవిపై దాడి చేసిన దుండగులు
-
వింతగా ప్రవర్తిస్తున్న కల్తీ కల్లు బాధితులు
-
ఏడేళ్ల క్రితం తెలంగాణ కు.. ఇప్పటికీ ఎంతో మార్పు ఉంది : సీఎం కేసీఆర్
-
మహబూబ్ నగర్ లో సీఎం కేసీఆర్ పర్యటన
-
రాహుల్ భారత్ జోడో యాత్ర: ట్రాఫిక్ ఆంక్షలు ఇలా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం ఉదయం కర్ణాటక నుంచి తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు ప్రవేశించనున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అటు హైదరాబాద్ నుంచి మక్తల్ మీదుగా రాయచూర్‌కు.. ఇటు దేవరకద్ర, మరికల్ నుంచి మక్తల్ గుండా రాయచూర్‌కు వెళ్లే వాహనాలను దారి మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. డైవర్షన్ ఇలా.. హైదరాబాద్ నుంచి మక్తల్ మీదుగా రాయచూర్‌కు వెళ్లే వాహనాలను గద్వాల్ మీదుగా డైవర్షన్ చేయనున్నారు. జడ్చర్ల, భూత్పూర్, మహబూబ్‌నగర్ వన్ టౌన్ వద్ద ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. దేవరకద్ర, మరికల్ నుంచి మక్తల్, రాయచూర్‌కి వెళ్లే వాహనాలను, అమరచింత, జూరాల, ధరూర్, కేటిదొడ్డి మీదుగా దారి మళ్లించనున్నారు. -
Telangana: కూచుకుళ్ళ, నాగం ఏకమైతే మర్రికి ఇబ్బందే!
నాగర్ కర్నూల్ వచ్చే ఎన్నికల్లో కీలకం కాబోతోంది. ఇక్కడి ఎమ్మెల్యే మర్రి జనార్థనరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ మరోసారి పోటీ చేస్తారని వినిపిస్తోంది. అచ్చంపేట నియోజకవర్గంలో పోడు భూముల సమస్య అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం వచ్చే ఎన్నికల్లో అత్యంత కీలకం కాబోతోంది. ఉమ్మడి జిల్లాలో సీనియర్ నాయకుల్లో ఒకరైన నాగం జనార్థనరెడ్డికి నియోజకవర్గంలో గట్టి పట్టుంది. తెలుగుదేశం అంతర్థానం తర్వాత బీజేపీలో చేరారు. అక్కడ గుర్తింపు దక్కకపోవడంతో ప్రస్తుతం హస్తం పార్టీలో కాలం వెళ్ళదీస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో మర్రి జనార్థనరెడ్డి కారు గుర్తు మీద ఇక్కడి నుంచి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో కూడా మర్రి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు జిల్లా పర్యటకు వచ్చినపుడు బహిరంగంగానే మర్రి పోటీ గురించి ప్రకటించారు. మరోవైపు అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న కూచుకుళ్ళ దామోదరరెడ్డితో మర్రి జనార్థనరెడ్డికి అసలు పడదనే ప్రచారం జిల్లాలో కొనసాగుతోంది. నియోజకవర్గంలో తన కేడర్‌పై కేసులు పెట్టించి వేధిస్తున్నారంటూ.. ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదరరెడ్డి ఎమ్మెల్యే మర్రి జనార్థనరెడ్డిపై మీడియా ముందే తీవ్ర ఆరోపణలు చేశారు. కూచుకుళ్ళ రెండోసారి కూడా ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఎమ్మెల్సీ కుమారుడు డాక్టర్ రాజేశ్‌రెడ్డి ఈసారి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నారు. నాగం జనార్థనరెడ్డి వయస్సు మీదపడటం, కాంగ్రెస్ కేడర్‌లో చాలామంది టీఆర్ఎస్ గూటికి చేరడంతో ఆయనకు సమస్యగా మారింది. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్‌రెడ్డి టీఆర్ఎస్లో సీటు రాకపోతే కాంగ్రెస్‌లో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే నాగం, కూచుకుళ్ళ మధ్య సయోధ్య కుదిరితే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాగంకు సముచిత స్థానం ఇస్తామని పెద్దల నుంచి హామీ వస్తే నియోజకవర్గంలో పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారవచ్చు. కూచుకుళ్ళ, నాగం ఏకమైతే మర్రికి ఇబ్బందికర పరిస్తితులు ఎదురవుతాయని చెబుతున్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో బీజేపీ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. అచ్చంపేట నియోజకవర్గం ఎస్సీ సీటుగా కొనసాగుతోంది. ఇక్కడి నుంచి రెండుసార్లు విజయం సాధించిన గువ్వల బాలరాజ్ మూడోసారి కూడా పోటీ చేస్తారని తెలుస్తోంది. బాలరాజ్ వ్యవహారశైలి కారణంగా కేడర్‌లో, ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేస్తున్నదేమీ లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన ఆమ్రాబాద్‌లో మంచినీటి సమస్య, పోడు భూముల సమస్య ఏమాత్రం పరిష్కారం కాకపోవడంతో గిరిజనులు కూడా ఎమ్మెల్యే పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ప్రశాంత్ కిషోర్ నిర్వహించిన సర్వేలో కూడా బాలరాజ్‌కు నెగిటివ్ నివేదికే వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున మరోసారి పోటీ చేయాలనుకుంటున్న డాక్టర్ వంశీకృష్ణ నియోజకవర్గంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ భూ కబ్జాలు, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. గతంలో కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన కేడర్ తిరిగి వస్తుండటంతో తమ విజయం తథ్యమని హస్తం పార్టీ భావిస్తోంది. డాక్టర్ వంశీకృష్ణ భార్య ఆమ్రాబాద్ జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ అనూరాధను రంగంలోకి దింపితే గెలుపు మరింత సులభమవుతుందని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. ఈసారి బీజేపీ కూడా అచ్చంపేటలో గెలుపే ధ్యేయంగా పనిచేస్తోంది. ఇటీవల కర్నాటక డీజీపీగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన ఐపీఎస్ అధికారి రవీంద్రనాథ్‌తో బీజేపీ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో మంచి పేరున్న మాజీ మంత్రి మహేంద్రనాథ్ కుమారుడైన రవీంద్రనాథ్ అయితే మాదిగ సామాజిక వర్గం ఓట్లన్నీ కమలం గుర్తుకే పడతాయని ఆ పార్టీ భావిస్తోంది. కల్వకుర్తిలో అధికార పార్టీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య అంతర్గత పోరు సాగుతోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా వీరిద్దరి మధ్య రెండు వర్గాలుగా చీలిపోయారు. గత ఎన్నికల్లో జైపాల్‌కు కసిరెడ్డి సహకరించకపోయినా విజయం సాధించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్యా గ్యాప్ కొనసాగుతోంది. ఇద్దరి మధ్యా సయోధ్యకు పార్టీ నాయకత్వం కూడా ప్రయత్నించలేదు. వంశీచందర్‌రెడ్డి 2014లో కాంగ్రెస్ తరపున స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించి..ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. తర్వాతి ఎన్నికల్లో ఓటమి చెందారు. రెండున్నరేళ్ళుగా వంశీచందర్ పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడంలేదని చెబుతున్నారు. మరోవైపు తలకొండపల్లి జడ్పీటీసీ సభ్యుడు ఉప్పల వెంకటేశ్ కాంగ్రెస్‌లోకి చేరేందుకు చర్చలు జరిగినట్లు సమాచారం. కాని సీటు గ్యారెంటీ లేదని చెప్పినట్లు తెలిసింది. బీజేపీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉండటంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో పనిచేస్తోంది. గత రెండుసార్లు స్వల్ప తేడాతో ఓడిన తల్లోజు ఆచారినే ఈసారి కూడా బరిలోకి దింపాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లుగా తెలిసింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్థన్‌రెడ్డి మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్థన్‌రెడ్డి చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి ఓటమి చెందారు. తర్వాత హర్షవర్థన్ కారు పార్టీలోకి జంప్ చేశారు. ఇక అప్పటినుంచీ ఇద్దరి మధ్యా వార్ నడుస్తోంది. ఇద్దరి వర్గీయులు ఎవరికి వారు ఈసారి సీటు తమదే అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే జూపల్లి పార్టీ మారతాడంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ మారితే పాతగూడు కాంగ్రెస్‌లో చేరతారా? లేక కాషాయ జెండా పట్టుకుంటారా అనే చర్చ జరుగుతోంది. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు జగదీశ్వరరావు ఆసక్తి చూపిస్తున్నారు. హర్షవర్థన్‌రెడ్డి పార్టీ వీడాక కాంగ్రెస్‌లో బలమైన నాయకత్వం కరువైంది. -
పాలమూరు పట్టణం మీద బీజేపీ ప్రత్యేక ఫోకస్
ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉన్న మహబూబ్‌నగర్ నియోజకవర్గం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత గులాబీ కోటగా మారింది. రెండు ఎన్నికల్లోనూ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘాధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాస్‌గౌడ్ విజయం సాధించారు. రెండోసారి గెలిచిన తర్వాత ఆయన్ను మంత్రి పదవి వరించింది. మూడోసారి కూడా శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్ నగర్ నుంచే పోటీ చేయనున్నారు. మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఆయన హ్యాట్రిక్‌పై ధీమాగా ఉన్నారు. ఇతర పార్టీల్లో శ్రీనివాస గౌడ్‌ను తట్టుకుని నిలిచే నాయకులు కనిపించకపోవడం కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు. పాలమూరు పట్టణం మీద బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా కాషాయ జెండా ఎగరేయాలని కంకణం కట్టుకున్నారు పార్టీ నేతలు. డీకే అరుణను ఇక్కడి నుంచి బరిలోకి దింపుతారని తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన డీకే అరుణకు...అసెంబ్లీలో శ్రీనివాస గౌడ్‌కు పడిన ఓట్లు కంటే ఎక్కువ పోలయ్యాయి. అయితే పార్టీలో పాత నాయకులు కొత్తవారిని ఎదగనీయడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పార్టీ కోశాధికారి శాంతకుమార్‌తో పాటు మరో ఇద్దరు నేతలు కూడా పోటీ చేయడానికి రెడీ అంటున్నారు. పాలమూరులో కాంగ్రెస్ పరిస్థితి మాత్రం అధ్వాన్నంగా తయారైంది. తమకే సీటు కావాలనే నాయకులున్నారు గాని..పార్టీని బలోపేతం చేద్దామనుకునేవారు కరువయ్యారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్నప్పటికీ వారిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నమేదీ లేదు. జడ్చర్ల సెగ్మెంట్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో సీటు ఆశించేవారి సంఖ్య పెరుగుతుండటం ఆసక్తి రేపుతోంది. గత రెండు ఎన్నికల్లో డాక్టర్ లక్ష్మారెడ్డి విజయం సాధించి, ఒకసారి మంత్రి పదవి నిర్వహించారు. మూడోసారి కూడా ఆయనే అధికార పార్టీ అభ్యర్థిగా ఉంటారనే ప్రచారం సాగుతోంది. అయితే పలు సమీకరణాల నేపథ్యంలో ఈసారి లక్ష్మారెడ్డికి అవకాశం రాదని కూడా అంటున్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి అన్న కుమారుడైన మన్నె జీవన్‌రెడ్డి మహబూబ్‌నగర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో మూడు ముక్కలాట నడుస్తోంది. ఇన్చార్జ్గా ఉన్న అనిరుద్‌రెడ్డి తనకే టిక్కెట్ ఖాయమని భావిస్తున్నారు. అయితే చంద్రశేఖర్ అలియాస్ ఎర్రశేఖర్ పార్టీలో చేరడంతో ముసలం మొదలైంది. తన సన్నిహితుడు అనిరుద్‌కు అడ్డుగా ఉంటాడని భావించి...ఎర్రశేఖర్ రాకను అడ్డుకునేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. బీజేపీ మాత్రం బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. సీటు రాని కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు తమ గుమ్మంలోకి రాకపోతారా అని ఎదురు చూస్తోంది. దేవరకద్ర నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ తీవ్రంగా జరిగేట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ తరపున రెండుసార్లుగా విజయం సాధించిన వెంకటేశ్వరరెడ్డి మూడోసారి పోటీకి సై అంటున్నారు. తన సెగ్మెంట్‌కు కేటాయించిన ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయించి, లబ్దిదారులకు అందచేశారు. ప్రభుత్వం మీదున్న వ్యతిరేకత ఈసారి ఆయనకు మైనస్ అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి గత రెండు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన డోకూర్ పవన్‌కుమార్ ప్రస్తుతం కాషాయ పార్టీలో ఉన్నారు. న్యాయవాది మధుసూదనరెడ్డి, ప్రదీప్‌గౌడ్‌లు ఎవరికి వారు ఈసారి కాంగ్రెస్ సీటు తమకే అని భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ నేత కొత్తకోట దయాకరరెడ్డి కూడా సీటు ఆశిస్తున్నారు. ఈ ముగ్గురి మధ్య సయోధ్య కోసం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎగ్గని నరసింహులు, సుదర్శన్ రెడ్డి, బాలకృష్ణలు బీజేపీ సీటును ఆశిస్తున్నారు. దంతో పవన్‌కుమార్‌కు కొంత ఇబ్బందిగా మారే పరిస్థితులున్నాయంటున్నారు. -
ఎవడు దద్దమ్మ.. మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
-
వైజాగ్ సృజన ఉదంతం మరవకముందే మహబూబ్‌నగర్‌లో లక్ష్మి!
సాక్షి, మహబూబ్‌నగర్: వైజాగ్ మదురవాడ నవవధువు సృజన ఘటన మరువకముందే మరో విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని మనస్తాపంతో ఓ నవ వధువు వివాహం జరిగిన కాసేపటికే ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పాతతోట ప్రాంతానికి చెందిన లక్ష్మికి అనంతపూర్ జిల్లాకు చెందిన మల్లికార్జున్‌తో గురువారం వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా ఎంతో హుషారుగా కనిపించిన నవవధువు లక్ష్మి.. ఒక్కసారిగా పెళ్లింట విషాదాన్ని నింపింది. వివాహమైన కాసేపటికే నవ వధువు.. బాత్రూమ్లోకి వెళ్లి పేను విరుగుడుకు వేసే మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమె ఎంతకీ బాత్ రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో లక్ష్మి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఆమె స్పృహలేకుండా కిందపడిపోయి కనిపించింది. వెంటనే ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించగా.. లక్ష్మి అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, లక్ష్మి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: నిజామాబాద్‌లో వైద్యురాలు అనుమానాస్పద మృతి -
ఏపీ, తెలంగాణ మధ్య తీగల వంతెన.. పిల్లర్లు లేకుండానే..
అచ్చంపేట (నాగర్‌కర్నూల్): తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ మధ్య మరో వారిధికి మార్గం సుగమమైంది. దశాబ్దాల కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్న బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2021– 22 బడ్జెట్లో రూ.600కోట్ల నిధులు కేటాయించింది. కృష్ణానదిపై బ్రిడ్జి కోసం సర్వే చేపట్టిన కన్సల్టెంట్ సంస్థ సోమశిల– సిద్దేశ్వరం వద్ద అధునాతన ‘ఐకానిక్’ (తీగల) వంతెన ఏర్పాటుకు నివేదిక ఇవ్వడంతో జాతీయ రహదారుల సంస్థ గత నెల 21న డీపీఆర్‌కు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిలోని 76/400 కి.మీ., కల్వకుర్తి (కొట్ర) నుంచి నంద్యాల వరకు 173.73 కి.మీ., రహదారిగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా సోమశిల వద్ద తీగల వంతెన నిర్మిస్తారు. ఇప్పటికే టూరిజం హబ్‌గా ఉన్న నాగర్‌కర్నూల్ జిల్లా రూపురేఖలు మారబోతున్నాయి. పర్యాటకానికి కేంద్ర బిందువుగా ఉన్న సోమశిల తెలంగాణకు మరో కలికితురాయిగా మారుతుంది. కృష్ణానది బ్యాక్‌వాటర్, సహజ సిద్ధమైన కొండలు, ప్రకృతి వాతావరణంలో బ్రిడ్జి ఏర్పాటు కాబోతుంది. మూడు ప్రతిపాదనలు కృష్ణానదిపై సోమశిల బ్రిడ్జి ఏర్పాటుకు కన్సల్టెంట్ సంస్థ మూడు ప్రతిపాదనలు తయారు చేసి జాతీయ రహదారుల సంస్థకు నివేదిక సమర్పించింది. ఇందులో మూడో ఆప్షన్‌కు ఆమోదం ముద్ర వేసింది. మొదటి ఆప్షన్ సోమశిల కాటేజీల నుంచి 1,800 మీటర్ల బ్రిడ్జికి, రెండో ఆప్షన్ సోమశిల వెళ్లే రహదారిలో కుడివైపు కృష్ణానది బ్యాక్‌వాటర్ నుంచి రోడ్డు, 750 మీటర్ల బ్రిడ్జికి ప్రతిపాదించారు. మూడో ఆప్షన్లో ప్రతిపాదించిన సోమశిల రీ అలాన్‌మెంట్ 9.20 కి.మీ రహదారి 600 మీటర్ల ఐకానిక్ బ్రిడ్జి ప్రతిపాదనలకు జాతీయ రహదారుల సంస్థ ఆమోదం తెలిపింది.æ కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల పథకం కింద 173.73 కి.మీ., జాతీయ రహదారిలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో 87.600 కి.మీ., రోడ్డు, 600 మీటర్ల తీగల వంతెనకు రూ.1,200 కోట్లు కేటాయించింది. సిద్దేశ్వరం రెండు కొండల మధ్య ఏర్పాటు కానున్న తీగల వంతెనతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల సమస్య తీరడంతోపాటు సోమశిల పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందనుంది. తీగల వంతెన అంటే.. సోమశిల– సిద్దేశ్వరం రెండు కొండల మధ్య (600 మీటర్లు) తక్కువ దూరం ఉండటంతో ఈ స్థలం ఎంపిక చేశారు. రెండు కొండల మధ్య పిల్లర్లు కాకుండా లండన్ బ్రిడ్జి మాదిరిగా అటు ఇటు రెండు పెద్ద టవర్లు నిర్మిస్తారు. ఈ రెండు టవర్లకు కేబుల్స్ బిగించి బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల కేబుల్స్ నుంచి బ్రిడ్జి సప్‌సెంట్ అవుతుంది. ఈ బ్రిడ్జి ఏర్పాటు చేయడానికి జాతీయ రహదారుల సంస్థ మొగ్గు చూపింది. దివంగత సీఎం హయాంలోనే.. సోమశిల బ్రిడ్జి నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో కొల్లాపూర్ ఎక్స్‌రోడ్డులో శిలాఫలకం వేశారు. అప్పట్లో బీఓటీ పద్ధతిన నిర్మించేందుకు రూ.93 కోట్లు కేటాయించారు. కొన్ని సాంకేతిక కారణాలతో అప్పట్లో పనులు మొదలుకాలేదు. తిరిగి 2012లో బ్రిడ్జి నిర్మాణానికి రూ.193కోట్లు, రోడ్డుకు రూ.60 కోట్లు కేటాయించగా రోడ్డు పనులు పూర్తిచేశారు. బ్రిడ్జి నిర్మాణం అప్పటి నుంచి పెండింగ్‌లో ఉంటూ వస్తోంది. అభివృద్ధికి బాటలు.. జాతీయ రహదారి, సోమశిల బ్రిడ్జితో నాగర్‌కర్నూల్ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. అధునాతన బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఐకానిక్ బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకంగా ఈ ప్రాంతంలో రిసార్ట్స్ ఏర్పాటవుతాయి. వెనకబడిన ఈ జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎంతో మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. నల్లమల అందాలు తిలకించేందుకు ఇప్పటికే పర్యాటకులు వస్తున్నారు. బ్రిడ్జి ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. – రాములు, ఎంపీ, నాగర్‌కర్నూల్ -
శ్రీనివాస్ గౌడ్ తల్లి దశదిన కర్మలో పాల్గొన్న సీఎం కేసీఆర్
-
జూరాల ప్రాజెక్ట్ వంతెన పై రాకపోకలు నిషేధం
-
ఆసుపత్రి కోసం ఆందోళన
-
జోగిపేటలో కిడ్నాప్ కలకలం..
సాక్షి, జోగిపేట(అందోల్): జోగిపేట పట్టణంలో ఆదివారం సాయంత్రం కిడ్నాప్ కలకలం రేపింది. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయగా కుటుంబీకులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టిన గంటకే బాధితుడిని సంగారెడ్డిలో వదిలివేశారు. ఈ ఘటకు సంబంధించి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అందోలు మండలం సంగుపేట గ్రామానికి చెందిన కృష్ణ, అశోక్‌ల మధ్య భూవివాదం ఉండడంతో ఉదయం అశోక్ జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై ప్రసాద్ వారిరువురిని పిలిపించి అశోక్ పేర చేయించాల్సిన భూమిని చేయించాలని కృష్ణకు సూచించారు. అయితే అదే సమయంలో రెండు వర్గాలకు చెందిన వారికి వాగ్వాదం జరిగింది. ఎస్సై ఇద్దరికి నచ్చజెప్పిన అనంతరం అశోక్‌కు చెందిన వారు బయటకు వెళ్లిపోయారు. అశోక్ గ్రామస్తుడు ఏసయ్యతో కలిసి పబ్బతి హనుమాన్ మందిరం వద్ద నుంచి వెళ్తుండగా పోచమ్మ దేవాలయం సమీపంలో ఫుట్‌వేర్ ముందు తెల్లటి బొలెరా వాహనంలో కొందరు వచ్చి అశోక్‌ను కిడ్నాప్ చేశారు. ఈ విషయం అశోక్ పక్కనే ఉన్న ఏసయ్య గ్రామస్తులకు, కుటుంబీకులకు ఫోన్లో చెప్పాడు. వెంటనే అశోక్ సోదరుడు కృష్ణ, గ్రామస్తులు వచ్చి పోలీసులకు కిడ్నాప్ విషయాన్ని తెలియజేశారు. విషయం తెలసుకున్న ఎస్సై ఆ ప్రాంతంలో ఉండే సీసీ కెమెరాలను పరిశీలించారు. ముగ్గురు వ్యక్తులు వాహనం నుంచి దిగి అశోక్‌ను ఎక్కించుకున్న దృశ్యాలను గమనించారు. ఈ విషయాన్ని చుట్టూ ఉన్న పోలీసులకు తెలియజేశారు. అయితే గంట తర్వాత అశోక్‌ను సంగారెడ్డి శివారులో వదిలివెళ్లినట్లుగా కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కిడ్నాప్‌కు గురైన అశోక్ బస్‌లో జోగిపేట పోలీస్‌స్టేషన్ వచ్చి తాను కిడ్నాప్‌కు గురైన వివరాలు తెలుపుతూ ఫిర్యాదు చేశారని ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. -
2 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్
-
పాలమూరుకు కొత్తశోభ..!
సాక్షి, మహబూబ్‌నగర్ : రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలాఖరులో చేపట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళిక స్ఫూర్తితో రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా స్థానిక మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక చొరవతో గత నెల 15న మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోనూ పట్టణ ప్రణాళిక ప్రారంభమైన విషయం తెలిసిందే. నెల రోజుల పాటు పట్టణంలో విస్తృతంగా పర్యటించి.. సమస్యల గుర్తింపుతో పాటు వాటి పరిష్కారానికి గడువు విధించుకుని పనులు పూర్తి చేయాలన్న మున్సిపల్ అధికారులకు మిగతా అన్ని శాఖాధికారుల సహాయ సాకారాలు సంపూర్ణంగా అందాయి. ఫలితంగా మహబూబ్‌నగర్ పట్టణం సమస్య లు లేని మున్సిపాలిటీ దిశగా అడుగులేస్తోంది. ఫలితమిచ్చిన శాఖల సమన్వయం.. మహబూబ్‌నగర్ మున్సిపాలిటినీ సమస్యలు లేని పురపాలికగా, ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు కలెక్టర్ రొనాల్డ్‌రోస్, మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు గత నెల 12న స్ధానిక మున్సిపల్ కార్యాలయంలో సమావేశమైన మిగతా అన్నిశాఖల జిల్లాస్థాయి అధికారులతో సమావేశమై ప్రణాళిక అమలులో భాగంగా పనుల గుర్తింపుతో పాటు వెంటనే చేయాల్సిన పనులు.. తర్వాత చేపట్టాల్సిన పనుల జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం పట్టణంలో 41 వార్డులుండగా.. ఒక్కో వార్డుకు ఓ జిల్లా లేదా డివిజన్‌స్థాయి అధికారితో పాటు ఓ మున్సిపల్ సిబ్బందిని నియమించారు. ఈ క్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కేవలం కార్యక్రమం ప్రారంభానికే పరిమితం కాకుండా తనూ అధికారులతో కలిసి వార్డు బాట పట్టారు. తనవంతుగా పారిశుద్ధ్య పనులూ చేశారు. ప్రతి రోజూ గుర్తించిన సమస్యలతో పాటు పరిష్కరించిన వాటి వివరాలు కలెక్టర్‌తో కలిసి తెలుసుకున్నారు. నిరంతర పర్యవేక్షణతో నియమిత స్పెషలాఫీసర్లు సైతం వార్డుల్లో విస్తృతంగా పర్యటించి సమస్యలకు పరిష్కారమార్గాలు చూపించారు. అయితే గుర్తించిన పనుల పూర్తికి ప్రత్యేక నిధుల మంజూరు లేకపోయినా.. అవసరమైన నిధులను జనరల్ ఫండ్ నుంచి వాడుకోవాలని అధికారులు నిర్ణయించారు. సాధించిన ప్రగతి ఇదీ.. పట్టణ సుందరీకరణ.. ఆదర్శ నగరం లక్ష్యంగా మొత్తం 22 అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకున్నారు. పట్టణంలో అన్ని జంక్షన్ల అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత కోసం కాలనీల అసోసియేషన్ల భాగస్వామ్యం, వీధుల్లో చెత్త కుప్పల తొలిగింపు, డ్రెయినేజీలు శుభ్రం, ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు, దోమల నిర్మూలన చర్యలు, కూలిపోయిన ఇళ్లు, పాడుబడ్డ గృహాల తొలగింపు, రోడ్లపై గుంతల పూడ్చివేత, పందుల నిర్మూలన, ప్లాస్టిక్ వాడకం నిర్మూలనలో భాగంగా జరిమానాల విధింపు, నీటి సరఫరా పైప్లైన్ల లీకేజీల మరమ్మతు, మొక్కలు నాటడం, వీధి దీపాల మరమ్మతు, కొత్తవి ఏర్పాటుతో పాటు రోడ్ల నిర్మాణం, విస్తరణ పనుల వేగవంతం, జడ్చర్ల–మహబూబ్‌నగర్ రహదారి విస్తరణ పనుల పూర్తిపై ప్రధానంగా దృష్టిసారించిన అధికారులు ఆ మేరకు పనులు చేపట్టారు. ఇప్పటి వరకు అత్యధికంగా 2,078 ఓపెన్ ప్లాట్లను గుర్తించిన స్పెషలాఫీసర్లు ఇప్పటి వరకు 1630 ప్లాట్లలో ఉన్న పిచ్చి మొక్కలు, కంప చెట్లను, నీటి నిల్వలను తొలగించి చదును చేశారు. ముందుగా ఓపెన్ ప్లాట్లలో పెరిగిన చెట్లు, నీటి నిల్వ గురించి ఆయా యజమానులకు సమాచారం అందజేసి మూడు, నాలుగు రోజుల్లో వాటిని శుభ్రం చేసుకోవాలని నోటీసులు ఇచ్చారు. స్పందించని యజమానుల ప్లాట్లను మున్సిపల్ అధికారులే శుభ్రం చేసి.. జేసీబీ, డంపింగ్ యార్డు వరకు చెత్త తరలింపు కోసం ఇతర వాహనాలకు అయ్యే ఖర్చును జరిమానా పేరిట వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.4లక్షలకు పైగా జరిమానాలు వసూలు చేశారు. ఇక మీదట ఓపెన్ ప్లాట్లలో చెట్లు పెరగకుండా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అత్యధికంగా మూడో వార్డులో 230 ఓపెన్ ప్లాట్లను గుర్తించిన ప్రత్యేకాధికారులు 120 ప్లాట్లను చదును చేశారు. 19వ వార్డులో 150 ప్లాట్లకు గానూ 25, 16వ వార్డులో 111 ప్లాట్లకు 76, 12వ వార్డులో 104 ప్లాట్లకు 99, ఏడో వార్డులో 93 ప్లాట్లకు 90, 41వ వార్డులో 93 ప్లాట్లకు గానూ 81 ప్లాట్లు చదును చేశారు. ఇప్పటికే పట్టణంలో లోపించిన పారిశుద్ధ్యంతో విష జ్వరాలు, డెంగీ వంటి వ్యాధులు ప్రబలిన నేపథ్యంలో అధికారులు తీసుకున్న ఓపెన్ ప్లాట్ల చదును కార్యక్రమంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరి కృషితోనే.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ రొనాల్డ్ రోస్, స్పెషలాఫీసర్లందరీ సమష్టి కృషితో గడిచిన కొన్ని రోజుల్లోనే పట్టణంలో అనేక సమస్యలు తీరాయి. పట్టణ ప్రణాళికలో భాగంగా స్పెషలాఫీసర్లు గుర్తించిన పనుల్ని రెండు, మూడు రోజుల్లోనే పరిష్కరించుకుంటున్నం. కార్యక్రమం గడువుకు ఇంకా సమస్య ఉన్నందునా మిగిలిన సమస్యలన్నీ పరిష్కరిస్తాం. అయితే ఈ కార్యక్రమం నెల రోజులకే పరిమితం కాకూడదు. ప్రజలూ పట్టణ పౌరులుగా తమ బాధ్యతను గుర్తించుకుని పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలి. ముఖ్యంగా ఓపెన్ ప్లాట్ల విషయంలో ఆయా యజమానులు శ్రద్ధ తీసుకుని పిచ్చి మొక్కలు పెరగకుండా, నీటి నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి. – వడ్డే సురేందర్, మున్సిపల్ కమిషనర్ -
వర్షాలు లేక వెలవెల..
సాక్షి, మహబూబ్‌నగర్ : దేశమంతటా పుష్కలంగా వర్షాలు కురిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం లోటు వర్షపాతం నమోదైంది. ఏ చెరువు చూసినా.. ఏ కుంట చూసినా కంపచెట్లు, పిచ్చిమొక్కలతో నిండి కనిపిస్తోంది. ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా పూడికతీత పనులు చేయించినా వర్షాలతో నీటి చేరిక లేకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు వేల పైచిలుకు చెరువులు జలకళ లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. కేవలం 35 చెరువులు మాత్రమే నిండగా మరో 23 చెరువులు మత్తడి దూకి ప్రవహిస్తున్నాయి. ఇటీవల వారంరోజులు ముసురు పట్టినా భూగర్భజలాలు మాత్రం పెరగలేదు. 20 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారుల లెక్కలు చెబుతన్నాయి. కొనసాగుతున్న మరమ్మత్తులు ఏళ్ల నుంచి మరమ్మత్తులకు నోచకుండా ఆదరణకు దూరమైన చెరువులకు మరమ్మతు పనులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం పనులు ఆశించిన మేరకు ముందుకు సాగడం లేదు. ఉమ్మడి పాలమూరు పరిధిలోని ఐదు జిల్లాల్లో మొత్తం 6,417 చెరువులు ఉండగా ఇప్పటివరకు 3,590 చెరువుల పనులు వందశాతం పూర్తయ్యాయి. మిగిలిన చెరువుల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 854 చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టగా అందులో 666 పనులు పూర్తయ్యాయి. ఇందుకు గానూ ప్రభుత్వం రూ.185 కోట్లు కేటాయించగా రూ.105 కోట్లు చెల్లింపులు జరిగాయి. వనపర్తి జిల్లాలో 1,253 చెరువులు ఉంటే 754 చెరువుల పనులు పూర్తయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 346 చెరువులు ఉంటే 226 చెరువుల పనులు పూర్తయ్యాయి. నారాయణపేట జిల్లాలో 1,125 చెరువులు ఉంటే 689 పనులు చేపట్టగా 394 చెరువుల మరమ్మత్తు జరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,995 చెరువులు ఉంటే 1,550 చెరువులకు మరమ్మత్తు పనులు పూర్తయ్యాయి. కాగా 2,827 చెరువుల పనుల మరమ్మత్తు పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పరిధిలో ఉన్న చెరువులకు మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో వాటిలో నీటనిల్వకు అవకాశం ఉన్నా చేయలేని పరిస్థితి నెలకొంది. మత్స్యకారులకూ నిరాశే! ఆర్థికంగా చితికిపోయిన మత్స్యకారులను చేయూతనిచ్చే విధంగా ప్రభుత్వం వారికి వందశాతం సబ్సిడీపై చేపపిల్లలు అందిస్తోంది. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9.86 కోట్ల చేప పిల్లలను వదలాలని సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే చెరువుల్లో చేప పిల్లలు పెరగానికి అనుకూల వాతావరణంతో పాటు 40 శాతం నీళ్లు ఉండి తీరాలి. కానీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 4,200 చెరువుల్లో నీరు 40శాతానికి తగ్గి ఉంది. కేవలం రెండొందల చెరువులు మాత్రమే చేపల పెంపకానికి అనుకూలంగా ఉన్నాయి. దీంతో రెండ్రొజుల క్రితమే ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు 40శాతానికి మించి నీళ్లు ఉన్న చెరువుల్లో చేప పిల్లల్ని వదలారు. ఇప్పటి వరకు సుమారు ఐదు కోట్ల చేప పిల్లల్ని చెరువుల్లో వదలారు. నీళ్లు తక్కువగా ఉన్న 4,200 చెరువుల్లో చేపపిల్లల పెరుగుదల ప్రశ్నార్ధకంగా మారడంతో వాటి పరిధిలో ఉన్న మత్స్యకారులు, సంబంధిత సంఘాల ప్రతినిధులు ఆందోళనలో ఉన్నారు. జలాశయాలే దిక్కు ఆశించిన మేరకు వర్షాలు కురవకపోయినా కర్ణాటక, మహారాష్ట్రలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కృష్ణా, భీమాతో పాటు తుంగభద్ర కూడా వరద రూపంలో నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలపై పోటñత్తాయి. దీంతో అధికారులు జూరాల, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసుకున్నారు. తాజాగా వాటి పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు తుంగభద్ర నీటితో తుమ్మిళ్ల జలాశయాన్ని, శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌ను నింపి వాటి పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను నింపుతున్నారు. -
కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు : డీకే అరుణ
సాక్షి, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానంలో నైతిక విజయం బీజేపీదే అని ఆ పార్టీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. పార్టీ గుర్తును గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరువ చేయటంలో వెనుకబడ్డామని చెప్పారు. దేశభద్రత బీజేపీతోనే సాధ్యమనే విశ్వాసంతో ప్రజలు మరోసారి పట్టం కట్టారన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ అని డీకే ఆరుణ అన్నారు. నిజాంబాద్, కరీంనగర్లో ఓటమికి సీఎం కేసీఆర్ నైతికబాధ్యత వహించాలన్నారు. భవిష్యత్‌లో చాలా కాలం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మనుగడ సాధించలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదన్నారు. కులమతాలకు అతీతంగా కలిసిరండీ అభివృద్ది చేసుకుందామని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ బెదిరింపులు మానుకోకుంటే తీవ్రపరిణామాలు తప్పవని హెచ్చరించారు. మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన మన్నె శ్రీనివాసరెడ్డి 4,11,241 ఓట్లతో గెలుపొందగా, బీజేపీ తరపున పోటీ చేసిన డీకే అరుణకు 3,33,121 ఓట్లు పోలయ్యి రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. -
స్కానింగ్ కేంద్రాల ‘కనికట్టు’!
సాక్షి,మహబూబ్‌నగర్: ‘ప్రతి గర్భిణికి ఐదోనెలలో చేసే స్కానింగ్ అతి ముఖ్యమైంది.అయితే స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు దీనిని విస్మరిస్తున్నారు..శిశువు ఆరోగ్య పరిస్థితిపై విభిన్న నివేదికలు(రిపోర్టులు) ఇస్తూ ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు కనికట్టు చేస్తున్నారు.’ తప్పుడు నివేదికలపై అధికారుల దృష్టి తప్పుడు నివేదికలు ఇవ్వడంతో పాటు లింగ నిర్దారణ చేస్తున్న స్కానింగ్ కేంద్రాలపై జిల్లా వైద్యారోగ్యశాఖ దృష్టి సారించింది. గత 15రోజుల నుంచి జిల్లాలో ఉన్న పీహెచ్‌సీల వారీగా, జిల్లా కేంద్రంలో పలు స్కానింగ్ సెంటర్లలో పరీక్షలు చేసుకున్న పలువురు మహిళలను ఎంపిక చేసుకొని వారితో మాట్లాడానికి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. బాధితులు ఏం స్కానింగ్ చేయాలని అడిగితే నిర్వాహకులు ఏం చేశారు?, ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చారు, ప్రస్తుతం గర్భిణులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే అంశాలపై ప్రత్యేక టీం అధికారులు క్షేత్రస్థాయి పర్యటణ చేసి గర్భిణులు, వారి కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. గత 15రోజుల నుంచి జిల్లా కేంద్రంలో 15మంది గర్భిణుల నుంచి వివరాలు సేకరించారు. డీఎంహెచ్‌వో అధికారులు చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆర్ఎంలు అబార్షన్ చేసినట్లు, లింగ నిర్ధారణ పరీక్షలు, లీగల్ అబార్షన్లు చేసినట్లు, జన్యుపరమైన లోపాలు ఉన్న స్కానింగ్ నిర్వాహకులు బాధితులకు చెప్పకుండా దాచడం వంటి ఎన్నో విషయాలు వెలుగుచూశాయి. స్కానింగ్ కేంద్రం నిర్వహణకు అవసరమైన కీలక డాక్యుమెంట్ ఫాం–ఎఫ్‌లో సరైన వివరాలు నమోదు చేయకపోవడం, రికార్డులలో ఎవరికి ఎలాంటి స్కానింగ్ చేశారు అనే వివరాలను పూర్తిగా తప్పుగా రాయడం బయటపడింది. మొక్కుబడిగా పరీక్షలు.. జిల్లాలో చాలా స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు గర్భిణులకు మొక్కుబడిగా పరీక్షలు చేస్తున్నారు. నివేదికలో స్పష్టత లేకపోవడం వల్ల తల్లీ బిడ్డ ప్రాణాలకు ఆపద కల్గుతుంది. జిల్లాలో గర్భిణులకు స్కానింగ్ చేసే కేంద్రాలు 67(రేడియాలజిస్టుతో కూడినవి) వరకు ఉన్నాయి. ప్రతి గర్భిణికి సంబంధించి ఐదో నెలలో రేడియాలజిస్టు క్షుణంగా స్కానింగ్ చేయాలి. శిశువు ఎదుగుదల, అవయవాల తీరు ఇలా ప్రతీది పరిశీలించాలి. వారిచ్చే నివేదికను గైనకాలజిస్టులు చూసి వైద్యం అందించాలి. శిశువు ఎదుగుదలలో ఉన్న లోపం చికిత్స పరంగా మెరుగుకాదనుకొంటే అబార్షన్ చేయడానికి అవకాశం ఉంది. ఇదిలాఉండగా, రాష్ట్రంలో బాలికల నిష్పత్తి రోజు రోజుకు తీవ్రంగా తగ్గిపోతున్న క్రమంలో రాష్ట్ర ప్రజా ఆరోగ్య– కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రాణా ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్యశాఖలోని మాస్ మీడియా విభాగం అధికారులు జిల్లాలో ప్రత్యేకంగా క్షేత్రస్థాయి పర్యటనను చేస్తున్నారు. ప్రధానంగా పట్టణంలో ఉన్న స్కానింగ్ కేంద్రాల ద్వారా అబార్షన్లు, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వాటిపై విచారణ జరుగుతుంది. దీనికితోడు పట్టణంలో కొందరు దళారి వ్యవస్థ ద్వారా పక్క రాష్ట్రాల్లో జోరుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేపిస్తున్నారు.లింగ నిర్ధారణను ప్రభుత్వం నిషేధించింది. ఒక వేళ అలా చేస్తే వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయినా పరీక్షల పేరిట పుట్టబోయేది ఆడ, మగ అని తెలుపుతూ అందినంత దోచుకునే తంతు జిల్లాలో కొనసాగుతుంది. చట్టాలు, నిబంధనలను కాలరాస్తూ గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడే కొందరు వైద్యులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు కలిసి ఆడ శిశువులకు మరణ శాసనం రాస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత పదేళ్ల కిందట 40మాత్రమే ఉన్న స్కానింగ్ కేంద్రాల సంఖ్య ప్రస్తుతం 178కి చేరింది. అనధికారికంగా మరో 50కేంద్రాలు నడుస్తున్నాయి. దీంట్లో మహబూబ్‌నగర్‌లో 67, వనపర్తిలో 38, నాగర్‌కర్నూల్‌లో 40, గద్వాలలో 25స్కానింగ్ కేంద్రాలు పని చేస్తున్నాయి. బాలికల సంఖ్య తగ్గుముఖం ఓ వైపు భ్రూణహత్యలు.. మరోవైపు శిశు విక్రయాలు ఇంకో వైపు మూఢనమ్మకాలు వెరసి ఆడపిల్ల బతుకు దిక్కుతోచని పరిస్థితి అవుతుంది. తాజా జనాభా లెక్కలను పరిశీలిస్తే జిల్లాలోని గ్రామీణా ప్రాంతాల్లో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ పరిణామంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉంది. 2001లో వెయ్యి మందికి 952మంది ఆడపిల్లలున్నారు. 2011లో ఆ సంఖ్య 900కి తగ్గింది. ప్రస్తుతం ప్రతి వెయ్యి మందికి 850మంది ఆడపిల్లలు ఉన్నారు. జిల్లాలోని పది మండలాల్లో మహిళల జనాభా గణనీయంగా పడిపోతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పది మండలాల్లో ఆడపిల్లల నిష్పత్తి 800లోపు ఉండడమే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి జిల్లాలోని తలకొండపల్లి, తిమ్మాజిపేట, ఆమనగల్లు, ఖిల్లఘనపురం, దేవరకద్ర, బాలానగర్, కొత్తూర్, దామరగిద్ద, వెల్దండ, అలంపూర్ మండలాల్లో మరింత ప్రమాదరకంగా స్త్రీ పురుష నిష్ఫతి 1000:800లోపు ఉంది. గత పదేళ్లలో జిల్లాలో గ్రామాల్లో ఆడపిల్లల సంఖ్య38శాతం తగ్గింది. జిల్లాలో 800వరకు ఆడపిల్లలు ఉన్న మండలాలు 10ఉన్నాయి. నిబంధనలకు నీళ్లు లింగ నిర్ధారణను ప్రభుత్వం నిషేధించింది. ఒక వేళ అలా చేస్తే వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయినా పరీక్షల పేరిట పుట్టబోయేది ఆడ, మగ అని తెలుపుతూ అందినంత దోచుకునే తంతు జిల్లాలో కొనసాగుతుంది. చట్టాలు, నిబంధనలను కాలరాస్తూ గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడే కొందరు వైద్యులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు కలిసి ఆడ శిశువులకు మరణ శాసనం రాస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత పదేళ్ల కిందట 40మాత్రమే ఉన్న స్కానింగ్ కేంద్రాల సంఖ్య ప్రస్తుతం 178కి చేరింది. అనధికారికంగా మరో 50కేంద్రాలు నడుస్తున్నాయి. దీంట్లో మహబూబ్‌నగర్‌లో 67, వనపర్తిలో 38, నాగర్‌కర్నూల్‌లో 40, గద్వాలలో 25స్కానింగ్ కేంద్రాలు పని చేస్తున్నాయి. ఫాం ఎఫ్‌లో అన్ని వివరాలు నమోదు చేయాలి జిల్లాలో ఉన్న స్కానింగ్ కేంద్రాలు ఫాం–ఎఫ్‌లో స్కానింగ్ చేసిన వివరాలు అన్నింటిని నమోదు చేయాలి. ఫాం–ఎఫ్ అనేది కీలక డాక్యుమెంట్‌గా భావించాలి. దాంట్లో అన్ని రకాల వివరాలు ఉండాలి. కొన్ని రకాల వివరాలు దాచిపెట్టడం మానుకోవాలి. లేకపోతే చట్టప్రకారం చర్యలు ఉంటాయి. పీసీపీఎన్డీటీ యాక్టులో భాగంగా క్షేత్రస్థాయి పర్యటన జరుగుతుంది. ఇప్పటి వరకు 15మంది గర్భిణుల ద్వారా వివరాలు సేకరించి వాటిని ఇటీవలే హైదరాబాద్‌లో ఉన్నత అధికారులకు ఇవ్వడం జరిగింది. వేణుగోపాల్‌రెడ్డి, మాస్ మీడియా అధికారి -
‘స్వచ్ఛ’ రుద్రారం
సాక్షి, నవాబుపేట (జడ్చర్ల): మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని రుద్రారం గ్రామం స్వచ్ఛ పురష్కార్ అవార్డుకు ఎంపికైంది. ఓ మహిళ అనుకుంటే సాధించలేనిది లేదంటూ నిరూపించింది. గ్రామం స్వచ్ఛంగా ఉండాలనే లక్ష్యంతో వందశాతం మరుగుదొడ్లు నిర్మించారు. దీంతో ఈ గ్రామానికి ప్రత్యేక పురష్కారం వచ్చినట్లు సమాచారం. 371 మరుగుదొడ్ల నిర్మాణం ఏడాదిలోపు పూర్తి చేశారు. దీంతో గతేడాది ఢిల్లీలో మహిళా సాధికారిత అవార్డు, జిల్లాల్లో తెలంగాణలో ప్రత్యేక అవార్డును అప్పటి సర్పంచ్ లక్ష్మీకృష్ణగౌడ్ పొందింది. ఈ రెండు అవార్డులతో పాటు తాజాగా స్వచ్ఛభారత్ పురష్కార్తో పాటు రూ.10లక్షలు అందుకోనున్నారు. ఈ అవార్డును శుక్రవారం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మహిళా దినోత్సవం సందర్భంగా నవాబుపేట మండల కేంద్రంలో అందించనున్నారు. మరింత అభివృద్ధి గ్రామం మరింత అభివృద్ధి చెందడానికి కృషి చేస్తాం. గతంలో అందరూ కృషి చేశారు. ఆ కృషికి వచ్చిన ఫలితంతో మరింత ముందుకు తీసుకెళ్తాం. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. పార్టీలకతీతంగా సమష్టిగా కృషి చేస్తాం. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం. – లలిత కృష్ణారెడ్డి, సర్పంచ్, రుద్రారం -
ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారు!
సాక్షి, అచ్చంపేట: వరుస ఎన్నికలతో మరోసారి పల్లెలు సందడిగా మారనున్నాయి. లోక్‌సభతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ వరకు ఎన్నికల కోలాహలం ఉండడంతో రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయారు. ఇక అధికారులు ఓటర్లు, మున్సిపల్ వార్డులు, పరిషత్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఒక్కో తంతు పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు మమ్మురమైంది. ఇప్పటికే ఎంపీపీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లా ప్రజా పరిషత్‌ల పరిధిలోని 71మండల ప్రజాపరిషత్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో ఒక మండలం ఏజెన్సీ ఏరియాలో ఉంది. మిగిలిన 70మండలాల్లో 50శాతం అంటే 35మండలాల ఎంపీపీ స్థానాలను జనరల్‌కు కేటాయించారు. మిగిలిన వాటిలో ఏడు ఎస్టీలకు, 14 ఎస్సీలకు, 14 బీసీలకు రిజర్వ్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేటగిరిలో అన్ని స్థానాల్లో 50 శాతం మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వారి జనాభా ప్రాతిపదికన, బీసీ రిజర్వేషన్లు ఓటర్ల ప్రకారం నిర్ణయించారు. గతంలో ఇలా.. గతంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జెడ్పీటీసీలు జిల్లా పరిషత్‌లో నామినేషన్లు వేయగా, ఎంపీటీసీలు ఆయా మండలాల్లో సమర్పించేవారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వాటిని సవరించి జెడ్పీటీసీలు మండల కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు. అదేవిధంగా మూడు ఎంపీటీసీ నియోజకవర్గాలకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమించి నామినేషన్లు స్వీకరించే విధంగా నిర్ణయించారు. దీంతో ఇటు జెడ్పీటీసీ, అటు ఎంపీటీసీ అభ్యర్థులకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఉమ్మడి జిల్లా ఉన్న సమయంలో జిల్లాలో దూర ప్రాంతాల నుంచి జిల్లాకేంద్రానికే వచ్చి నామినేషన్ల పత్రాలు సమర్పించే విషయంలో ఇబ్బందులు తలెత్తేవి. ఇప్పుడు ఎన్నికల సంఘం వెసులుబాటు కలిగించడంతో ఊరట కలగనుంది. 600–700మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం 600 మంది నుంచి 700 మంది ఓటర్ల వరకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు ఓటరు జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం తిరిగి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టింది. ఈ ఎన్నికల్లో చాలా ఓట్లు గల్లంతు కావడంతో వాటిని తిరిగి చేర్పించేందుకు ఓటర్ల నమోదు ముసాయిదా నిర్వహించారు. ఓటర్లు కూడా పెద్ద ఎత్తున నమోదు చేసుకున్నారు. అసెంబ్లీ ఓటర్లతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో దాదాపు 2లక్షల ఓటర్లు కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. తుది జాబితాను ఫిబ్రవరి 22వ తేదీన ప్రకటించారు. ఈ జాబితాను ఆధారంగా చేసుకునే ఈ పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్లను విభజించనున్నారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాకు కసరత్తు మొదలుపెట్టారు. ఇటీవల నూతనంగా తయారు చేసిన ఓటర్ల జాబితాను కలెక్టర్ ద్వారా తీసుకున్నారు. దాని ఆధారంగానే గ్రామాల వారీగా ఆయా వార్డుల జాబితాను తయారు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వీటి ఆధారంగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నారు. అనంతరం ఎంపీటీసీల నియోజకవర్గాల వారీగా తయారు చేసి ఈ నెల 27న తుది జాబితాను ప్రకటించనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో కొత్తగా పదర, చారకొండ, పెంటవెల్లి, ఊర్కొండ, వనపర్తి జిల్లాలో చిన్నంబావి, మదనాపురం, శ్రీరంగాపూర్, జోగుళాంబ జిల్లాలో కేటీ దొడ్డి, రాజోళి, ఉండవెల్లి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో మరికల్, మూసాపేట, రాజాపూర్, కృష్ణా మండలాలు ఏర్పడ్డాయి. పాత మండల పరిషత్‌లో ఉన్న ఈ మండలాల్లో కొత్త పరిషత్‌లు ఏర్పాటు కానున్నాయి. అలాగే ఏ జిల్లాకు ఆ జిల్లా జెడ్పీటీసీలతో కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పాటు కానుంది. మొత్తం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కలిపి ప్రస్తుతం 71 జెడ్పీటీసీ, 804 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రిజర్వేషన్లకు లక్కీడిప్.. గద్వాల అర్బన్: ఎట్టకేలకు జిల్లాలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. దీనికోసం మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లో కలెక్టర్ కె.శశాంక ఆధ్వర్యంలో లక్కీడిప్ తీశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాములు, డీపీఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కోతల కాన్పులకు ఇక చెల్లుచీటి..!
సాక్షి, పాలమూరు: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పుల లెక్క ఇకనుంచి పక్కాగా ఉంటోంది. పుట్టిన ప్రతీ బిడ్డ, తల్లిదండ్రుల వివరాలు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలను కట్టడి చేయడానికి, బోగస్ పౌరసత్వం తీసుకునే అవకాశం లేకుండా తల్లీబిడ్డల సంక్షేమమే లక్ష్యంగా వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ జనవరి 1నుంచి జిల్లాలో ఈ–బర్త్ విధానం అమల్లోకి తెచ్చింది. ఆస్పత్రుల్లో ప్రసవాలు, జనన వివరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌లో నమోదు చేసే విధానం పకడ్బందీగా చేస్తున్నారు. ప్రతీ ఆస్పత్రికి ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కేటాయించారు. ఏ రోజుకారోజు ప్రసవాల సంఖ్య, వివరాలను ఇందులోపూర్తిస్థాయిలో నమోదు చేస్తున్నారు. ఎన్నో ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–బర్త్ విధానం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధానంలో తల్లీపిల్లల మరణాలను తగ్గించడంలో పాటు నూరుశాతం కాన్పులు ఆస్పత్రుల్లో జరుగుతాయి. ప్రభుత్వ పథకాలను వర్తింప చేయడంతో పాటు జనన ధ్రువీకరణ పత్రాలు సులువుగా పొందుతారు. బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా భ్రూణ హత్యలు అరికట్టవచ్చు. ప్రైవేట్ ఆస్పత్రుల వారు ధనార్జనే ధ్యేయంగా అవసరం లేకున్నా శస్త్రచికిత్స కాన్పులు చేస్తున్నారా.. అనే అంశాన్ని పరిశీలించవచ్చు. ప్రత్యేకంగా ఏదైనా ఒక ఆస్పత్రిలో కేవలం మగపిల్లలే జన్మిస్తుంటే అక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయా.. అనే అంశాన్ని కూడా పరిశీలించవచ్చు. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలకు అడ్డుకట్ట వేసి బోగస్ విదేశీయులు దేశంలో చొరబడి తప్పుడు పౌరసత్వం తీసుకొకుండా నిలువరించవచ్చు. జనవరి 1వ తేదీనుంచి రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ ఈ విధానాన్ని ప్రవేశపెట్టి ఎప్పటికప్పుడు ఆ వివరాలను రాష్ట్రస్థాయిలో పరిశీలిస్తోంది. సదరు కుటుంబీకులు సైతం ఈ విధానంలో రూపొందించిన పత్రంలోని వివరాల ప్రకారమే మున్సిపాలిటీ, పంచాయతీల్లో జనన ధ్రువపత్రం పొందవచ్చు. ప్రసవాల సంఖ్య.. జిల్లాలో జనవరి 1 నుంచి అమలు చేస్తున్న ఈ–బర్త్ విధానంలో ఈనెల 25వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2,251 కాన్పులు జరిగాయి. వాటిలో సాధారణ కాన్పులు 1,661, సిజేరియన్లు 583 జరిగినట్లు నమోదయ్యాయి. అలాగే జరిగిన కాన్పుల్లో ఆడ శిశువులు 1,128, మగ శిశువులు 1,129 ఉన్నారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రుల్లో 947 కాన్పులు జరుగగా అందులో సాధారణం 307, సిజరీయన్ 640 జరిగాయి. వాటిలో ఆడ శిశువులు 488, మగ శిశువులు 479 మంది ఉన్నారు. ఇలా నమోదు చేస్తారు.. వైద్యఆరోగ్య శాఖ పర్యవేక్షణలో అమలవుతున్న ఈ–బర్త్ నమోదు ప్రక్రియను పటిష్టంగా చేసేందుకు డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రత్యేక దృష్టి సారించారు. ప్రైవేట్ నర్సింగ్ హోంలు, ఆస్పత్రుల జాబితా రూపొందించి వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చారు. తల్లీబిడ్డకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్ చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు కేటాయించిన యూజర్ ఐడీలలో వివరాలు నమోదు చేసే విధంగా పోర్టల్‌ను రూపొందించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు ప్రతి రోజు ఆస్పత్రుల్లో జరిగిన కాన్పుల వివరాలతో పాటు తల్లీబిడ్డల సమాచారాన్ని అందులో నమోదు చేస్తారు. భ్రూణ హత్యల నివారణ ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న భ్రూణ హత్యలను ఈ–బర్త్ పోర్టల్ ద్వారా ఆరోగ్య శాఖ ఇట్టే పసిగట్టనుంది. లింగనిర్ధారణ పరీక్షలు చేయించినా, గర్భస్రావం అయినా వెంటనే తెలిసిపోయేలా ప్రణాళిక రూపొందించింది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఆశా, అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తల సమన్వయంతో ప్రతి గర్భిణి వివరాలను ఏఎన్సీ నమోదు చేస్తున్నారు. రెండో నెల నుంచి కాన్పు జరిగే వరకు గర్భిణి ఆరోగ్యస్థితిపై ఆరోగ్యశాఖ పర్యవేక్షణ కొనసాగుతుంది. చికిత్స పొందుతున్న ఆస్పత్రుల వివరాలతో పాటు ఆరోగ్యవివరాలను అందులో పొందుపరుస్తారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకుంటున్న వారి ప్రతి ఒక్కరి వివరాలను గుర్తిస్తారు. గర్భిణుల వివరాలు పక్కాగా సేకరించి కాన్పులు జరిగే వరకు వారి పట్ల పర్యవేక్షణ చేస్తారు. గర్భిణీతో పాటు శిశువు ఆరోగ్యస్థితిని కూడా పరిశీలిస్తూ తగిన సూచనలు సలహాలు అందిస్తారు. మరో ప్రయోజనం ఈ విధానం వల్ల అకారణంగా శస్త్రచికిత్స కాన్పులను అడ్డుకట్ట వేయవచ్చు. ప్రతి కాన్పు ఇంటర్నెట్లో నమోదు చేసేప్పుడు శస్త్రచికిత్స ప్రసవం చేస్తే ఎందుకు చేశారు.? సర్జరీ చికిత్స చేయడానికి గల కారణాలను వివరంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను రాష్ట్రస్థాయిలో పరిశీలిస్తారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా జిల్లా అధికారులతో విచారణ చేపడతారు. అకారణంగా సర్జరీలు చేసినట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా నిర్లక్ష్యంగా ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవ వివరాలను ఏరోజుకారోజు ఈ–బర్త్ విధానంలో నమోదు చేయనట్లయితే ఆయా ఆస్పత్రులపై వైద్యశాఖ కేసులు నమోదు చేయించి మూడేళ్ల జైలు శిక్షపడేలా చర్యలు తీసుకోనుంది. -
పేట పై అభ్యంతరాలు
-
మహబూబ్ నగర్లో అగ్రిగోల్డ్ భూముల వేలం పాట
-
‘మెరుపులా వచ్చింది.. మెరుపులానే పోతుంది’
జడ్చర్ల: కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ మెరుపులా వచ్చిందని..ఎన్నికలై పోయిన తర్వాత మెరుపులానే కనపడకుండా పోయిద్దని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు చేసిన మైనార్టీల సదస్సుకు గులాం నబీ ఆజాద్, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో పొత్తు వల్ల తెలంగాణాలో మా బలం పెరిగిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ స్టేట్మెంట్తో తెలంగాణ రాలేదని, రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణాను తామే ఇచ్చామని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మా రెడ్డి వ్యాపారాలకు ప్రాధాన్యత ఇస్తాడు కానీ ప్రజల బాగోగులు పట్టవని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవిని గెలిపిస్తే మీకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటాడని హామీ ఇచ్చారు. -
ఓటును అమ్ముకోవద్దు
సాక్షి, ఖిల్లాఘనపురం: మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎన్నికలు, ఓటుహక్కు, మూఢనమ్మకాలపై గురువారం రాత్రి అవగాహన కల్పించారు. స్థానిక ఎస్ఐ నరేందర్ మండల కేంద్రంలోని బస్టాండు ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రం నుంచి వచ్చిన పోలీస్ శాఖ కళాకారులు పలు విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటుహక్కు వినియోగంతోపాటు బాల్యవివాహాలు, సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, అంటరానితనం, మూఢనమ్మకాలు, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యల నివారణ, మహిళలపై లైంగిక దాడులు, హెల్మెట్ వాడకం తదితర వాటిపై పాటలు, నృత్యాలు, చలోక్తులతో చైతన్యపరిచారు. ఎస్ఐ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, సారా సీసాకు, డబ్బులకు ఓటును అమ్ముకోవద్దన్నారు. ఒక్కసారి లొంగిపోతే ఐదేళ్లపాటు నాయకుడు ఎన్ని తప్పులు చేసిన, మోసాలు చేసిన బానిసలుగా బతకాల్సిందేనని, ఓటు ప్రతి ఒక్కరికి వజ్రాయుధం లాంటిదన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ వారు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది, కళాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించండి వనపర్తి: అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగుల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు సెక్టోరల్ అధికారులు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ చంద్రారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఆర్డీఓ తన చాంబర్లో సెక్టోరల్ అధికారులు, మండలాల ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులను పోలింగ్ స్టేషన్‌కు తీసుకువచ్చేందుకు ఆటో సౌకర్యం కల్పించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు నిర్మించాలని, దివ్యాంగులను పోలింగ్ కేంద్రంలోకి తీసుకువెళ్లేందుకు వలంటీర్లను ఏర్పాటు చేయాలని, ప్రతి పోలింగ్ కేంద్రంలో విద్యుత్, బాతురూం, నెట్ సౌకర్యం కల్పించాలని సూచించారు. బీఎల్ఓలకు పలు సూచనలు చేశారు. నియోజకవర్గంలో 278 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. కావాల్సిన కంటే ఎక్కువ గానే.. ఈవీఎంలు, వీవీ ప్యాట్స్‌ను ఎన్నికల సంఘం అధికారులు నియోజకవర్గానికి పంపించారన్నారు. సమావేశంలో డీఆర్డీఓ గణేష్, తహసీల్దార్ శాంతిలాల్, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు పాల్గొన్నారు. -
కురుమూర్తిరాయా.. కోటి దండాలయ్యా.!
సాక్షి, చిన్నచింతకుంట (దేవరకద్ర): పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీకశుద్ధ సప్తమి సందర్భంగా ఈ నెల 14న జరగనున్న ఉద్దాల ఉత్సవ వేడుకల్లో స్వామివారి పాదుకలను తాకి పునీతులయ్యేందుకు భక్తజనం సిద్ధమవుతున్నారు. కాగా, బ్రహ్మోత్సవాల ఆరంభాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో యాగం జరిపారు. ఈ మేరకు తొలిరోజే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కల్యాణం.. కమనీయం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గు రువారం పూర్తి లాంఛనాలతో స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధాన ఆర్చ కులు వెంకటేశ్వరాచార్యుల ఆధ్వర్యంలో వేదపండితులు ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు పెద్దసంఖ్యలో హాజరైన భక్తులు కురుమూర్తి స్వామితో పాటు లక్ష్మీదేవి, ఆంజనేయస్వామిని, ఉద్దాల పాదుకలను దర్శించుకున్నారు. దాసంగాలతో మొక్కులు సమర్పించారు. కాగా, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె.దయాకర్‌రెడ్డి, టీఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్కరణ్రెడ్డి, టీఎస్ ఐడీసీ ఎస్ఈ కిశోర్‌కుమార్, టీఎస్ ఐడీసీ మహబూబ్‌నగర్ ఏఈ నయీంఖాన్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ సురేందర్, ఆలయ మాజీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, బత్తుల బాల్‌రాజు, ప్రతాప్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్, వెంకట్రాములుయాదవ్, ఆలయ ఉద్యోగులు శివానందచారి, సాయిరెడ్డి, శ్రీకర్, పూజారులు వెంకటయ్య, విజయ్, అమ్మాపురం బాల్‌రాజ్ పాల్గొన్నారు. ఆలయ చరిత్ర ఆకాశరాజు కూతు రు పద్మావతి దేవిని శ్రీనివా సుడు వివా హం ఆడేందుకు తన అన్న గోవిందరాజును భరోసాపెట్టి కుబేరుడి నుంచి అప్పు తీసుకుంటాడు. ఆ అప్పు స్వామివారు చెల్లించకపోవడంతో కుబేరుడు ఒత్తిడి తెస్తాడు. దీంతో తన మనస్సు కలతచెంది ఆయన ప్రతిరూపాన్ని అక్కడే వదిలి అర్ధరాత్రి ఎవ్వరికి చెప్పకుండా ఉత్తరదిశగా కాలినడకన పయనమై వస్తారు. మహబూబ్‌నగర్ జిల్లా గుండాల జలపాతం వద్ద కృష్ణానదిలో స్వామివారు స్నానం చేస్తారు. అప్పటివరకు తెలుపురంగులో ప్రవహిస్తున్న కృష్ణమ్మ స్వామివారు స్నానం చేశాక నీలివర్ణంలోకి మారుతుంది. దీంతో నదిని ఆయన కృష్ణా అంటూ సంబోధిస్తారు. ఆయన పిలుపుతో సంతోషపడిన గంగాదేవి స్వామివారికి ప్రత్యేక్షమై పాదాలు కంది పోకుండా పాదుకలను బహుకరిస్తుంది. అనంతరం నిర్మానుష్యంగా ఉన్న కురుమూర్తి ఏడుకొండలకు స్వామివారు చేరుకుని సేదతీరుతారు. స్వామివారి జాడను తెలుసుకుంటూ పద్మావతిదేవి కురుమూర్తి కొండలకు చేరుకుంటుంది. తిరుమలకు రావాలని స్వామివారిని వేడుకుంటుంది. చివరికి స్వామిని ఒప్పించి ఇద్దరి ప్రతిరూపాలను దేవరగట్టు కాంచనగుహలో వదిలి తిరుమలకు వెళ్లారని చరిత్ర చెబుతుంది. అందుకే కురుమూర్తిస్వామిని ఏడుకొండల వెంకన్నా అంటూ భక్తులు కొలుస్తారు. 12న అలంకారోత్సవం స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నెలరోజుల పాటు స్వామివారికి ముక్కెరవంశపు రాజులు బహుకరించిన బంగారు ఆభరణాలు అలంకరించడం ఆనవాయితీ. ఆత్మకూర్ ఎస్బీఐలో భద్రపర్చిన స్వామివారి బంగారు ఆభరణాలను పోలీసు బందోబస్తు మధ్య ఆత్మకూర్ నుంచి మదనాపురం మండలం కొత్తపల్లి, దుప్పల్లి గ్రామాల మీదుగా మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మం డలంలోని అమ్మాపూర్‌కు తరలిస్తారు. అమ్మాపురంలో సంస్థానాధీశులు రాజా శ్రీరాంభూపాల్ ఇంట్లో ప్రత్యేక పూజల అనంతరం అంబోరు మధ్యన కాలినడకన ఆభరణాలను కురుమూర్తి గిరులకు చేరుస్తారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుం ది. ఉద్దాల ఉత్సవం బ్రహ్మోత్సవాల్లో ఉద్దాలకు ప్రత్యేకత ఉంది. జాతరలో ఇదే ప్రధాన ఘట్టం. ఈ వేడుకకు లక్షలాధి మంది భక్తులు హాజరవుతారు. శివసత్తుల ఆటలు, పాటలతో ఏడుకొండలు మార్మోగుతాయి. చిన్నవడ్డెమాన్ గ్రామ దళితులు వారం పాటు నియమనిష్టలతో ఉంటూ స్వామివారికి పాదుకలను తయారుచేస్తారు. బ్రహ్మోత్సవాల వివరాలు 9వ తేదీ శుక్రవారం : ఉదయం 8గంటలకు అవాహిత దేవతాపూజ, హోమం, సాయంత్రం 6:25 గంటలకు హంసవాహన సేవ 10వ తేదీ శనివారం : సాయంత్రం 6:25 గంటలకు గజవాహనసేవ 11వ తేదీ ఆదివారం : సాయంత్రం 6:30 గంటలకు శేషవాహనసేవ 12వ తేదీ సోమవారం : సాయంత్రం 5:30కి స్వర్ణాభరణాలతో స్వామివారి దర్శనం, రాత్రి 10గంటలకు అశ్వవాహనసేవ 13వ తేదీ మంగళవారం : రాత్రి 9:30 గంటలకు హనుమత్‌వాహన సేవ 14వ తేదీ బుధవారం : సాయంత్రం 6:30 గంటలకు ఉద్దాల ఉత్సవం, రాత్రి 10:45 గరుడవాహన సేవ 15వ తేదీ గురువారం : పుష్పయాగం -
రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి
సిర్పూర్(టి) : రెండు మోటారుసైకిళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని కంచర్‌పేట్ గ్రామసమీపంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. వెంకట్రావుపేటకు చెందిన అన్నదమ్ములు (పెదనాన్న, చిననాన్న కొడుకులు) లొనారే కిశోర్, లొనారే గులాబ్‌రావులు బైక్‌పై కౌటాల మండలంలో జరిగే పెళ్లికి వెళ్తున్నారు. ఎదురుగా బైక్‌పై వస్తున్న దహెగాం మండలం ఇట్యాల గ్రామానికి చెందిన గుజ్జ సురేశ్ ఢీకొట్టాడు. ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సిర్పూర్(టి) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కిశోర్ (35) మృతి చెందాడు. సురేశ్, గులాబ్‌రావు పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మంచిర్యాలకు తరలించారు. అక్కడి నుంచి గులాబ్‌రావ్‌ను కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. కిశోర్‌కు భార్య, కుమారుడు, గులాబ్‌రావుకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కిశోర్ భార్య ప్రస్తుతం గర్భవతి. ఒకే కుటుంబంలో ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆసుపత్రిలో మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సిర్పూర్(టి) అదనపు ఎస్సై పురుషోత్తం తెలిపారు. -
మరక మిగిలింది..!
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారం ముగిశాయి. అయితే, జిల్లా స్థాయిలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు మొదటి నుంచి చెబుతున్నా మరికల్లో ఇంగ్లిష్–1 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వారికి మరక మిగిల్చింది. ప్రారంభం నుండి అంతా సాఫీగానే సాగుతోందని భావిస్తుండగా పేపర్ లీక్ కావడాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు.. అన్ని శాఖల అధికారులను రంగంలోకి దించారు. మరికల్ వ్యవహారంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల పాత్ర ఉన్నట్లు తేలగా.. 13 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో పాటు 11 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో ఒక ఇన్విజిలేటర్ కూడా ఉండడం గమనార్హం. కాగా, ఎస్సెస్సీ పరీక్షల్లో మొత్తం నలుగురు విద్యార్థులను డిబార్ చేశారు. లీక్ వ్యవహారంలో 13 మంది సస్పెన్షన్ మరికల్‌లోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో 19వ తేదీ సోమవారం ఇంగ్లిష్–1 పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే నవీన్ అనే యువకుడు కేంద్రం గోడ దూకి ఓ విద్యార్థి ని ప్రశ్నపత్రాన్ని కిటికీ నుంచి ఫొటో తీసుకుని బయట ఉన్న రెండు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు మోహన్ రాజేందర్, ప్రవీణ్‌కు అందజేశారు. ఆ తర్వాత వారు సమాధానాలు తయారు చేయించి తమ విద్యార్థులకు పంపించారు. ఈ ఘటనలో ఇన్విజిలేటర్ సహా 13 మందిని సస్పెండ్ చేయడంతో పాటు ఓ ఇన్విజిలేటర్‌పై కేసు నమోదు చేసి, వ్యవహారంతో సంబంధం ఉన్న మొత్తం 11 మంది రిమాండ్‌కు తరలించారు. ఇదే ఘటనలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో ముగ్గురు కానిస్టేబుళ్లను కూడా ఎస్పీ అనురాధ సస్పెండ్ చేశారు. ఇది జరిగాక కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్ని శాఖల ఉన్నతాధికారులు రంగంలోకి జిల్లాను జల్లెడ పట్టారు. దాదాపు అన్ని కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి లోపాలను గుర్తించి హెచ్చరికలు జారీ చేశారు. ఇక ధన్వాడ మండలం కొండాపూర్ పాఠశాలలో తనిఖీకి వెళ్లిన ఆర్జేడీ వియజలక్ష్మికి కేంద్రం ఆవరణలో చీటీలు ఎక్కువ కనిపించడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. అలాగే, అక్కడ 11 మంది ఇన్విజిలేటర్లను పరీక్ష విధుల నుండి తప్పించారు. భూత్పూర్లో ఉపాధ్యాయుడు.. భూత్పూర్లోని పదో తరగతి పరీక్ష కేంద్రంలో తనిఖీ సందర్భంగా విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు కలెక్టర్ రొనాల్డ్ రోస్ గుర్తించారు. ఒక గది కిటీకి పక్కన చీటీలు ఎక్కువగా ఉండడంతో ఇన్విజిలేటర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలగా సస్పెండ్ చేశారు. అంతేకాకుండా అదే పరీక్ష కేంద్రం వద్ద ఫిజిక్స్ పేపర్ పరీక్ష రోజు పాత మొల్గర పాఠశాలలో సబ్జెక్టు ఉపాధ్యాయుడు కనిపించగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఉపాధ్యాయుల సస్పెన్షన్‌పై ఉపాద్యాయ సంఘాల నాయకులు కలెక్టర్‌ను కలవగా.. ఆ సమావేశంలో జీహెచ్ఎం సంఘం నాయకుడు, పాత మొల్గర పాఠశాల హెచ్ఎంను కలెక్టర్ మందలించారు. భూత్పూర్ పరీక్ష కేంద్రంలో ఎక్కువగా పాతమొల్గర విద్యార్థులే పరీక్షలు రాస్తున్నారని, అక్కడకు పాఠశాల చెందిన ఉపాధ్యాయులు ప్రతిరోజు ఎందుకు వెళ్తున్నారు, ఏం పని అంటూ ప్రశ్నించారు. చివరి రోజు 20,126 మంది విద్యార్థుల హాజరు ఎస్సెస్సీ పరీక్షల చివరి రోజైన బుధవారం మొత్తం 20,126 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 20,188 మంది విద్యార్థులకు 64 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. చివరి రోజు డీఎల్ఓ ఐదు కేంద్రాల్లో, డీఈఓ ఆరు, ఫ్లయింగ్ స్వా్కడడ్లు 28 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. -
అంతకు మించి
జిల్లాకు వరప్రదాయినిగా మారిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఫలాలు రైతులకు అందుతున్నాయి. రబీలో సాగు చేసిన వేరుశనగ పంట రైతు చేతికి వచ్చింది. బీడు భూముల్లో కృష్ణా జలాలు పారగా రైతులు తమ రెక్కల కష్టంతో పసిడి పంటలుపండించారు. దీంతో జిల్లాలోని ప్రధాన వ్యవసాయ మార్కెట్లన్నీ రబీ వేరుశనగతో కిటకిటలాడుతున్నాయి. సాక్షి, నాగర్‌కర్నూల్ : రబీ పంటలు చేతికొచ్చాయి. జిల్లాలో ఎక్కడ చూసినా వేరుశనగ రైతుల సందడే కనిపిస్తోంది. ట్రాక్టర్లు, ఆటోలు, ఎద్దుల బండ్లన్నీ మార్కెట్‌యార్డుల చెంతకే వెళ్తున్నాయి. వారంపదిరోజులుగా అయితే వేలాది బస్తాల వేరుశనగ ప్రతిరోజూ ఆయా మార్కెట్లకు తరలి వస్తుందంటే నమ్మశక్యం కావడంలేదు. సరుకును కొనేందుకు స్థానిక వ్యాపారులే కాక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకకు చెందిన వారు సైతం ఇక్కడ నుంచే కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగా వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగానే మార్కెట్లలో ధర లభిస్తోంది. జిల్లా లో అత్యధికంగా క్వింటాల్‌కు రూ.5వేలకు పైగా ధర లభిస్తుండటంతో రైతుల ము ఖాల్లో ఆనందం కనిపిస్తోంది. ఈ ధర రై తుల కష్టాలను పూర్తిగా తీర్చనప్పటికీ ఆ రువేల పైచిలుకు ధర లభిస్తే రైతులకు కొంత లాభం చేకూరే అవకాశాలున్నాయి. కలిసొచ్చిన తుంపర సేద్యం ఆరుగాలం శ్రమించే జిల్లా రైతాంగానికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువల ద్వారా కృష్ణా జలాలు పొలాల గుండా పారాయి. 2017 అక్టోబర్ నుంచి కాలువల నుంచి నీరు పారుతుండటంతో రైతులు ధైర్యంగా రబీ పంటకు శ్రీకారం చుట్టారు. దీనికితోడు భూగర్భ జలాలు మెరుగు పడటంతో తుంపర సేద్యం ద్వారా వేరుశనగను భారీగా సాగు చేశారు. సాధారణ సాగు విస్తీర్ణం 69వేల 887 ఎకరాలు కాగా ఈసారి లక్షా 30వేల ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలోనే కందనూలు జిల్లాలో అత్యధికంగా వేరుశనగ సాగైనట్టు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మూడు ప్రధాన మార్కెట్లలో పెరిగిన వ్యాపారం జిల్లాలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని వ్యవసాయ మార్కెట్లకు పెద్ద ఎత్తున వేరుశనగ తరలివస్తోంది. నేరుగా కమీషన్ ఏజెంట్లే రైతుల నుంచి వేరుశనగను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనప్పటికీ వేరుశనగ డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వ మద్దతు ధరను మించి ధర లభిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటి వరకు గత 15 రోజుల నుంచి వేరుశనగ లావాదేవీలలో గరిష్టంగా క్వింటాల్‌కు రూ.5039 చెల్లించి ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. కనిష్టంగా రూ.4029 జిల్లాలో వేరుశనగ ధర నమోదైంది. సరాసరిగా రూ.4735 క్వింటాల్‌కు ప్రైవేటు వ్యాపారులు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు జిల్లాలో ప్రైవేటు వ్యాపారులు 28వేల 991 క్వింటాళ్ల వేరుశనగను కొనుగోలు చేశారు. వేరుశనగ విక్రయాలు మరో 20 రోజులపాటు ఇదేవిధంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో సాగయిన వేరుశనగ విస్తీర్ణంలో కేవలం 25 శాతం మాత్రమే ఇప్పటి వరకు రైతుల చేతికి వచ్చింది. మొత్తం పంట దిగుబడి అంచనా ఒక లక్షా 61వేల 140 మెట్రిక్ టన్నులుగా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఎకరాకు 6 నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. స్థలాభావంతో ఇబ్బందులు జిల్లాలోని రబీ పంట ఒక్కసారిగారైతుల చేతికి రావడంతో మార్కెట్ యార్డులలో స్థలాలు సరిపోక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల రాష్ట్ర మార్కెటింగ్ శాఖా మంత్రి హరీశ్‌రావు జిల్లాలో పర్యటించిన సందర్భంలో వసతులు పెంచాలని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో రైతులకు మార్కెట్ యార్డులలో పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ రైతులు విశ్రాంతి తీసుకునేందుకు భవనాలు లేకపోవడం, భోజనం చేయటానికి వేర్వేరుగా రూములు లేకపోవడంతో ఆరు బయటనే భోజనాలు చేసి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. మలమూత్ర విసర్జనకు సైతం మూత్రశాలలు లేకపోవడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. మార్కెట్ చుట్టూ ప్రహరీ గోడ లేక పందుల బెడదతో పంటకు రక్షణ లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ పనులకు కూలీల కొరత అధికమైంది. వేరుశనగ పంట తొలగింపునకు ఒక్కో మహిళా కూలీకి రూ.300 దాకా కూలి చెల్లించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా కూలీలు దొరకక చాలామటుకు భూముల్లోనే వేరుశనగ మిగిలి ఉంది. ఇలా మరికొద్ది రోజులు గడిస్తే వేరుశనగ కాయలు మొలకెత్తే ప్రమాదం లేకపోలేదు. వ్యవసాయ శాఖాధికారులు వేరుశనగ పంట తీసేందుకు ప్రత్యేకంగా యంత్రాల వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ముందస్తు వ్యూహం లేక రైతులకు వచ్చే లాభమంతా కూలీలకే చెల్లించాల్సి వస్తోంది. ఒక ఎకరం వేరుశనగ సాగుకు రూ.10వేలు విత్తనాలకు, మరో 10వేలు ఎరువులు, కూలీల ఖర్చులు అవుతాయి. ఇలా ఎకరానికి ఒక్కో రైతు రూ.20వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎకరా దిగుబడి సరాసరి ఐదు క్వింటాళ్లు అనుకుంటే రైతుకు ప్రస్తుతం అందుతున్న ధర ప్రకారం రూ.25వేలు చేతికొస్తాయి. అంటే రైతు పెట్టిన పెట్టుబడి రూ.20వేలు పోగా ఎకరాకు కేవలం రూ.5వేలు మాత్రమే రైతు చేతికి అందుతుండటంతో నష్టం లేకుండా రైతులు కొద్దిపాటి లాభంతో బయట పడుతున్నారు. కొల్లాపూర్ మార్కెట్ నిరుపయోగం కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మార్కెట్ యార్డు ఉన్నా అక్కడి మార్కెట్లో వేరుశనగ కొనుగోలు చేసే ట్రేడర్లు లేక ఆ ని యోజకవర్గంలోని రైతులంతా నాగర్‌కర్నూ ల్ మార్కెట్ యార్డుకు తరలి వస్తున్నారు. దీంతో వారికి ట్రాన్స్‌పోర్టు ఖర్చు అధికంగా వస్తోంది. మిగిలే ఆ డబ్బులు కూడా రైతులు పొందలేకపోతున్నారు. అధికారులు అక్కడే కొనుగోళ్లు ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని రైతులు కోరుతున్నారు. కొల్లాపురం నుంచి వచ్చినా.. నాలుగు ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేశాను. 27 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అయితే కొల్లాపూర్ మార్కెట్లో వ్యాపారులు లేక ఇంత దూరం రావాల్సి వచ్చింది రూ.3వేలు పెట్టి ట్రాక్టర్ కిరాయి తీసుకుని నాగర్‌కర్నూల్ మార్కెట్‌కు వచ్చాను. ఇక్కడ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.4729 చొప్పున 94 బస్తాలను కొన్నారు. – శ్రీను, ఎల్లూరు, కొల్లాపూర్ మండలం అందరూ ప్రైవేట్‌లోనే విక్రయిస్తున్నారు.. ప్రస్తుతం జిల్లాలో అన్ని మార్కెట్ యార్డుల్లో వేరుశనగ ప్రభుత్వ మద్దతు ధర కంటే ప్రైవేటుగానే రైతులకు అధికంగా వస్తుండటంతో ఎవరూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. రానున్న రోజుల్లో ప్రైవేటు వ్యాపారుల వద్ద ధర తగ్గితే అప్పుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ప్రారంభించి ధాన్యం కొంటాం. – బాలమణి, మార్కెటింగ్ ఏడీ -
ఎట్టకేలకు చిక్కిన యాక్టివాల దొంగ
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం: హోండ కంపెనీ వాహనాలకు ఫైనాన్స్ ఇచ్చే కార్యాలయంలో రికవరీ ఎజెంట్‌గా పని చేసిన అనుభవం ఉండటం వల్ల కేవలం హోండా కంపెనీకి చెందిన యాక్టివా స్కూటర్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేశాడు. రోడ్డుపై..వివిధ పెళ్లిల సమయంలో పంక్షన్ హాల్స్‌లలో పార్క్ చేసిన వాటిని మాత్రమే దొంగలిస్తూ వచ్చాడు. ఎట్టకేలకు హోండా యాక్టివాల దొంగను పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ బి.అనురాధ మంగళవారం వివరాలను మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌లోని మీర్ ఆలం మండి ప్రాంతానికి చెందిన మీర్ షబ్బీర్ అలీ మహబూబ్‌నగర్ నుంచి హోండా యాక్టివాపై జడ్చర్ల వైపు వెళ్తుంటే రూరల్ ఎస్ఐ ఖాజాఖాన్ ఏనుగొండ దగ్గర అతణ్ణి పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఫైజల్ అనే వ్యక్తితో కలిసి షబ్బీర్ అలీ గత మూడు నెలల కాలంలో హైదరాబాద్‌లోని రాచకొండ పరిధిలో చోరీ చేసిన 15ద్విచక్ర వాహనాలు, మహబూబ్‌నగర్‌లో చేసిన రెండు ద్విచక్ర వాహనాల చోరీల గురించి విచారణలో అంగీకరించాడు. చోరీ చేసిన 17వాహనాలను జిల్లా కేంద్రంలోని సద్దలగుండు ప్రాంతానికి చెందిన నదీం ఇంట్లో ఉంచాడు. వాటిని ఇప్పటికే వేరు వేరుగా 17మందికి ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున విక్రయించాడు. వాటిని వారం రోజుల్లో తీసుకువెళ్లాలని చెప్పాడు. ఈ క్రమంలోనే అతను పోలీసులకు పట్టుపడటంతో నదీం ఇంట్లో ఉంచిన 17యాక్టివ వాహనాలను రికవరీ చేశారు. వాటి విలువ రూ.10లక్షల 20వేలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. రికవరీ ఎజెంట్ అనుభవంతోనే హైదరాబాద్‌లోని చార్మినార్ మీర్ అలం మండి ప్రాంతానికి చెందిన షబ్బీర్ అలీ గతంలో మణికొండలో హోండా కంపెనీకి సంబంధించిన ద్విచక్ర వాహనాలకు రుణాలు ఇచ్చే కార్యాలయంలో రికవరీ ఎజెంట్‌గా పనిచేశాడు. హైదరాబాద్‌కు చెందిన ఫైజల్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుని కేవలం హోండా కంపెనీకి చెందిన యాక్టివా వాహనాలను లక్ష్యం చేసుకుని చోరీలు చేయడం మొదలుపట్టి పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే షబ్బీర్ అలీ గతంలో చెన్ స్నాచింగ్ కేసులలో జైలు శిక్ష కూడా అనుభవించాడని పోలీసులు తెలిపారు. -
మనవి వర్షాధార పంటలే!
ప్రధాన పంటలు : కంది, మొక్కజొన్న సాగు విస్తీర్ణం : 2.43లక్షల హెక్టార్లు సాగునీరు : కేవలం 9వేల హెక్టార్లే సాగునీటి వనరులు : కోయిల్‌సాగర్, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకాలు మహబూబ్‌నగర్ వ్యవసాయం : ఇకనుంచి మన జిల్లావన్నీ వర్షాధార పంటలే. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 7.60 లక్షల హెక్టార్లలో సాగు విస్తీర్ణం ఉండగా జిల్లాల విభజనతో సగటు విస్తీర్ణం 2.43లక్షల హెక్టార్లకు చేరుకుంది. ఇప్పుడున్న 26 మండలాల్లో ప్రధానంగా రైతులు కంది, మొక్కజొన్నపంటలనే సాగుచేస్తారు. సాగునీటి ప్రధాన వనరులున్న మండలాలు ఇతర జిల్లాలోకి వెళ్లడంతో ప్రస్తుతం పాలమూరు రైతులు వర్షాధార పంటలపై ఆధారపడాల్సిన పరిస్థితులున్నాయి. వరి సాగు కష్టమే.. జిల్లాలో సాగునీటి వనరులు తక్కువగా ఉండడంతో వరి సాగు కష్టతరం కానుంది. గతం నుంచి కూడా జిల్లా రైతులు బోర్లపై ఆధారపడి వరి పంటను సాగు చేస్తుంటారు. అయితే జిల్లాలో సగటుకు మించి వర్షాలు కురిస్తేనే బోర్లలో నీటిమట్టం పెరిగి పంటలను సాగు చేసుకునే వీలుంటుంది. వరుసగా నాలుగేళ్లు లోటు వర్షపాతం నమోదు కావడంతో భూగర్భజలాలు అడుగంటాయి. ఈ ఏడాది సగటుకు మించి వర్షాలు కురిసినా చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండలేదు. దీంతో బోర్లలో నీటిమట్టం పెరుగలేదు. ఈ కారణంగా జిల్లాలో వరి పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి జిల్లాలో 99వేల హెక్టార్లలో వరి సాగవ్వగా ప్రస్తుతం 36వేలకు పడిపోయింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో అయితే 19వేల హెక్టార్లలో మాత్రమే వరి పంటలు సాగు చేశారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో కంది, మొక్కజొన్న పంటలు ప్రధానమైనవి. గత ఖరీఫ్‌లో జిల్లా సగటు సాగు విస్తీర్ణం 2.43లక్షల హెక్టార్లుగా నమోదవ్వగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.44హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అందులో ప్రధానంగా కంది పంట సాధారణ సాగు 57వేల హెక్టార్లు. ఈ ఖరీఫ్‌లో 1.03లక్షల హెక్టార్లలో సాగుచేశారు. అలాగే మొక్కజొన్న సగటు సాగు విస్తీర్ణం 32వేల హెక్టార్లు. ఈ ఖరీఫ్‌లో 45వేల హెక్టార్లలో సాగు చేశారు. అలాగే పత్తి 54వేల హెక్టార్లు, ఈ ఏడాది 22వేల హెక్టార్లు, జొన్న 13వేల హెక్టార్లు కాగా రైతులు 16వేల హెక్టార్లలో సాగుచేశారు. కోయిల్‌సాగర్, రాజీవ్ భీమా ఎత్తిపోతలతో.. జిల్లాలో సాగునీటి పథకాలైన కోయిల్‌సాగర్ రిజర్వాయర్, రాజీవ్ భీమా ఎత్తిపోతల ప్రాజెక్టులే సాగునీటికి ప్రధాన వనరులుగా మారాయి. కోయిల్‌సాగర్ రిజర్వాయర్ కింద 4726 హెక్టార్లు, రాజీవ్ భీమా ఎత్తిపోతల ప్రాజెక్ట్ కింద 4200 హెక్టార్లకు మాత్రమే సాగు నీరు అందనుంది. అయితే కల్వకుర్తి మూడోవిడత ఎత్తిపోతల పథకం పనులు పూర్తయితే మరో 2500హెక్టార్లకు సాగునీరందే అవకాశం ఉంటుంది.