సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం ఉదయం కర్ణాటక నుంచి తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు ప్రవేశించనున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అటు హైదరాబాద్ నుంచి మక్తల్ మీదుగా రాయచూర్‌కు.. ఇటు దేవరకద్ర, మరికల్ నుంచి మక్తల్ గుండా రాయచూర్‌కు వెళ్లే వాహనాలను దారి మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
డైవర్షన్ ఇలా..
హైదరాబాద్ నుంచి మక్తల్ మీదుగా రాయచూర్‌కు వెళ్లే వాహనాలను గద్వాల్ మీదుగా డైవర్షన్ చేయనున్నారు. జడ్చర్ల, భూత్పూర్, మహబూబ్‌నగర్ వన్ టౌన్ వద్ద ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. దేవరకద్ర, మరికల్ నుంచి మక్తల్, రాయచూర్‌కి వెళ్లే వాహనాలను, అమరచింత, జూరాల, ధరూర్, కేటిదొడ్డి మీదుగా దారి మళ్లించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment