
మహబూబ్‌నగర్: ఇంటివద్ద చీరతో కట్టిన ఊయలలో ఆడుకుంటున్న ఓ బాలిక ప్రమాదవశాత్తు ఉరిపడి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. సిద్దాపూర్ హెడ్‌కానిస్టేబుల్ రెడ్యానాయక్ కథనం ప్రకారం.. బొమ్మన్‌పల్లికి చెందిన పరశురాములు చిన్న కూతురు శ్రావణి(10) ఇంటి ఆరుబయట చీరతో కట్టిన ఊయలలో శుక్రవారం ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బాలిక మెడకు ఉరి పడింది.
వెంటనే కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వచ్చి ఊయల నుంచి తీశారు. అపస్మారక స్థితికి వెళ్లిన బాలికను వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం నాగర్‌కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడి నుంచి హైదరాబాద్ రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ బాలిక శనివారం మృతి చెందింది. కుటుంబ సభ్యుడు భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment