nagar kurnool town
-
ఉరితాడై.. ఉసురు తీసిన 'ఊయల' !
మహబూబ్‌నగర్: ఇంటివద్ద చీరతో కట్టిన ఊయలలో ఆడుకుంటున్న ఓ బాలిక ప్రమాదవశాత్తు ఉరిపడి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. సిద్దాపూర్ హెడ్‌కానిస్టేబుల్ రెడ్యానాయక్ కథనం ప్రకారం.. బొమ్మన్‌పల్లికి చెందిన పరశురాములు చిన్న కూతురు శ్రావణి(10) ఇంటి ఆరుబయట చీరతో కట్టిన ఊయలలో శుక్రవారం ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బాలిక మెడకు ఉరి పడింది. వెంటనే కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వచ్చి ఊయల నుంచి తీశారు. అపస్మారక స్థితికి వెళ్లిన బాలికను వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం నాగర్‌కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడి నుంచి హైదరాబాద్ రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ బాలిక శనివారం మృతి చెందింది. కుటుంబ సభ్యుడు భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. -
వైభవంగా సామూహిక వివాహ వేడుకలు
-
ఒకే వేదికపై ఒక్కటైన 102 జంటలు
నాగర్‌కర్నూల్ : మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే, ఎంజేఆర్ ట్రస్టు చైర్మన్ మర్రి జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం 102 జంటలకు సామూహిక వివాహాలు జరిగాయి. ఒకే ముహూర్తంలో (ఉదయం 11.05 గంటలకు) 102 జంటలు ఒక్కటయ్యాయి. ఈ అపూర్వ వేడుకకు నాగర్‌కర్నూలు పట్టణంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల వేదికయింది. ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించి మంగళసూత్రం అందజేశారు. అలాగే నూతన వధూవరులకు మెట్టెలు, బీరువా, మంచం, పరుపు, వంట సామగ్రితో పాటు పలు వస్తువులను అందజేశారు. ఈ వివాహ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతమంతా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఓ వేదికపై 102 జంటలు ఒక్కటవుతున్న వేళ
మహబూబ్‌నగర్ : ఒకే ముహూర్తంలో (శుక్రవారం ఉదయం 11.05 గంటలకు) 102 జంటలు ఒక్కటవబోతున్నాయి. అదీ ఒకే వేదికపై. ఈ అపూర్వ వేడుకకు మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శుక్రవారం వేదిక అయింది. ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఈ సామూహిక వివాహాలను నిర్వహిస్తున్నారు. అందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వివాహ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.