ఒకే వేదికపై ఒక్కటైన 102 జంటలు
నాగర్‌కర్నూల్ : మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే, ఎంజేఆర్ ట్రస్టు చైర్మన్ మర్రి జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం 102 జంటలకు సామూహిక వివాహాలు జరిగాయి. ఒకే ముహూర్తంలో (ఉదయం 11.05 గంటలకు) 102 జంటలు ఒక్కటయ్యాయి. ఈ అపూర్వ వేడుకకు నాగర్‌కర్నూలు పట్టణంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల వేదికయింది. ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించి మంగళసూత్రం అందజేశారు. అలాగే నూతన వధూవరులకు మెట్టెలు, బీరువా, మంచం, పరుపు, వంట సామగ్రితో పాటు పలు వస్తువులను అందజేశారు.
ఈ వివాహ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతమంతా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.