సాక్షి, మహబూబాబాద్: మహిళలను వేధింపులకు గురి చేస్తున్న నకిలీ బాబా గుట్టురట్టయ్యింది. మహిళా సంఘాలు అతడికి దేహశుద్ధి చేసి మరీ పోలీసులకు అప్పగించారు. రెండు నెలలగా ఓ మహిళను నగ్న వీడియోలు ఉన్నాయంటూ బెదిరింపులకు గురిచేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో ఓ నకిలీ బాబా మహిళలను తన మాయమాటలతో లోబర్చుకుని వారిని వేధిపులకు గురి చేయడం వంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు.
అతను మహిళలను క్షద్ర పూజల పేరుతో లోబర్చుకుని నగ్న వీడియోలు తీసి డబ్బులు డిమాండ్ చేయడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యంతో హైదరాబాద్‌కు చెందిన మహిళ ఈ నకిలీ బాబాను ఆశ్రయించగా.. ఇదే అదునుగా తీసుకుని ఆమెను వేధిపులుకు గురి చేయడం ప్రారంభించాడు. గత రెండు నెలలుగా ఆ మహిళను నగ్న వీడియోలు ఉన్నాయని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు.
ఇక అతడి వికృత చేష్టలకు తాళలేక ఆ మహిళ సంఘాలను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన మహిళా సంఘాలు రెక్కీ నిర్వహించి మరీ ఆ దొంగ బాబాను పట్టుకుని అతడికి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత అతనని పోలీసులకు అప్పగించారు.
(చదవండి: అప్సర కేసు: అర్థరాత్రి జడ్జి ముందుకు.. పూర్తికాని అటాప్సీ! సాయికృష్ణ అమాయకుడా?)
Comments
Please login to add a commentAdd a comment