Womens Association
-
నకిలీ బాబా గుట్టురట్టు..దేహశుద్ధి చేసిన మహిళా సంఘాలు
సాక్షి, మహబూబాబాద్: మహిళలను వేధింపులకు గురి చేస్తున్న నకిలీ బాబా గుట్టురట్టయ్యింది. మహిళా సంఘాలు అతడికి దేహశుద్ధి చేసి మరీ పోలీసులకు అప్పగించారు. రెండు నెలలగా ఓ మహిళను నగ్న వీడియోలు ఉన్నాయంటూ బెదిరింపులకు గురిచేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో ఓ నకిలీ బాబా మహిళలను తన మాయమాటలతో లోబర్చుకుని వారిని వేధిపులకు గురి చేయడం వంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. అతను మహిళలను క్షద్ర పూజల పేరుతో లోబర్చుకుని నగ్న వీడియోలు తీసి డబ్బులు డిమాండ్ చేయడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యంతో హైదరాబాద్‌కు చెందిన మహిళ ఈ నకిలీ బాబాను ఆశ్రయించగా.. ఇదే అదునుగా తీసుకుని ఆమెను వేధిపులుకు గురి చేయడం ప్రారంభించాడు. గత రెండు నెలలుగా ఆ మహిళను నగ్న వీడియోలు ఉన్నాయని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. ఇక అతడి వికృత చేష్టలకు తాళలేక ఆ మహిళ సంఘాలను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన మహిళా సంఘాలు రెక్కీ నిర్వహించి మరీ ఆ దొంగ బాబాను పట్టుకుని అతడికి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత అతనని పోలీసులకు అప్పగించారు. (చదవండి: అప్సర కేసు: అర్థరాత్రి జడ్జి ముందుకు.. పూర్తికాని అటాప్సీ! సాయికృష్ణ అమాయకుడా?) -
ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం
మన ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో పొదుపు సంఘాల పని తీరు ఎలా మారిందో అందరికీ కనిపిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్న పొదుపు సంఘాల ఉద్యమం మళ్లీ ఊపిరి పోసుకుంది. తద్వారా ఈ రోజు 91 శాతానికి పైగా సంఘాలు ఏ, బీ గ్రేడ్లలో కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 18 శాతం సంఘాలు ఎన్పీఏలు.. ఓవర్ డ్యూస్గా ఉంటే, ఈ రోజు అది కేవలం 0.45 శాతం మాత్రమే. అక్కచెల్లెమ్మల పట్ల మన ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని.. అక్క చెల్లెమ్మలకు విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కల్పించాలని తపిస్తున్న ప్రభుత్వమని, ఇక్కడికి విచ్చేసిన తన అక్కచెల్లెమ్మలే ఇందుకు నిదర్శనమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మహిళలు అన్ని విధాలుగా ఎదగాలని, బాగు పడాలని.. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి రావాలన్న తపన, తాపత్రయంతో గత 45 నెలల పాలన సాగిందని చెప్పారు. ఇప్పటిదాకా వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు రూ.2.25 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఏలూరు జిల్లా దెందులూరులో శనివారం ఆయన వైఎస్సార్ ఆసరా పథకం కింద మూడో విడత నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పది రోజుల పాటు ప్రతి మండలంలో జరగబోయే ఆసరా సంబరాల్లో రాష్ట్రంలో 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా రూ.6,419 కోట్లు జమ చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కేవలం 45 నెలల్లోనే మహిళా సాధికారత విషయంలో మనందరి ప్రభుత్వం తీసుకు వచ్చిన మార్పులు, ఫలితాలు ఎంత గొప్పగా ఉన్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ‘నా పాదయాత్ర సందర్భంగా ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ మీ తమ్ముడిగా, అన్నగా మాటిచ్చాను. ఆ రోజు నేను విన్నాను, నేను మీ బాధలు చూశాను, నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తోడుగా ఉంటూ వచ్చాను. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 2019 మార్చి 31 వరకు ఉన్న రూ.25,500 కోట్లకు పైగా రుణాల విషయంలో తోడుగా ఉంటామని చెప్పాం. తద్వారా 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే రెండు వాయిదాల్లో రూ.12,758 కోట్లు ఇచ్చాం. ఈ రోజు నుంచి ప్రారంభమై.. పది రోజుల పాటు జరిగే ఆసరా పండగ కార్యక్రమంలో మరో రూ.6,419 కోట్లు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి. మొత్తంగా రూ.19,178 కోట్లు లబ్ధి చేకూర్చాం’ అని చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం వ్యాపార పరంగా అండగా నిలిచాం ► పొదుపు సంఘాలకు ఇస్తున్న ఆసరా డబ్బు ఎలా ఖర్చు చేసుకోవాలన్నది అక్కచెల్లెమ్మల అభిమతానికి వదిలి పెట్టాం. వీటిని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం లేదా స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంది. ► తోడ్పాటు అందించడానికి వ్యాపార దిగ్గజ సంస్థలైన ఎల్ అండ్ టీ, పీ అండ్ జీ, రిలయన్స్, ఐటీసీ, అమూల్, అల్లానా, మహేంద్రా గ్రూప్, తానాగేర్, కాల్ గుడి, హిందూస్తాన్ యూనీ లీవర్ వంటి కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని బ్యాంకులకు కూడా అనుసంధానం చేసి ప్రతి అక్కచెల్లెమ్మలకు వ్యాపార మార్గాలు చూపించేలా అడుగులు వేస్తోంది. ► ఈ 45 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం చూపిన శ్రద్ధ వల్ల అక్కచెల్లెమ్మలకు ఈరోజు నిత్యావసర సరుకుల షాపులు, వస్త్ర వ్యాపారం, ఆవులు, గేదెల ద్వారా పాడి, గొర్రెలు, మేకల పెంపకం, పౌల్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, చేపల పెంపకం, కూరగాయలు, పండ్ల తోటలు, హస్తకళలతో పాటు తమకు నైపుణ్యం ఉన్న ఇతర మార్గాల్లో పెద్ద ఎత్తున వీరందరికీ స్వయం ఉపాధి మార్గాలు చూపించింది. ► ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి అనేక కార్యక్రమాలను క్రోడీకరించాం. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 9,86,616 మంది అక్కచెల్లెమ్మలకు బ్యాంకుల ద్వారా రూ.4,355 కోట్లను అనుసంధానం చేశాం. వారంతా ఇవాళ వివిధ రకాల వ్యాపారాలలో నిమగ్నమై వాళ్ల కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2014–2019 మధ్య పొదుపు సంఘాలకు సంబంధించి రూ.14 వేల కోట్ల బ్యాంకు రుణాలు ఇస్తే, ఇవాళ అక్కచెల్లెమ్మలకు సగటున రూ.30 వేల కోట్ల రుణాలు మన ప్రభుత్వం ద్వారా అందుతున్నాయి. వైఎస్సార్ ఆసరా మూడో విడత సాయం కింద లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్ మన పొదుపు సంఘాల వైపు ఇతర రాష్ట్రాల చూపు ► వివిధ బ్యాంకుల ద్వారా ఈ సంఘాలకు ఏటా రూ.30 వేల కోట్లకు పైగా రుణాలు అందుతుండగా.. వాటిని చెల్లించే విషయంలో 99.55 శాతం రికవరీ ఉంది. అంటే ప్రతి అక్కచెల్లెమ్మ తీసుకున్న రుణాల్లో 99.55 శాతం తిరిగి చెల్లిస్తూ.. దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచారు. తద్వారా మన రాష్ట్రంలో ఏం జరుగుతోందని మిగిలిన రాష్ట్రాల వారు వచ్చి పొదుపు సంఘాల విప్లవాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. ► ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి పొదుపు సంఘాలకిచ్చే రుణాల వడ్డీ శాతాన్ని తగ్గించింది. ఇంతకు ముందు రూ.3 లక్షల రుణానికి 13 శాతం ఉండే వడ్డీని 7 శాతానికే తగ్గించాం. రూ.5 లక్షల రుణంపై వడ్డీ 13 శాతం ఉంటే 9.5 శాతానికి తగ్గించాం. ఈ వడ్డీ శాతం ఇంకా తగ్గించేలా బ్యాంకర్లపై ఒత్తిడి తీసుకువస్తాం. ► అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని ఇంత బాధ్యతగా చేస్తున్నాం. వారు ఏం వ్యాపారం చేస్తున్నారు? ఆదాయం ఎంత వస్తుంది? ఏ మేరకు వడ్డీ రీజనబుల్? ఎంత శాతం కన్నా వడ్డీ ఎక్కువ ఉండకూడదు.. తదితర విషయాలు చెప్పి, మీ తరఫున బ్యాంకులతో మాట్లాడుతూ బాధ్యతగా అడుగులు వేస్తున్న ప్రభుత్వమిది. పొదుపు సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ నాడు రుణ మాఫీ కాదు.. పథకాలే రద్దు ► చంద్రబాబు హయాంలో అక్కచెల్లెమ్మలందరికీ రుణాలు మాఫీ చేస్తాం.. ఎన్నికల వేళ ఎవరూ వాటిని కట్టొద్దని చెప్పారు. ఎన్నికలయ్యాక అక్కచెల్లెమ్మలతో పని అయిపోవడంతో ఆ హామీని గాలికి వదిలేశారు. వారి రుణాల మాఫీ కథ దేవుడెరుగు.. 2016 అక్టోబర్ నుంచి వారి తరఫున కట్టాల్సిన సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసిన దుస్థితి చూశాం. ► అలాంటి దారుణమైన పరిస్థితుల్లో అక్కచెల్లెమ్మలకు తోడుగా, అండగా ఉంటూ బ్యాంకులకు వాళ్లు కట్టాల్సిన వడ్డీని చెల్లిస్తున్నాం. 2016 అక్టోబర్‌లో నిలిచిపోయిన సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి తీసుకువచ్చి రూ.3,615 కోట్లు సున్నా వడ్డీ కింద కింద చెల్లించాం. తద్వారా మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి గర్వ పడుతున్నాం. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ► జగనన్న అమ్మఒడి ద్వారా 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు, 82 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ.. రూ.19,674 కోట్లు సాయం చేశాం. వైఎస్సార్ చేయూత ద్వారా 26.39 లక్షల మందికి రూ.14,219 కోట్లు లబ్ధి చేకూర్చాం. వైఎస్సార్ కాపునేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1,518కోట్లు, ఈబీసీనేస్తం ద్వారా మరో 3.94 లక్షల మందికి రూ.596 కోట్లు అందించాం. ► వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ ద్వారా ఇంకో రూ.22,793 కోట్లు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టాం. విద్యా దీవెన ద్వారా 26.99 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లల చదువుల కోసం రూ.9,947 కోట్లు ఇచ్చాం. వసతి దీవెన ద్వారా మరో 22.58 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లల వసతి, భోజన సౌకర్యం కోసం రూ.3,363 కోట్లు ఇచ్చాం. ► 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని వారి పేరుతో ఇళ్ల పట్టాలిచ్చాం. వీరిలో 22 లక్షల మంది ఇప్పటికే ఇళ్లు కట్టడం ప్రారంభించారు. ఆ ఇళ్లు పూర్తయితే ఒక్కో ఇంటి విలువ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వేసుకున్నా.. ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో అంత డబ్బు పెట్టినట్టు అవుతుంది. ఇవన్నీ పూర్తయితే ఈ ఒక్క పథకం ద్వారానే రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు వారి చేతిలో పెట్టినట్లవుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు రోజా, తానేటి వనిత, ఉషాశ్రీచరణ్, కొట్టు సత్యనారాయణ, విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ 50% ► నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పోస్టులు అక్కచెల్లెమ్మలకే రావాలని ఏకంగా అసెంబ్లీలోనే చట్టం చేశాం. నామినేషన్ ద్వారా ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో కూడా 50 శాతం ఇవ్వాలని చట్టం చేశాం. ఏ రాజకీయ పదవి చూసినా.. ఎంపీపీ నుంచి జెడ్పీ చైర్పర్సన్ వరకు, మున్సిపల్ చైర్మన్ నుంచి కార్పొరేషన్ మేయర్ వరకు గుడి చైర్మన్ నుంచి ఏఎంసీ చైర్మన్ పదవుల వరకు ఏ పదవిలో చూసినా 50 శాతం అక్కచెల్లెమ్మలు కనిపిస్తున్నారు. ► అక్కచెల్లెమ్మలు ఎక్కడకు వెళ్లినా ధైర్యంగా వెళ్లాలని, వారి రక్షణ కోసం దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా దిశ యాప్‌ను తీసుకొచ్చాం. దీని ద్వారా 1.17 కోట్ల మంది ఈ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎవరికి ఆపద వచ్చినా ఎక్కడికి వెళ్లినా యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కినా, లేక సెల్‌ఫోను ఐదు సార్లు ఊపినా వెంటనే పోలీసు సోదరుడు పది నిమిషాల్లో అక్కడికి చేరుకుని అండగా నిలిచే గొప్ప వ్యవస్థను తీసుకొచ్చాం. ఈ రోజు దిశ యాప్ ద్వారా 26 వేల మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరిగింది. ఈ ప్రభుత్వం.. మీ ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం.. వివక్ష మీద పోరాటం చేస్తున్న ప్రభుత్వం. కోట్ల మంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం. ప్రతి రూపాయి కూడా మన అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతుంది. వారికి ఇస్తే కుటుంబాలు బాగు పడతాయని నమ్మిన ప్రభుత్వం ఇది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మహిళా సంక్షేమం మీద ఇన్ని రంగాలలో వారిని అభివృద్ధి పథం మీద నడిపించాలని తపన పడుతోంది. వారి రక్షణ మీద కూడా మనలా దృష్టి పెట్టిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. బాబు మోసం చేస్తే.. జగన్ ఆదుకున్నారు సీఎం వైఎస్ జగన్ సహకారంతో దెందులూరులో రూ.1900 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. రూ.85 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్, రూ.70 కోట్లతో మంచినీటి పథకం, నూజివీడు – దెందులూరు మధ్య తమ్మిలేరుపై బ్రిడ్జి శంకుస్థాపన, సీహెచ్‌సీ ప్రారంభోత్సవం సీఎం చేతుల మీదుగా జరగడం ఆనందంగా ఉంది. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని నాడు చంద్రబాబునాయుడు ఇదే దెందులూరులో హామీ ఇచ్చి మోసం చేశారు. సీఎం జగన్ చెప్పిన మాట మేరకు డ్వాక్రా రుణాల చెల్లింపు దిశగా దెందులూరు వేదికగా మరో అడుగు మందుకు వేయడం ఆనందంగా ఉంది – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు ఎమ్మెల్యే కలకాలం సీఎం చల్లగా ఉండాలి వైఎస్సార్ ఆసరా కార్యక్రమం మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ పథకం ద్వారా మా గ్రూప్ సభ్యులకు రూ.2.95 లక్షలు వచ్చాయి. నా వాటాగా రూ.27,400 దక్కాయి. గత రెండు విడతల ఆసరా కార్యక్రమం ద్వారా అందిన మొత్తాలతో కుట్టు మిషన్, జిగ్ జాగ్ మిషన్ కొనుగోలు చేసి, టైలరింగ్ ద్వారా రోజుకు రూ.500 నుంచి రూ.700 వరకు సంపాదిస్తున్నా. పిల్లలను చదివించుకుంటున్నా. చిన్న కొడుకు 8వ తరగతి చదువుతున్నాడు. జగనన్న ఇచ్చిన ట్యాబ్‌తో బాగా చదివి క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్‌లో నిలిచాడు. కలకాలం మీరు (సీఎం) చల్లగా ఉండాలి. – ఎండీ.రుబీనా బేగం, 48వ డివిజన్, ఏలూరు మహిళల జీవితాల్లో వెలుగులు వైఎస్సార్ ఆసరా ద్వారా మా గ్రూపునకు రూ.5 లక్షలు అందింది. ఇందులో నా వాటాకు తోడుగా ఉన్నతి, స్త్రీనిధి ద్వారా రుణాలు తీసుకుని ట్రాక్టర్ కొనుగోలు చేశాను. నా భర్తకు రోడ్డు ప్రమాదం కారణంగా కాలు విరిగి పోవడం వల్ల ప్రస్తుతం కుటుంబాన్ని నేనే నడిపిస్తున్నాను. ఆరోగ్యశ్రీ ద్వారా నా భర్తకు ఉచితంగా వైద్యం అందింది. వైఎస్సార్ ఆసరా నా లాంటి మహిళలు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మహిళల సంక్షేమం కోసం ఇంతలా తపించే సీఎం వైఎస్ జగన్‌కు దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆదరాభిమానాలు ఎప్పటికీ ఉంటాయి. – కలపాల గంగారత్నకుమారి, దొరమామిడి, బుట్టాయగూడెం మండలం -
వర్జీనియా, కాలిఫోర్నియాలో వెటా ఆధర్యంలో బతుకమ్మ సంబురం!
తెలంగాణలో ఊరూ వాడా పూలజాతర సందడి చేస్తున్నట్టే అమెరికాలో కూడా విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వెటా) సంస్థ బతుకమ్మ వేడుకలను వర్జీనియా రాష్ట్రంలోని FAIRFAX నగరంలో ఘనంగా నిర్వహించింది. స్థానిక ఎస్బీ లోటస్ టెంపుల్ ఆవరణలో పూలతో బతుకమ్మని పేర్చి, పసుపు ముద్దతో గౌరమ్మని అలంకరించుకుని, ఒక్కొక్క పువ్వేసి చందమామా...ఒక్క జాము గడిచె చందమామా, బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో మాతల్లి బతుకమ్మ ఊయ్యాలో అంటూ అనేక బతుకమ్మ పాటలతో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపు కున్నారు. సంప్రదాయ వస్త్రాదారణలో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడి సందడి చేశారు. మహిళా శక్తి స్వరూపిణిగా చెప్పే ఈ దసరా నవరాత్రి రోజులలో వచ్చే సంబరాల్లో "బతుకమ్మ పండుగ" తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్న విషయం తెలిసిందే. ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా)’ స్థాపించినప్పటినుంచి ప్రతి ఏడాది ఈ బ్రతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈవేడుకల్లో ప్రముఖ యాంకర్ ఉదయ భాను దాదాపు 800 మంది పెద్దలు , పిల్లలను ఎంటర్టైన్ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికీ వెటాప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల , advisory కౌన్సిల్ కో-చైర్ Dr అభితేజ కొండా , ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి, నేషనల్ మీడియా చైర్ సుగుణ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం వర్జీనియా బోర్డ్ అఫ్ డైరెక్టర్ జయశ్రీ తెలుకుంట్ల, మేరీల్యాండ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ ప్రీతి రెడ్డి, రీజినల్ కల్చరల్ చైర్ చైతన్య పోలోజు,రీజినల్ కోర్ కమిటీ స్మృతి రెడ్డి పర్యవేక్షణలో జరిగింది. సతీష్ వడ్డే, సుధ పాలడుగు, సతీష్ వేమన, విశ్వేశ్వర్ కలవాల,కాంగ్రెస్ మహిళజెన్నిఫర్ వెక్స్టన్ హాజరయ్యారు. కాలిఫోర్నియాలో బతుకమ్మ సంబరాలు కాలిఫోర్నియా లోని హ్యాంఫోర్డ్ నగరంలో వెటా ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్లగారి బంగ్లా ఆవరణలో " బతుకమ్మ పండుగ శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి ఫుడ్ స్పాన్సర్ చేసిన Dr కాంతం & సుజాత గాదె గారికి ఝాన్సీ గారు కృతజ్ఞతలు తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో WETA treasurer విశ్వ వేమిరెడ్డి, కమ్యూనిటీ చైర్ జ్యోతి, RVP పూజ రెడ్డి, సెక్రటరీ అనురాధ అలిశెట్టి, హైమ అనుమాండ్ల తో పాటు దాదాపు 500 మంది పెద్దలు, పిల్లలు పాల్గొన్నారు. -
అత్తవారింట్లో కోడలి ప్రవేశం!
► నిరసన విడిచి.. తాళాలు పగలగొట్టి.. ► అండగా నిలిచిన మహిళా సంఘాలు ► పరారీలో ఉన్న భర్త, అత్తమామలు బత్తిలి: నాలుగు రోజులు నుంచి అత్తవారింటి ముందు ఓ కోడలు నిరసన ప్రదర్శన చేస్తోంది. ఆమె భర్తతోపాటు, అత్తమామలు ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లిపోయినా.. ఆమె నిరసన ఆపలేదు. చివరికి అత్తవారింటి తాళాలు పగలగొట్టి.. ఆమె లోపలికి ప్రవేశించింది నాలుగు రోజులుగా ఇక్కడే నిరస... భామిని మండలం బత్తిలికి చెందిన బోయిన సుమన్‌కుమార్.. భార్య నవీనను నాలుగేళ్లుగా ఆమె కన్నవారింట్లో వదిలిపెట్టాడు. ఎంతకూ తీసుకురాకపోవడంతో ఆమె నాలుగు రోజుల క్రితం అత్తవారింటికి చేరుకుంది. అయితే, ఆమెను లోపలికి అత్తవారు రానీయలేదు. దీంతో నవీన అత్తవారింటి ముందే నిరసన చేపట్టింది. అక్కడే ఆరుబయట కూర్చొంటూ ఎండకు ఎండతూ, వానకు తడస్తూ నిరసన కొనసాగించింది. వంటావార్పు అక్కడే చేపట్టింది. మహిళా సంఘాలు ఆమెకు అండగా నిలిచాయి. అత్తమామలు ఇంటికి తాళం వేసుకుని పరారయ్యారు. విషయం తెలుసుకున్న బత్తిలి ఎస్సై ఎం.ముకుందరావు స్వయంగా వెళ్లి.. బాధితురాలు నవీనతో మాట్లాడారు. బాధితురాలి భర్త, మామలతో ఫోన్లో మాట్లాడారు. వారిలో మార్పు రాలేదు. అయితే, వారిపై కేసు పెట్టేందుకు కోడలు నవీన కూడా అంగీకరించలేదు. దీంతో పోలీసులూ ఏమీ చేయలేక వెనుదిరిగారు. చివరికి సహనం నశించిన నవీన.. సోమవారం ఐద్వా, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆ ఇంటి తాళాలను పగలగొట్టింది. తల్లిదండ్రులు గుడ్ల సుశీల, లింగరాజులతో కలసి లోపలికి ప్రవేశించింది. ఆమె వెంట ఐద్వా సంఘ జిల్లా ఉపాధ్యక్షురాలు గంగరాపు ఈశ్వరమ్మ, బత్తిలి వీఓ అధ్యక్షురాలు ఆరికి గౌరమ్మ, మండల నాయకులు దశాలమ్మ, చిట్టెమ్మ, సుహాసిని ఉన్నారు. -
మావోయిస్టుల ముసుగులో మహిళా సంఘాలు
గిరిజన యువతను మావోయిస్టుల్లో చేర్పించడమే వాటి పని కొయ్యూరులో వెలసిన కరపత్రాలు కొయ్యూరు(పాడేరు) : మొదటిసారిగా మహిళా సం ఘాలపై తీవ్ర ఆరోపణలతో కరపత్రాలు వెలువడ్డాయి. స్థానిక మండల పరిషత్ ఆవరణలోని గోడపై ఈ కరపత్రం వెలుగుచూసింది. వాటిని ఎవరు అంటించారో తెలియకపోయినా విద్యార్థిని చైతన్య సంఘం పేరిట అంటించారు. మహిళా సంఘాలు కొన్ని మావోయిస్టుల ముసుగులో పనిచేస్తున్నాయని, దీనిని గిరిజన విద్యార్థులు గుర్తించాలని పేర్కొన్నారు. కళాశాల లేదా హాస్టళ్లకు చైతన్య మహిళా సంఘం, ప్రగతి శీల మహిళా సమాఖ్య తరఫున కార్యక్రమాలు చేసేందుకు బృందాలు గా వస్తారని, స్త్రీశక్తి, లేదా మహిళా చైతన్యం అంటూ మాయమాటలు చెబుతారని పేర్కొన్నా రు. ‘మీతో పాటు పాడించి వారి వెంట తిప్పు కుంటారు. సమాజంలో ఉండాల్సిన మిమ్మల్ని అడవిబాట పట్టిస్తారు.. వారి మాటల ఒరవడి, పాటల పల్లవిలో మీరంతా శ్రుతులు మాదిరిగా కలిసిపోయేలా చేస్తార’ని పేర్కొన్నారు. అమాయకంగా ఉండే పేద విద్యార్థులను ఎన్నుకుని వారికి పాఠాలు చెబుతారని, పరీక్షలు పెడతారని, తరువాత బహుమతులు ఇస్తారని ఆరోపించారు. ఇదంతా చైతన్యమని దానిని అందుకోడానికి అరుణతార మహిళా మార్గం లాంటి పుస్తకాలను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. మీ తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడి పిల్లలకు భరోసా ఇస్తామని చెబుతారని, అయితే ఈ సంస్థలన్నీ కూడా మావోయిస్టు ముసుగు సంఘాలని, మిమ్మల్ని చదువు మాన్పించి అడవుల్లో తిప్పుకోవడమే వారి లక్ష్యమని తీవ్ర ఆరోపణలు చేశారు. వారి మాటలు, పాటలు కూడా విషపూరితాలని, వారి బోధన మార్గం నయవంచనేనని, తేనె పలుకులు కురిపించే చేతనలు.. పాలిచ్చే నెపంతో విషమిచ్చే పూతనలు అంటూ ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు. పోస్టర్లపై సత్రజ్, దేవేంద్ర, రాజేశ్వరి, వరలక్ష్మి, శిల్ప పద్మ, సిపోరా, అన్నపూర్ణ, ఇందూ, రాధ అని పేర్కొంటూ ఫొటోలను సైతం ముద్రించారు. -
బ్యాంకర్లా..మజాకా!
సంఘంలో లేరు.. రుణం తీసుకోలేదు.. అయినా డబ్బులు చెల్లించాలని వృద్ధురాలికి నోటీసులు వనపర్తి : చెప్పులు అరిగేలా బ్యాంకుల చుట్టూ తిరిగినా రుణం మంజూరు చేయని బ్యాంకు అధికారులు సంఘంలో లేకున్నా, అడక్కుండానే రుణం ఇచ్చినట్టు, కొన్నేళ్లుగా కట్టనట్టు ఓ అమాయక వృద్ధురాలికి నోటీసులు జారీచేశారు. ఇంతకు రుణాలు ఎవరు తీసుకుంటున్నారో, సంఘంలో ఉన్నవారు నిజంగా ఉన్నారా లేరా.. అనే విషయాలు తెలుసుకోకుండానే రూ.3.50లక్షల లోన్ ఇచ్చి చేతులు కాల్చుకున్నారు. పూర్తి వివరాలిలా.. వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామంలోని నందీశ్వర మహిళా సంఘానికి అదే గ్రామంలోని ఏపీజీవీబీ బ్యాంకు అధికారులు గతేడాది మార్చి 17న రూ.3.50లక్షల రుణం ఇచ్చారు. ఇప్పటి వరకు కనీసం మూడునెలల కిస్తులు కూడా చెల్లించలేదని డీఫాల్ట్ సంఘంగా బ్యాంకర్లు గుర్తించి అగ్రిమెంటు ప్రకారం సంఘంలోని 12 మంది సభ్యులపై చర్యలు తీసుకుంటామని నోటీసులు జారీ చేశారు. అయితే రుణం తీసుకున్న సంఘానికి సంబంధంలేని రామకిష్టమ్మ అనే వృద్ధురాలికి కూడా నోటీసు అందింది. ఆమె పేరును సంఘం సభ్యురాలిగా నమోదు చేయించి వేలిముద్రలు కూడా వేయించారు. వృద్ధురాలి కుమారుడు సత్యనారాయణ బ్యాంకుకు వెళ్లి వాకపు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకర్లు, మహిళా సంఘం అధ్యక్షురాలు, బుక్‌కీపర్లు చెప్పే మాటలకు ఎక్కడా పొంతన కుదరటం లేదు. తప్పుల తడకగా అగ్రిమెంటు నందీశ్వర మహిళా సం ఘానికి ఇచ్చిన రూ. 3.50 లక్షల లోన్ అగ్రిమెంటులో అన్నీ తప్పులే ఉన్నాయి. ఒక చోట కార్యదర్శి వరలక్ష్మిగా, మరోచోట చంద్రకళ గా రాసి ఉంది. సభ్యులకు సంతకాలు చేయాల్సిన చోట అందరివీ వేలిముద్రలు వేసి ఉన్నాయి. ఫీల్డ్ ఆఫీసర్ సంఘం సభ్యులను బ్యాంకు రప్పించుకుని ఒక్కొక్కరితో మాట్లా డి సంతకాలుచేసి అడ్రస్ కోసం ఆధార్ గాని రేషన్ కార్డు గాని జిరాక్స్ కాపిలను తీసుకోవాల్సి ఉంది. కాని అగ్రిమెంటులో సభ్యులకు సంబంధించిన వివరాలు పేర్లు తప్పా మరేమి లేకపోవటం గమనార్హం. ఇదిలావుండగా సంఘం సభ్యుల జాబితాలో పేరు ఉండటంతోనే వృద్ధురాలికి నోటీసులిచ్చామని కడుకుంట్ల ఏపీజీవీబీ ఇన్చార్జ్ మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు. సంఘం గ్రూప్ ఫొటో తీసుకురావాలని చాలా సార్లు కోరినా అద్యక్ష కార్యదర్శులు స్పందించలేదని తెలిపారు. నేను ఎవరికి బాకీలేను సార్ నేను పుట్టినప్పటి నుంచి ఏనాడు సంఘంలో చేరలేదు. ఒక్కనాడూ బ్యాంకునకు పోలేదు. జీవితంలో ఎవరికీ బాకీపడలేదు. అలాంటి నాకు బ్యాంకులో బాకీ ఉందని చెప్పి టప్పలో ఓ కాగితం పంపిండ్రు. పైసలు కట్టకపోతే జైల్లో వేస్తమని చెబుతున్నరు. నా పేరు ఎవరు రాసిండ్రో వారిని వేయండి జైల్లో - రామకిష్టమ్మ, వృద్ధురాలు -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా
కీసర : ప్రేమికుల దినోత్సవం రోజే ఓ యువతికి అన్యాయం జరిగింది. మూడేళ్లుగా ప్రేమించిన యువకుడు ముఖం చాటేశాడు. పోలీసులు కౌన్సెలింగ్ చేసి నా అతడి మనసు మారలేదు. దీంతో బాధితురాలు మహిళాసంఘం నేతలతో ప్రియుడి ఇంటిఎదుట ధర్నాకు దిగింది. ఈ ఘటన శనివారం కీసర మండలం భోగారంలో చోటుచేసుకుంది. వివరాలు.. రాంపల్లిదాయరకు చెందిన మమత (21) తల్లిదండ్రులు మూడేళ్లక్రితం మృతిచెందారు. దీంతో ఆమె భోగారంలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చీర్యాలలోని సెరినిటీ పాఠశాలో టీచర్‌గా పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన సుంకరి సాయికిరణ్‌రెడ్డి(22) ఇంటర్ పూర్తిచేసి వ్యవసాయపనులు చేస్తున్నాడు. మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు. వారం క్రితం చీర్యాల కట్టమైసమ్మ దేవాలయం వద్ద మమతకు పసుపుకొమ్ముతో తాళికట్టిన సాయికిరణ్ మరుసటిరోజు నుంచి మాటమార్చాడు. దీంతో బాధితురాలు కీసర పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాయికిరణ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మహిళా సంఘాల నేతలు అతడికి ఠాణాలో సర్దిచెప్పగా పెళ్లి చేసుకుంటానని అంగీకరించారు. వారు వరుడు, వధువు కోసమని నూతన వస్త్రాలు, తాళిమెట్టెలు తీసుకొచ్చారు. అంతలోనే సాయికిరణ్‌రెడ్డి బంధువులు వచ్చి అతడి మనసు మార్చగా వివాహానికి నిరాకరించాడు. దీంతో బాధితురాలు మహిళా సంఘాల నేతలతో కలిసి భోగారంలోని సాయికిరణ్‌రెడ్డి ఇంటి ఎదుట శనివారం సాయంత్రం ధర్నాకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి జరిగేదిలేదని బాధితురాలు తెలిపింది. ఈ విషయమై కీసర సీఐ గురువారెడ్డిని వివరణ కోరగా మమత ఫిర్యాదు మేరకు సాయికిరణ్‌రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేశామని తెలిపారు. -
ఇసుక.. మస్కా !
►మహిళా సంఘాలకు మిగిలేది మట్టే ►పేరు మహిళలది- ఆదాయం ప్రభుత్వానిది ►జిల్లాలో అమ్మకాలు రూ.18 కోట్ల 60 లక్షలు ►మహిళలకు ఇచ్చింది నామమాత్రమే మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తామంటూ ప్రభుత్వం ప్రచారం సాగించింది. ఇందుకోసమే ఇసుక రీచులను సంఘాలకు అప్పజెప్పుతున్నామంటూ అధికార పార్టీ నాయకులు గొప్పలు చెబుతున్నారు. అరుుతే వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నారుు. ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖాజానాకు రూ. కోట్లు చేరుతుంటే మహిళా సంఘాలకు మాత్రం మట్టే మిగులుతుంది. మరోవైపు పంచాయతీలకు చేరాల్సిన సీనరీజ్ చార్జీలు అందించకుండా ఖజానాకే మళ్లిస్తున్నారు. కనీస సౌకర్యాలు లేని మహిళా సంఘాల సభ్యులు అర్ధరాత్రి వరకు ఇసుక ర్యాంపుల్లో అవస్థలు పడుతున్నారు. పాలకొండ : జిల్లాలో గత ఏడాది అక్టోబర్ పదో తేదీ నుంచి ఇసుక రీచులు అమల్లోకి వచ్చారుు. 13 రీచులను ఏర్పాటు చేయడం ద్వారా ఇంతవరకు 2,75,565 క్యూబిక్ మీటర్ల ఇసుకను 27,985 మంది కొనుగోలుదారులకు విక్రయించారు. దీని ద్వారా ప్రభుత్వం 18 కోట్ల 60 లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో 4 కోట్ల 90 లక్షల 50,570 రూపాయలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ చార్జీల కింద చెల్లించాల్సి ఉంది. ఇందులో కేవలం ఇసుక లోడింగ్‌కు, ర్యాంప్‌ల నిర్వహణకు మినహాయిస్తే మిగతా మొత్తాన్ని ప్రభుత్వ ఖాజానాకు మళ్లించారు. ఇవీ నిబంధనలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేరుగా నదిలో యంత్రాలతో పనిచేసే ఇసుక రీచులకు మహిళా సంఘాలకు క్యూబిక్ మీటర్‌కు రూ.15 చొప్పునివ్వాలని నిర్ణయించారు. దీని ప్రకారం ఇప్పటివరకు వీరికి రూ. 41 లక్షల 33,475 చెల్లించాల్సి ఉంది. ఇందులో కొంతమేర ఇప్పటికే బిల్లుల రూపంలో చెల్లించారు. ఈ మొత్తాన్ని మహిళా సంఘాలు పంచుకుంటే కేవలం నెలకు రూ. 2 వేల నుంచి 4 వేల రూపాయలు మాత్రమే పడుతుందని మహిళలు ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇసుక లోడింగ్‌లు నిలిపివేయాలి. రీచుల వద్ద ఈ నిబంధన సాగడం లేదు. ఉదయం నుంచి మహిళలు అర్ధరాత్రి వరకు రీచుల వద్దే ఉండాల్సి వస్తుంది. పంచాయతీలకు చేరని సీనరీజులు! ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం క్యూబిక్ మీటర్‌కు రూ.40 చొప్పున సంబంధిత పంచాయతీలకు సీనరైజ్ల రూపంలో చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం కోటి 10 లక్షల 600 రూపాయలు పంచాయతీలకు జమకావాల్సి ఉంది. దీన్ని ఇంతవరకు జమ చేయకుండా ప్రభుత్వ ఖజానాకు మళ్లించడంతోగ్రామాల్లో వివాదాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే పలు రీచులను నిలిపివేయాలని ఆందోళన చేపడుతున్నారు. ఇదే పరిస్థితిలో అల్లెన, ఆకులతంపర రీచులు కొనసాగుతున్నాయి. కొనసాగుతున్నవి నాలుగే... ఇసుకకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో ఏర్పాటు చేసిన 13 ర్యాంపుల్లో తలవరం, బద్దేరు, డొంపాక, కల్లేపల్లి రీచుల్లో నిల్వలు నిండుకోవడంతో నిలిపివేశారు. తమరాం ర్యాంప్‌లో పూర్తిగా అక్రమాలు చోటు చేసుకోవడంతో నిలిచిపోయింది. ఆకులతంపర రీచుపై అధికార పార్టీకి చెందిన ఇరువర్గాల మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరుకోవడం, పంచాయతీకి సీనరీజ్ చెల్లించకపోవడంతో ఇసుక విక్రయాలు నిలిచిపోయాయి. ప్రస్తుతానికి కాఖండ్యాం, యరగాం, పురుషోత్తపురం ర్యాంపుల్లో మాత్రం విక్రయాలు సాగుతున్నాయి. అన్నింటికీ రూ.178 ప్రభుత్వం యంత్రాలతో నిర్వహించే ఇసుక రీచులకు క్యూబిక్ మీటర్‌కు రూ. 178 చొప్పున చెల్లించాలని నిబంధన విధించింది. జిల్లాలోని ర్యాంప్‌లన్నీ యంత్రాలతో నిర్వహించేవి కావడంతో క్యూబిక్ మీటర్‌కు రూ.178 చొప్పున అందించాల్సి ఉంది. ఇందులో లోడింగ్, మిషనరీ చార్జీలు కలిపి క్యూబిక్ మీటర్‌కు రూ.50, పంచాయతీ సీనరీజ్ల కింద రూ.40, ర్యాంప్‌లు ఏర్పాటు చేసుకొనేందుకు రూ.5, సీసీ టీవీలు, కంప్యూటర్లు తదితర ఏర్పాట్లుకు రూ.15, మహిళా సంఘాలకు కూలి కింద రూ.15, రవాణా చార్జీల కింద రూ.23, అడ్మినిస్ట్రేషన్, మోనటరింగ్‌కు తదితరమైన వాటికి రూ.30 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. ఈ మొత్తంలో కేవలం ఇసుక లోడింగ్ చార్జీలకు, సీసీ టీవీల ఏర్పాటుకు నిధులు కేటాయించారు తప్పితే మిగతా వాటికి సంబంధించిన నిధులు ప్రభుత్వ ఖాజానకే మళ్లించారు. ఏర్పాటు కాని సీసీ కెమెరాలు ఒక్కర్యాంప్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. ఇందుకోసం కేటాయించిన నిధులు ఖజానాలోనే ఉంచారు. కెమెరాలు లేకపోవడంతో ర్యాంప్‌ల వద్ద వాహనాలు గుర్తించడంలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ల్యాప్‌ట్యాప్‌లు, కంప్యూటర్ సామాగ్రి అందించినా వీటి వినియోగంపై మహిళలకు అవగాహన లేకపోవడం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. ఇంతవరకు దీని కోసం చెల్లించాల్సిన సుమారు రూ.45 లక్షలు ప్రభుత్వ ఖాజానాకు మళ్లించారు. అక్రమాలకు నిలయం! ఇసుక ధరలు అమాంతంగా పెంచేయడంతో అధికార పార్టీ నాయకుల అక్రమాలకు కొదవ లేకుండాపోయింది. అనధికారికంగా ఇసుకను తరలించుకుంటూ కోట్ల రూపాయలు అర్జిస్తున్నారు. జిల్లాలో ఉన్న ప్రధాన నాయకుల అనుచరగణం చేస్తున్న దురాగతాలపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తలవరంలో జరిగిన సుమారు రూ.40 లక్షల అక్రమాలపై దర్యాప్తు జరుగుతుండగా, తమరాం ర్యాంప్‌లో కోట్ల రూపాయల ఇసుకను అక్రమంగా తరలించేశారు. బూర్జ మండలంలోని అల్లెన ఇసుక ర్యాంప్‌లో కూడా ఎమ్మెల్యే పేరుతో జరుగుతున్న అక్రమాలపై లారీ డ్రైవర్లు సైతం ఆందోళనకు దిగారు. -
చిన్నారులకు నివాళి
ముషీరాబాద్ : రైల్వే ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నాయకులు ఆశాలత, పి. శశికళలు గోల్కొండ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రైల్వే నిర్లక్ష్యం వల్లే పసిమొగ్గలు నేల రాలాయి హిమాయత్‌నగర్ : రైలును స్కూల్ బస్సు ఢీకొన్న ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారు ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షిస్తూ డీవైఎఫ్ఐ నారాయణగూడ బ్రి లియంట్ పాఠశాలలో డీవైఎఫ్ఐ శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించింది. డీవైఎఫ్ఐ నగర కార్యదర్శి విజయకుమార్, డీవైఎఫ్ఐ నాయకులు కృష్ణప్రసాద్, సురేష్, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. బీసీ వసతి గృహం బాలికల నివాళి భోలక్‌పూర్ : సికింద్రాబాద్ బీసీ బాలికల వసతి గృహం బాలికలు క్యాండి ళ్లతో ర్యాలీ నిర్వహించారు. సంక్షేమ శాఖ అధికారిణి ఇందిర, విద్యార్థినులు పుష్పలత, శ్రావణి, అనిత, అనూష తదితరులున్నారు. భోలక్‌పూర్ : బీజేపీ నగర కార్యదర్శి నవీన్‌గౌడ్ ఆధ్వర్యంలో శనివారం ముషీరాబాద్ శివాలయం చౌరస్తాలో నివాళి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సాయి, కిశోర్ యాదవ్, సురేష్, సూర్య, రామకృష్ణ, బబ్లూ, సత్తి, కృపాకర్ యాదవ్ పాల్గొన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో... సుందరయ్య విజ్ఞాన కేంద్రం: బీజేవైఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. భరత్‌గౌడ్, బీజేవైఎం నాయకులు పార్థసారథి, కిరణ్, బి.వెంకటయ్య, పీజేఆర్, ఉదయ్‌కుమార్, విజయవాడ రవీందర్, గోపి, పి.వి.శ్రీనివాస్, మంగళ, రమాదేవి, గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘రుణ’ వేదన..!
లావేరు: మహిళా సంఘం ద్వారా లింకేజీ రుణం మం జూరైందన్న ఆనందం ఆమెకు ఎంతో సేపు నిలవలేదు. భర్త వ్యవసాయ రుణం తీసుకున్నాడంటూ..ఆమెకు వచ్చి నగదును భర్త ఖాతాకు జమచేశాడు బ్యాంకు మేనేజర్. దీంతో కంగుతిన్న ఆమె.. ఇదేం పద్ధతంటూ.. ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. బెజ్జిపురం గ్రామానికి చెందిన ఏనెత్తల దుర్గాప్రసాద్ అనే రైతు మండలంలోని అదపాక ఆంధ్రాబ్యాంకులో పట్టాదారు పాసుపుస్తకం ద్వా రా 20 వేల పంట రుణం తీసుకున్నాడు. చంద్రబాబు సీ ఎం రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇవ్వడంతో పంట రుణం చెల్లించలేదు. ఈ నేపథ్యంలో దుర్గాప్రసాద్ భార్య శ్రావణికి మహిళా సంఘాల ద్వారా రూ.12, 500 రూపాయల బ్యాంకు లింకేజీ రుణం మంజూరైంది. సొమ్ము తీసుకునేందుకు గురువారం ఆమె అదపాక ఆంధ్రా బ్యాంకు శాఖకు వెళ్లింది. కానీ అక్కడి మేనేజర్ మాత్రం నగదు ఇచ్చేందుకు అంగీకరించలేదు. మీ భర్త దుర్గాప్రసాద్ రూ.20 వేల పంట రుణం తీసుకున్నాడని, సకాలంలో చెల్లించకపోవడంతో ఈ సొమ్మును ఆయన రుణఖాతాకు జమ చేస్తున్నామని చెప్పాడు. దీంతో కంగుతిన్న ఆమె..వ్యవసాయ రుణానికి, మహిళా సంఘాల లింకేజీకి సంబంధమేమిటని నిలదీసినా..మేనేజర్ పట్టించుకోలేదని వాపోయింది. అనంతరం భార్యాభర్తలు బ్యాంకుకు వెళ్లి..రైతు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతుంటే..ఎందుకు లింకేజీ రుణం జమ చేశారని ప్రశ్నించగా..తమకెటువంటి ఆదేశాలు లేవని జవాబు ఎదురైంది. దీంతో ఊసురుమంటూ..భారాభర్తలు వెనుదిరిగారు. -
దర్యాప్తులో నిర్లక్ష్యం.. బాధితులకు శాపం
లైంగిక దాడి కేసుల్లో శిక్షలు 15 శాతమే.. 85 శాతం కోర్టులో వీగిపోతున్నవే తూతూ మంత్రంగా దర్యాప్తే దీనికి కారణం ఆరేళ్లలో 371 కేసులు నమోదు దర్యాప్తునకు నోచుకోనివి122 సాక్షి,సిటీబ్యూరో: తప్పు చేసిన వారికి శిక్ష పడినప్పుడే నేరాలు...ఘోరాలు తగ్గడంతో పాటు బాధితులకు కొంతమేర ఊరట కలుగుతుంది. అయితే పోలీసుల నిర్లక్ష్య ధోరణి కారణంగా కొన్ని కేసుల్లో నిందితులకు ఎలాంటి శిక్ష పడటం లేదు. దీంతో వారు మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారు. శిక్ష నుంచి తప్పించుకుని స్వేచ్ఛగా తమ కళ్లముందే నిందితులు తిరుగుతుండటం చూసి బాధితులు కుమిలిపోతున్నారు. నగరంలో గత ఆరేళ్లలో నమోదైన లైంగిక దాడి కేసులు.. నిందితులకు పడిన శిక్షలును పరిశీలిస్తే ఇదే విషయం వెల్లడవుతోంది. సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత ఆరేళ్లలో 371 లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో చిన్నారుల నుంచి 60 ఏళ్లు పైబడిన వారున్నారు. అయితే కోర్టులో శిక్ష పడింది మాత్రం ఏడు కేసుల్లోనే, 39 కేసులు కోర్టులో వీగిపోవడంతో నిందితులు శిక్ష నుంచి తప్పించుకున్నారు. దీనిని బట్టి చూస్తే శిక్షల శాతం 15కు మించి పెరగడం లేదు. 85 శాతం కేసులు కోర్టులో వీగిపోవడం ఆందోళన కలిగించే అంశం. సంఘటన జరిగినప్పుడు పోలీసులు హడావుడి చేయడం, ఆ తర్వాత దర్యాప్తుకు అవసరమైన సాక్ష్యాధారాలను సరైన రీతిలో సేకరించకపోవడంతోనే నిందితులు కేసుల నుంచి సులువుగా బయటపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దరాప్తు మరింత దారుణం... శిక్షల శాతం ఇంత దారుణంగా ఉంటే.. ఇక నమోదైన కేసుల దర్యాప్తు విషయంలో పోలీసుల పని తీరు మరింత దారుణంగా ఉంది. సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్లు వేయడంలేదు. ఆరేళ్లలో నమోదైన 371 కేసుల్లో కేవలం 237 కేసులకు సంబంధించి మాత్రమే దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేశారు. ఇంకా 122 కేసులో దర్యాప్తు పూర్తి కాలేదు. ఉదాహరణకు 2008లో 52 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఏడు కేసుల్లో ఇంకా చార్జిషీట్లు వేయలేదు. ఏళ్లు గడుస్తున్నా.. చార్జిషీట్కే నోచుకోక పోతే ఇక కోర్టులో విచారణ ఎప్పుడు జరుగుతుంది? నిందితులకు ఎప్పడు శిక్ష పడుతుందని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక కోర్టుకావాలి... లైంగిక దాడికి గురైన బాధితులు విచారణ సమయంలో కోర్టుకు రావడం, అందరి ముందు నిల్చుని తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పడం సాహసోపేత చర్యే. ఢిల్లీ నిర్భయ కేసులో అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం ద్వారా పోలీసులు త్వరితగతిన చార్జిషీట్ దాఖలు చేసి.. వేగంగా విచారణ పూర్తి చేయడంతో కొద్ది నెలల్లోనే నిందితులకు శిక్షలు ఖరారయ్యాయి. నిర్భయ కేసులో తీసుకున్న చర్యలనే ఇక్కడి ప్రభుత్వం కూడా తీసుకొని తమకు బాసటగా నిలవాలని బాధితులు కోరుతున్నారు. అవినీతి నిరోధక శాఖ కేసులు, సీబీఐ కేసులు విచారణ కోసం ఉన్నట్టే లైంగికదాడి కేసుల విచారణకూ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇలా చేస్తే దర్యాప్తు అధికారుల్లో చలనం రావడమే కాకుండా కేసుల దర్యాప్తు, విచారణ వేగవంతం అవుతుందని, తద్వారా శిక్షల శాతం పెరిగి నేరాలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. పరువు పోతుందనే భయంతో కొందరు బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముం దుకు రావడంలేదు. ధైర్యం చేసి వచ్చినా.. పోలీసులు వారికి న్యాయం అం దించకపోవడం దురదృష్టకరం. నిందితుల నుంచి డబ్బులు తీసుకుంటున్న పోలీసులు చార్జిషీట్‌ను బలహీనంగా, లోపభూయిష్టంగా తయారు చేస్తున్నారు. ఇదే శిక్షల శాతం తగ్గడానికి ప్రధాన కారణం. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకున్నా బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా శిక్ష వేయవచ్చని ఒక పక్క చట్టం చెప్తున్నా.. బాధితులనే సాక్షాధారాలు తీసుకురావాలని పోలీసులు వేధించడం పరోక్షంగా నిందితులకు సహకరించినట్లే అవుతుంది. శిక్షల శాతం రోజు రోజుకూ తగ్గిపోవడానికి పోలీసులే ప్రధాన కారణం. - వి.సంధ్య, ప్రధాన కార్యదర్శి ప్రగతిశీల మహిళా సంఘం