లావేరు: మహిళా సంఘం ద్వారా లింకేజీ రుణం మం జూరైందన్న ఆనందం ఆమెకు ఎంతో సేపు నిలవలేదు. భర్త వ్యవసాయ రుణం తీసుకున్నాడంటూ..ఆమెకు వచ్చి నగదును భర్త ఖాతాకు జమచేశాడు బ్యాంకు మేనేజర్. దీంతో కంగుతిన్న ఆమె.. ఇదేం పద్ధతంటూ.. ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. బెజ్జిపురం గ్రామానికి చెందిన ఏనెత్తల దుర్గాప్రసాద్ అనే రైతు మండలంలోని అదపాక ఆంధ్రాబ్యాంకులో పట్టాదారు పాసుపుస్తకం ద్వా రా 20 వేల పంట రుణం తీసుకున్నాడు. చంద్రబాబు సీ ఎం రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇవ్వడంతో పంట రుణం చెల్లించలేదు.
ఈ నేపథ్యంలో దుర్గాప్రసాద్ భార్య శ్రావణికి మహిళా సంఘాల ద్వారా రూ.12, 500 రూపాయల బ్యాంకు లింకేజీ రుణం మంజూరైంది. సొమ్ము తీసుకునేందుకు గురువారం ఆమె అదపాక ఆంధ్రా బ్యాంకు శాఖకు వెళ్లింది. కానీ అక్కడి మేనేజర్ మాత్రం నగదు ఇచ్చేందుకు అంగీకరించలేదు. మీ భర్త దుర్గాప్రసాద్ రూ.20 వేల పంట రుణం తీసుకున్నాడని, సకాలంలో చెల్లించకపోవడంతో ఈ సొమ్మును ఆయన రుణఖాతాకు జమ చేస్తున్నామని చెప్పాడు. దీంతో కంగుతిన్న ఆమె..వ్యవసాయ రుణానికి, మహిళా సంఘాల లింకేజీకి సంబంధమేమిటని నిలదీసినా..మేనేజర్ పట్టించుకోలేదని వాపోయింది. అనంతరం భార్యాభర్తలు బ్యాంకుకు వెళ్లి..రైతు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతుంటే..ఎందుకు లింకేజీ రుణం జమ చేశారని ప్రశ్నించగా..తమకెటువంటి ఆదేశాలు లేవని జవాబు ఎదురైంది. దీంతో ఊసురుమంటూ..భారాభర్తలు వెనుదిరిగారు.
‘రుణ’ వేదన..!
Published Fri, Jul 4 2014 1:43 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement