చిన్నారులకు నివాళి | Tribute to children | Sakshi
Sakshi News home page

చిన్నారులకు నివాళి

Published Sun, Jul 27 2014 4:22 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM

రైల్వే ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నాయకులు ఆశాలత, పి. శశికళలు గోల్కొండ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

ముషీరాబాద్ : రైల్వే ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నాయకులు ఆశాలత, పి. శశికళలు గోల్కొండ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.    
 
రైల్వే నిర్లక్ష్యం వల్లే పసిమొగ్గలు నేల రాలాయి
 
హిమాయత్‌నగర్ : రైలును స్కూల్ బస్సు ఢీకొన్న ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారు ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షిస్తూ  డీవైఎఫ్‌ఐ నారాయణగూడ బ్రి లియంట్ పాఠశాలలో డీవైఎఫ్‌ఐ శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించింది. డీవైఎఫ్‌ఐ నగర కార్యదర్శి విజయకుమార్,   డీవైఎఫ్‌ఐ నాయకులు కృష్ణప్రసాద్, సురేష్,  స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

బీసీ వసతి గృహం బాలికల నివాళి
 
భోలక్‌పూర్ : సికింద్రాబాద్  బీసీ బాలికల వసతి గృహం బాలికలు   క్యాండి ళ్లతో ర్యాలీ నిర్వహించారు.   సంక్షేమ శాఖ అధికారిణి ఇందిర, విద్యార్థినులు పుష్పలత, శ్రావణి, అనిత, అనూష తదితరులున్నారు.
 
భోలక్‌పూర్ :  బీజేపీ నగర కార్యదర్శి నవీన్‌గౌడ్ ఆధ్వర్యంలో శనివారం ముషీరాబాద్ శివాలయం చౌరస్తాలో నివాళి కార్యక్రమం జరిగింది.  కార్యక్రమంలో సాయి, కిశోర్ యాదవ్, సురేష్, సూర్య, రామకృష్ణ, బబ్లూ, సత్తి, కృపాకర్ యాదవ్ పాల్గొన్నారు.
 
బీజేవైఎం ఆధ్వర్యంలో...
 
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: బీజేవైఎం ఆధ్వర్యంలో  కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. భరత్‌గౌడ్, బీజేవైఎం నాయకులు పార్థసారథి, కిరణ్, బి.వెంకటయ్య, పీజేఆర్, ఉదయ్‌కుమార్, విజయవాడ రవీందర్, గోపి, పి.వి.శ్రీనివాస్, మంగళ, రమాదేవి, గడ్డం శ్రీనివాస్  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement