
సాక్షి,పశ్చిమగోదావరి: జిల్లాలోని ఆచంట మండలం కోడేరు రోడ్డుపై డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతి చెందిన వారిని కరుగోరిమిల్లి,ముత్యాలపల్లి గ్రామానికి చెందిన వాసుదేవ (13) కుక్కల నాగరాజు( 12) గా గుర్తించారు.
ఆటోలో ఉన్న మరో అయిదుగురికి తీవ్ర గాయాలవడంతో 108 అంబులెన్సులో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment