railway accident
-
రైలు పట్టాలపై ఇనుప స్తంభాలు.. ధర్మవరంలో తప్పిన ప్రమాదం
శ్రీసత్యసాయి, సాక్షి: జిల్లాలో గత అర్ధరాత్రి లోకో పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ధర్మవరం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఇనుప స్తంభాలు ఉంచారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆకతాయిల పనిగా భావిస్తున్న రైల్వే పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
సీఎం చలించిపోయారు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం జిల్లా కంటకాపల్లి సమీపంలో ఆదివారం జరిగిన రైల్వే ప్రమాదంలో గాయపడ్డవారి పరిస్థితిని చూసి చలించిపోయారు. తొలుత రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడ్డవారిని సోమవారం స్వయంగా పరామర్శించిన అనంతరం ఎక్స్‌గ్రేషియాను పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రూ.2.59 కోట్ల మొత్తాన్ని మంజూరు చేశారు. దీనికి సంబంధించిన చెక్కులను గాయపడ్డ 30 మందికి మంగళవారం విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ నాగలక్ష్మి అందజేశారు. అనంతరం మజ్జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. రైలు ప్రమాదంలో 13 మంది మృతుల కుటుంబాలకు సంబంధించిన ఎక్స్‌గ్రేషియాను వారి ఇంటికి తీసుకెళ్లి కుటుంబసభ్యులకు సంబంధిత ఎమ్మెల్యేల ద్వారా అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. రైల్వే ప్రమాదంలో గాయపడి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి కూడా పరిహారం అందజేస్తామని చెప్పారు. 13 మంది మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, 30 మంది గాయపడ్డ వారి గాయాల తీవ్రతను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ప్రభుత్వం పరిహారం మంజూరు చేసిందని వివరించారు. స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్న 12 మందికి రూ. 2 లక్షల చొప్పున, తీవ్ర గాయాలతో నెలకు మించి చికిత్స అవసరమైన 15 మందికి రూ. 5 లక్షల చొప్పున మంజూరైనట్టు వివరించారు. తీవ్ర గాయాలతో వైకల్యం పొందిన ముగ్గురికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెంచారని వెల్లడించారు. వారి పరిస్థితిని చూసి సీఎం ఎంతో చలించిపోయారని, పరిహారం విషయంలో ఎంతో ఉదారంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిలా సునందని, డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ బి.గౌరీశంకర్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మలీల తదితరులు పాల్గొన్నారు. -
నిబద్ధతతో వ్యవహరించి.. రాజీనామా చేసిన నాటి రైల్వే మంత్రులు వీరే..
ఒడిశాలోని బాలాసోర్ ఘోర రైలు ప్రమాదం దేశ చరిత్రలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఒకటిగా నిలిచి త్రీవ విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో వందలాది మంది మృత్యువాత పడగా, వెయ్యిమందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్విని వైష్టవ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం హ్యాష్ ట్యాగ్‌లో ట్రెండింగ్ చేస్తూ.. రాజీనామా చేయాల్సిందే అంటూ పోస్టులు వస్తున్నాయి. అదీగాక అశ్విని వైష్ణవ్ సొంత రాష్టంలోనే ఈ ఘోర రైలు ప్రమాదం జరగడంతో మరింత తీవ్ర స్థాయిలో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు గతంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన నాటి మంత్రులను గుర్తు చేసుకుంటున్నారు. నాటి మంత్రులలో ఉన్న నిబద్ధత, నైతికత ఇప్పుడూ కానరావడం లేదంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐతే గతంలో జరిగిన రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామాలు చేసిన నాటి ముఖ్యమంత్రులు ఎవరంటే... గతంలో రాజీనామ చేసిన రైల్వే మంత్రులు 👉1956లో లాల్ బహదూర్ శాస్త్రీ హయాంలో రెండు రైలు ప్రమాదాలు జరిగాయి. ఆగస్టులో ఉమ్మడి ఏపీలో జరిగిన ప్రమాదంలో 112 మంది మరణించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. దీన్ని నెహ్రూ అంగీకరించలేదు. రెండోసారి అదే ఏడాది నవంబర్‌లో తమిళనాడులో జరిగిన మరో ఘోర ప్రమాదంలో 144 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. దీంతో శాస్త్రీ వెంటనే నెహ్రూకి రాజీనామా సమర్పించడమే గాక వెంటనే ఆమెదించాలని విజ్ఞప్తి చేశారు. ఆ నాడు శాస్త్రీ చేసిన రెండో రాజీనామా ప్రజల దృష్టిని ఆకర్షించింది కూడా. ఇది సాంకేతిక లోపమని రైల్వే బోర్డు బాధ్యత వహించాలని పలువురు నచ్చచెప్పేందుకు చెబుతున్న శాస్త్రీగారు వెనక్కి తగ్గలేదు. ఇక అప్పడు నెహ్రు ఇది తనకు క్లిష్టమైన నిర్ణయం అంటూ ఆయన రాజీనామాను ఆమోదించారు. 1956 :: Resignation Letter of Railway Minister Shri Lal Bahadur Shastri After Ariyalur Train Accident ( Photo - PM Museum ) pic.twitter.com/LuNGxDa88G — indianhistorypics (@IndiaHistorypic) June 2, 2023 👉1999 ఆగస్టులో అసోంలో జరిగిన రైలు ప్రమాదంలో 290 ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో నితీశ్ కుమార్ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆయన అసోం రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి నిష్క్రమణ తర్వాత సరిగ్గా 43 ఏళ్ల తర్వాత రైల్వే మంత్రి నుంచి వచ్చిన రెండవ రాజీనామా ఇది. 👉ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలో ఎన్డీయే ప్రభుత్వం హయాంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. 2000వ సంవత్సరంలో రెండు రైలు ప్రమాదాలు జరగడంతో ఆమె నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అయితే అప్పటి ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయి ఆమో రాజీనామాను తిరస్కరించారు. 👉2016లో నాలుగు రోజుల వ్యవధిలో కైఫియత్ ఎక్స్‌ప్రెస్, పూరీ-ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ అనే రెండు రైళ్లు పట్టాలు తప్పినందుకు నైతిక బాధ్యత వహిస్తూ 2017 ఆగస్టు 23న రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సురేష్ ప్రభు ప్రతిపాదించారు. కొంత సమయం వేచిచూడాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరగా.. ఆ తరువాత కొద్ది నెలల్లోనే ప్రభుత్వానికి రాజీనామా చేశారు. కాన్పూర్ సమీపంలో పాట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ 14 కోచ్‌లు పట్టాలు తప్పడంతో 150 మంది చనిపోయారు. 1999 తర్వాత ఇది అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటి. (చదవండి: లెక్క తేలని మరణాలు!.. దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలివే) -
రైలు ప్రమాదంపై సీఎం మమతా సంచలన వ్యాఖ్యలు
-
కవచ్ ఏమైంది..?
-
రైల్వే ప్రమాదంపై మోడీ సమీక్షా
-
మహా విషాదంపై రైల్వే మంత్రి క్లారిటీ
-
రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తున్నాయ్.. మధ్యలో కవచ్
రైల్వే ప్రయాణం ఇక మరింత భద్రం కానుంది. రైలు ప్రమాదాల నివారణకు ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మంగా చేపట్టిన కవచ్ ప్రోగ్రామ్ పరిధిలోకి దక్షిణ మధ్య రైల్వే కూడా చేరింది. దేశంలో రైలు ప్రమాదాలు ఆగడం లేదు. ఏడాదిరి రెండు మూడు చోట్ల ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీని వల్ల ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఈ సమస్యను తీర్చేందుకు ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మకంగా కవచ్ పేరుతో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ని రూపొందించింది. దశల వారీగా ఒక్కో జోన్ పరిధిలో కవచ్‌ను అమరుస్తోంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో కీలకమైన సికింద్రాబాద్ - వాడి - ముంబై మార్గంలో కవచ్‌ను అమల్లోకి తేనుంది. అందులో భాగంగా లింగంపల్లి - వికారాబాద్ సెక్షన్‌ను కవచ్ పరిధిలోకి తెచ్చారు. దీంతో ఈ సెక్షన్లో ఇకపై రైలు ప్రమాదాలు దాదాపుగా నివారించినట్టే. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ 2022 మార్చి 4న ఈ సెక్షన్లో కవచ్‌ను టెస్ట్ రైడ్‌ను స్వయంగా పరిశీలించారు. Shri Ashwini Vaishnaw @AshwiniVaishnaw Hon'ble Railway Minister briefs during live testing of #kavach automatic train protection technology in Lingampalli - Vikarabad section, South Central Railway #NationalSafetyDay @RailMinIndia @drmsecunderabad pic.twitter.com/jtW5EXECm3 — South Central Railway (@SCRailwayIndia) March 4, 2022 కవర్ పరిధిలో ఉన్న ట్రాక్‌లో ప్రత్యేకమైన సెన్సార్ల అమర్చుతారు. వీటి వల్ల ఒకే ట్రాక్‌పై రైళ్లు ఎదురుదెరుగా వచ్చినప్పుడు లేదా ఒక దాని వెనుక మరొకటి వేగంగా వస్తూ ఢీ కొట్టే సందర్భాలు పూర్తిగా నివారించబడతాయి. ప్రమాదాలను ముందుగానే పసిగట్టే వ్యవస్థలను రైళ్లను ఆటోమేటిక్‌గా ఆపేస్తాయి. అంతేకాదు రెడ్ సిగ్నల్ ఉన్నా కూడా రైలు ముందుకు దూసుకువస్తుంటే కూడా కవచ్ యాక్టివేట్ అవుతుంది. వెంటనే రైలును ఆపేస్తుంది. Rear-end collision testing is successful. Kavach automatically stopped the Loco before 380m of other Loco at the front.#BharatKaKavach pic.twitter.com/GNL7DJZL9F — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 4, 2022 -
రైల్లో నుంచి జారిపడి వ్యక్తి మృతి
ఒక రైల్లో నుంచి మరో రైల్లోకి ఎక్కడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి రైలు కిందపడి మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా మదనాపురం- వనపర్తిరోడ్ రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వనపర్తికి చెందిన రాములు(45) అనే వ్యక్తి గుంటూరు రైల్వే ప్యాసింజర్ ఎక్కే క్రమంలో.. ప్రమాదవశాత్తు దాని కిందపడి మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారులకు నివాళి
ముషీరాబాద్ : రైల్వే ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నాయకులు ఆశాలత, పి. శశికళలు గోల్కొండ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రైల్వే నిర్లక్ష్యం వల్లే పసిమొగ్గలు నేల రాలాయి హిమాయత్‌నగర్ : రైలును స్కూల్ బస్సు ఢీకొన్న ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారు ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షిస్తూ డీవైఎఫ్ఐ నారాయణగూడ బ్రి లియంట్ పాఠశాలలో డీవైఎఫ్ఐ శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించింది. డీవైఎఫ్ఐ నగర కార్యదర్శి విజయకుమార్, డీవైఎఫ్ఐ నాయకులు కృష్ణప్రసాద్, సురేష్, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. బీసీ వసతి గృహం బాలికల నివాళి భోలక్‌పూర్ : సికింద్రాబాద్ బీసీ బాలికల వసతి గృహం బాలికలు క్యాండి ళ్లతో ర్యాలీ నిర్వహించారు. సంక్షేమ శాఖ అధికారిణి ఇందిర, విద్యార్థినులు పుష్పలత, శ్రావణి, అనిత, అనూష తదితరులున్నారు. భోలక్‌పూర్ : బీజేపీ నగర కార్యదర్శి నవీన్‌గౌడ్ ఆధ్వర్యంలో శనివారం ముషీరాబాద్ శివాలయం చౌరస్తాలో నివాళి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సాయి, కిశోర్ యాదవ్, సురేష్, సూర్య, రామకృష్ణ, బబ్లూ, సత్తి, కృపాకర్ యాదవ్ పాల్గొన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో... సుందరయ్య విజ్ఞాన కేంద్రం: బీజేవైఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. భరత్‌గౌడ్, బీజేవైఎం నాయకులు పార్థసారథి, కిరణ్, బి.వెంకటయ్య, పీజేఆర్, ఉదయ్‌కుమార్, విజయవాడ రవీందర్, గోపి, పి.వి.శ్రీనివాస్, మంగళ, రమాదేవి, గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఏదీ కాపలా ?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద గురువారం జరిగిన రైలు ప్రమాదం కాపలా లేని రైల్వే క్రాసిం గుల వద్ద భద్రతను మరోమారు తెరమీదకు తెచ్చిం ది. గతంలో జిల్లాలోనూ కాపలా లేని రైల్వే క్రాసిం గుల వద్ద జరిగిన ఘోర ప్రమాదాలను జిల్లా ప్రజానీకం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. జిల్లాలో సుమారు 200 కిలో మీటర్లు రైలుమార్గం ఉండగా నేటికీ చాలాచోట్ల కాపలా లేని రైల్వే క్రాసింగులు నిత్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. జిల్లాలో తిమ్మాపూర్ మొదలుకుని ఆలంపూర్ వరకు 191కిలోమీటర్ల రైలు మార్గం ఉంది. ఈ మార్గంలో రోజూ ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ తదితర 54 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు అంతే సంఖ్యలో సరుకు రవాణా రైళ్లు (గూడ్సు) జిల్లా మీదుగా పరుగులు తీస్తున్నాయి. రైల్వే అధికారుల లెక్కల ప్రకారం మొత్తం 101 రైల్వే క్రాసింగులుండగా వీటిలో 60చోట్ల మాత్రమే కాపలా వుంది. మరో 41ప్రదేశాల్లో కాపలా లేని రైల్వే క్రాసింగులున్నాయి. సమీప గ్రామాల ప్రజలు ఈ క్రాసింగుల మీదుగా ప్రతిరోజూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పట్టాలు దాటుతున్నారు. గతంలో జిల్లాలో కాపలా లేని రైల్వే క్రాసింగుల వద్ద ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. 2011లో దేవరకద్ర సమీపంలోని పుట్టపల్లి కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో హడావుడి చేసిన రైల్వే అధికారులు నేటికీ పుట్టపల్లి వద్ద కాపలా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. కాపలా ఉండే గేట్ల వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకొని పట్టాల మీదుగా రోడ్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు. అప్పన్నపల్లి, గద్వాల, జడ్చర్ల, దేవరకద్ర రైల్వే క్రాసింగ్‌ల వద్ద రోడ్డ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో నిధులు కూడా మంజూరు చేశారు. అయితే రూ.22 కోట్ల వ్యయంతో చేపట్టిన అప్పన్నపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగి ఇటీవలే ప్రారంభమైంది. మిగతా మూడు బ్రిడ్జిల నిర్మాణం పనులు ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. నిత్యం ప్రాణగండమే! గ్రామీణ ప్రాంతాల్లోనే కాపలా లేని రైల్వే క్రాసింగులు అధికంగా ఉండటంతో ప్రాణాలు అరచేత పట్టుకుని పట్టాలు దాటుతున్నారు. ట్రాక్టర్లు, ఆటోలు హెచ్చరికలు లేకుండానే వెళ్తుండడంతో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. నిర్ణీత ఎత్తులో సబ్‌వేలు, మళ్లింపు దారులు నిర్మించాల్సి ఉన్నా శ్రద్ధ చూపడం లేదు. కాపలా లేని రైల్వే క్రాసింగులు దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైల్వే శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. క్రాసింగుల వద్ద జరిగిన ప్రమాదాలు 1994 మే 5న గొల్లపల్లి - బాలానగర్ స్టేషన్ల నడుమ రంగారెడ్డిగూడ సమీపంలో కాపలా లేని రైల్వే క్రాసింగు వద్ద జీపును తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 13మంది మరణించగా, నలుగురు గాయపడ్డారు. 2003 జనవరి 9న దేవరకద్ర- కౌకుంట్ల మార్గంలో డోకూరు వద్ద ట్రాక్ దాటుతున్న ఆటోను కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న రైలు ఇంజిన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. 2010 ఫిబ్రవరి 13న కోడూరు వద్ద గుంటూరు- సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలు కారును ఢీకొన్న ఘటనలో ఇద్దరు మరణించారు. 2011 ఫిబ్రవరి 3న దేవరకద్ర సమీపంలోని పుట్టపల్లి కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద ఆటోను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. -
నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది..
* గేటు ఏర్పాటుపై పట్టించుకోని రైల్వే అధికారులు * అప్రమత్తంగా లేని బస్సు డ్రైవర్ సాక్షి, హైదరాబాద్: దశాబ్దాలుగా ప్రజలు మొత్తుకుంటున్నా రైల్వే శాఖ మాసాయిపేట లెవల్ క్రాసింగ్ వద్ద గేటు ఏర్పాటు చేయలేదు.. కాపలాదారులను నియమించలేదు.. గేటు లేదు సరికదా ట్రాక్ కనిపించకుండా ఓ గార్డు రూం కట్టి వదిలేశారు..! కాపలాదారు లేని లెవల్ క్రాసింగ్స్ వద్ద వాహనాల డ్రైవర్లు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. కానీ పాఠశాల బస్సు డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తతతో వ్యవహరించలేదు. ...వెరసి ఈ రెండు నిర్లక్ష్యాలు ఏకంగా 16 మంది చిన్నారుల ప్రాణాలను కబళించాయి. గది కట్టారు... గేటు వదిలేశారు.. రైల్వే శాఖ నిర్లక్ష్యానికి మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట వద్ద చోటు చేసుకున్న దుర్ఘటన నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. మాసాయిపేట వద్ద ప్రమాదం జరిగిన ప్రాంతంమీదుగా ఉన్న రైల్వే లైన్‌ను సరిగ్గా 14 ఏళ్లక్రితం బ్రాడ్‌గేజ్‌గా మార్చారు. దీంతో ఇటువైపు రైళ్ల రాకపోకలు పెరిగాయి. మీటర్‌గేజ్‌గా ఉన్నప్పుడే లెవల్‌క్రాసింగ్ వద్ద గేటుకోసం గట్టిగా డిమాండ్ చేసిన ప్రజలు బ్రాడ్‌గేజ్‌గా మారాక మరింత గా పోరాటం చేశారు. అయినా రైల్వేశాఖ పట్టించుకోలేదు. నిధులు లేవంటూ గేటు ఏర్పాటు చేయలేదు. చివరకు స్థానికుల ఆందోళన తీవ్రతరమవడంతో మూడేళ్లక్రితం గేటును మంజూరు చేసి కాపలా సిబ్బందికోసం విశాలమైన గది నిర్మించారు. రెండే ళ్లక్రితం గేటు అమర్చి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. దీంతో సమస్య పరిష్కారమైందని ప్రజలు సంతోషించారు. కానీ మరుసటిరోజే ఆ గేటును తొలగించి తీసుకెళ్లిపోయారు. మధ్యలో రెండుసార్లు ఆ గదికి మరమ్మతులు చేసి రంగులేసిన రైల్వే అధికారులు ఇప్పటివరకు గేటును పెట్టలేదు. విచిత్రమేంటంటే ఆ గది పేరుతో ఇప్పటివరకు దాదాపు రూ.25 లక్షలు ఖర్చు చేశారు. నిజానికి సాధారణ గేటు ఏర్పాటుకయ్యే వ్యయమే రూ.20 లక్షలు. కాగా ఇక్కడ గేటు ఏర్పాటు చేసి గేట్‌మెన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సాక్షి గతంలో పలు సందర్భాల్లో సూచించింది. అయినా అధికారులు పట్టించుకోలేదు. రైలు కనపడకుండా అడ్డుగా మారిన గది.. గేటు లేకుండా దిష్టిబొమ్మలా మిగిలిన ఆ గది ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. ట్రాక్ దాటేందుకొచ్చే వాహనదారులు దగ్గరికొచ్చాక.. రైలు ఇంజిన్ సరిగ్గా ఎంతదూరంలో ఉందో కనిపించకుండా ఆ గది అడ్డుగా మారింది. ఇంజిన్ కాస్త దూరంగానే ఉండిఉంటుందన్న భావనతో కొందరు వాహనదారులు వేగంగా వాహనాన్ని పట్టాలెక్కించి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆ గది కట్టకముందు అడపాదడపా జరిగే ప్రమాదాలు.. ఆ తర్వాత తరచూ జరుగుతున్నాయి. గది నిర్మాణం తర్వాత దాదాపు 25కుపైగా ప్రమాదాలు జరిగాయన్నది స్థానికుల కథనం. అందులో ఈ స్కూలు బస్సు దుర్ఘటన అతిపెద్దది. ఒకవేళ గేటు ఏర్పాటు చేయటంలో మరింత జాప్యం జరిగేపక్షంలో వెంటనే ఆ గదిని కూల్చేయాలని వారు అధికారులను కోరుతుండటం గమనార్హం. రెగ్యులర్ డ్రైవర్ రాకపోవడంతో... పిల్లల పాలిట మృత్యుశకటంగా మారిన పాఠశాల బస్సు(ఎ.పి.23ఎక్స్ 5349)ను కేవలం స్కూలుబస్సుగా వాడతామంటూ పాఠశాల యాజమాన్యం 2012లో దాని రిజిస్ట్రేషన్ సమయంలో రవాణా అధికారులకు తెలిపింది. ఈ బస్సుకు రెగ్యులర్ డ్రైవర్‌గా కె.ఎల్లం(40) వ్యవహరిస్తున్నాడు. అయితే బుధవారం ఉదయం అతను రాకపోవటంతో భిక్షపతి అనే మరో డ్రైవర్‌ను యాజమాన్యం పిలిపించింది. ఇతనికి ఆ మార్గం కొత్త. సాధారణంగా ఆ బస్సు రైల్వేట్రాక్‌కు ఈవల ఉన్న వెంకటాయపల్లి, ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, దాతరపల్లి, కిష్టాయపల్లి గ్రామాల విద్యార్థులను ఎక్కించుకుని ట్రాక్ ఆవల ఉన్న మాసాయిపేట వెళ్లి మరికొందర్ని ఎక్కించుకుని తూప్రాన్‌కు వెళుతుంది. ఈ క్రమంలో శ్రీనివాసనగర్ స్టేషన్ వైపున్న గేటు ఉండే లెవల్‌క్రాసింగ్ గుండా మాసాయిపేటకు వెళ్లి తిరుగుప్రయాణంలో ఈ గేటులేని క్రాసింగ్ ద్వారా వస్తుంది. అయితే కొత్త డ్రైవర్ భిక్షపతికి అవగాహనలేక గేటు లేని క్రాసింగ్ గుండా వెళ్లే ప్రయత్నం చేశాడు. శ్రీనివాసనగర్ స్టేషన్నుంచి వస్తున్న రైలును గమనించకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. ఆ సమయంలో అతను సెల్‌ఫోన్ ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటుండటంతో రైలు కూతను వినలేదన్నది స్థానికుల కథనం. ప్రమాదాన్ని నిమిషం ముందే విద్యార్థులు గమనించి, పెద్దగా అరుస్తూ హెచ్చరించినప్పటికీ డ్రైవర్ జాగ్రత్త పడలేదని ప్రత్యక్ష సాక్షి మురళీకృష్ణ ‘సాక్షి’ వివరించారు. కాగా బస్సు ట్రాక్‌కు దగ్గరగా రావడం గమనించిన రైలు లోకోపైలట్ సత్యనారాయణ వెంటనే బ్రేక్ వేశాడు. అది అక్కడ్నుంచీ సరిగ్గా 534 మీటర్ల దూరం వెళ్లి నిలిచింది. ఈలోపే బస్సును ఢీకొనటం, దాన్ని ఈడ్చుకుంటూ దాదాపు 35 మీటర్ల దూరం వరకు వెళ్లటం రెప్పపాటులో జరిగిపోయాయి. రైళ్లకు సడన్‌బ్రేకు వేయటం సాధ్యం కాదు. అలా వేస్తే బోగీలు ఒకదానికొకటి ఢీకొని పట్టాలు తప్పి భారీ ప్రమాదానికి కారణమవుతుంది. రైల్వే వ్యవస్థలో సడన్ బ్రేక్ అంటే... బ్రేకు వేసిన 600 మీటర్ల దూరంలో రైలు నిలిచిపోయేలా చేయటం. ఇక్కడా ఆ ‘సడన్ బ్రేకే’ వేశారు. పాడు రైలు... టైమ్కొచ్చినా బాగుండు! మృత్యువు దరిచేరేవేళ అన్ని కారణాలను మోసుకొస్తుందంటారు. మాసాయిపేట రైల్వే లెవల్‌క్రాసింగ్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో ఇదే కనిపిస్తుంది. స్కూలు బస్సును ఢీకొన్న నాందేడ్-కాచిగూడ ప్యాసింజర్ రైలు వాస్తవానికి ఉదయం నాలుగున్నరకే ఆ ప్రాంతంమీదుగా వెళ్లాల్సి ఉంది. కానీ దాని జత రైలు రావటంలో జాప్యం ఫలితంగా ఈ రైలు మంగళవారం రాత్రి నాందేడ్‌లో రాత్రి 11.30కు బదులుగా తెల్లవారుజాము 3.30కి బయల్దేరింది. ఫలితంగా.. సరిగ్గా స్కూలు బస్సు పట్టాలెక్కిన సమయానికి మృత్యురూపంలో దూసుకొచ్చింది. తండావాసులు డబ్బులు పోగుచేసి కడితే.. తీసుకుని చేతులెత్తేసిన రైల్వేశాఖ! సాక్షి, హైదరాబాద్: నిధులు లేకనే లెవల్ క్రాసింగ్స్ వద్ద గేట్లు పెట్టలేకపోతున్నామని, రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ), రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ)లు నిర్మించలేకపోతున్నామని రైల్వే శాఖ చెబుతోంది. మరి స్థానికులు డబ్బులు పోగుచేసి రైల్వే అధికారుల చేతిలో పెట్టిన తర్వాత కూడా పనిచేయకపోతే దాన్నేమనాలి? మాసాయిపేట లెవల్ క్రాసింగ్ దాటి మేడ్చల్ వైపు ముందుకెళ్తే వచ్చే చిన్న తండా కూచారం. ఆ తండా ప్రజలు రోడ్డువైపు రావాలంటే ట్రాక్ దాటాల్సిందే. దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అక్కడ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని ఆ తండావాసులు ఎన్నోమార్లు ఆందోళనలు చేశారు. అయితే అక్కడ ఆర్యూబీ నిర్మాణానికి రూ.1.30 కోట్లు అవసరమవుతాయని, నిధులు లేకనే నిర్మించలేకపోతున్నామని అధికారులు చెప్పారు. దీంతో తండావాసులు ఇంటికి కొంతచొప్పున చందాలు పోగుచేసి రూ.80 వేలు సమకూర్చుకుని చెక్కురూపంలో రైల్వే అధికారులకు అందజేశారు. అంతే.. ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఆర్యూబీ కట్టనేలేదు. దాంతోపాటు తండావాసులిచ్చిన ఆ నిధుల జాడా లేకుండా పోయింది..! ఆటోలో వెళ్లిన అన్న.. బస్సులో చితికిన తమ్ముడు ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన వీరేశం, లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు భగవాన్ పదో తరగతి, చిన్న బాబు విష్ణువర్థన్ 7వ తరగతి చదువుతున్నాడు. భగవాన్‌కు ప్రత్యేక తరగతులు ఉండడంతో ఆటోలో స్కూల్‌కు వెళ్లాడు. బస్సులో వెళ్లిన భగవాన్ తమ్ముడు విష్ణు మాత్రం మృత్యు శకటానికి బలయ్యాడు. -
రైలు ఢీకొని రైల్వే హెల్పర్ మృతి
విజయవాడ మధురానగర్ రైల్వేస్టేషన్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్‌పై ప్రయాణిస్తున్న ట్రాలీని ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రైల్వే హెల్పర్ గోవింద్ మృతి చెందాడు. అదే సమయంలో ట్రాలీ మీద మరో నలుగురు కూలీలు కూడా ఉన్నా.. వాళ్లంతా ప్రమాదాన్ని పసిగట్టి ముందుగానే ట్రాలీ మీదనుంచి దూకేయడంతో వాళ్లు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. అలా దూకినవారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సిగ్నల్ లైట్లు మరమ్మతులు చేసుకుంటూ గుడివాడ నుంచి విజయవాడకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఢీకొట్టిన రైలు నరసాపురం ప్యాసింజర్ అయ్యి ఉంటుందని భావిస్తున్నారు.