రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తున్నాయ్‌.. మధ్యలో కవచ్‌ | Railway Minister Ashwini Vaishnav Launched Kavach In Lingampalli - Vikarabad Section | Sakshi
Sakshi News home page

కవచ్‌ వచ్చేసింది.. ఇకపై ఈ సెక్షన్‌ ఫుల్‌ సేఫ్టీ!

Published Fri, Mar 4 2022 12:48 PM | Last Updated on Fri, Mar 4 2022 7:17 PM

Railway Minister Ashwini Vaishnav Launched Kavach In Lingampalli - Vikarabad Section - Sakshi

రైల్వే ప్రయాణం ఇక మరింత భద్రం కానుంది. రైలు ప్రమాదాల నివారణకు ఇండియన్‌ రైల్వేస్‌ ప్రతిష్టాత్మంగా చేపట్టిన కవచ్‌ ప్రోగ్రామ్‌ పరిధిలోకి దక్షిణ మధ్య రైల్వే కూడా చేరింది. 

దేశంలో రైలు ప్రమాదాలు ఆగడం లేదు. ఏడాదిరి రెండు మూడు చోట్ల ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉ‍న్నాయి. దీని వల్ల ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఈ సమస్యను తీర్చేందుకు ఇండియన్‌ రైల్వేస్‌ ప్రతిష్టాత్మకంగా కవచ్‌ పేరుతో ఆటోమేటిక్‌ ట్రైన్‌ ప్రొటెక‌్షన్‌ సిస్టమ్‌ని రూపొందించింది. దశల వారీగా ఒక్కో జోన్‌ పరిధిలో కవచ్‌ను అమరుస్తోంది.

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో కీలకమైన సికింద్రాబాద్‌ - వాడి - ముంబై మార్గంలో కవచ్‌ను అమల్లోకి తేనుంది. అందులో భాగంగా లింగంపల్లి - వికారాబాద్‌ సెక‌్షన్‌ను కవచ్‌ పరిధిలోకి తెచ్చారు. దీంతో ఈ సెక‌్షన్‌లో ఇకపై రైలు ప్రమాదాలు దాదాపుగా నివారించినట్టే. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ 2022 మార్చి 4న ఈ సెక‌్షన్‌లో కవచ్‌ను టెస్ట్‌ రైడ్‌ను స్వయంగా పరిశీలించారు. 

కవర్‌ పరిధిలో ఉన్న ట్రాక్‌లో ప్రత్యేకమైన సెన్సార్ల అమర్చుతారు. వీటి వల్ల ఒకే ట్రాక్‌పై రైళ్లు ఎదురుదెరుగా వచ్చినప్పుడు లేదా ఒక దాని వెనుక మరొకటి వేగంగా వస్తూ ఢీ కొట్టే సందర్భాలు పూర్తిగా నివారించబడతాయి. ప్రమాదాలను ముందుగానే పసిగట్టే వ్యవస్థలను రైళ్లను ఆటోమేటిక్‌గా ఆపేస్తాయి. అంతేకాదు రెడ్‌ సిగ్నల్‌ ఉన్నా కూడా రైలు ముందుకు దూసుకువస్తుంటే కూడా కవచ్‌ యాక్టివేట్‌ అవుతుంది. వెంటనే రైలును ఆపేస్తుంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement