lingampalli
-
రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తున్నాయ్.. మధ్యలో కవచ్
రైల్వే ప్రయాణం ఇక మరింత భద్రం కానుంది. రైలు ప్రమాదాల నివారణకు ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మంగా చేపట్టిన కవచ్ ప్రోగ్రామ్ పరిధిలోకి దక్షిణ మధ్య రైల్వే కూడా చేరింది. దేశంలో రైలు ప్రమాదాలు ఆగడం లేదు. ఏడాదిరి రెండు మూడు చోట్ల ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీని వల్ల ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఈ సమస్యను తీర్చేందుకు ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మకంగా కవచ్ పేరుతో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ని రూపొందించింది. దశల వారీగా ఒక్కో జోన్ పరిధిలో కవచ్‌ను అమరుస్తోంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో కీలకమైన సికింద్రాబాద్ - వాడి - ముంబై మార్గంలో కవచ్‌ను అమల్లోకి తేనుంది. అందులో భాగంగా లింగంపల్లి - వికారాబాద్ సెక్షన్‌ను కవచ్ పరిధిలోకి తెచ్చారు. దీంతో ఈ సెక్షన్లో ఇకపై రైలు ప్రమాదాలు దాదాపుగా నివారించినట్టే. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ 2022 మార్చి 4న ఈ సెక్షన్లో కవచ్‌ను టెస్ట్ రైడ్‌ను స్వయంగా పరిశీలించారు. Shri Ashwini Vaishnaw @AshwiniVaishnaw Hon'ble Railway Minister briefs during live testing of #kavach automatic train protection technology in Lingampalli - Vikarabad section, South Central Railway #NationalSafetyDay @RailMinIndia @drmsecunderabad pic.twitter.com/jtW5EXECm3 — South Central Railway (@SCRailwayIndia) March 4, 2022 కవర్ పరిధిలో ఉన్న ట్రాక్‌లో ప్రత్యేకమైన సెన్సార్ల అమర్చుతారు. వీటి వల్ల ఒకే ట్రాక్‌పై రైళ్లు ఎదురుదెరుగా వచ్చినప్పుడు లేదా ఒక దాని వెనుక మరొకటి వేగంగా వస్తూ ఢీ కొట్టే సందర్భాలు పూర్తిగా నివారించబడతాయి. ప్రమాదాలను ముందుగానే పసిగట్టే వ్యవస్థలను రైళ్లను ఆటోమేటిక్‌గా ఆపేస్తాయి. అంతేకాదు రెడ్ సిగ్నల్ ఉన్నా కూడా రైలు ముందుకు దూసుకువస్తుంటే కూడా కవచ్ యాక్టివేట్ అవుతుంది. వెంటనే రైలును ఆపేస్తుంది. Rear-end collision testing is successful. Kavach automatically stopped the Loco before 380m of other Loco at the front.#BharatKaKavach pic.twitter.com/GNL7DJZL9F — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 4, 2022 -
ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ లింగంపల్లి వరకు..
సాక్షి, హైదరాబాద్: విజయవాడ–సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి వరకు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ సోమవారం తెలిపారు. ఈ మేరకు విజయవాడ–లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ (నం.12795) సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 10.50కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. అక్కడ నుంచి 10.55కి బయలుదేరి 11.04కి బేగంపేట చేరుకుంటుంది. అక్కడ నుంచి 11.05కి బయలుదేరి 11.35కి లింగంపల్లి చేరుకుంటుంది. సోమవారం నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. అలాగే లింగంపల్లి–విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ (నంబర్ 12796) మంగళవారం (14న) నుంచి లింగంపల్లిలో ఉదయం 4.40కి బయలుదేరుతుంది. 4.58కి బేగంపేటకు చేరుకుని, అక్కడ నుంచి 4.59కి బయలుదేరి 5.20కి సికింద్రాబాద్ చేరుతుంది. అక్కడ నుంచి 5.30కి బయలుదేరి 10.45కి విజయవాడకు చేరుకుంటుంది. ఇంటర్సిటీ ప్రత్యేక రైళ్లు.. హైదరాబాద్–విజయవాడ ఇంటర్సిటీ ప్రత్యేక రైళ్లను ఈ నెల 19 నుంచి అక్టోబర్ 28 వరకు ప్రతి ఆదివారం లింగంపల్లి వరకు నడపనున్నారు. లింగంపల్లి–విజయవాడ ఇంటర్ సిటీ ప్రత్యేక రైలు (నం.07757) ప్రతి ఆదివారం ఉదయం 4.40కి లింగంపల్లి నుంచి బయలుదేరుతుంది. 4.58 గంటలకు బేగంపేటకు చేరుకుని, అక్కడ నుంచి 4.59కి బయలుదేరి 5.20కి సికింద్రాబాద్ చేరుతుంది. అక్కడ నుంచి నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, మంగళగిరి మీదుగా 10.45కి విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడ–లింగంపల్లి ఇంటర్సిటీ ప్రత్యేక రైలు (నం.07758) ప్రతి ఆదివారం సాయంత్రం 5.30కి విజయవాడ నుంచి బయలుదేరుతుంది. అక్కడ నుంచి మంగళగిరి, గుంటూరు, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా 10.50కి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. 11.04కి బేగంపేటకు చేరుకుని, అక్కడ నుంచి 11.05కి బయలుదేరి 11.35కి లింగంపల్లి చేరుకుంటుంది. -
కారు ఆటో ఢీ, ఐదుగురి మృతి
-
లింగంపల్లిలో ఘోర ప్రమాదం
సాక్షి, రంగారెడ్డి : యాదాద్రి జిల్లాలో ఆదివారం జరిగిన దుర్ఘటన మరవక ముందే మరో ఘోర ప్రమాదం ఐదుగురు శ్రమ జీవులను బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, లింగంపల్లి వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు, ఆటోలు ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా ఆటోలో కూరగాయలను హైదరాబాద్ తీసుకువస్తూ మృత్యువాత పడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలే ఉండటం హృదయ విదారకం. వివరాలు.. చెన్నారెడ్డిగూడెంకు చెందిన పదిమంది మహిళలు ప్రతిరోజు కూరగాయలను ఆటోలో వేసుకొని హైదరాబాద్ నగరానికి తీసుకువస్తారు. రోజు వారి మాదిరిగానే సోమవారం కూడా దాదాపు పది మంది మహిళలు అదే గ్రామానికి చెందిన శీను ఆటోలో కూరగాయలు వేసుకొని నగరానికి బయలుదేరారు. మంచాల మండలం లింగంపల్లి వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్‌తో పాటు ముందు భాగంలో కూర్చున్న మహిళలు అక్కడిక్కడే తుది శ్వాస విడిచారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను చికిత్స కోసం ఇబ్రహీం పట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు ఆటో డ్రైవర్ శీను, సుజాత, మాధవి, మారు, అఫిలీగా గుర్తించారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. -
అత్త మందలించిందని..
కొత్తపల్లి(కర్నూలు): అత్త మందలించిందని క్షణికావేశానికి గురైన ఓ మహిళ తనకు తాను అగ్నికి ఆహుతైంది. ఎం.లింగాపురం గ్రామానికి చెందిన రాఘవేంద్ర భార్య రాణెమ్మ(37) పుట్టినిల్లు అయిన నందికొట్కూరుకు నాలుగు రోజుల క్రితం వెళ్లింది. తిరిగి 4వ తేదీన మళ్లీ అత్తారింటికి పిల్లలతో పాటు వచ్చింది. అయితే ఆమె అత్త అయిన సువార్తమ్మ నాలుగు రోజులు పుట్టింట్లో ఉంటే ఎట్లా అంటూ కోడలిని మందలించింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పివేసి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే, అక్కడ చికిత్సపొందుతూ తెల్లవారుజామున చనిపోయింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.