అత్త మందలించిందని..
Published Thu, Jan 5 2017 7:28 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
కొత్తపల్లి(కర్నూలు): అత్త మందలించిందని క్షణికావేశానికి గురైన ఓ మహిళ తనకు తాను అగ్నికి ఆహుతైంది. ఎం.లింగాపురం గ్రామానికి చెందిన రాఘవేంద్ర భార్య రాణెమ్మ(37) పుట్టినిల్లు అయిన నందికొట్కూరుకు నాలుగు రోజుల క్రితం వెళ్లింది. తిరిగి 4వ తేదీన మళ్లీ అత్తారింటికి పిల్లలతో పాటు వచ్చింది. అయితే ఆమె అత్త అయిన సువార్తమ్మ నాలుగు రోజులు పుట్టింట్లో ఉంటే ఎట్లా అంటూ కోడలిని మందలించింది.
తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పివేసి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే, అక్కడ చికిత్సపొందుతూ తెల్లవారుజామున చనిపోయింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement