రైలు ఢీకొని రైల్వే హెల్పర్ మృతి | railway helper dies after train hits him | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని రైల్వే హెల్పర్ మృతి

Published Sun, Jun 1 2014 10:19 AM | Last Updated on Sat, Sep 2 2017 8:10 AM

railway helper dies after train hits him

విజయవాడ మధురానగర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్‌పై ప్రయాణిస్తున్న ట్రాలీని ప్యాసింజర్ రైలు  ఢీకొట్టడంతో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రైల్వే హెల్పర్‌ గోవింద్‌ మృతి చెందాడు. అదే సమయంలో ట్రాలీ మీద మరో నలుగురు కూలీలు కూడా ఉన్నా.. వాళ్లంతా ప్రమాదాన్ని పసిగట్టి ముందుగానే ట్రాలీ మీదనుంచి దూకేయడంతో వాళ్లు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.

అలా దూకినవారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సిగ్నల్‌ లైట్లు మరమ్మతులు చేసుకుంటూ గుడివాడ నుంచి విజయవాడకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఢీకొట్టిన రైలు నరసాపురం ప్యాసింజర్‌ అయ్యి ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement