train hits
-
మయాంక్ లేవరా ప్లీజ్.. సెకన్ల గ్యాప్‌లో లోకల్ ట్రైన్ ఢీకొనడంతో..
ముంబై: మనిషి చేసే చిన్న చిన్న తప్పిదాలు వారి ప్రాణాల మీదకు తెస్తాయి. సెకన్ల వ్యవధిలో ప్రాణాలుపోయే పరిస్థితి వస్తుంది. రైలు ఎక్కే సమయంలో దిగే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సోషల్ మీడియా కారణంగా రీల్స్, వీడియోలు అంటూ కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన రైలు ఓ యువకుడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు స్పాట్లోనే చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ముంబైలోని మలాడ్ రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫామ్‌పై ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్ కూర్చున్నారు. వారంతా అక్కడే టిఫిన్ తిన్నారు. ఓ కుర్రాడు పైకి లేచి ప్లాట్ ఫామ్ చివరగా వెళ్లి చేతులు కడుక్కున్నాడు. ఇంతలో అతడి ఫ్రెండ్ మయాంక్ అనిల్ శర్మ(17) కూడా చేతులు కడుక్కోవడానికి ప్లాట్ ఫామ్ అంచువరకు వెళ్లాడు. మరో స్నేహితుడు తన చేతులు కడుక్కుని వాటర్ బాటిల్లోని నీరు తాగి. ఆ తర్వాత బాటిల్‌ని అనిల్‌కు ఇచ్చాడు. అనిల్ తన చేతులు వాష్ చేసుకుంటున్నాడు. ఇంతలో ప్లాట్‌ఫామ్-3పైకి లోకల్ ట్రైన్ దూసుకొచ్చింది. ఈ క్రమంలో ప్లాట్‌ఫామ్ అంచునే ఉన్న మయాంక్‌ను గట్టిగా ఢీకొనడంతో ఒక్కసారిగా గాల్లోకి లేచి కిందపడిపోయాడు. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. ఈ క్రమంలో స్పాట్లోనే మయాంక్ మృతిచెందాడు. మరో స్నేహితుడికి గాయలయ్యాయి. అయితే, ఈ ప్రమాదం జూన్ 17వ తేదీన చోటుచేసుకుంది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ప్లాట్‌ఫాంలపై జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: హాయ్ అంటూ దగ్గరయ్యాడు.. నమ్మకంతో ఆమె వీడియో కాల్స్ చేసి.. -
నెల్లూరులో విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు మృతి
సాక్షి, నెల్లూరు: నెల్లూరులోని ఆత్మకూర్ బస్టాండ్ రైల్వే బ్రిడ్జిపై రైలు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. పట్టాలు దాటుతుండగా ఎదురుగా వస్తున్న రైలు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకొంది. సమాచారం అందుకొన్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగింది?. మృతులు ఎవరన్న దానిపై విచారణ చేస్తున్నారు. ప్రమాదమా లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. -
మరి కొద్ది గంటల్లో పెళ్లి అనగా..?
లక్నో : మరి కొద్ది గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ యువ ఇంజనీర్ ఆజాగ్రత్తగా వ్యవహరించి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో భాజభజాంత్రిలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగింది. ఈ విషాద సంఘటన ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు సమీపంలోని నందోసి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నరేశ్‌పాల్ గాంగ్వర్ ఓ ప్రైయివేట్ బిల్డర్స్ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అతనికి అదే రోజు సాయంత్రం షాజహాన్‌పూర్‌కు చెందిన ఓ యువతితో పెళ్లి జరగాల్సింది. పెళ్లి పనులతో ఆ కుటుంబమంతా సందడి నెలకొంది. ఇంతలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేశ్‌పాల్‌కు ఫోన్ రావడంతో మాట్లాడుతూ.. తన ఇంటికి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. ఫోన్ ద్యాసలో ఉన్న నరేశ్‌ను వేగంగా వచ్చిన రాజ్యారాణి ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి కోసం వచ్చి అంత్యక్రియల్లో పాల్గొనడం బాధాకరంగా ఉందని అతని బంధు మిత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
పార్వతీపురం(విజయనగరం): పార్వతీపురం రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. రైలు ఢీకొన్న సమయంలో అతను కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటంతో స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సదరు వ్యక్తి చికిత్సపొందుతూ మరణించాడు. మృతుని వివరాలు తెలియరాలేదు. అతని జేబులో గరుగుబిల్లి నుంచి పార్వతీపురం వచ్చినట్లు రైల్వే టిక్కెట్టు, రూ.100 నోటు ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యాన్ - రైలు ఢీ : ఐదుగురి మృతి
లక్ష్మీపూర్: ఉత్తరప్రదేశ్ లక్ష్మీపూర్‌లోని మయిగల్గంజి ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనాన్ని సీతాపూర్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జుమాయి నుంచి షాజహాన్‌పూర్ వెళ్తున్న పెళ్లి బృందం వ్యాన్ .. కాపలా లేని రైల్వే క్రాసింగ్ దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సీతాపూర్ జిల్లా ఆస్పుత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. రైలు వస్తున్న సంగతి వ్యాన్ డ్రైవర్ గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. -
రైలు ఢీకొని రైల్వే హెల్పర్ మృతి
విజయవాడ మధురానగర్ రైల్వేస్టేషన్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్‌పై ప్రయాణిస్తున్న ట్రాలీని ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రైల్వే హెల్పర్ గోవింద్ మృతి చెందాడు. అదే సమయంలో ట్రాలీ మీద మరో నలుగురు కూలీలు కూడా ఉన్నా.. వాళ్లంతా ప్రమాదాన్ని పసిగట్టి ముందుగానే ట్రాలీ మీదనుంచి దూకేయడంతో వాళ్లు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. అలా దూకినవారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సిగ్నల్ లైట్లు మరమ్మతులు చేసుకుంటూ గుడివాడ నుంచి విజయవాడకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఢీకొట్టిన రైలు నరసాపురం ప్యాసింజర్ అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. -
స్టేషన్ మాస్టర్ నిర్లక్ష్యంతో వ్యక్తికి తీవ్రగాయాలు
గుంటూరు : స్టేషన్ మాస్టర్ నిర్లక్ష్యంతో కృష్ణా జిల్లాలో రైలు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.నర్సాపూర్ నుంచి గుంటూరు వెళ్లే రైలు ఆలస్యం కావడంతో గుడివాడ మండలం మోటూరు వద్ద ప్రయాణీకులు ఆందోళనకు దిగారు.పట్టాలపై బైఠాయించి నినానాదాలు చేశారు. అదేసమయంలో రైలు రావడంతో స్టేషన్ మాస్టర్ చూసుకోకుండా పచ్చజెండా ఊపారు. ఇంతలో ప్రయాణీకులు భయపడి వెనక్కి వెళ్లారు.అయితే 50 ఏళ్ల కర్ణ అనే వ్యక్తి పక్కకు తప్పుకోలేకపోవటంతో అతన్ని రైలు ఢీకొంది. దీంతో అతని రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.