వ్యాన్ - రైలు ఢీ : ఐదుగురి మృతి | 5 killed, 6 hurt as train hits van carrying marriage party | Sakshi
Sakshi News home page

వ్యాన్ - రైలు ఢీ : ఐదుగురి మృతి

Published Tue, May 12 2015 1:28 PM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM

వ్యాన్ -  రైలు ఢీ : ఐదుగురి మృతి

వ్యాన్ - రైలు ఢీ : ఐదుగురి మృతి

లక్ష్మీపూర్: ఉత్తరప్రదేశ్ లక్ష్మీపూర్లోని మయిగల్గంజి ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనాన్ని సీతాపూర్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జుమాయి నుంచి షాజహాన్పూర్ వెళ్తున్న పెళ్లి బృందం వ్యాన్ .. కాపలా లేని రైల్వే క్రాసింగ్ దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సీతాపూర్ జిల్లా ఆస్పుత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. రైలు వస్తున్న సంగతి వ్యాన్ డ్రైవర్ గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement