పార్వతీపురం రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు.
పార్వతీపురం(విజయనగరం): పార్వతీపురం రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. రైలు ఢీకొన్న సమయంలో అతను కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటంతో స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సదరు వ్యక్తి చికిత్సపొందుతూ మరణించాడు.
మృతుని వివరాలు తెలియరాలేదు. అతని జేబులో గరుగుబిల్లి నుంచి పార్వతీపురం వచ్చినట్లు రైల్వే టిక్కెట్టు, రూ.100 నోటు ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.