హైదరాబాద్: ప్రమదవశాత్తు సంపులో పడి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వైరా మండలం గార్లకు చెందిన ఖలీల్ పాషా కుమారుడు షేక్ అక్మల్ సుఫుయాన్ (25) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని షుణ్ముక్ మెన్స్ పీజీ హాస్టల్‌లో నివాసముంటున్నాడు.
సోమవారం ఉదయం 10.30 గంటలకు జిమ్‌కు వెళ్లి తిరిగి హాస్టల్‌కు వస్తుండగా దారిలో తెరిచి ఉంచిన నీళ్ల సంపులో ప్రమాదవశాత్తు అక్మల్ పడిపోయాడు. తీవ్రగాయాలు కావడం, నీటిలో పడడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ మేనేజర్ కె. మధుసూదన్‌రెడ్డి నిర్లక్ష్యంతో వ్యవహరించినందునే ఘటన చోటుచేసుకుందని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Continuation of video… pic.twitter.com/w6CNRNIQMx
— Sudhakar Udumula (@sudhakarudumula) April 22, 2024
Comments
Please login to add a commentAdd a comment