స్టేషన్‌ మాస్టర్‌ నిర్లక్ష్యంతో వ్యక్తికి తీవ్రగాయాలు | Person injured as Train hits due to Station master reckless | Sakshi
Sakshi News home page

స్టేషన్‌ మాస్టర్‌ నిర్లక్ష్యంతో వ్యక్తికి తీవ్రగాయాలు

Published Wed, Oct 16 2013 8:55 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM

Person injured as Train hits due to Station master reckless

గుంటూరు : స్టేషన్‌ మాస్టర్‌ నిర్లక్ష్యంతో కృష్ణా జిల్లాలో రైలు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.నర్సాపూర్ నుంచి గుంటూరు వెళ్లే రైలు ఆలస్యం కావడంతో గుడివాడ మండలం మోటూరు వద్ద  ప్రయాణీకులు ఆందోళనకు దిగారు.పట్టాలపై బైఠాయించి నినానాదాలు చేశారు. అదేసమయంలో రైలు రావడంతో స్టేషన్ మాస్టర్ చూసుకోకుండా  పచ్చజెండా ఊపారు.

ఇంతలో ప్రయాణీకులు భయపడి వెనక్కి వెళ్లారు.అయితే 50 ఏళ్ల కర్ణ అనే వ్యక్తి పక్కకు తప్పుకోలేకపోవటంతో అతన్ని రైలు ఢీకొంది. దీంతో అతని  రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement