Person injured
-
అగివున్న లారీని ఢీకొట్టిన డీసీఎం
మహబూబ్‌నగర్ (కొత్తకోట): వేగంగా వెళ్తున్న డీసీఎం వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ వెంకటయ్య(35) రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కర్నూలు నుంచి ఖాళీ బీర్ బాటిళ్లతో వస్తున్న డీసీఎం పాలెం సమీపంలో ఆగిఉన్న లారీని డీకొట్టింది. దీంతో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్ ను అంబులెన్స్ సహాయంతో వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
స్టేషన్ మాస్టర్ నిర్లక్ష్యంతో వ్యక్తికి తీవ్రగాయాలు
గుంటూరు : స్టేషన్ మాస్టర్ నిర్లక్ష్యంతో కృష్ణా జిల్లాలో రైలు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.నర్సాపూర్ నుంచి గుంటూరు వెళ్లే రైలు ఆలస్యం కావడంతో గుడివాడ మండలం మోటూరు వద్ద ప్రయాణీకులు ఆందోళనకు దిగారు.పట్టాలపై బైఠాయించి నినానాదాలు చేశారు. అదేసమయంలో రైలు రావడంతో స్టేషన్ మాస్టర్ చూసుకోకుండా పచ్చజెండా ఊపారు. ఇంతలో ప్రయాణీకులు భయపడి వెనక్కి వెళ్లారు.అయితే 50 ఏళ్ల కర్ణ అనే వ్యక్తి పక్కకు తప్పుకోలేకపోవటంతో అతన్ని రైలు ఢీకొంది. దీంతో అతని రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.