మహబూబ్‌నగర్ (కొత్తకోట): వేగంగా వెళ్తున్న డీసీఎం వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ వెంకటయ్య(35) రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
కర్నూలు నుంచి ఖాళీ బీర్ బాటిళ్లతో వస్తున్న డీసీఎం పాలెం సమీపంలో ఆగిఉన్న లారీని డీకొట్టింది. దీంతో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్ ను అంబులెన్స్ సహాయంతో వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.